సముద్రం పక్కనే ఉన్న మహానగరం... కానీ విశాఖలో మంచినీటి కోసం మొదలైన కష్టాలు..! VSP...ఒకప్పుడు నీటితో కళకళలాడిన జలాశయాలు... ఇప్పుడు అడుగంటిపోతున్నాయి. విశాఖకు ప్రధాన నీటి వనరుల్లో ఒకటైన ముడసర్లోవ రిజర్వాయర్‌లో నీటి మట్టం భారీగా పడిపోయింది. దాదాపు 90 శాతం అడుగంటిపోయిన ముడసర్లోవ పరిస్థితి... నీటి కొరత తీవ్రతను కళ్లకు కడుతోంది. మన దగ్గరున్న డ్రోన్ విజువల్స్‌లో కూడా... విస్తారంగా కనిపించాల్సిన జలాశయం ఎంతగా వెలవెలబోయిందో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు... తాగునీటి అవసరాల కోసం మంచినీటి ట్యాంకర్లు వరుసగా రోడ్డెక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెందుర్తి పెద్ద చెరువులోనూ ఇదే పరిస్థితి. నీటి నిల్వలు తగ్గిపోవడంతో... భవిష్యత్తు నీటి అవసరాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక సింహాచలం అప్పన్న స్వామి వారి కోనేరు కూడా నీటి కష్టాలను తప్పించుకోలేకపోతోంది. విశాఖలో నీటి సమస్య ఇంకా ఎంత తీవ్రంగా మారనుందో చెప్పడానికి... ఈ దృశ్యాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. సముద్రం పక్కనే ఉన్న నగరం... కానీ తాగునీటి కోసం ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? వర్షాలు ఆలస్యం కావడం, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం... ఇవన్నీ కలిసి విశాఖకు రాబోయే రోజుల్లో మరింత పెద్ద నీటి సవాలుగా మారనున్నాయా..? ఇప్పటికైనా నీటి వనరుల సంరక్షణ, ప్రత్యామ్నాయ నీటి వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రస్తుత పరిస్థితి హెచ్చరిస్తోంది.
సముద్రం పక్కనే ఉన్న మహానగరం... కానీ విశాఖలో మంచినీటి కోసం మొదలైన కష్టాలు..! VSP...ఒకప్పుడు నీటితో కళకళలాడిన జలాశయాలు... ఇప్పుడు అడుగంటిపోతున్నాయి. విశాఖకు ప్రధాన నీటి వనరుల్లో ఒకటైన ముడసర్లోవ రిజర్వాయర్‌లో నీటి మట్టం భారీగా పడిపోయింది. దాదాపు 90 శాతం అడుగంటిపోయిన ముడసర్లోవ పరిస్థితి... నీటి కొరత తీవ్రతను కళ్లకు కడుతోంది. మన దగ్గరున్న డ్రోన్ విజువల్స్‌లో కూడా... విస్తారంగా కనిపించాల్సిన జలాశయం ఎంతగా వెలవెలబోయిందో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు... తాగునీటి అవసరాల కోసం మంచినీటి ట్యాంకర్లు వరుసగా రోడ్డెక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెందుర్తి పెద్ద చెరువులోనూ ఇదే పరిస్థితి. నీటి నిల్వలు తగ్గిపోవడంతో... భవిష్యత్తు నీటి అవసరాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక సింహాచలం అప్పన్న స్వామి వారి కోనేరు కూడా నీటి కష్టాలను తప్పించుకోలేకపోతోంది. విశాఖలో నీటి సమస్య ఇంకా ఎంత తీవ్రంగా మారనుందో చెప్పడానికి... ఈ దృశ్యాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. సముద్రం పక్కనే ఉన్న నగరం... కానీ తాగునీటి కోసం ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? వర్షాలు ఆలస్యం కావడం, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం... ఇవన్నీ కలిసి విశాఖకు రాబోయే రోజుల్లో మరింత పెద్ద నీటి సవాలుగా మారనున్నాయా..? ఇప్పటికైనా నీటి వనరుల సంరక్షణ, ప్రత్యామ్నాయ నీటి వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రస్తుత పరిస్థితి హెచ్చరిస్తోంది.
- సముద్రం పక్కనే ఉన్న మహానగరం... కానీ విశాఖలో మంచినీటి కోసం మొదలైన కష్టాలు..! VSP...ఒకప్పుడు నీటితో కళకళలాడిన జలాశయాలు... ఇప్పుడు అడుగంటిపోతున్నాయి. విశాఖకు ప్రధాన నీటి వనరుల్లో ఒకటైన ముడసర్లోవ రిజర్వాయర్‌లో నీటి మట్టం భారీగా పడిపోయింది. దాదాపు 90 శాతం అడుగంటిపోయిన ముడసర్లోవ పరిస్థితి... నీటి కొరత తీవ్రతను కళ్లకు కడుతోంది. మన దగ్గరున్న డ్రోన్ విజువల్స్‌లో కూడా... విస్తారంగా కనిపించాల్సిన జలాశయం ఎంతగా వెలవెలబోయిందో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు... తాగునీటి అవసరాల కోసం మంచినీటి ట్యాంకర్లు వరుసగా రోడ్డెక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెందుర్తి పెద్ద చెరువులోనూ ఇదే పరిస్థితి. నీటి నిల్వలు తగ్గిపోవడంతో... భవిష్యత్తు నీటి అవసరాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక సింహాచలం అప్పన్న స్వామి వారి కోనేరు కూడా నీటి కష్టాలను తప్పించుకోలేకపోతోంది. విశాఖలో నీటి సమస్య ఇంకా ఎంత తీవ్రంగా మారనుందో చెప్పడానికి... ఈ దృశ్యాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. సముద్రం పక్కనే ఉన్న నగరం... కానీ తాగునీటి కోసం ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? వర్షాలు ఆలస్యం కావడం, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం... ఇవన్నీ కలిసి విశాఖకు రాబోయే రోజుల్లో మరింత పెద్ద నీటి సవాలుగా మారనున్నాయా..? ఇప్పటికైనా నీటి వనరుల సంరక్షణ, ప్రత్యామ్నాయ నీటి వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రస్తుత పరిస్థితి హెచ్చరిస్తోంది.1
- నెల్లిమర్లలో దంచి కొడుతున్న వర్షం. రైతుల్లో ఆనందం వెల్లువిరిసింది నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం వర్షం దంచి కొట్టింది. ఈరోజు ఉదయం నుండి విపరీతమైన ఎండకాచి ఉక్క పూతలకు గురయ్యారు. మధ్యాహ్నం ఒంటిగంట నుండి చల్లబడి మేఘాలు దిగి వర్షం కొనసాగింది. దీంతో వాతావరణం చల్లబడి స్థానికులు కొంత ఉపశమనం పొందారు. ఈ వర్షం పడడంతో నగర పరిసర ప్రాంతాల వరి నారు, ఉబాలకు అనుకూలంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.1
- *ఆదివాసి అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ* *జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్* *ఘనంగా ఆదివాసి దినోత్సవ వేడుకలు* పలాస, ఆగస్టు 9: ఆదివాసి అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్ అన్నారు. స్థానిక రైల్వే మైదానంలో ఆదివారం సీతం పేట ఐ టి డి ఎ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు గౌతు శిరీష ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ద్వారా ప్రభుత్వం గిరిజనుల గౌరవాన్ని మరింత పెంచిందని తెలిపారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో సుమారు 90 వేల మంది సవర గిరిజనులు నివసిస్తున్నారని, వీరందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు.ఐటీడీఏ పరిధిలో 268 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, సుమారు 20 వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల పరీక్షా ఫలితాల్లో ఐటీడీఏ పరిధిలోని పాఠశాలలు 94.77 శాతం ఉత్తీర్ణత సాధించాయని, జిల్లా సగటు ఉత్తీర్ణత 90.5 శాతంగా ఉందన్నారు. జిల్లా సగటు కంటే అధికంగా ఉత్తీర్ణత సాధించడంతో పాటు గిరిజన విద్యార్థులు విద్యలో ప్రతిభ కనబరచడం సంతోషకరమని తెలిపారు. గిరిజనుల ఆరోగ్య భద్రతకు చర్యలు గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా వంటి వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య కార్డులు పంపిణీ చేసి, గిరిజనుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రూ.198 కోట్లతో రహదారుల అభివృద్ధి గత రెండు సంవత్సరాల్లో గిరిజన ప్రాంతాల్లో 291 గ్రామాల్లో 249 గ్రామాలకు వి బీ జీ రామ్ జీ, నాబార్డ్ నిధులు సుమారు రూ.198 కోట్ల వ్యయంతో రహదారి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఇప్పటివరకు రహదారి సౌకర్యం లేని, డోలీపై ఆధారపడుతున్న గ్రామాలకు కూడా రహదారులు నిర్మించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. గిరిజనులకు భూ హక్కులు అటవీ హక్కుల చట్టం (RoFR) కింద సుమారు 163 ఎకరాల భూమిని గిరిజన లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. గిరిజన ఉత్పత్తులకు ‘అమోఘం’ బ్రాండ్ వీడీవీకేలు, డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ఐటీడీఏ బ్రాండ్ అయిన ‘అమోఘం’ కార్యక్రమం ద్వారా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గిరిజనుల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించి, వారి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. క్రీడలు, పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు పాతపట్నం, పలాస, మందస ప్రాంతాల్లో గిరిజన విద్యార్థుల కోసం మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ట్రెక్కింగ్ మార్గాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రకృతి వనరులను పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ గిరిజనుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో, అలాగే పాతపట్నం వద్ద ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గిరిజనులు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందేలా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.గిరిజనుల విద్య, వైద్యం, రహదారులు, భూ హక్కులు, ఉపాధి, క్రీడలు, పర్యాటకం తదితర రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతతో చర్యలు చేపడుతోందని తెలిపారు. శాసనసభ్యులు గౌతు శిరీష మాట్లాడుతూ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారన్నారు. ఆదివాసి దినోత్సవం సందర్భంగా అందరికి అభినందనలు తెలియజేశారు. అనంతరం 200 మంది ఆశ్రమ పాఠశాల విద్యార్థినిలు ప్రదర్శించిన దింసా నృత్యాలు, సాంప్రదాయ సాంస్కృత కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అంతకుముందు ఆదివాసీలు నిర్వహించిన ర్యాలీ కోలాహలంగా సాగింది. ఆదివాసి దినోత్సవం సందర్భంగా టెక్కలి జిల్లా ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. రక్తదానం చేసేందుకు వచ్చిన యువతను ప్రత్యేకంగా అభినందించారు. ప్రశంసా పత్రాలను కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు విఠల్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ వజ్జ బాబూ రావు, డిఆర్డిఏ పథక సంచాలకులు ఎన్ .కిరణ్ కుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్.అప్పల రాజు, ఐ టి డి ఎ సహాయ ప్రాజెక్ట్ అధికారి చిన్నబాబు, డి డి. అన్నా దొర, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పి.నాయుడు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారి రమాదేవి, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ రావు, తాసిల్దార్ బెలమాన శ్రీదేవి, ఎంపీడీఓ వసంత ప్రసాద్, డా,సునీత, గిరిజన సంఘ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.3
- ఈ నెల 10న అరకులోయ లో నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఏర్పాట్లు అరకులోయ లో ఈ నెల 10న నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి వేదిక సిద్దమవుతుంది. సుమారు 1500 మంది కూర్చునే విధంగా రూఫ్ క్లోజ్డ్ వేదికను అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వద్ద ఏర్పాటు చేయిస్తున్నారు. ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉత్పత్తులు, సేవలు ప్రదర్శించడానికి 15 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.1
- విజయనగరం జిల్లా జనసేన సీనియర్ నాయకులు గుర్రాన అయ్యులను పరామర్శించిన బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అప్పలస్వామి.. బొబ్బిలి నియోజకవర్గం తేదీ 09-08-2026 విజయనగరం జిల్లా జనసేన సీనియర్ నాయకులు గుర్రానా అయ్యులపై కక్ష సాధింపు చర్యలో భాగంగా వైసిపి ప్రభుత్వం దాడి చేసిన విషయం తెలుసుకొని బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అప్పలస్వామి గారు అయ్యలు స్వగృహంలో వారిని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకొని బొబ్బిలి నియోజకవర్గం ఎల్లవేళలా అండగా ఉంటుందని బొబ్బిలి నియోజకవర్గం నుంచి అయ్యలు గారిని కలవడానికి లెంక రమేష్ గారు, ఉల్లి సంతోష్ కుమార్ పొట్నూరు జనార్దహనరావు,కొటేడ సురేష్,గొల్లపల్లి జాను, దాకారపు చంద్రమౌళి, పాచిపెంట మండలం నుంచి మాదిరెడ్డి సతీష్ జన సైనికులు పాల్గొన్నారు..4
- వంగర :రాజుల గుమ్మాడ వెల్నెస్ సెంటర్ ఎదురుగా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి వంగర మండలం రాజుల గుమ్మాడ వెల్నెస్ సెంటర్ ఎదురుగా నెలకొన్న అపరిశుభ్రత పరిస్థితి పంచాయతీ అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనం గ్రామస్తులు మండిపడుతున్నారు. సమీప ఆలయ లకు వెళ్లే భక్తులు ఈ దుర్వాసన తో అవస్తులు పడుతున్నారు. గ్రామ శివారు ప్రాంతంలోని చెత్త కుప్పలు దర్శిమిస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- గజపతినగరంలో వైసీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి గజపతినగరంలో ఉద్రిక్త వాతావరణం నడుమ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించడంతో పట్టణంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య ఏర్పడిన పరిస్థితులతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.1