విజయనగరం జిల్లా బాడంగి పోలీసు స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులు, కేసుల పురోగతిని ఆయన పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన పోలీసు సేవలు అందేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతతో పనిచేయాలని, పోలీసు సేవలతో ప్రజలకు భరోసా కల్పించాలని ఆయన సూచించారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడితో మర్యాదపూర్వకంగా, సానుభూతితో వ్యవహరించాలని, నేరస్థుల పట్ల మాత్రం కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, హెల్మెట్ వినియోగం, రహదారి భద్రత వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. స్మార్ట్ పోలీసింగ్ విధానాలను సమర్థంగా అమలు చేస్తూ అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించాలని, పోలీసు స్టేషన్ పరిధిలో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అనంతరం స్టేషన్‌లో దర్యాప్తులో ఉన్న వివిధ కేసుల కేసు డైరీలు, రౌడీ షీట్లు, ఇతర రికార్డులను పరిశీలించిన ఎస్పీ, దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి చట్టపరమైన చర్యలు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో బొబ్బిలి డీఎస్పీ ఆర్. గోవిందరావు, బాడంగి ఎస్సై సూర్యకుమారి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా బాడంగి పోలీసు స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులు, కేసుల పురోగతిని ఆయన పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన పోలీసు సేవలు అందేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతతో పనిచేయాలని, పోలీసు సేవలతో ప్రజలకు భరోసా కల్పించాలని ఆయన సూచించారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడితో మర్యాదపూర్వకంగా,
సానుభూతితో వ్యవహరించాలని, నేరస్థుల పట్ల మాత్రం కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, హెల్మెట్ వినియోగం, రహదారి భద్రత వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. స్మార్ట్ పోలీసింగ్ విధానాలను సమర్థంగా అమలు చేస్తూ అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించాలని, పోలీసు స్టేషన్ పరిధిలో మరిన్ని
సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అనంతరం స్టేషన్‌లో దర్యాప్తులో ఉన్న వివిధ కేసుల కేసు డైరీలు, రౌడీ షీట్లు, ఇతర రికార్డులను పరిశీలించిన ఎస్పీ, దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి చట్టపరమైన చర్యలు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో బొబ్బిలి డీఎస్పీ ఆర్. గోవిందరావు, బాడంగి ఎస్సై సూర్యకుమారి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
- 😭🙏1
- 🙏🙏1
- 🙏🙏1
- తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టాలనే ఉద్దేశంతో నిన్నటివరకు రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్టును వక్రీకరించి, వారిని మెచ్చుకున్న రేవంత్ రెడ్డి.. ఈరోజు అదే రిటైర్డ్ ఇంజనీర్లు కన్నెపల్లి పంపులను ఆన్ చేయమని చెప్పగానే వారిని జైల్లో పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఆరోపించారు.1
- ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలకు ఎంపికైన ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ జాయినింగ్ ఆర్డర్లను అందజేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లోని 28 ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలకు 28 మంది ఇన్‌స్ట్రక్టర్లు, 28 మంది ఆయాలు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే రాగమయి దయానంద్, డాక్టర్ మట్టా దయానంద్ కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా నియమితులైన ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, చిన్నారుల పట్ల ప్రేమ, ఓర్పుతో వ్యవహరించాలని, ఆటలు, పాటల ద్వారా బోధన అందించాలని సూచించారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, పిల్లల ఆరోగ్యం, భద్రత, పోషకాహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి, సత్తుపల్లి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.2
- 😭🙏1
- 🙏🙏1
- 🙏🙏1
- ఓటర్లకు అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ అయింది. మీ ఓటు భద్రంగా ఉండాలంటే ఎన్యూమరేషన్ ఫారమ్ (EF) ను జూలై 14వ తేదీలోపు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి చేసిన ఫారమ్‌ను మీ ప్రాంత బీఎల్‌ఓ (BLO) కు అందజేయాలి. ఒకవేళ నిర్ణీత గడువులోగా దీనిని సమర్పించకపోతే, జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోయే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఇంకా ఈ ఫారమ్ అందనట్లయితే, ఈసీఐ (ECI) ఓటర్ పోర్టల్ లేదా ఈసీఐ యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. లేదా మీ పరిధిలోని బీఎల్‌ఓను సంప్రదించి కూడా ఫారమ్ పొందవచ్చు. మీ ఓటు భద్రంగా ఉండాలంటే జూలై 14 లోపు ఈ ఎన్యూమరేషన్ ఫారమ్‌ను సమర్పించడం తప్పనిసరి.1