Shuru
Apke Nagar Ki App…
This Eid the world feels more like a mourning than a celebration A celebration shadowed by the world's tears Heart heavy world hurting This Eid feels different
Ali ammu
This Eid the world feels more like a mourning than a celebration A celebration shadowed by the world's tears Heart heavy world hurting This Eid feels different
More news from తెలంగాణ and nearby areas
- శభాష్‌పల్లి గ్రామంలో దుండగులు రెచ్చిపోయారు. మంగలి పెంటయ్య పొలం వద్ద ఉన్న 25 కేవీ డీటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళలో కింద పడగొట్టి ట్రాన్స్‌ఫార్మర్‌లోని విలువైన ఆయిల్‌ను దొంగిలించారు. ఈ దారుణ ఘటనతో గ్రామం మొత్తం భయాందోళనకు గురైంది. విద్యుత్ సరఫరా అంతరాయం కలగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.స్థానికులు వెంటనే స్పందించి అధికారులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది పరిశీలన చేపట్టారు. గ్రామంలో వరుసగా జరుగుతున్న చోరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- వికారాబాద్ జిల్లా : పదవ తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ వారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి పదవ తరగతి పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపర్డెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజి లెటర్లకు,జూమ్ మీటింగ్ ద్వారా పలు సూచనలు సలహాలు ఇచ్చారు. పరీక్షలు సజావుగా జరిగేలా ఎలాంటి పొరపాట్లకు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పరీక్షల్లో విధులు నిర్వహించే సిబ్బంది వద్ద పరీక్షలు నిర్వహించే ప్రాంగణంలో మొబైల్ ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా జాగ్రత్త తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.1
- Ugadhi subhakankshalu1
- ఈద్గా వద్ద బందోబస్తు పరిశీలించిన అదనపు ఎస్పీ మహేందర్ మెదక్: రంజాన్ పండుగను పురస్కరించుకుని నవాబ్‌పేట్‌లోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈద్గా పరిసరాల్లో భద్రతా చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. జిల్లా కేంద్ర పరిధిలోని మసీదుల వద్ద పటిష్ట భద్రత కల్పించినట్లు తెలిపారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో ప్రత్యేక పోలీసు పికెట్స్ ఏర్పాటు చేసి, రద్దీ ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించినట్లు వివరించారు. పండుగ రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర పెట్రోలింగ్ కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రజలు సోదరభావంతో, పరస్పర గౌరవంతో పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.1
- యువత ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవాలని.. క్రైస్తవ మార్గం శాంతిని బోధిస్తుందని wcm ఫౌండర్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్, పాస్టర్ కిరణ్ పాల్ అన్నారు. గురువారం నల్గొండలోని టీఎన్జీవో భవన్లో సియాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్టియన్ యూత్ రిట్రీట్ కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యువత భక్తి భావంతో ప్రేమ సౌబ్రాతృత్వాన్ని పెంపొందించాలని కోరారు. ముఖ్యంగా ప్రపంచ శాంతి కోసం క్రైస్తవులు పాటుపడడమే కాకుండా భారత దేశ అభ్యున్నతి కోసం విద్యను పెంపొందించేందుకు ప్రేమను పంచేందుకు క్రైస్తవులు కృషి చేయాలని చెప్పారు. సమాజంలో సమానత్వం కోసం పాటుపడాలన్నారు. అనంతరం ఆయన ఇచ్చిన దైవ సందేశం ఎంతగానో ఆకట్టుకుంది. సియాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరాధన, పాటలు ఉత్సాహాన్ని నింపాయి. అనంతరం కిరణ్ పాల్ ను సియాన్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సియాన్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, సభ్యులు వడ్డే జాకబ్ రోషన్, టి. ప్రవీణ్ కుమార్, జర్నలిస్టు ప్రేమ్ కుమార్,సాగర్ జాన్, సుమన్ రమన్, అఖిల్, నోయెల్, శ్రీకాంత్,సల్మాన్ రాజ్, స్టీఫెన్ పాల్, సంపత్, గోపి, జాన్, జయరాజ్, జైసన్, పాస్టర్ జీవన్, మోసెస్, సియాన్ వుమెన్ టీమ్ తదితరులు పాల్గొన్నారు.3
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం : *విద్యాకు 8% శాతం బడ్జెట్ ప్రవేశపెట్టి విద్యార్థులను మరియు తెలంగాణ ఏర్పాటుకు కోసం ప్రాణాలను త్యాగం చేసిన విద్యార్థులను అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం* *విద్యార్థుల సమస్యల పై మౌనం పాటించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు* అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లా ఎబివిపి నాయకులు మాట్లాడుతూ నూతన తెలంగాణ ఏర్పాటుకు విద్యార్థులు కీలకపాత్ర అప్ పోషించి ఎంతో మంది విద్యార్థుల బలిదలన పై తెలంగాణ తెచ్చుకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యార్థులకు కేటాయించింది కేవలం 8% మాత్రమే ఈ ఇది విద్యార్థులను అవమాన చేస్తూ తెలంగాణ వస్తే విద్యార్థుల బతుకులు మారుతాయి అని భావించిన శ్రీకాంతాచార్య లాంటి త్యాగ మూర్తులకు అవమాన పరిచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పక్క రాష్ట్రలను చూసి సిగ్గు తెచ్చుకోవాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకట్,కౌశిక్ తదితరులు పాల్గొనడం జరిగింది1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 21 ప్రజా తెలంగాణ న్యూస్/ *_2026-27 సం,, యొక్క తైబజార్ మరియు పశువుల సంత ఆదాయం 89,00,000/-_* తేదీ:20-03-2026 రోజున గౌరవ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ అధ్యక్షతన, కమీషనర్ R వెంకట గోపాల్ ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరం యొక్క *తైబజార్ మరియు పశువుల సంతను* కార్యాలయంలో వేలంపాట నిర్వహించడం జరిగినది. ముందుగా తైబజార్ వేలంలో 21 మంది పాల్గొనగా అత్యధికంగా E. భిక్షపతి రూపాయలు 70లక్షలకు వేలం పాడి దక్కించుకున్నారు. పశువుల సంత వేలంలో 32 మంది పాల్గొనగా అత్యధికంగా T రాజేశం 19లక్షలకు వేలం పాడి దక్కించుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, మేనేజర్, మరియు కార్యాలయ సిబ్బంది పలుగోనడం జరిగినది. *కమీషనర్* *పురపాలక సంఘo* *గజ్వేల్-ప్రజ్ఞాపూర్*4
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని నెక్ బీబీ దర్గా ఈద్గా వద్ద ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అఖిలపక్ష నాయకులు పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకోవడంతో పట్టణంలో సోదరభావం వెల్లివిరిసింది.1
- రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త బస్టాండ్ సమీపంలోని ఈద్గా లో ముస్లిం మత గురువుల చే నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలలో బి ఆర్ ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి పాల్గొని సిరిసిల్ల మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ సమీ గారిని మరియు మత గురువులను, మాజీ మజీద్ కమిటీ అధ్యక్షులను, పుర ప్రముఖులను మొదలగు ముస్లిం సోదరులందరిని కలుసుకొని (రంజాన్ పండుగ శుభాకాంక్షలు) ఈద్ ముబారక్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వీరి వెంట కౌన్సిలర్ లు కూరపాటి శ్రీశైలం, మాజీ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ నంది శంకర్ మొదలగు నాయకులు పాల్గొని అందరికీ (రంజాన్ శుభాకాంక్షలు) ఈద్ ముబారక్ తెలియజేశారు.1