Shuru
Apke Nagar Ki App…
విజయనగరం జిల్లా జనసేన సీనియర్ నాయకులు గుర్రాన అయ్యులను పరామర్శించిన బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అప్పలస్వామి.. బొబ్బిలి నియోజకవర్గం తేదీ 09-08-2026 విజయనగరం జిల్లా జనసేన సీనియర్ నాయకులు గుర్రానా అయ్యులపై కక్ష సాధింపు చర్యలో భాగంగా వైసిపి ప్రభుత్వం దాడి చేసిన విషయం తెలుసుకొని బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అప్పలస్వామి గారు అయ్యలు స్వగృహంలో వారిని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకొని బొబ్బిలి నియోజకవర్గం ఎల్లవేళలా అండగా ఉంటుందని బొబ్బిలి నియోజకవర్గం నుంచి అయ్యలు గారిని కలవడానికి లెంక రమేష్ గారు, ఉల్లి సంతోష్ కుమార్ పొట్నూరు జనార్దహనరావు,కొటేడ సురేష్,గొల్లపల్లి జాను, దాకారపు చంద్రమౌళి, పాచిపెంట మండలం నుంచి మాదిరెడ్డి సతీష్ జన సైనికులు పాల్గొన్నారు..
వెంకీ నాయుడు
విజయనగరం జిల్లా జనసేన సీనియర్ నాయకులు గుర్రాన అయ్యులను పరామర్శించిన బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అప్పలస్వామి.. బొబ్బిలి నియోజకవర్గం తేదీ 09-08-2026 విజయనగరం జిల్లా జనసేన సీనియర్ నాయకులు గుర్రానా అయ్యులపై కక్ష సాధింపు చర్యలో భాగంగా వైసిపి ప్రభుత్వం దాడి చేసిన విషయం తెలుసుకొని బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అప్పలస్వామి గారు అయ్యలు స్వగృహంలో వారిని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకొని బొబ్బిలి నియోజకవర్గం ఎల్లవేళలా అండగా ఉంటుందని బొబ్బిలి నియోజకవర్గం నుంచి అయ్యలు గారిని కలవడానికి లెంక రమేష్ గారు, ఉల్లి సంతోష్ కుమార్ పొట్నూరు జనార్దహనరావు,కొటేడ సురేష్,గొల్లపల్లి జాను, దాకారపు చంద్రమౌళి, పాచిపెంట మండలం నుంచి మాదిరెడ్డి సతీష్ జన సైనికులు పాల్గొన్నారు..
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- నెల్లిమర్లలో దంచి కొడుతున్న వర్షం. రైతుల్లో ఆనందం వెల్లువిరిసింది నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం వర్షం దంచి కొట్టింది. ఈరోజు ఉదయం నుండి విపరీతమైన ఎండకాచి ఉక్క పూతలకు గురయ్యారు. మధ్యాహ్నం ఒంటిగంట నుండి చల్లబడి మేఘాలు దిగి వర్షం కొనసాగింది. దీంతో వాతావరణం చల్లబడి స్థానికులు కొంత ఉపశమనం పొందారు. ఈ వర్షం పడడంతో నగర పరిసర ప్రాంతాల వరి నారు, ఉబాలకు అనుకూలంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.1
- *ఆదివాసి అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ* *జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్* *ఘనంగా ఆదివాసి దినోత్సవ వేడుకలు* పలాస, ఆగస్టు 9: ఆదివాసి అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్ అన్నారు. స్థానిక రైల్వే మైదానంలో ఆదివారం సీతం పేట ఐ టి డి ఎ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు గౌతు శిరీష ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ద్వారా ప్రభుత్వం గిరిజనుల గౌరవాన్ని మరింత పెంచిందని తెలిపారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో సుమారు 90 వేల మంది సవర గిరిజనులు నివసిస్తున్నారని, వీరందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు.ఐటీడీఏ పరిధిలో 268 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, సుమారు 20 వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల పరీక్షా ఫలితాల్లో ఐటీడీఏ పరిధిలోని పాఠశాలలు 94.77 శాతం ఉత్తీర్ణత సాధించాయని, జిల్లా సగటు ఉత్తీర్ణత 90.5 శాతంగా ఉందన్నారు. జిల్లా సగటు కంటే అధికంగా ఉత్తీర్ణత సాధించడంతో పాటు గిరిజన విద్యార్థులు విద్యలో ప్రతిభ కనబరచడం సంతోషకరమని తెలిపారు. గిరిజనుల ఆరోగ్య భద్రతకు చర్యలు గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా వంటి వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య కార్డులు పంపిణీ చేసి, గిరిజనుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రూ.198 కోట్లతో రహదారుల అభివృద్ధి గత రెండు సంవత్సరాల్లో గిరిజన ప్రాంతాల్లో 291 గ్రామాల్లో 249 గ్రామాలకు వి బీ జీ రామ్ జీ, నాబార్డ్ నిధులు సుమారు రూ.198 కోట్ల వ్యయంతో రహదారి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఇప్పటివరకు రహదారి సౌకర్యం లేని, డోలీపై ఆధారపడుతున్న గ్రామాలకు కూడా రహదారులు నిర్మించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. గిరిజనులకు భూ హక్కులు అటవీ హక్కుల చట్టం (RoFR) కింద సుమారు 163 ఎకరాల భూమిని గిరిజన లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. గిరిజన ఉత్పత్తులకు ‘అమోఘం’ బ్రాండ్ వీడీవీకేలు, డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ఐటీడీఏ బ్రాండ్ అయిన ‘అమోఘం’ కార్యక్రమం ద్వారా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గిరిజనుల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించి, వారి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. క్రీడలు, పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు పాతపట్నం, పలాస, మందస ప్రాంతాల్లో గిరిజన విద్యార్థుల కోసం మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ట్రెక్కింగ్ మార్గాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రకృతి వనరులను పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ గిరిజనుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో, అలాగే పాతపట్నం వద్ద ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గిరిజనులు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందేలా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.గిరిజనుల విద్య, వైద్యం, రహదారులు, భూ హక్కులు, ఉపాధి, క్రీడలు, పర్యాటకం తదితర రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతతో చర్యలు చేపడుతోందని తెలిపారు. శాసనసభ్యులు గౌతు శిరీష మాట్లాడుతూ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారన్నారు. ఆదివాసి దినోత్సవం సందర్భంగా అందరికి అభినందనలు తెలియజేశారు. అనంతరం 200 మంది ఆశ్రమ పాఠశాల విద్యార్థినిలు ప్రదర్శించిన దింసా నృత్యాలు, సాంప్రదాయ సాంస్కృత కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అంతకుముందు ఆదివాసీలు నిర్వహించిన ర్యాలీ కోలాహలంగా సాగింది. ఆదివాసి దినోత్సవం సందర్భంగా టెక్కలి జిల్లా ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. రక్తదానం చేసేందుకు వచ్చిన యువతను ప్రత్యేకంగా అభినందించారు. ప్రశంసా పత్రాలను కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు విఠల్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ వజ్జ బాబూ రావు, డిఆర్డిఏ పథక సంచాలకులు ఎన్ .కిరణ్ కుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్.అప్పల రాజు, ఐ టి డి ఎ సహాయ ప్రాజెక్ట్ అధికారి చిన్నబాబు, డి డి. అన్నా దొర, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పి.నాయుడు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారి రమాదేవి, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ రావు, తాసిల్దార్ బెలమాన శ్రీదేవి, ఎంపీడీఓ వసంత ప్రసాద్, డా,సునీత, గిరిజన సంఘ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.3
- సముద్రం పక్కనే ఉన్న మహానగరం... కానీ విశాఖలో మంచినీటి కోసం మొదలైన కష్టాలు..! VSP...ఒకప్పుడు నీటితో కళకళలాడిన జలాశయాలు... ఇప్పుడు అడుగంటిపోతున్నాయి. విశాఖకు ప్రధాన నీటి వనరుల్లో ఒకటైన ముడసర్లోవ రిజర్వాయర్‌లో నీటి మట్టం భారీగా పడిపోయింది. దాదాపు 90 శాతం అడుగంటిపోయిన ముడసర్లోవ పరిస్థితి... నీటి కొరత తీవ్రతను కళ్లకు కడుతోంది. మన దగ్గరున్న డ్రోన్ విజువల్స్‌లో కూడా... విస్తారంగా కనిపించాల్సిన జలాశయం ఎంతగా వెలవెలబోయిందో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు... తాగునీటి అవసరాల కోసం మంచినీటి ట్యాంకర్లు వరుసగా రోడ్డెక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెందుర్తి పెద్ద చెరువులోనూ ఇదే పరిస్థితి. నీటి నిల్వలు తగ్గిపోవడంతో... భవిష్యత్తు నీటి అవసరాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక సింహాచలం అప్పన్న స్వామి వారి కోనేరు కూడా నీటి కష్టాలను తప్పించుకోలేకపోతోంది. విశాఖలో నీటి సమస్య ఇంకా ఎంత తీవ్రంగా మారనుందో చెప్పడానికి... ఈ దృశ్యాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. సముద్రం పక్కనే ఉన్న నగరం... కానీ తాగునీటి కోసం ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? వర్షాలు ఆలస్యం కావడం, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం... ఇవన్నీ కలిసి విశాఖకు రాబోయే రోజుల్లో మరింత పెద్ద నీటి సవాలుగా మారనున్నాయా..? ఇప్పటికైనా నీటి వనరుల సంరక్షణ, ప్రత్యామ్నాయ నీటి వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రస్తుత పరిస్థితి హెచ్చరిస్తోంది.1
- ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భముగా ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు సంప్రదాయ నృత్యాలతో కదం తొక్కిన గిరిజనులు.. పలాసలో భారీ ర్యాలీ గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే గౌతు శిరీష సమస్యల పరిష్కారానికి అండగా ఉంటాం: జిల్లా కలెక్టర్ పలాస: ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను పలాసలో గిరిజనులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలాస కేటీ రోడ్డు మీదుగా గిరిజనులు తమ సంప్రదాయ దుస్తులు ధరించి, సాంస్కృతిక నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. సంప్రదాయ వాయిద్యాలు, నృత్యాలతో ర్యాలీ ఆద్యంతం సందడిగా సాగింది. అనంతరం పలాస రైల్వే గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌తో పాటు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి, కళలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 200 మంది గిరిజన కళాకారులు థీంశా నృత్యాలు ప్రదర్శించి సభకు హాజరైన వారిని విశేషంగా ఆకట్టుకున్నారు. గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికే అనేక మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా గిరిజన ప్రాంతాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గిరిజనుల సంప్రదాయాలు, సంస్కృతి, కళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గిరిజన సంక్షేమమే లక్ష్యం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్య, వైద్యం, ఉపాధి తదితర రంగాల్లో అవసరమైన సహకారం అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు. గిరిజనులు ఎదుర్కొంటున్న ఎటువంటి సమస్య అయినా తమ దృష్టికి తీసుకువస్తే, తన వంతు సహకారాన్ని అందించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు పలాసలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, కళారూపాలు కార్యక్రమానికి హాజరైన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.1
- గొల్లప్రోలులో భారీ కార్డన్ అండ్ సెర్చ్ 58 బైక్‌లు స్వాధీనం... పిఠాపురం: శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ నిర్వహించారు. కాకినాడ సబ్ డివిజన్ ఇన్‌చార్జ్ అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ పర్యవేక్షణలో పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా ఆదివారం తెల్లవారుజామున 04:00 గంటల ప్రాంతంలో ఈ తనిఖీలు చేపట్టారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగప్ప చెరువు ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ అదుపులోకి తీసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలోని ముఖ్య వీధులు, అనుమానాస్పద ప్రాంతాలను అణువణువూ గాలించారు. గ్రామంలోని అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరించడంతో పాటు పాత నేరస్తుల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇళ్లు,పరిసర ప్రాంతాల్లో గంజాయి ఇతర మత్తు పదార్థాలు,నాటు సారా,అక్రమ మద్యం నిల్వలు మరియు బెల్ట్ షాపులపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నాటు సారా తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని,కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గ్రామాల్లో నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేని మొత్తం 58 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వారి వివరాలు తెలుసుకోవాలని పోలీసులు సూచించారు. గ్రామంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, మత్తు పదార్థాల విక్రయాలు,నాటు సారా తయారీ లేదా అక్రమ మద్యం అమ్మకాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ, పిఠాపురం టౌన్ ఎస్ఐ లోకేష్, యు కొత్తపల్లి ఎస్సై వెంకటేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.1
- ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ సిబ్బంది నిరసన దీక్ష రాజమహేంద్రవరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. తమకు ఎదురవుతున్న సమస్యలను యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సిబ్బంది తెలిపారు. ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలను సకాలంలో చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలు మరియు ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరియు యూనివర్సిటీ నిబంధనలకు అనుగుణంగా తమ సేవలకు తగిన గుర్తింపు, సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలని కోరారు. దీక్షలో పాల్గొన్న సిబ్బంది మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను అధికారులు సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఔట్సోర్సింగ్ సిబ్బంది పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.1
- కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వేద పండితులు జన్మదిన శుభాకాంక్షలు1
- కాకినాడ జిల్లా లో ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి విస్తృత తనిఖీలు కాకినాడ జిల్లాలో పర్యటన భాగంగా సోమవారం నాడు తునిలో ఏపీ పూడ్ కమిషన్ చైర్మన్ సి.విజయ్ ప్రతాప్ రెడ్డి విస్తృత తనిఖీలు చేపట్టారు. పట్టణములో ని రేషన్ డిపోలు, ప్రభుత్వ పాఠశాలల ను అంగన్వాడీ కేంద్రాల్లో ఆయన తనిఖీలు నిర్వహించరు. పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బాలికలతో విద్యార్థులకు ఇస్తున్న మెనూపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.రాష్ట్రంలోనే రెండవ ర్యాంకు సాధించినందుకు పాఠశాలలో ఉపాధ్యాయులను అభినందించారు.1