Shuru
Apke Nagar Ki App…
రెండు వేల కిలోమీటర్లు ఉన్న నమామి గంగే ప్రాజెక్ట్ కోసం రూ. 40 వేల కోట్లు ఖర్చు అయితే.. 55 కిలోమీటర్లు ఉన్న మూసీకి మాత్రం రూ. లక్షా 50 వేల కోట్ల ఖర్చు ఎలా అవుతుంది? మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ రెడ్డి వేల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోం. • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 🔥
Akhil kumar
రెండు వేల కిలోమీటర్లు ఉన్న నమామి గంగే ప్రాజెక్ట్ కోసం రూ. 40 వేల కోట్లు ఖర్చు అయితే.. 55 కిలోమీటర్లు ఉన్న మూసీకి మాత్రం రూ. లక్షా 50 వేల కోట్ల ఖర్చు ఎలా అవుతుంది? మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ రెడ్డి వేల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోం. • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 🔥
More news from తెలంగాణ and nearby areas
- CHALLAN1
- Post by Vishwamber Rao1
- పత్రిక ప్రకటన తేది: 13-04-2026 కామారెడ్డి జిల్లా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 135 దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలపై తమ వినతిపత్రాలను సమర్పించగా, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి, వేగవంతమైన పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, మేడంమోహన్, సీఈఓ జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవరూ లేని తాళాలు వేసిన ఇండ్లను ఎంచుకున్నారు. 6 ఇండ్లలో తాళాలు పగులగొట్టి చోరి కి పాల్పడ్డారు. ఒ వృద్ధురాలి ఇంట్లో పెన్షన్,రైతు బంధు డబ్బులు 12 వేలు ఎత్తుకెళ్లగా మరో ఇంట్లో 23 వేలు 20 తులాల వెండి,తులం నర బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇంటికి తాళాలు వేసి వెళ్తే డబ్బులు విలువ అయిన వస్తువులు వెంబడ తీసుకు వెళ్లలని ఆటోకు మైకు పెట్టీ గ్రామాల్లో పోలీసులు ప్రచారం చేసిన కూడా ఇండ్లనే టార్గెట్ చేస్తున్నారు దొంగలు.1
- భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అధికారులతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని మరియు కూడలిని పరిశీలించారు.ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించబోయే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలోని మున్సిపల్ ద్వారా నిర్వహించాల్సిన వాటర్ ఫౌంటెంట్ మరియు ఇతర నిర్వహణ పనులలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని మరియు అంబేద్కర్ చౌరస్తా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ దార్నం అరుణ లక్ష్మీనారాయణ, మున్సిపల్ డిఈ వాని , ఏఈ నరసింహస్వామి , అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సంఘం అధ్యక్షులు కత్తెర దేవదాస్ మరియు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు..1
- రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం ఆర్మూర్ మండలం పిప్రిలో జరిగిన గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడారు. అరైవ్-అలైవ్ కార్యక్రమాల ఔన్నత్యాన్ని గుర్తిస్తూ ప్రతి ఒక్కరూ భాగస్వాములై, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తమవంతు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.1
- పత్రిక ప్రకటన తేది :13. 04.2026 కామారెడ్డి జిల్లా సోమవారం Arrive Alive” అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం ఏప్రిల్ 13 నుంచి కామారెడ్డి జిల్లాలో విస్తృత కార్యక్రమాలు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. పోలీస్, రవాణా, ఆర్ & బి, విద్య, వైద్య శాఖల సమన్వయంతో “Arrive Alive” ఇతివృత్తంతో ఏప్రిల్ 13 నుండి 18 వరకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగవాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కలెక్టర్ చాంబర్ లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రణాళికలో భాగంగా చేపట్టే అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పాదచారులు, వాహనదారులకు రహదారి భద్రతపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సంబంధిత శాఖల అధికారులు తమ పూర్తి శక్తి సామర్థ్యాలతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.1
- ఎల్లారెడ్డిపేట సబ్‌స్టేషన్లను తనిఖీ చేసిన టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వ్యవసాయ కనెక్షన్ల మంజూరు వేగవంతం తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎన్పీడీసీఎల్) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కర్నాటి వరుణ్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని 132/33 కెవి , 33/11 కెవి సబ్‌స్టేషన్లను సోమవారం స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ట్రాన్స్కో అధికారులతో మాట్లాడుతూ పవర్ ఫ్యాక్టర్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు . పవర్ ఫ్యాక్టర్ .9 వస్తుందని చెప్పగా , ఇంకా పవర్ ఫ్యాక్టర్ మెరుగుపరచుకోవాలని సూచించారు . ఓవర్ లోడ్ ఉన్న ఫీడర్ ఉన్న వాటిని బదలాయింపు చర్యలు చేపట్టాలని , అలాగే కెపాసిటర్ బ్యాంకు లు పెట్టాలని అన్నారు . రైతులకు విద్యుత్ అంతరాయాలు కలగకుండా నిరంతరాయంగా సరఫరా అందించాలని ఆదేశించారు . అంతేకాక సబ్‌స్టేషన్ల యార్డ్ పరిసరాలను అన్నివేళలా శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు . విద్యుత్ మౌలిక సదుపాయాల పై సీఎండీ చర్చిస్తూ , వినియోగదారులకు , రైతులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించాలన్న సంకల్పంతో ముందుకు వెళ్లాలని చెప్పారు . ఈ సందర్బంగా సీఎండీ మాట్లాడుతూ సెస్ బాధ్యతలు స్వీకరించే సమయానికి (ఏప్రిల్ 1) పెండింగ్‌లో ఉన్న 2491 వ్యవసాయ విద్యుత్ దరఖాస్తులను గుర్తించి , వీటిని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని , ఇప్పటి వరకు 431 కనెక్షన్లు ఇచ్చామని, మిగిలిన వాటిని నెలవారీ ప్రాతిపదికన పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు (AEs/ADEs) లక్ష్యాలను నిర్దేశించామన్నారు . కొత్త కనెక్షన్ల కోసం వినియోగదారులు మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు . సిరిసిల్ల పట్టణంలోని పవర్ లూమ్ యూనిట్లపై బిల్లింగ్ భారాన్ని తగ్గించేందుకు, వాటి టారిఫ్ కేటగిరీని 'కేటగిరీ-III' నుండి 'కేటగిరీ-IV'కి మారుస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు . నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఎన్పీడీసీఎల్ ఇప్పటికే దాదాపు ₹2.0 నుండి ₹2.5 కోట్ల వ్యయంతో సుమారు 80 సంఖ్యలో 33/11 kV సబ్‌స్టేషన్లను నిర్మించామని వెల్లడించారు . అనవసరమైన ట్రిప్పింగ్‌లను తగ్గించేందుకు ప్రతి సబ్‌స్టేషన్‌లో అత్యాధునిక ట్రాన్స్‌ఫార్మర్లు , బ్రేకర్లను ఏర్పాటు చేశామని తెలిపారు . . భవిష్యత్తు అవసరాల కోసం ₹45 కోట్ల అంచనా వ్యయంతో మరో 15 కొత్త సబ్‌స్టేషన్లను మంజూరు చేశామని చెప్పారు . . వీటిలో కొన్నింటికి ఇప్పటికే ప్రజాప్రతినిధుల సమక్షంలో భూమి పూజ పూర్తయిందని , ఈ పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని అన్నారు . గతంలో సెస్ హయాంలో ఒకే బ్రేకర్ ద్వారా 2-3 ఫీడర్లను అనుసంధానించడం వల్ల తరచుగా అంతరాయాలు కలిగేవి. దీనిని పరిష్కరించేందుకు ₹1.5 కోట్ల వ్యయంతో అదనంగా 20 బ్రేకర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని , ఈ పనులు 15-20 రోజుల్లో పూర్తవుతాయని వివరించారు . విద్యుత్ నిరంతరాయంగా అందేలా సుమారు ₹30 కోట్ల వ్యయంతో 33 kV ఇంటర్ లింకింగ్ లైన్లను వేశామని చెప్పారు . . దీనివల్ల ఒక ఫీడర్‌లో సమస్య వచ్చినా, మరో మార్గం ద్వారా విద్యుత్ సరఫరా చేసే వీలుంటుంది అన్నారు . ఇతర 17 జిల్లాల మాదిరిగానే సిరిసిల్లలో కూడా USLC విధానాన్ని అమలు చేస్తున్నామని , . దీనివల్ల సర్వీస్ కనెక్షన్ ఛార్జీలు సరళతరం చేయబడ్డాయి . గతంలో వినియోగదారులు చెల్లించే ₹20,000 నుండి ₹60,000 వరకు ఉన్న ORC ఛార్జీలను రద్దు చేశామని చెప్పారు . వినియోగదారులు చెల్లించాల్సిన రుసుము: వ్యవసాయ కనెక్షన్ల కోసం కేవలం కిలోవాట్‌కు ₹1,000 మాత్రమే అన్నారు . నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే "గృహ జ్యోతి" పథకాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని , అర్హులైన వారు సంబంధిత పత్రాలతో స్థానిక ఏఈ (AE) కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. 'పొలం బాట/ప్రజా బాట' కార్యక్రమంలో భాగంగా వదులుగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయడం, మధ్యలో స్తంభాలను ఏర్పాటు చేయడం వంటి పనులను వేగవంతం చేశామని , అత్యవసర పరిస్థితుల కోసం 1000కి పైగా విద్యుత్ స్తంభాలను సిరిసిల్లలో సిద్ధంగా ఉంచామని , కరీంనగర్ స్టోర్స్ నుండి ₹5 కోట్ల విలువైన మెటీరియల్ ఇప్పటికే సిరిసిల్లకు తరలించామన్నారు . అంచనాలు మరియు పనుల అమలులో పారదర్శకత కోసం 'SAP' ఆధారిత సాఫ్ట్ వేర్ విధానాన్ని ప్రవేశపెట్టి, ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చామని , ఉన్నతాధికారులు నిరంతరం సిరిసిల్లలో పర్యటిస్తూ పనులను పర్యవేక్షిస్తారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ను అందించేందుకు ఎన్పీడీసీఎల్ కట్టుబడి ఉందని , ఈ క్రమంలో వినియోగదారులు నెలవారీ విద్యుత్ బిల్లులను క్రమం తప్పకుండా చెల్లించాలని , గృహ జ్యోతి వంటి ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు . సీఎండీ వెంట రాజన్న సిరిసిల్ల సూపెరింటెండింగ్ ఇంజనీర్ బేతి బిక్షపతి, డివిజనల్ ఇంజనీర్ ఎన్ అంజయ్య తో పాటు ఏడీఈ శ్రీనివాస్, రాజలింగం , ఏ ఈ పృథ్విదర్ , ఏ ఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు .1
- నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(GGH) ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ నాగ మోహన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయన్ను ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ నాగరాజ్‌తో పాటు సిబ్బంది అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇంత వరకు ఇక్కడ ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గా పని చేస్తూ విధులు నిర్వహిస్తున్న పి.శ్రీనివాస్ నల్గొండ GGHకు బదిలీ అయ్యారు.1