సర్వే నెంబర్ 650-2 లో అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలి.గ్రీవెన్స్ లో సిపిఐ నాయకుల ఫిర్యాదు శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం పట్టణంలో 650-2 సర్వే నంబర్ లో ప్రభుత్వం ప్లంబర్స్ కార్మికుల కు కేటాయించిన రెండు ఎకరాల భూమిని కొంతమంది అన్యాక్రాంతం చేసి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పేదల పేర్లు చెప్పుకొని ప్లంబర్స్ యూనియన్ వివిధ రాజకీయ పార్టీల నాయకులు కుమ్మక్కై ఆ ప్రభుత్వ భూమిని నిజమైన అర్హులైన ప్లంబర్లకు అందకుండా తమ బినామీ పేర్లతో అంతా నొక్కేశారు. వీరికి అప్పటి తాసిల్దార్ రమేష్ అవినీతి అక్రమార్కులకు పూర్తిగా సహకరించారు.1996 లో ప్లంబర్స్ అంత ఒక యూనియన్ గా ఏర్పాటు చేసుకుని పట్టాల కోసం ప్రభుత్వానికి విన్నవించుకోగా కార్మికులకు పట్టాలని మంజూరు చేసింది. అయితే ఆ భూమి మాది అని పట్టణానికి చెందిన కొంతమంది వ్యక్తులు కోర్టును ఆశ్రయించడం తో అప్పటినుండి ఆ భూమి పెండింగ్లో పడుతూ వచ్చింది. ప్లంబర్స్ యూనియన్ ముసుగులో అప్పటి అధికార పార్టీని అడ్డుపెట్టుకొని భూమి యజమానులను బెదిరించి మరోవైపు అసలైన ప్లంబర్స్ కార్మికులను కూడా తొక్కిపెట్టేసి యూనియన్ పేరు చెప్పుకొని ముగ్గురు వ్యక్తులు దాదాపు 30 నుంచి 35 పట్టాల వరకు దోచేశారు. 2025 సంవత్సరంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిన ఫలితంగా అక్కడ నకిలీ పట్టాలు ఎవరైతే చేసుకున్నారో వారి పట్టాలను వెంటనే రద్దు చేయాలని కలెక్టర్ గారు ధర్మవరం ఆర్డీవో గారికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. RDO గారు పట్టాలు రద్దు చేసిన తర్వాత కూడా ఆ భూమిలో అక్రమార్కులు ఇంకా భవనాలు నిర్మిస్తూనే ఉన్నారు. కావున ఆ నిర్మాణాలు వెంటనే తొలగించి అర్హులైన కార్మికులు కి పట్టాలు ఇప్పించి న్యాయం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, AITUC, నాయకులు ఎర్రం శెట్టి రమణ, ప్లంబర్స్ కార్మిక సంఘం అధ్యక్ష,కార్యదర్శులు, గోవిందరాజు,అన్నం లక్ష్మీనారాయణ, రామసుబ్బయ్య, రామకృష్ణ, మసూద్, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

- శ్రీ సత్య సాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి తాండ గ్రామంలో యూరియా కలిపిన నీరు త్రాగి దాదాపు 40 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల రైతు బోజే నాయక్ గొర్రెలను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గొర్రెలను తీసుకెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పంట పొలాలకు యూరియా కలిపి ఉంచిన నీరు గొర్రెలు త్రాగి 40 గొర్రెలు మృతి చెందాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. సుమారు గొర్రెలు 4 లక్షల రూపాయలు విలువ చేస్తా అన్నారు. బతుకుదెరువు కోసం ఉన్న గొర్రెలు ఒక్కసారిగా అన్ని మృతి చెందడంతో ఇంటిని ఎలా పోషించుకోవాలని రైతు కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి ఆ రైతును ఆదుకోవాలని వేడుకుంటున్నారు.1
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కాలువ తలపెట్టిన 10 రోజుల హోమాలు నేటితో ముగిసాయి. నేడు చంద్రబాబు జన్మదినం సందర్భంగా మహా చండీయాగం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే దైవబలం ఆయనకు సమకూరాలని తాము యజ్ఞాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రభుత్వ విప్ కాలువ శుభాకాంక్షలు తెలిపారు.1
- చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్ర అభివృద్ధి : పతిరాజు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాదిరాజు లక్ష్మణ పతి రాజు అన్నారు సోమవారం ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను స్థానిక బస్టాండ్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ నందు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ మేరకు ఆయన ప్రసంగిస్తూ ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వ రథసారథి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ అదేవిధంగా ప్రకటించనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యారన్నారు నవీన రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు అనంతరం అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హరీ రాయల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల రామచంద్రయ్య వేలూరు సుబ్రహ్మణ్యం కార్తీక్ మురళి విద్యాసాగర్ బోయకొండ పవన్ రామకృష్ణ శివప్ప పునీత్ రాజు కుంచి నరేష్ బోయకొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు3
- కర్నూలు జిల్లా... హలహర్వి మండలం మెదేహల్ గ్రామం సమీపంలో ఆటో బోల్తా... ఒకరికి పరిస్థితి విషమంగా ఉంది నలుగురికి గాయాలు... చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది2
- గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది1
- Post by Daatha Foundation Trust1
- బద్వేలు:సరస్వతి శిశు మందిరంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితభావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ వేదికపై ఘనంగా సన్మానం జరిగింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానంతో పాటు, విద్యా విలువలను చాటిచెప్పే పలు కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. క్రమశిక్షణ, విద్య మరియు సంస్కృతుల కలయికగా సాగిన ఈ ఉత్సవం అందరినీ అలరించింది. ఈ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న పలువురికి సరస్వతి శిశు మందిరం కమిటీ సభ్యులు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు, అనంతరం శిశు మందిరం వార్షికోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులతో పాటు కమిటీ సభ్యులు పలువురు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు2