చిన్నగూడూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఐపిఎస్ మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా.శబరీష్ చిన్ని గూడూరు పోలీస్ స్టేషన్‌ను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, కార్యాలయం లోపలి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై ప్రవీణ్ మరియు సిబ్బందికి విధి నిర్వహణలో క్రమశిక్షణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం పై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా అక్రమ కార్యకలాపాలపై ఎలాంటి జోక్యం ఉండకూడదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు . అలాగే స్థానిక సర్పంచ్‌లతో పరస్పరం మాట్లాడి, గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు అవసరంపై చర్చించారు. గ్రామ భద్రతలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణలో సర్పంచ్‌లు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా హెల్మెట్ వాడకం పై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, అవసరమైతే గ్రామాల్లో తమతమ స్థాయిలో ప్రచారం చేపట్టాలని సూచించారు. జిల్లాలో నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత మరియు ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తుందని ఎస్పీ తెలిపారు.

- వరంగల్ జిల్లా: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్ పరిధిలోని నాలుగు జెండాల వద్ద మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్న పిల్లలపై కుక్కలు దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గ్రేటర్ మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.1
- యువత ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవాలని.. క్రైస్తవ మార్గం శాంతిని బోధిస్తుందని wcm ఫౌండర్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్, పాస్టర్ కిరణ్ పాల్ అన్నారు. గురువారం నల్గొండలోని టీఎన్జీవో భవన్లో సియాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్టియన్ యూత్ రిట్రీట్ కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యువత భక్తి భావంతో ప్రేమ సౌబ్రాతృత్వాన్ని పెంపొందించాలని కోరారు. ముఖ్యంగా ప్రపంచ శాంతి కోసం క్రైస్తవులు పాటుపడడమే కాకుండా భారత దేశ అభ్యున్నతి కోసం విద్యను పెంపొందించేందుకు ప్రేమను పంచేందుకు క్రైస్తవులు కృషి చేయాలని చెప్పారు. సమాజంలో సమానత్వం కోసం పాటుపడాలన్నారు. అనంతరం ఆయన ఇచ్చిన దైవ సందేశం ఎంతగానో ఆకట్టుకుంది. సియాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరాధన, పాటలు ఉత్సాహాన్ని నింపాయి. అనంతరం కిరణ్ పాల్ ను సియాన్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సియాన్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, సభ్యులు వడ్డే జాకబ్ రోషన్, టి. ప్రవీణ్ కుమార్, జర్నలిస్టు ప్రేమ్ కుమార్,సాగర్ జాన్, సుమన్ రమన్, అఖిల్, నోయెల్, శ్రీకాంత్,సల్మాన్ రాజ్, స్టీఫెన్ పాల్, సంపత్, గోపి, జాన్, జయరాజ్, జైసన్, పాస్టర్ జీవన్, మోసెస్, సియాన్ వుమెన్ టీమ్ తదితరులు పాల్గొన్నారు.3
- కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు ఈ వీడియోను సమయము అనుకూలంత చేసుకుని తప్పక విని బంధుత్వాలను ఎలా బలపరుచుకోవాలో తెలుసుకుంటారని కోరుకుంటున్నాను ఇట్లు మీ రేషన్ డీలర్ జాటోత్ రమేష్ నాయక్ రాథోడ్ (అల్ ఇండియా రేషన్ డీలర్ సోషల్ మీడియా)1
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొండగట్టు ను సందర్శించి అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారం రోజుల క్రితం కరీంనగర్ నుంచి కొండగట్టుకు అంజన్న ఆశీర్వాదయాత్ర నిర్వహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ రోజు రాత్రి కావడంతో ఆలయం మూసి వేయడం వల్ల గుడి ముందే దర్శనం చేసుకున్నారు. ఈరోజు కరీంనగర్ మేయర్ కొలకాని శ్రీనివాస్ తో పాటు పలువురు కార్పొరేటర్లతో కలిసి కేంద్రమంత్రి సంజయ్ కొండగట్టుకు చేరుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. అంజన్న ఆలయం చుట్టూ బండి సంజయ్ ప్రదిక్షణలు చేశారు. అనంతరం శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలోకి వెళ్లిన బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు శాలువా కప్పి ఆశీర్వచనం అందించారు.2
- Post by వేముల నాగరాజు2
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు చేరి సామూహిక ప్రార్థనలు (నమాజ్) నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కొత్త దుస్తులు ధరించి అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనా స్థలాలకు చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది.1
- హన్మకొండ జిల్లా కాజీపేట పట్టణంలోని ఈద్గాలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, తెలంగాణ స్టేట్ గ్రంథాలయ చైర్మన్ డా. రియాజ్, 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి, అలైబలై చేసుకున్నారు. కార్యక్రమంలో 63వ డివిజన్ కార్పొరేటర్ విజయ శ్రీరజలి, స్థానిక నాయకులు, మైనారిటీ ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు కొందరు జమ్మికుంట శివారులో సమావేశమయ్యారు. డిన్నర్ తో కలిసిన ఐదుమండలాల నాయకులు ఎమ్మెల్యే వ్యవహారశైలిపై సుదీర్గంగా చర్చించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో హుజురాబాద్ నియోజకవర్గ నాయకులం అని చెప్పుకోవడానికే సిగ్గేస్తుందని ఆవేధన వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులను పట్టించుకోకుండా కుటుంబసభ్యులతో కలిసి ప్యాషన్ షోలా తిరుగుతున్నాడని ఆందోళన చెందుతున్నారు. లోపాలను సరిదిద్దుకోవాలని పార్టీ నాయకులం చెప్పేందుకు ప్రయత్నిస్తే చెప్పనివ్వకుండా నీకేం తెల్వదన్నట్లు వ్యవహరిస్తాడట. నాయకులకు సర్పంచ్, ఎంపిటీసి పదవులు తప్ప మండల జిల్లా స్థాయి పదవులు ఉండొద్దనే దోరణితో ఎమ్మెల్యే ఉన్నాడని ఆవేధన చెందుతున్నారు. ఎవరైనా ఎదురుమాట్లాడితే రౌడీషీట్ ఓపెన్ చేయుమని చెప్పే నాయకుడితో ఇక వేగలేం అంటున్నారు. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.3
- ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు పంచాయతీ కల్లేరు గ్రామంలో జల్ జీవన్ మిషన్ పైప్ లైన్లు గుంతలు తీసి పుడ్చని అధికారులు ఆవులు గేదెలు పడి చనిపోతున్నాయి అని ఎన్నిసార్లు గ్రామస్తులు ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులకు చెప్పినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న తీరుని గ్రామస్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు.1