Shuru
Apke Nagar Ki App…
జగిత్యాల జిల్లా మైనార్టీ చైర్మన్‌గా మహమ్మద్ అబ్దుల్ నయీమ్ కోరుట్ల: 19వ వార్డుకు చెందిన మహమ్మద్ అబ్దుల్ నయీమ్‌ను జగిత్యాల జిల్లా మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా నియమించిన సందర్భంగా హైదర్‌గూడ వాసులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నయీమ్‌కు ఈ పదవి దక్కడంతో హైదర్‌గూడలో కాంగ్రెస్ బలం మరింత పెరిగిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నయీమ్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
అబ్దుల్ ముసవ్విర్
జగిత్యాల జిల్లా మైనార్టీ చైర్మన్‌గా మహమ్మద్ అబ్దుల్ నయీమ్ కోరుట్ల: 19వ వార్డుకు చెందిన మహమ్మద్ అబ్దుల్ నయీమ్‌ను జగిత్యాల జిల్లా మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా నియమించిన సందర్భంగా హైదర్‌గూడ వాసులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నయీమ్‌కు ఈ పదవి దక్కడంతో హైదర్‌గూడలో కాంగ్రెస్ బలం మరింత పెరిగిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నయీమ్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- జగిత్యాల జిల్లా మైనార్టీ చైర్మన్‌గా మహమ్మద్ అబ్దుల్ నయీమ్ కోరుట్ల: 19వ వార్డుకు చెందిన మహమ్మద్ అబ్దుల్ నయీమ్‌ను జగిత్యాల జిల్లా మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా నియమించిన సందర్భంగా హైదర్‌గూడ వాసులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నయీమ్‌కు ఈ పదవి దక్కడంతో హైదర్‌గూడలో కాంగ్రెస్ బలం మరింత పెరిగిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నయీమ్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.1
- *ఘనంగా వికసిత్ భారత్ సంకల్ప సభ, సేవా జ్యోతి యాత్ర* *ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నాం* *బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ వి. మురళీధర్ గౌడ్* జగిత్యాల అక్టోబర్ 7 భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు గారి ఆధ్వర్యంలో ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా జగిత్యాల పట్టణంలో వికసిత్ భారత్ సంకల్ప సభ, సేవా జ్యోతి యాత్ర కార్యక్రమాలను బుధవారం ఘనంగా నిర్వహించారు.1
- ముదిరాజులకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి: జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన వారికి అవకాశం కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. చట్టసభల్లో ముదిరాజులకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదని అన్నారు. ఎమ్మెల్సీ బరిలో ముదిరాజులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.1
- సిరిసిల్ల : “మన అంగన్‌వాడీ–మన బాధ్యత” కార్యక్రమం....... రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక కళ్యాణ లక్ష్మి గార్డెన్‌లో పోషణ మాసం–2026 ముగింపు వేడుకలు నిర్వహించారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన “మన అంగన్‌వాడీ–మన బాధ్యత” కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్యాభివృద్ధిలో అంగన్‌వాడీల పాత్ర కీలకమని ఆమె అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు, పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్‌పై AMC కమిటీలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం సామూహిక శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొని గర్భిణులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది, ANMలు, ఆశా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ అందించి, ఎండిపోతున్న పంటలను కాపాడాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం దత్తూజిపేటలో విద్యుత్ సరఫరా సరిగా లేక ఎండిపోతున్న వరి పంటలను ఆయన పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా పంటలకు నీరందక రైతులు నష్టపోతున్నారని హరిప్రసాద్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 24 గంటల ఉచిత విద్యుత్ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను గుర్తించి పరిహారం అందించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ నాయకులు మ్యాకల తిరుపతి, మ్యాక వినోద్, శ్రీరాముల రమేష్, చంటి శ్రీనివాస్, పుల్ల మల్లేశం, నగర పార్టీ అధ్యక్షురాలు రంగరవేణి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.1
- ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం సిరిసిల్లలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు సంబంధించిన 425 ఎకరాల భూముల వివరాలపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డుల్లో అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సర్వే నంబర్ల వారీగా సమగ్ర సర్వే నిర్వహించి, గ్రామసభల ద్వారా భూముల హద్దులను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కమిటీలు భూ సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు విఫలమవుతున్నాయని ప్రశ్నించారు. ముస్తాబాద్ మండలంలో భూ సమస్యపై వచ్చిన వినతిని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తోందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడం ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపిందని విమర్శించారు. ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలు స్వతంత్రంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుందని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి, మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. సమావేశంలో సిపిఐ నాయకులు పంతం రవి, గుంటి వేణు, కడారి రాములు, మంద అనిల్ తదితరులు పాల్గొన్నారు.3
- సింగరేణిలో కార్మికులకు సీపీఆర్‌పై శిక్షణ ప్రాణాలను కాపాడే అత్యవసర వైద్య ప్రక్రియపై అవగాహన అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్ట్‌లో హ్యాండ్స్‌ఆన్ సీపీఆర్ ట్రైనింగ్ సింగరేణిలో కార్మికులకు సీపీఆర్‌పై శిక్షణ ప్రాణాలను కాపాడే అత్యవసర వైద్య ప్రక్రియపై అవగాహన అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్ట్‌లో హ్యాండ్స్‌ఆన్ సీపీఆర్ ట్రైనింగ్ సింగరేణి కాలరీస్ సంస్థ ఆధ్వర్యంలో అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్ట్ ప్రాంతంలో కార్మికులకు సీపీఆర్ (Cardiopulmonary Resuscitation) పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గుండె ఆగిపోయిన వ్యక్తికి తక్షణ ప్రథమ చికిత్స అందించి ప్రాణాలను కాపాడే విధానంపై కార్మికులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ శిక్షణలో చెక్, కంప్రెస్, బ్రీత్ విధానాలను అనుసరించి సీపీఆర్ ఎలా చేయాలి, అత్యవసర సమయంలో ఎలా స్పందించాలి అనే అంశాలను ప్రాక్టికల్‌గా వివరిస్తున్నారు. కార్మికులు స్వయంగా సీపీఆర్ విధానాన్ని అభ్యసించేలా హ్యాండ్స్‌ఆన్ ట్రైనింగ్ నిర్వహిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. 28-09-2026 నుంచి 26-11-2026 వరకు కొనసాగనున్న ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా కార్మికుల్లో అత్యవసర వైద్య పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. “ప్రాక్టీస్ CPR – సేవ్ ఎ లైఫ్” అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్మికుల భద్రతకు ఎంతో దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్మికుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ సీపీఆర్ విధానాన్ని ప్రాక్టికల్‌గా ప్రదర్శిస్తూ కార్మికులను శిక్షణలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించిన ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ మెంబర్ & సోషల్ మీడియా ఆర్గనైజర్ కాంపెల్లి రాజేష్ కుమార్, కార్మికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ విషయంలో సింగరేణి యాజమాన్యానికి ఉన్న బాధ్యతను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు ప్రతి కార్మికుడు సీపీఆర్‌పై ప్రాథమిక అవగాహన కలిగి ఉండటం అవసరమని తెలిపారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.1
- రాహుల్ ప్రియాంకపై దాడికి నిరసనగా మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నిరాహారదీక్ష ఓటు హక్కును హరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదు రాజ్యాంగ పరిరక్షణ కోసమే మా నాయకుల పోరాటం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేపడుతాం జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మోదీ కనుసన్నల్లో జరుగుతున్న ఈసీ అక్రమాలకు నిరసనగా శాంతియుతంగా ధర్నా చేసిన రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ లపై పోలీసులచే దాడి చేయించిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముకరంపుర లోని తన కార్యాలయం వద్ద నాయకులు కార్యకర్తలతో కలిసి ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ లోక్ సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ మోదీ కనుసన్నల్లో చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ చేసిన తప్పిదాలపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోలీసులచే దాడి చేపించి అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని అటువంటి ఓటు హక్కును కేంద్రం ప్రభుత్వం సీఈసీ ని అడ్డుపెట్టుకుని అన్యాయం చేస్తోందని నరేందర్ రెడ్డి అన్నారు.రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ చేస్తున్న ఈ న్యాయమైన పోరాటానికి దేశ ప్రజల పూర్తి మద్దతుందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.ఫాం 6 లో 2002 లో ఓటు హక్కు పొందిన వారి వివరాలు నమోదు చేయాలని ఉందని అప్పుడు ఓటు వేయని వారి కుటుంబాల పరిస్థితేంటని,బోగస్ ఫాం 7 ద్వారా బోగస్ సంతకాలు పెట్టి బీజేపీ నాయకులు ఓట్లు కొల్లగొడుతున్నారని నరేందర్ రెడ్డి ఆరోపించారు.అన్ని అక్రమాలకు జ్ఞానేశ్ కుమార్ మద్దతు ఉందని అందుకే జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇదే విధంగా కొనసాగుతే అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు మేం సిద్దమని నరేందర్ రెడ్డి హెచ్చరించారు.4