Shuru
Apke Nagar Ki App…
గజపతినగరంలో వైసీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి గజపతినగరంలో ఉద్రిక్త వాతావరణం నడుమ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించడంతో పట్టణంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య ఏర్పడిన పరిస్థితులతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Sativada Venkatarao
గజపతినగరంలో వైసీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి గజపతినగరంలో ఉద్రిక్త వాతావరణం నడుమ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించడంతో పట్టణంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య ఏర్పడిన పరిస్థితులతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- విజయనగరం: సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ఉద్రిక్తత నెలకొంది విజయనగరం కలెక్టరేట్ వద్ద సోమవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు తమ డిమాండ్లపై నిరసన వ్యక్తం చేశారు. ఆశ వర్కర్లు తమ కనీస వేతనాలు ఇవ్వాలని తదితర డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కలెక్టరేట్ ముట్టడిలో పోలీసులకు ఆశ వర్కర్లకు కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సిఐటియు, జిల్లా ఆశా వర్కర్లు, తదితర సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.1
- విజయనగరం జిల్లా జనసేన సీనియర్ నాయకులు గుర్రాన అయ్యులను పరామర్శించిన బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అప్పలస్వామి.. బొబ్బిలి నియోజకవర్గం తేదీ 09-08-2026 విజయనగరం జిల్లా జనసేన సీనియర్ నాయకులు గుర్రానా అయ్యులపై కక్ష సాధింపు చర్యలో భాగంగా వైసిపి ప్రభుత్వం దాడి చేసిన విషయం తెలుసుకొని బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అప్పలస్వామి గారు అయ్యలు స్వగృహంలో వారిని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకొని బొబ్బిలి నియోజకవర్గం ఎల్లవేళలా అండగా ఉంటుందని బొబ్బిలి నియోజకవర్గం నుంచి అయ్యలు గారిని కలవడానికి లెంక రమేష్ గారు, ఉల్లి సంతోష్ కుమార్ పొట్నూరు జనార్దహనరావు,కొటేడ సురేష్,గొల్లపల్లి జాను, దాకారపు చంద్రమౌళి, పాచిపెంట మండలం నుంచి మాదిరెడ్డి సతీష్ జన సైనికులు పాల్గొన్నారు..4
- వంగర :రాజుల గుమ్మాడ వెల్నెస్ సెంటర్ ఎదురుగా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి వంగర మండలం రాజుల గుమ్మాడ వెల్నెస్ సెంటర్ ఎదురుగా నెలకొన్న అపరిశుభ్రత పరిస్థితి పంచాయతీ అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనం గ్రామస్తులు మండిపడుతున్నారు. సమీప ఆలయ లకు వెళ్లే భక్తులు ఈ దుర్వాసన తో అవస్తులు పడుతున్నారు. గ్రామ శివారు ప్రాంతంలోని చెత్త కుప్పలు దర్శిమిస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- ఈ నెల 10న అరకులోయ లో నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఏర్పాట్లు అరకులోయ లో ఈ నెల 10న నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి వేదిక సిద్దమవుతుంది. సుమారు 1500 మంది కూర్చునే విధంగా రూఫ్ క్లోజ్డ్ వేదికను అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వద్ద ఏర్పాటు చేయిస్తున్నారు. ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉత్పత్తులు, సేవలు ప్రదర్శించడానికి 15 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.1
- నిత్యావసర ధరల పెంపు తప్పదా?FMCG కంపెనీలు రేట్లు పెంచేందుకు రెడీ అవుతున్నాయి. నిత్యావసర ధరల పెంపు తప్పదా? ముడి సరకుల ధరల పెరుగుదల నేపథ్యంలో దేశంలోని ప్రముఖ FMCG కంపెనీలు రేట్లు పెంచేందుకు రెడీ అవుతున్నాయి. జూన్ త్రైమాసికంలో 2-5% పెంచిన సంస్థలు సెప్టెంబర్ క్వార్టర్లోనూ అదే స్థాయిలో హైక్ చేయాలని భావిస్తున్నాయి. కొన్ని ప్రొడక్టుల గ్రామేజీని తగ్గించాలని చూస్తున్నాయి. పలు ఉత్పత్తులపై 1.5-2% పెంచే అవకాశం ఉందని బ్రిటానియా వెల్లడించింది. గోద్రెజ్, డాబర్, HUL, టాటా, నెస్లే కూడా ఇదే దారిలో ఉన్నాయి.1
- లక్కిడాం గ్రామంలో సీసీ రోడ్లు, కాలువలు ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని లక్కీడాం గ్రామంలో 127. 50 లక్షల ఖర్చుతో నిర్మించిన సిసి రోడ్లు కాలువలను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కరనాయుడు తదితరులు పాల్గొన్నారు.1