logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శభాష్‌పల్లిలో డీటీఆర్‌పై దుండగుల దాడి 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ కింద పడగొట్టి ఆయిల్ దొంగతనం శభాష్‌పల్లి గ్రామంలో దుండగులు రెచ్చిపోయారు. మంగలి పెంటయ్య పొలం వద్ద ఉన్న 25 కేవీ డీటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళలో కింద పడగొట్టి ట్రాన్స్‌ఫార్మర్‌లోని విలువైన ఆయిల్‌ను దొంగిలించారు. ఈ దారుణ ఘటనతో గ్రామం మొత్తం భయాందోళనకు గురైంది. విద్యుత్ సరఫరా అంతరాయం కలగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.స్థానికులు వెంటనే స్పందించి అధికారులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది పరిశీలన చేపట్టారు. గ్రామంలో వరుసగా జరుగుతున్న చోరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

7 hrs ago
user_ASHOK VENGANI
ASHOK VENGANI
Court reporter శివంపేట, మెదక్, తెలంగాణ•
7 hrs ago

శభాష్‌పల్లిలో డీటీఆర్‌పై దుండగుల దాడి 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ కింద పడగొట్టి ఆయిల్ దొంగతనం శభాష్‌పల్లి గ్రామంలో దుండగులు రెచ్చిపోయారు. మంగలి పెంటయ్య పొలం వద్ద ఉన్న 25 కేవీ డీటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళలో కింద పడగొట్టి ట్రాన్స్‌ఫార్మర్‌లోని విలువైన ఆయిల్‌ను దొంగిలించారు. ఈ దారుణ ఘటనతో గ్రామం మొత్తం భయాందోళనకు గురైంది. విద్యుత్ సరఫరా అంతరాయం కలగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.స్థానికులు వెంటనే స్పందించి అధికారులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది పరిశీలన చేపట్టారు. గ్రామంలో వరుసగా జరుగుతున్న చోరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • Shivampet Mandal లో గ్రామ పంచాయతీ కార్యాలయం 60 గజాల్లో ఉండటంతో 10మంది కూడా కూర్చోలేని పరిస్థితి నెలకొంది. 15 ఏళ్లుగా అభివృద్ధి జరగలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన కార్యాలయం నిర్మించాలని బీజేపీ అభ్యర్థి Shyam Vanjari కోరారు.
    1
    Shivampet Mandal లో గ్రామ పంచాయతీ కార్యాలయం 60 గజాల్లో ఉండటంతో 10మంది కూడా కూర్చోలేని పరిస్థితి నెలకొంది. 15 ఏళ్లుగా అభివృద్ధి జరగలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన కార్యాలయం నిర్మించాలని బీజేపీ అభ్యర్థి Shyam Vanjari కోరారు.
    user_ASHOK VENGANI
    ASHOK VENGANI
    Court reporter శివంపేట, మెదక్, తెలంగాణ•
    6 hrs ago
  • ఈద్గా వద్ద బందోబస్తు పరిశీలించిన అదనపు ఎస్పీ మహేందర్ మెదక్: రంజాన్ పండుగను పురస్కరించుకుని నవాబ్‌పేట్‌లోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈద్గా పరిసరాల్లో భద్రతా చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. జిల్లా కేంద్ర పరిధిలోని మసీదుల వద్ద పటిష్ట భద్రత కల్పించినట్లు తెలిపారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో ప్రత్యేక పోలీసు పికెట్స్ ఏర్పాటు చేసి, రద్దీ ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించినట్లు వివరించారు. పండుగ రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర పెట్రోలింగ్ కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రజలు సోదరభావంతో, పరస్పర గౌరవంతో పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    ఈద్గా వద్ద బందోబస్తు పరిశీలించిన అదనపు ఎస్పీ మహేందర్
మెదక్: రంజాన్ పండుగను పురస్కరించుకుని నవాబ్‌పేట్‌లోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈద్గా పరిసరాల్లో భద్రతా చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. జిల్లా కేంద్ర పరిధిలోని మసీదుల వద్ద పటిష్ట భద్రత కల్పించినట్లు తెలిపారు.
ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా  చూడాలని తెలిపారు. ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో ప్రత్యేక పోలీసు పికెట్స్ ఏర్పాటు చేసి, రద్దీ ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించినట్లు వివరించారు. పండుగ రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర పెట్రోలింగ్ కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ప్రజలు సోదరభావంతో, పరస్పర గౌరవంతో పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    18 hrs ago
  • ఏ ఎస్ రావు నగర్,జై జవాన్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో (ఎంపీపీఎస్) విద్యార్థుల మధ్య పజ్జురి కాష్యపి రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. డివిజన్ మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సేవా కార్యక్రమాలతో ప్రత్యేకంగా నిలిచింది.ఈ సందర్భంగా పీఎంఆర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా నీటి సీసాలను పంపిణీ చేశారు. పావని మణిపాల్ రెడ్డి తన కుమార్తె కాష్యపి రెడ్డితో కలిసి విద్యార్థులకు సీసాలను అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన పావని మణిపాల్ రెడ్డి, తన కుమార్తె పుట్టినరోజును ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఉపయోగపడడం తమ లక్ష్యమని తెలిపారు.పీఎంఆర్ ప్రతినిధులు మాట్లాడుతూ, దివంగత నేత కీ.శే. పజ్జురి మణిపాల్ రెడ్డి పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీఎంఆర్ సభ్యులు, స్థానిక నాయకులు, మహిళలు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు కాష్యపి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పాఠశాల అభివృద్ధికి పజ్జురి కుటుంబం అందిస్తున్న సహకారం అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
    2
    ఏ ఎస్ రావు నగర్,జై జవాన్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో (ఎంపీపీఎస్) విద్యార్థుల మధ్య పజ్జురి కాష్యపి రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. డివిజన్ మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సేవా కార్యక్రమాలతో ప్రత్యేకంగా నిలిచింది.ఈ సందర్భంగా పీఎంఆర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా నీటి సీసాలను పంపిణీ చేశారు. పావని మణిపాల్ రెడ్డి తన కుమార్తె కాష్యపి రెడ్డితో కలిసి విద్యార్థులకు సీసాలను అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన పావని మణిపాల్ రెడ్డి, తన కుమార్తె పుట్టినరోజును ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఉపయోగపడడం తమ లక్ష్యమని తెలిపారు.పీఎంఆర్ ప్రతినిధులు మాట్లాడుతూ, దివంగత నేత కీ.శే. పజ్జురి మణిపాల్ రెడ్డి పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీఎంఆర్ సభ్యులు, స్థానిక నాయకులు, మహిళలు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు కాష్యపి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పాఠశాల అభివృద్ధికి పజ్జురి కుటుంబం అందిస్తున్న సహకారం అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
    user_Suresh Sagar
    Suresh Sagar
    కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    19 hrs ago
  • This Eid the world feels more like a mourning than a celebration ​A celebration shadowed by the world's tears ​Heart heavy world hurting This Eid feels different
    1
    This Eid the world feels more like a mourning than a celebration
​A celebration shadowed by the world's tears
​Heart heavy world hurting This Eid feels different
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ _వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 21 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ పట్టణంలోని ఈద్గా వద్ద మరియు ప్రజ్ఞాపూర్ లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి ఈద్-ఉల్-ఫితుర్ ఈద్ ముబారక్ తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి మీకు మీ కుటుంబ సభ్యులకు ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పై ఉండాలని కోరుకుంటున్నాను క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ఈ రంజాన్ పండుగ మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని, ప్రేమ శాంతి సంపదలతో మీ ఇంట్లో సంతోషాలను నింపాలని, రంజాన్ నింపే స్ఫూర్తి నిరంతరం ఉండాలని, సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మరొక్కసారి ఈద్ ముబారక్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
    4
    గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ _వంటేరు ప్రతాప్ రెడ్డి 
గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 21 ప్రజా తెలంగాణ న్యూస్/
గజ్వేల్ పట్టణంలోని ఈద్గా వద్ద మరియు ప్రజ్ఞాపూర్ లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి ఈద్-ఉల్-ఫితుర్ ఈద్ ముబారక్ తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి 
మీకు మీ కుటుంబ సభ్యులకు ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పై ఉండాలని కోరుకుంటున్నాను క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ఈ రంజాన్ పండుగ మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని, ప్రేమ శాంతి సంపదలతో మీ ఇంట్లో సంతోషాలను నింపాలని, రంజాన్ నింపే స్ఫూర్తి నిరంతరం ఉండాలని, సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మరొక్కసారి ఈద్ ముబారక్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • Ugadhi subhakankshalu
    1
    Ugadhi subhakankshalu
    user_Jattigaru krishna mudiraj J Krishna
    Jattigaru krishna mudiraj J Krishna
    పాపన్నపేట, మెదక్, తెలంగాణ•
    8 hrs ago
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి అడ్లురి లక్ష్మణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీకి ₹1000 కోట్లు, చాకలి వీరనారి ఐలమ్మ యూనివర్సిటీకి ₹400 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ₹26,674 కోట్లు కేటాయించడం ఎంతో హర్షణీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా గత డిసెంబర్‌లో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉస్మానియా యూనివర్సిటీకి ₹1000 కోట్లు కేటాయించడం విద్యార్థులు, అధ్యాపకుల ఆశలను నెరవేర్చిన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం రాష్ట్ర ఉన్నత విద్యాభివృద్ధికి కీలకంగా మారుతుందని, విశ్వవిద్యాలయ మౌలిక వసతుల అభివృద్ధి, పరిశోధనలకు ఇది తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు చందు, రాజేందర్, రాజు, ప్రవీణ్, చరణ్, అరుణ్, స్వామి, శ్రీనివాస్, రమేష్, శివ తదితరులు పాల్గొన్నారు.
    1
    హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి అడ్లురి లక్ష్మణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీకి ₹1000 కోట్లు, చాకలి వీరనారి ఐలమ్మ యూనివర్సిటీకి ₹400 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ₹26,674 కోట్లు కేటాయించడం ఎంతో హర్షణీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా గత డిసెంబర్‌లో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉస్మానియా యూనివర్సిటీకి ₹1000 కోట్లు కేటాయించడం విద్యార్థులు, అధ్యాపకుల ఆశలను నెరవేర్చిన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం రాష్ట్ర ఉన్నత విద్యాభివృద్ధికి కీలకంగా మారుతుందని, విశ్వవిద్యాలయ మౌలిక వసతుల అభివృద్ధి, పరిశోధనలకు ఇది తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  ఓయూ జేఏసీ నాయకులు చందు, రాజేందర్, రాజు, ప్రవీణ్, చరణ్, అరుణ్, స్వామి, శ్రీనివాస్, రమేష్, శివ తదితరులు పాల్గొన్నారు.
    user_Sagaboina Paparao
    Sagaboina Paparao
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • శభాష్‌పల్లి గ్రామంలో దుండగులు రెచ్చిపోయారు. మంగలి పెంటయ్య పొలం వద్ద ఉన్న 25 కేవీ డీటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళలో కింద పడగొట్టి ట్రాన్స్‌ఫార్మర్‌లోని విలువైన ఆయిల్‌ను దొంగిలించారు. ఈ దారుణ ఘటనతో గ్రామం మొత్తం భయాందోళనకు గురైంది. విద్యుత్ సరఫరా అంతరాయం కలగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.స్థానికులు వెంటనే స్పందించి అధికారులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది పరిశీలన చేపట్టారు. గ్రామంలో వరుసగా జరుగుతున్న చోరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    శభాష్‌పల్లి గ్రామంలో దుండగులు రెచ్చిపోయారు. మంగలి పెంటయ్య పొలం వద్ద ఉన్న 25 కేవీ డీటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళలో కింద పడగొట్టి ట్రాన్స్‌ఫార్మర్‌లోని విలువైన ఆయిల్‌ను దొంగిలించారు. ఈ దారుణ ఘటనతో గ్రామం మొత్తం భయాందోళనకు గురైంది. విద్యుత్ సరఫరా అంతరాయం కలగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.స్థానికులు వెంటనే స్పందించి అధికారులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది పరిశీలన చేపట్టారు. గ్రామంలో వరుసగా జరుగుతున్న చోరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_ASHOK VENGANI
    ASHOK VENGANI
    Court reporter శివంపేట, మెదక్, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.