ఓయూ వెయ్యి కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఓయు జెఏసి చైర్మన్ కొత్తపల్లి తిరుపతి హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి అడ్లురి లక్ష్మణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీకి ₹1000 కోట్లు, చాకలి వీరనారి ఐలమ్మ యూనివర్సిటీకి ₹400 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ₹26,674 కోట్లు కేటాయించడం ఎంతో హర్షణీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా గత డిసెంబర్‌లో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉస్మానియా యూనివర్సిటీకి ₹1000 కోట్లు కేటాయించడం విద్యార్థులు, అధ్యాపకుల ఆశలను నెరవేర్చిన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం రాష్ట్ర ఉన్నత విద్యాభివృద్ధికి కీలకంగా మారుతుందని, విశ్వవిద్యాలయ మౌలిక వసతుల అభివృద్ధి, పరిశోధనలకు ఇది తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు చందు, రాజేందర్, రాజు, ప్రవీణ్, చరణ్, అరుణ్, స్వామి, శ్రీనివాస్, రమేష్, శివ తదితరులు పాల్గొన్నారు.
ఓయూ వెయ్యి కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఓయు జెఏసి చైర్మన్ కొత్తపల్లి తిరుపతి హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి అడ్లురి లక్ష్మణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీకి ₹1000 కోట్లు, చాకలి వీరనారి ఐలమ్మ యూనివర్సిటీకి ₹400 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ₹26,674 కోట్లు కేటాయించడం ఎంతో హర్షణీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా గత డిసెంబర్‌లో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉస్మానియా యూనివర్సిటీకి ₹1000 కోట్లు కేటాయించడం విద్యార్థులు, అధ్యాపకుల ఆశలను నెరవేర్చిన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం రాష్ట్ర ఉన్నత విద్యాభివృద్ధికి కీలకంగా మారుతుందని, విశ్వవిద్యాలయ మౌలిక వసతుల అభివృద్ధి, పరిశోధనలకు ఇది తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు చందు, రాజేందర్, రాజు, ప్రవీణ్, చరణ్, అరుణ్, స్వామి, శ్రీనివాస్, రమేష్, శివ తదితరులు పాల్గొన్నారు.
- శభాష్‌పల్లి గ్రామంలో దుండగులు రెచ్చిపోయారు. మంగలి పెంటయ్య పొలం వద్ద ఉన్న 25 కేవీ డీటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళలో కింద పడగొట్టి ట్రాన్స్‌ఫార్మర్‌లోని విలువైన ఆయిల్‌ను దొంగిలించారు. ఈ దారుణ ఘటనతో గ్రామం మొత్తం భయాందోళనకు గురైంది. విద్యుత్ సరఫరా అంతరాయం కలగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.స్థానికులు వెంటనే స్పందించి అధికారులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది పరిశీలన చేపట్టారు. గ్రామంలో వరుసగా జరుగుతున్న చోరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- Ugadhi subhakankshalu1
- ఈద్గా వద్ద బందోబస్తు పరిశీలించిన అదనపు ఎస్పీ మహేందర్ మెదక్: రంజాన్ పండుగను పురస్కరించుకుని నవాబ్‌పేట్‌లోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈద్గా పరిసరాల్లో భద్రతా చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. జిల్లా కేంద్ర పరిధిలోని మసీదుల వద్ద పటిష్ట భద్రత కల్పించినట్లు తెలిపారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో ప్రత్యేక పోలీసు పికెట్స్ ఏర్పాటు చేసి, రద్దీ ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించినట్లు వివరించారు. పండుగ రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర పెట్రోలింగ్ కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రజలు సోదరభావంతో, పరస్పర గౌరవంతో పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.1
- యువత ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవాలని.. క్రైస్తవ మార్గం శాంతిని బోధిస్తుందని wcm ఫౌండర్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్, పాస్టర్ కిరణ్ పాల్ అన్నారు. గురువారం నల్గొండలోని టీఎన్జీవో భవన్లో సియాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్టియన్ యూత్ రిట్రీట్ కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యువత భక్తి భావంతో ప్రేమ సౌబ్రాతృత్వాన్ని పెంపొందించాలని కోరారు. ముఖ్యంగా ప్రపంచ శాంతి కోసం క్రైస్తవులు పాటుపడడమే కాకుండా భారత దేశ అభ్యున్నతి కోసం విద్యను పెంపొందించేందుకు ప్రేమను పంచేందుకు క్రైస్తవులు కృషి చేయాలని చెప్పారు. సమాజంలో సమానత్వం కోసం పాటుపడాలన్నారు. అనంతరం ఆయన ఇచ్చిన దైవ సందేశం ఎంతగానో ఆకట్టుకుంది. సియాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరాధన, పాటలు ఉత్సాహాన్ని నింపాయి. అనంతరం కిరణ్ పాల్ ను సియాన్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సియాన్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, సభ్యులు వడ్డే జాకబ్ రోషన్, టి. ప్రవీణ్ కుమార్, జర్నలిస్టు ప్రేమ్ కుమార్,సాగర్ జాన్, సుమన్ రమన్, అఖిల్, నోయెల్, శ్రీకాంత్,సల్మాన్ రాజ్, స్టీఫెన్ పాల్, సంపత్, గోపి, జాన్, జయరాజ్, జైసన్, పాస్టర్ జీవన్, మోసెస్, సియాన్ వుమెన్ టీమ్ తదితరులు పాల్గొన్నారు.3
- కామారెడ్డి జిల్లా : విద్యార్థులు సహకార రంగంపై అవగాహన పెంచుకోవాలి : - జిల్లా కోఆపరేటివ్ అధికారి పి. రామ్మోహన్ రావు గ్రామీణ యువత, విద్యార్థులకు సహకార సంఘాల పనితీరు, రుణాలు మరియు స్వయం ఉపాధిపై అవగాహన కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సహకార రంగాన్ని బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కోఆపరేటివ్ అధికారి పి. రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాలలో 44 మంది విద్యార్థులతో 'స్టూడెంట్స్ కోఆపరేటివ్ క్లబ్' ను జిల్లా అధికారి ప్రారంభించారు.ఈ క్లబ్ సభ్యులైన విద్యార్థులు స్థానిక సహకార సంఘాలను సందర్శిస్తారు. రైతుల ఖాతాల నిర్వహణ, వ్యవసాయ రుణాలు, విత్తనాలు, ఎరువుల పంపిణీ వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.ఈ ప్రక్రియలో పాల్గొన్న విద్యార్థులకు 'పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు' అందజేస్తారు. దీనివల్ల విద్యార్థులు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకొని, భవిష్యత్తులో రుణాలు పొంది స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడానికి మార్గం సుగమం అవుతుందని రామ్మోహన్ రావు వివరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, సమాజంలో కీలకమైన సహకార సంఘాల పనితీరును తెలుసుకోవాలని సూచించారు. సహకార రంగంపై అవగాహన పెంచుకోవడం ద్వారా జీవన నైపుణ్యాలు మెరుగుపడతాయని, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ సైన్సెస్ డీన్ లెఫ్టినెంట్ డాక్టర్ ఏ. సుధాకర్, కామర్స్ విభాగం అధిపతి అంకం జయప్రకాష్, హిందీ విభాగం అధిపతి డాక్టర్ జి. శ్రీనివాసరావు, కె.కవిత మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.1
- దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్నను భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను చెల్లించుకున్నారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 21 ప్రజా తెలంగాణ న్యూస్/ *_2026-27 సం,, యొక్క తైబజార్ మరియు పశువుల సంత ఆదాయం 89,00,000/-_* తేదీ:20-03-2026 రోజున గౌరవ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ అధ్యక్షతన, కమీషనర్ R వెంకట గోపాల్ ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరం యొక్క *తైబజార్ మరియు పశువుల సంతను* కార్యాలయంలో వేలంపాట నిర్వహించడం జరిగినది. ముందుగా తైబజార్ వేలంలో 21 మంది పాల్గొనగా అత్యధికంగా E. భిక్షపతి రూపాయలు 70లక్షలకు వేలం పాడి దక్కించుకున్నారు. పశువుల సంత వేలంలో 32 మంది పాల్గొనగా అత్యధికంగా T రాజేశం 19లక్షలకు వేలం పాడి దక్కించుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, మేనేజర్, మరియు కార్యాలయ సిబ్బంది పలుగోనడం జరిగినది. *కమీషనర్* *పురపాలక సంఘo* *గజ్వేల్-ప్రజ్ఞాపూర్*4
- నలుగురు జూదగాళ్లు అరెస్టు ఇద్దరుపరారీ,4750 నగదుఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ దేవలపల్లి శ్రీనివాస్ రావు తెలిపారు. ఎస్పికథనంప్రకారంమధ్యాహ్నంకథనంప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి మెదక్ జిల్లా చిల్బుచేడు మండలం శీలం పల్లి గ్రామ శివారులో డంప్ యార్డ్ సమీపంలో ప్రభుత్వం నిషేధించిన జూదమండుతున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురిని అరెస్టు చేసి వారి నుండి 4750 నగదు ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అరెస్టు అయినవారిలో వెంకటాపురం లక్ష్మణ్ జూకంటి లోకయ్య మన్నె ప్రసాద్ ఎల్లయ్య గారి భూమిరెడ్డి ఉన్నారు ఈ ఘటనలో పాల్గొన్న రాకేష్ పెద్దోళ్ల సుధాకర్ రెడ్డి పరారీలో ఉన్నారు ఈ మేరకు చిలిపిచేడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జిల్లాల్లో ఎక్కడైనా జూద కార్యకలాపాలు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రజలు ఇలాంటి కార్యకలాపాలపై 100 కాల్ ఫోన్ చేసి పోలీసులకుసమాచారంఇచ్చి సహకరించాలని కోరారు.1
- కామారెడ్డి: BJP Protest Kamareddy | ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం (Kamareddy Municipal Office) వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. BJP Protest Kamareddy | అమలు కాని హామీలు ఇచ్చి.. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) అలవికాని హామీలను ప్రజలకు ఇచ్చారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేయలేదన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఇచ్చిన దరఖాస్తులకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికి ఇళ్లు ఇవ్వాలన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ (Kamareddy BC Declaration) ఏమైందని ప్రశ్నించారు. 42శాతం ఇస్తామని చెప్పి 32శాతమే ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందన్నారు.1