logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నల్గొండలో ఘనంగా సీయాన్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ రిట్రీట్.. హాజరైన అంతర్జాతీయ పాస్టర్ కిరణ్ పాల్ యువత ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవాలని.. క్రైస్తవ మార్గం శాంతిని బోధిస్తుందని wcm ఫౌండర్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్, పాస్టర్ కిరణ్ పాల్ అన్నారు. గురువారం నల్గొండలోని టీఎన్జీవో భవన్లో సియాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్టియన్ యూత్ రిట్రీట్ కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యువత భక్తి భావంతో ప్రేమ సౌబ్రాతృత్వాన్ని పెంపొందించాలని కోరారు. ముఖ్యంగా ప్రపంచ శాంతి కోసం క్రైస్తవులు పాటుపడడమే కాకుండా భారత దేశ అభ్యున్నతి కోసం విద్యను పెంపొందించేందుకు ప్రేమను పంచేందుకు క్రైస్తవులు కృషి చేయాలని చెప్పారు. సమాజంలో సమానత్వం కోసం పాటుపడాలన్నారు. అనంతరం ఆయన ఇచ్చిన దైవ సందేశం ఎంతగానో ఆకట్టుకుంది. సియాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరాధన, పాటలు ఉత్సాహాన్ని నింపాయి. అనంతరం కిరణ్ పాల్ ను సియాన్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సియాన్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, సభ్యులు వడ్డే జాకబ్ రోషన్, టి. ప్రవీణ్ కుమార్, జర్నలిస్టు ప్రేమ్ కుమార్,సాగర్ జాన్, సుమన్ రమన్, అఖిల్, నోయెల్, శ్రీకాంత్,సల్మాన్ రాజ్, స్టీఫెన్ పాల్, సంపత్, గోపి, జాన్, జయరాజ్, జైసన్, పాస్టర్ జీవన్, మోసెస్, సియాన్ వుమెన్ టీమ్ తదితరులు పాల్గొన్నారు.

3 hrs ago
user_Journalist pk
Journalist pk
Journalist Nalgonda, Telangana•
3 hrs ago
1562e61b-4ad5-4bf4-9da8-f1999ba68a80

నల్గొండలో ఘనంగా సీయాన్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ రిట్రీట్.. హాజరైన అంతర్జాతీయ పాస్టర్ కిరణ్ పాల్ యువత ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవాలని.. క్రైస్తవ మార్గం శాంతిని బోధిస్తుందని wcm ఫౌండర్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్, పాస్టర్ కిరణ్ పాల్ అన్నారు. గురువారం నల్గొండలోని టీఎన్జీవో భవన్లో సియాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్టియన్ యూత్ రిట్రీట్ కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యువత

భక్తి భావంతో ప్రేమ సౌబ్రాతృత్వాన్ని పెంపొందించాలని కోరారు. ముఖ్యంగా ప్రపంచ శాంతి కోసం క్రైస్తవులు పాటుపడడమే కాకుండా భారత దేశ అభ్యున్నతి కోసం విద్యను పెంపొందించేందుకు ప్రేమను పంచేందుకు క్రైస్తవులు కృషి చేయాలని చెప్పారు. సమాజంలో సమానత్వం కోసం పాటుపడాలన్నారు. అనంతరం ఆయన ఇచ్చిన దైవ సందేశం ఎంతగానో ఆకట్టుకుంది. సియాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరాధన, పాటలు ఉత్సాహాన్ని నింపాయి. అనంతరం కిరణ్

పాల్ ను సియాన్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సియాన్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, సభ్యులు వడ్డే జాకబ్ రోషన్, టి. ప్రవీణ్ కుమార్, జర్నలిస్టు ప్రేమ్ కుమార్,సాగర్ జాన్, సుమన్ రమన్, అఖిల్, నోయెల్, శ్రీకాంత్,సల్మాన్ రాజ్, స్టీఫెన్ పాల్, సంపత్, గోపి, జాన్, జయరాజ్, జైసన్, పాస్టర్ జీవన్, మోసెస్, సియాన్ వుమెన్ టీమ్ తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 21 ప్రజా తెలంగాణ న్యూస్/ శుక్రవారం నంగునూరు మండలంలోని నర్మెట్టలో ఈనెల 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న ఫ్యాక్టరీ లో అడిషనల్ DGP మహేష్ భగవత్, ఐజి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కే. హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మి పెరుమాళ్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, పలువురు అధికారులు పర్యటించి కార్యక్రమం నిర్వహించనున్న సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, హెలిప్యాడ్ ఏర్పాటు చేసే ప్రదేశాలను పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఈ మేరకు ప్రజా పాలనలో రైతు మహోత్సవం నిర్వహిస్తున్న ప్రదేశంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిర్వహణకు తగిన ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. పెద్ద సంఖ్యలో రైతులు మరియు ప్రజలు హాజరయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని పార్కింగ్, రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ యాజమాన్యం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిద్ధిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, సిద్ధిపేట రూరల్ సీఐ శ్రీను, రాజగోపాల్‌పేట ఎస్ఐ వివేక్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు మరియు రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ 22వ తేదీ నాడు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారిక పాసులను జారీ చేయడం జరుగుతుందని, హెలిప్యాడ్, ముఖ్యమంత్రి కాన్వాయ్, ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, స్టాళ్ల సందర్శన, ఫ్యాక్టరీ పైలాన్ ఆవిష్కరణ, వివిధ నిర్మాణాల ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరించి బహిరంగ సభలో పాల్గొంటారని అన్నారు. ముఖ్యమంత్రి పర్యట పర్యటన వివిధ స్థాయిలలో విధులను కేటాయించిన అధికారులు మాత్రమే ఉండి ఆయా శాఖలకు కేటాయించిన విధులను తూచా తప్పకుండా పగడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ప్రజలకు సరిపడు మరుగుదొడ్లు, త్రాగునీరు వసతి కల్పించాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యుత్ సౌకర్యం, సౌండ్ సిస్టం, అంబులెన్స్ లు, ఫైర్ ఇంజన్, వైద్య శిబిరం, పార్కింగ్, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు ప్రాపర్ గా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట హుస్నాబాద్ ఆర్డీవోలు సదానందం, రామ్మూర్తి, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, డిపిఓ రవీందర్, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ధనరాజ్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, ఫుడ్ సేఫ్టీ, వ్యవసాయ, ఉద్యానవన, ఐ అండ్ పిఆర్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 21 ప్రజా తెలంగాణ న్యూస్/
శుక్రవారం నంగునూరు మండలంలోని 
నర్మెట్టలో ఈనెల 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న ఫ్యాక్టరీ లో అడిషనల్ DGP మహేష్ భగవత్, ఐజి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కే. హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మి పెరుమాళ్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, పలువురు అధికారులు పర్యటించి కార్యక్రమం నిర్వహించనున్న సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, హెలిప్యాడ్ ఏర్పాటు చేసే ప్రదేశాలను పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఈ మేరకు ప్రజా పాలనలో రైతు మహోత్సవం నిర్వహిస్తున్న ప్రదేశంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిర్వహణకు తగిన ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. పెద్ద సంఖ్యలో రైతులు మరియు ప్రజలు హాజరయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని పార్కింగ్, రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ యాజమాన్యం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిద్ధిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, సిద్ధిపేట రూరల్ సీఐ శ్రీను, రాజగోపాల్‌పేట ఎస్ఐ వివేక్ పాల్గొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు మరియు రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ  22వ తేదీ నాడు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారిక పాసులను జారీ చేయడం జరుగుతుందని,  హెలిప్యాడ్, ముఖ్యమంత్రి కాన్వాయ్, ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, స్టాళ్ల సందర్శన, ఫ్యాక్టరీ పైలాన్ ఆవిష్కరణ, వివిధ నిర్మాణాల ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరించి బహిరంగ సభలో పాల్గొంటారని అన్నారు. ముఖ్యమంత్రి పర్యట పర్యటన వివిధ స్థాయిలలో విధులను కేటాయించిన అధికారులు మాత్రమే ఉండి ఆయా శాఖలకు కేటాయించిన విధులను తూచా తప్పకుండా పగడ్బందీగా  నిర్వహించాలని అన్నారు.  ప్రజలకు సరిపడు మరుగుదొడ్లు, త్రాగునీరు వసతి కల్పించాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యుత్ సౌకర్యం, సౌండ్ సిస్టం, అంబులెన్స్ లు, ఫైర్ ఇంజన్, వైద్య శిబిరం, పార్కింగ్, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు  ప్రాపర్ గా చేయాలని ఆదేశించారు. 
ఈ కార్యక్రమంలో సిద్దిపేట హుస్నాబాద్ ఆర్డీవోలు సదానందం, రామ్మూర్తి, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్,  డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, డిపిఓ రవీందర్, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ధనరాజ్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, ఫుడ్ సేఫ్టీ, వ్యవసాయ, ఉద్యానవన, ఐ అండ్ పిఆర్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా.శబరీష్ చిన్ని గూడూరు పోలీస్ స్టేషన్‌ను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, కార్యాలయం లోపలి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై ప్రవీణ్ మరియు సిబ్బందికి విధి నిర్వహణలో క్రమశిక్షణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం పై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా అక్రమ కార్యకలాపాలపై ఎలాంటి జోక్యం ఉండకూడదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు . అలాగే స్థానిక సర్పంచ్‌లతో పరస్పరం మాట్లాడి, గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు అవసరంపై చర్చించారు. గ్రామ భద్రతలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణలో సర్పంచ్‌లు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా హెల్మెట్ వాడకం పై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, అవసరమైతే గ్రామాల్లో తమతమ స్థాయిలో ప్రచారం చేపట్టాలని సూచించారు. జిల్లాలో నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత మరియు ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తుందని ఎస్పీ తెలిపారు.
    1
    మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా.శబరీష్  చిన్ని గూడూరు పోలీస్ స్టేషన్‌ను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, కార్యాలయం లోపలి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు.
స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై ప్రవీణ్  మరియు సిబ్బందికి విధి నిర్వహణలో క్రమశిక్షణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం పై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా అక్రమ కార్యకలాపాలపై ఎలాంటి జోక్యం ఉండకూడదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు .
అలాగే స్థానిక సర్పంచ్‌లతో పరస్పరం మాట్లాడి, గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు అవసరంపై చర్చించారు. గ్రామ భద్రతలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణలో సర్పంచ్‌లు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. 
అదేవిధంగా హెల్మెట్ వాడకం పై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, అవసరమైతే గ్రామాల్లో తమతమ స్థాయిలో ప్రచారం చేపట్టాలని సూచించారు.
జిల్లాలో నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత మరియు ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తుందని ఎస్పీ తెలిపారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పెంజర్ల శివారులో టపాసులతో వెళ్తున్న లారీ ఆకస్మికంగా మంటలకు ఆహుతైంది. సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    1
    కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పెంజర్ల శివారులో టపాసులతో వెళ్తున్న లారీ ఆకస్మికంగా మంటలకు ఆహుతైంది. సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • దళితులకు రూ.12 లక్షలు ఇవ్వాలి దళితులకు అంబేడ్కర్ అభయహస్తం రూ.12 లక్షలు ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. మాదిగ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్పీఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ అధ్యక్షతన హనుమకొండ ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ దళితు లకు అంబేడ్కర్ అభయహస్తం పథకం ద్వారా రూ.12 లక్షలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోం దని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అభివాదం చేస్తున్న నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమం జరిగినా వరంగల్ ముందుంటుందని చెప్పారు. మైస ఉపేందర్ మాదిగ, వెజ్ బోర్డ్ మాజీ చైర్మన్ జన్ను జకార్య, వీరేందర్, సుంకె ప్రభాకర్, చెన్నం గోపి, విష్ణు, రాంకుమార్ పాల్గొన్నారు.
    4
    దళితులకు రూ.12 లక్షలు ఇవ్వాలి
దళితులకు అంబేడ్కర్ అభయహస్తం
రూ.12 లక్షలు ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. మాదిగ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్పీఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ అధ్యక్షతన హనుమకొండ ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ దళితు లకు అంబేడ్కర్ అభయహస్తం పథకం ద్వారా రూ.12 లక్షలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోం దని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి
అభివాదం చేస్తున్న నాయకులు
మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమం జరిగినా వరంగల్ ముందుంటుందని చెప్పారు. మైస ఉపేందర్ మాదిగ, వెజ్ బోర్డ్ మాజీ చైర్మన్ జన్ను జకార్య, వీరేందర్, సుంకె ప్రభాకర్, చెన్నం గోపి, విష్ణు, రాంకుమార్ పాల్గొన్నారు.
    user_Public Reporter Gaddam Kiran
    Public Reporter Gaddam Kiran
    జర్నలిస్ట్ Khazipet, Hanumakonda•
    3 hrs ago
  • Post by Kotaissaku
    2
    Post by Kotaissaku
    user_Kotaissaku
    Kotaissaku
    చందర్లపాడు, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • తెలంగాణ ప్రభుత్వం 2026–27 బడ్జెట్‌లో విద్యా రంగానికి భారీ ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. విద్యాశాఖకు సుమారు ₹26,674 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక నిధులు గురుకులాలు, వసతి గృహాల వంటశాలల ఆధునీకరణకు ₹100 కోట్లు ప్రతిపాదన ప్రీ-ప్రైమరీ నుంచి విద్యను బలోపేతం చేయడానికి కొత్త ప్రణాళికలు రాష్ట్రంలోని వేలాది పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విభాగాల విస్తరణ ఇక విద్యార్థుల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది: పాఠశాల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించే నిర్ణయం టెక్నాలజీ ఆధారిత విద్య కోసం పాలిటెక్నిక్, ఐటీఐల్లో కొత్త కోర్సులు మొత్తం మీద, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యా ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ నిధుల విడుదల జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. 👉 ఇది విద్యా రంగంలో పెద్ద మార్పులకు దారితీసే నిర్ణయంగా భావిస్తున్నారు.
    1
    తెలంగాణ ప్రభుత్వం 2026–27 బడ్జెట్‌లో విద్యా రంగానికి భారీ ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది.
విద్యాశాఖకు సుమారు ₹26,674 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు 
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక నిధులు
గురుకులాలు, వసతి గృహాల వంటశాలల ఆధునీకరణకు ₹100 కోట్లు ప్రతిపాదన 
ప్రీ-ప్రైమరీ నుంచి విద్యను బలోపేతం చేయడానికి కొత్త ప్రణాళికలు
రాష్ట్రంలోని వేలాది పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విభాగాల విస్తరణ 
ఇక విద్యార్థుల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది:
పాఠశాల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం
ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించే నిర్ణయం 
టెక్నాలజీ ఆధారిత విద్య కోసం పాలిటెక్నిక్, ఐటీఐల్లో కొత్త కోర్సులు
మొత్తం మీద, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యా ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ నిధుల విడుదల జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది.
👉 ఇది విద్యా రంగంలో పెద్ద మార్పులకు దారితీసే నిర్ణయంగా భావిస్తున్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. వీరి వెంట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, ఐనవోలు దేవస్థానం చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
    1
    వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. వీరి వెంట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, ఐనవోలు దేవస్థానం చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    35 min ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 21 ప్రజా తెలంగాణ న్యూస్/ *_2026-27 సం,, యొక్క తైబజార్ మరియు పశువుల సంత ఆదాయం 89,00,000/-_* తేదీ:20-03-2026 రోజున గౌరవ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ అధ్యక్షతన, కమీషనర్ R వెంకట గోపాల్ ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరం యొక్క *తైబజార్ మరియు పశువుల సంతను* కార్యాలయంలో వేలంపాట నిర్వహించడం జరిగినది. ముందుగా తైబజార్ వేలంలో 21 మంది పాల్గొనగా అత్యధికంగా E. భిక్షపతి రూపాయలు 70లక్షలకు వేలం పాడి దక్కించుకున్నారు. పశువుల సంత వేలంలో 32 మంది పాల్గొనగా అత్యధికంగా T రాజేశం 19లక్షలకు వేలం పాడి దక్కించుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, మేనేజర్, మరియు కార్యాలయ సిబ్బంది పలుగోనడం జరిగినది. *కమీషనర్* *పురపాలక సంఘo* *గజ్వేల్-ప్రజ్ఞాపూర్*
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 21 ప్రజా తెలంగాణ న్యూస్/
*_2026-27 సం,, యొక్క తైబజార్ మరియు పశువుల సంత ఆదాయం 89,00,000/-_*
తేదీ:20-03-2026 రోజున గౌరవ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్  అధ్యక్షతన, కమీషనర్ R వెంకట గోపాల్ ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరం యొక్క *తైబజార్ మరియు పశువుల సంతను* కార్యాలయంలో వేలంపాట నిర్వహించడం జరిగినది. ముందుగా తైబజార్ వేలంలో 21 మంది పాల్గొనగా అత్యధికంగా E. భిక్షపతి  రూపాయలు 70లక్షలకు వేలం పాడి దక్కించుకున్నారు.  పశువుల సంత వేలంలో 32 మంది పాల్గొనగా అత్యధికంగా T రాజేశం 19లక్షలకు వేలం పాడి దక్కించుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, మేనేజర్, మరియు కార్యాలయ సిబ్బంది పలుగోనడం జరిగినది.
*కమీషనర్*
*పురపాలక సంఘo*
*గజ్వేల్-ప్రజ్ఞాపూర్*
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమమ్మాయిగూడెం సమీపంలోని సీతారాం తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పురుషోత్తమ గూడెం గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ కుటుంబం శుభకార్య నిమిత్తం ఆటోలో మహబూబాబాద్ బయలుదేరారు ఈ క్రమంలో సీతారంతాండ స్టేజి సమీపంలో కొరివైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రామసాని వెంకన్న మృతిచెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు
    1
    మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమమ్మాయిగూడెం సమీపంలోని సీతారాం తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పురుషోత్తమ గూడెం గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ కుటుంబం శుభకార్య నిమిత్తం ఆటోలో మహబూబాబాద్ బయలుదేరారు ఈ క్రమంలో సీతారంతాండ స్టేజి సమీపంలో కొరివైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రామసాని వెంకన్న మృతిచెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.