Shuru
Apke Nagar Ki App…
సంగారెడ్డి జిల్లాలో గణతంత్ర దినోత్సవము లో పాల్గొని ప్రసంగించడానికి అనుమతి కోరుతూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్న కండర క్షిణిత వ్యాధి బాధితుల సంఘం మడపతి రవికుమార్ గారు తదితరులు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రము ఇవ్వడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ గారు అవకాశం ఇస్తామని తెలియజేసారు.దానికి దివ్యాంగులు కృతజ్ఞతలు తెలియజేసారు.
Mahesh Kumar
సంగారెడ్డి జిల్లాలో గణతంత్ర దినోత్సవము లో పాల్గొని ప్రసంగించడానికి అనుమతి కోరుతూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్న కండర క్షిణిత వ్యాధి బాధితుల సంఘం మడపతి రవికుమార్ గారు తదితరులు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రము ఇవ్వడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ గారు అవకాశం ఇస్తామని తెలియజేసారు.దానికి దివ్యాంగులు కృతజ్ఞతలు తెలియజేసారు.
More news from తెలంగాణ and nearby areas
- సంగారెడ్డి పట్టణంలో శిశు గృహ, సఖి కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య1
- భారత్ మాత కి జై 🇮🇳1
- మేడారం జాతరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావుకు ఆత్మీయ ఆహ్వానం పలికిన రాష్ట్ర మహిళా మంత్రులు.. రాష్ట్ర మహిళా మంత్రులకు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు.ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం రాష్ట్ర దేవదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. పంచాయతీ రాజ్ & మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ కి మేడారం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా... తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా.. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సాదర ఆహ్వానం పలికారు.1
- మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి అభినందనలు అందుకుంటున్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న మరియు దొంగిలించబడిన మొబైల్ ఫోన్ల రికవరీలో పోలీసులు కీలక విజయం సాధించారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ – CEIR పోర్టల్ సహాయంతో మొత్తం 1039 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వీటి విలువ రూ. 2 కోట్ల 8 లక్షలుగా అధికారులు తెలిపారు.పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఐపిఎస్ ఆదేశాల మేరకు, సీసీఎస్ ఎల్బీ నగర్, మల్కాజిగిరి యూనిట్లు, ఐటి సెల్ కలిసి ప్రత్యేక బృందాలుగా పనిచేసి ఆరు నెలల వ్యవధిలో ఈ ఫోన్లను గుర్తించారు. ఎల్బీ నగర్ పరిధిలో 739, మల్కాజిగిరి పరిధిలో 300 మొబైల్ ఫోన్లు రికవరీ అయ్యాయి. గురువారం రోజు జనవరి 8న రికవరీ చేసిన ఫోన్లను అసలైన యజమానులకు అందజేయగా, బాధితులు మల్కాజిగిరి పోలీసుల పనితీరును ప్రశంసించారు. మొబైల్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, దొంగిలించిన ఫోన్ల కొనుగోలు నేరమని పోలీసులు హెచ్చరించారు.2
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవీ రవీందర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి సమయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి రాజేష్ గారికి వార్డులను పెంచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.1
- ట్రాక్టర్ ఆటో ఢీకొని ఒకరు మృతి బాన్సువాడ ప్రతినిధి రెవిన్యూ అధికారులు ఇష్టం వచ్చిన విధంగా ఒకేసారి రెండు గ్రామాల నుంచి ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక తరలించడానికి అనుమతులు ఇవ్వడంతో, వారు అట్టివేగంగా ట్రాక్టర్లు నడుపుతూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. ఇప్పటికే ఇసుక ట్రాక్టర్ల వల్ల, ఇసుక లారీల వల్ల బీర్కూర్, కిష్టాపూర్, కొల్లూర్, దామరించ, చించోల్లి బిచ్కుంద, జూకల్, పిట్లం, నిజం సాగర్, మద్నూర్ మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక దందా కొనసాగిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఒకటే రోజు చించొల్లి, కిష్టాపూర్ గ్రామాల మంజీరా నది నుంచి ఇసుక ఇందిరమ్మ ఇళ్లకు అనుమతులు ఇవ్వడంతో, గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారు. ఎక్కువగా ఇసుక ట్రిప్పులు జరుగుతే ఎక్కువగా డబ్బులు వస్తాయని ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు అతివేగంగా ట్రాక్టర్లను నడుపుతూ ప్రాణాలను తీస్తున్నారు. గురువారం రాత్రి బుడిమి నుంచి నాగారం గ్రామంలో వరి నాట్లు వేయడానికి వచ్చి తిరిగి వెళుతుండగా కొల్లూరు శివారులోని రైస్ మిల్ వద్ద 12 మంది కూలీలతో వెళ్తున్న ఆటో ను అతివేగంగా ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకేసారి ఆటో బోల్తా పడి రుక్మిణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది, తీవ్ర గాయాలు కుకురైన కూలీలను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ పరార్ లో ఉన్నారు. ఏ గ్రామానికి చెందిన ట్రాక్టర్, డ్రైవర్ ఎవరు అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.2
- వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు1
- భారత్ మాత కి జై 🇮🇳2