ఓయూలో ఘనంగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం అద్భుత స్పందన(హైదరాబాద్ జిల్లా, ఓయూ) హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ హెల్త్ సెంటర్ లో సోమవారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఘనంగా నిర్వహించారు.బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి జంగా శ్రీధర్ వారి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరానికి విద్యార్థులు అధ్యాపకుల నుండి మంచి స్పందన లభించింది.ఓయూ జేఏసీ నాయకులు తూము నవీన్ యాదవ్, గడ్డం శ్రీనివాస్, డి.బి.ఎస్.ఏ రాష్ట్ర కో ఆర్డినెటర్ జంగిలి దర్శన్, టీఎస్పీ జాక్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వలిగొండ నరసింహా ఆధ్వర్యంలో ఓయూ హెల్త్ సెంటర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతమ్, రాచకొండ డీసీపీ ఎస్.ఓ.టి మనోహర్,టిపిసిసి మీడియా అండ్ కమ్యూనికేషన్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి, తోలి వెలుగు రఘు, కాళోజీ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం అత్యంత అవసరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఆరోగ్య అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి శిబిరాలు మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరంలో ఉదయం 9 గంటల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు,అధ్యాపకులు, నాన్ టీచింగ్ అధికారులు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని, మంచి ఫలితాలు సాధ్యమవుతాయని వైద్య నిపుణులు తెలిపారు. జీవితం రక్షించే మొదటి అడుగు స్క్రీనింగ్ అనే విషయాన్ని వారు వివరించారు.ఈ శిబిరంలో ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన మహిళలు, పొగాకు మరియు మద్యపానం చేసేవారు, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు, శరీరంలో అనుమానాస్పద లక్షణాలు గమనిస్తున్న వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిపుణులచే సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించబడగా, అవసరమైన సూచనలు మరియు అవగాహన కల్పించబడింది.ఈ శిబిరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకులు, విద్యార్థులు, బోధనా మరియు బోధనేతర సిబ్బంది, అలాగే పరిసర ప్రాంతాల ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే పలు విద్యార్థి సంఘాల నాయకులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రజలు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని, ఇలాంటి శిబిరాలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు.మొత్తంగా ప్రజల ఆరోగ్య సంరక్షణ దిశగా ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఒక సార్థక ప్రయత్నంగా నిలిచింది అన్నారు.

- ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన పరిపాలన భవనానికి అంబేద్కర్ ఫూలే పేరుపెట్టాలని, అదేవిధంగా వారి పేరు మీద ఫెలోషిప్లను కూడా అందజేయాలని ఓయూ జేఏసీ చైర్మన్, పీహెచ్డీ స్కాలర్ కొత్తపల్లి తిరుపతి కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిబిఎస్ఏ అధ్యక్షులు నలగంటి శరత్, బహుజన విద్యార్థి సంఘాల అధ్యక్షులు వేల్పుల సంజయ్, టిఎస్ఎఫ్ అధ్యక్షులు జంపాల రాజేష్ పాల్గొని ఈ మేరకు ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో 135 వ అంబేద్కర్ జయంతినీ పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ వద్ద ప్రభుత్వం నిర్మించబోయే జగ్జీవన్ రామ్, అంబేద్కర్ నాలెడ్జ్ పార్క్ ను విద్యార్థులుగా స్వాగతిస్తున్నామని, ఈ నాలెడ్జ్ సెంటర్ ను నిర్మించడానికి పూనుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. పొలిటికల్ జేఏసీ నరసింహ, డిబిఎస్ఏ నాయకులు జంగిలి దర్శన్, మధు, ఓయూ జెఏసి మరియు ఎన్టీవీఎస్ ప్రెసిడెంట్ చరణ్, ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి దరువు రమేష్, ఓయూ జేఏసీ నాయకులు రాజేందర్, ప్రవీణ్,సంజీవ్, అరుణ్,కరుణాకర్, ఉదయ్, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.5
- Post by Bandi renu1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం (14-04-2026) ఉదయం 9:30 గంటలకు పులిహోర పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ సేవా కార్యక్రమానికి ఈ వారం దాతలుగా శ్రీమతి & శ్రీ మురికి శ్వేత విజయ్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీ రామదూత పూజ జనరల్ స్టోర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సక్రమంగా జరిగింది.ఈ సందర్భంగా భక్తులకు పులిహోరను పంపిణీ చేసి, సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, మల్యాల భైరయ్య, నేతి శ్రీనివాస్, దూబకుంట లచ్చల్, కైలాస ప్రశాంత్, గందె సంతోష్, నోముల సంతోష్, పోగుల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం భక్తి, సేవా భావం కలగలిపిన మంచి ఉదాహరణగా నిలిచింది.4
- చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు: TGIIC చైర్పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి1
- నేటి యువతరం అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 165 వ జయంతి సందర్భంగా సంగారెడ్డి లోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, మున్సిపల్ చైర్మన్ కూన వనిత, గ్రంథాల సంస్థ చైర్మన్ అంజయ్య ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి పాల్గొన్నారు.1
- వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో రెండవ రోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగఅరైవ్ -అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎన్నేపల్లి లోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రజలతో అధికారులతో చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూనే మానసిక దృఢత్వంతో భద్రతగా వాహనాలు నడపాలని సూచించారు. మారుమూల ప్రాంతాల వరకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచాలని అన్నారు.1
- ఈరోజు లింగాల ఘనపూర్ మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అమల సుమలత మరియు వార్డ్ నెంబర్లు యూత్ సభ్యులు ముఖ్య నాయకులు అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సిద్ధవటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది4
- అంబేద్కర్ 135 వ జయంతి ని పురస్కరించుకొని లాలాపేట లోని అంబేద్కర్ విగ్రహానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి , బిజెపి నాయకులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ వర్కర్లను శాలువాలతో సత్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా ప్రవర్తిస్తుందని, పేరుకు మాత్రమే రాజ్యాంగాన్ని చేతిలో ధరిస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ఏతర పార్టీల అధికారంలో అంబేద్కర్ కు భారతరత్న వరించిందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అంబేద్కర్ ను గౌరవించే విధంగా ఆయన చదివిన తిరిగిన ప్రదేశాలను పంచ తీర్థలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలను రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అలాంటి మహనీయుని ఆశయాలు కొనసాగే విధంగా రాష్ట్ర ప్రజలు ముందుకు వెళ్లాలని కోరారు.2