logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎల్లారెడ్డిపేట సబ్‌స్టేషన్లను తనిఖీ చేసిన టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి. ఎల్లారెడ్డిపేట సబ్‌స్టేషన్లను తనిఖీ చేసిన టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వ్యవసాయ కనెక్షన్ల మంజూరు వేగవంతం తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎన్పీడీసీఎల్) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కర్నాటి వరుణ్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని 132/33 కెవి , 33/11 కెవి సబ్‌స్టేషన్లను సోమవారం స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ట్రాన్స్కో అధికారులతో మాట్లాడుతూ పవర్ ఫ్యాక్టర్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు . పవర్ ఫ్యాక్టర్ .9 వస్తుందని చెప్పగా , ఇంకా పవర్ ఫ్యాక్టర్ మెరుగుపరచుకోవాలని సూచించారు . ఓవర్ లోడ్ ఉన్న ఫీడర్ ఉన్న వాటిని బదలాయింపు చర్యలు చేపట్టాలని , అలాగే కెపాసిటర్ బ్యాంకు లు పెట్టాలని అన్నారు . రైతులకు విద్యుత్ అంతరాయాలు కలగకుండా నిరంతరాయంగా సరఫరా అందించాలని ఆదేశించారు . అంతేకాక సబ్‌స్టేషన్ల యార్డ్ పరిసరాలను అన్నివేళలా శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు . విద్యుత్ మౌలిక సదుపాయాల పై సీఎండీ చర్చిస్తూ , వినియోగదారులకు , రైతులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించాలన్న సంకల్పంతో ముందుకు వెళ్లాలని చెప్పారు . ఈ సందర్బంగా సీఎండీ మాట్లాడుతూ సెస్ బాధ్యతలు స్వీకరించే సమయానికి (ఏప్రిల్ 1) పెండింగ్‌లో ఉన్న 2491 వ్యవసాయ విద్యుత్ దరఖాస్తులను గుర్తించి , వీటిని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని , ఇప్పటి వరకు 431 కనెక్షన్లు ఇచ్చామని, మిగిలిన వాటిని నెలవారీ ప్రాతిపదికన పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు (AEs/ADEs) లక్ష్యాలను నిర్దేశించామన్నారు . కొత్త కనెక్షన్ల కోసం వినియోగదారులు మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు . సిరిసిల్ల పట్టణంలోని పవర్ లూమ్ యూనిట్లపై బిల్లింగ్ భారాన్ని తగ్గించేందుకు, వాటి టారిఫ్ కేటగిరీని 'కేటగిరీ-III' నుండి 'కేటగిరీ-IV'కి మారుస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు . నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఎన్పీడీసీఎల్ ఇప్పటికే దాదాపు ₹2.0 నుండి ₹2.5 కోట్ల వ్యయంతో సుమారు 80 సంఖ్యలో 33/11 kV సబ్‌స్టేషన్లను నిర్మించామని వెల్లడించారు . అనవసరమైన ట్రిప్పింగ్‌లను తగ్గించేందుకు ప్రతి సబ్‌స్టేషన్‌లో అత్యాధునిక ట్రాన్స్‌ఫార్మర్లు , బ్రేకర్లను ఏర్పాటు చేశామని తెలిపారు . . భవిష్యత్తు అవసరాల కోసం ₹45 కోట్ల అంచనా వ్యయంతో మరో 15 కొత్త సబ్‌స్టేషన్లను మంజూరు చేశామని చెప్పారు . . వీటిలో కొన్నింటికి ఇప్పటికే ప్రజాప్రతినిధుల సమక్షంలో భూమి పూజ పూర్తయిందని , ఈ పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని అన్నారు . గతంలో సెస్‌ హయాంలో ఒకే బ్రేకర్ ద్వారా 2-3 ఫీడర్లను అనుసంధానించడం వల్ల తరచుగా అంతరాయాలు కలిగేవి. దీనిని పరిష్కరించేందుకు ₹1.5 కోట్ల వ్యయంతో అదనంగా 20 బ్రేకర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని , ఈ పనులు 15-20 రోజుల్లో పూర్తవుతాయని వివరించారు . విద్యుత్ నిరంతరాయంగా అందేలా సుమారు ₹30 కోట్ల వ్యయంతో 33 kV ఇంటర్ లింకింగ్ లైన్లను వేశామని చెప్పారు . . దీనివల్ల ఒక ఫీడర్‌లో సమస్య వచ్చినా, మరో మార్గం ద్వారా విద్యుత్ సరఫరా చేసే వీలుంటుంది అన్నారు . ఇతర 17 జిల్లాల మాదిరిగానే సిరిసిల్లలో కూడా USLC విధానాన్ని అమలు చేస్తున్నామని , . దీనివల్ల సర్వీస్ కనెక్షన్ ఛార్జీలు సరళతరం చేయబడ్డాయి . గతంలో వినియోగదారులు చెల్లించే ₹20,000 నుండి ₹60,000 వరకు ఉన్న ORC ఛార్జీలను రద్దు చేశామని చెప్పారు . వినియోగదారులు చెల్లించాల్సిన రుసుము: వ్యవసాయ కనెక్షన్ల కోసం కేవలం కిలోవాట్‌కు ₹1,000 మాత్రమే అన్నారు . నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే "గృహ జ్యోతి" పథకాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని , అర్హులైన వారు సంబంధిత పత్రాలతో స్థానిక ఏఈ (AE) కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. 'పొలం బాట/ప్రజా బాట' కార్యక్రమంలో భాగంగా వదులుగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయడం, మధ్యలో స్తంభాలను ఏర్పాటు చేయడం వంటి పనులను వేగవంతం చేశామని , అత్యవసర పరిస్థితుల కోసం 1000కి పైగా విద్యుత్ స్తంభాలను సిరిసిల్లలో సిద్ధంగా ఉంచామని , కరీంనగర్ స్టోర్స్ నుండి ₹5 కోట్ల విలువైన మెటీరియల్ ఇప్పటికే సిరిసిల్లకు తరలించామన్నారు . అంచనాలు మరియు పనుల అమలులో పారదర్శకత కోసం 'SAP' ఆధారిత సాఫ్ట్ వేర్ విధానాన్ని ప్రవేశపెట్టి, ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చామని , ఉన్నతాధికారులు నిరంతరం సిరిసిల్లలో పర్యటిస్తూ పనులను పర్యవేక్షిస్తారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ను అందించేందుకు ఎన్పీడీసీఎల్ కట్టుబడి ఉందని , ఈ క్రమంలో వినియోగదారులు నెలవారీ విద్యుత్ బిల్లులను క్రమం తప్పకుండా చెల్లించాలని , గృహ జ్యోతి వంటి ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు . సీఎండీ వెంట రాజన్న సిరిసిల్ల సూపెరింటెండింగ్ ఇంజనీర్ బేతి బిక్షపతి, డివిజనల్ ఇంజనీర్ ఎన్ అంజయ్య తో పాటు ఏడీఈ శ్రీనివాస్, రాజలింగం , ఏ ఈ పృథ్విదర్ , ఏ ఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు .

21 hrs ago
user_Satheesh gangu
Satheesh gangu
జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•

More news from తెలంగాణ and nearby areas
  • భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో బిజెపి జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి పైన గోపి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను సమర్పించి నివాళులను అర్పించారు.
    1
    భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో బిజెపి జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి పైన గోపి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను సమర్పించి నివాళులను అర్పించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • జగిత్యాల కాంగ్రెస్ లో సరికొత్త లొల్లి తెరపైకి వచ్చింది. సీనియర్, జూనియర్ల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. ఇప్పటికే సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి ఈనెల 20న బీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో సీనియర్లతో సీఎం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బిఆర్ఎస్ లో చేరుతుండగా జగిత్యాలలో కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి. మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల నేపథ్యంలో సీనియర్, జూనియర్ అనే అంశం తెరపైకి వచ్చింది. కో అప్షన్ పదవులు సీనియర్లకే ఇవ్వాలని ఇంతకాలం జీవన్ రెడ్డితో నడిచిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అర్హులైన వారితో భర్తీ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో పాటు జిల్లాకు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పదవులు రాకుంటే సీనియర్లు జీవన్ రెడ్డి వెంట బిఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉందని, వారు చేజారి పోకుండా ఉండాలంటే సీఎంతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఈరోజు సాయంత్రం అపాయింట్మెంట్ తీసుకున్నారు. నిన్న జరగాల్సిన సమావేశం అనివార్య కారణాలవల్ల ఈరోజు జరగడంతో డిసిసి అధ్యక్షులు నందయ్య నేతృత్వంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణంతో పాటు 50 మంది నాయకులు సీఎం వద్దకు వెళ్లారు. పార్టీ మారే ఉద్దేశం తమకు లేదని, సీనియర్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నామని సీనియర్లు అంటున్నారు. సీఎం నుండి తమకు ఎలాంటి భరోసా లభిస్తుందో చూస్తామని చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తోపాటు డిసిసి అధ్యక్షులు మాత్రం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అందరం కలిసే సీనియర్ లను సీఎం వద్దకు తీసుకెళ్ళాలని నిర్ణయించినట్లు తెలిపారు.
    4
    జగిత్యాల కాంగ్రెస్ లో సరికొత్త లొల్లి తెరపైకి వచ్చింది. సీనియర్, జూనియర్ల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. ఇప్పటికే సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి ఈనెల 20న బీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో సీనియర్లతో సీఎం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై  చెప్పి బిఆర్ఎస్ లో చేరుతుండగా జగిత్యాలలో కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి.  మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల నేపథ్యంలో సీనియర్, జూనియర్ అనే అంశం తెరపైకి వచ్చింది. కో అప్షన్ పదవులు సీనియర్లకే ఇవ్వాలని ఇంతకాలం జీవన్ రెడ్డితో నడిచిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అర్హులైన వారితో భర్తీ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో పాటు జిల్లాకు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పదవులు రాకుంటే  సీనియర్లు జీవన్ రెడ్డి వెంట బిఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉందని, వారు చేజారి పోకుండా ఉండాలంటే సీఎంతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఈరోజు సాయంత్రం అపాయింట్మెంట్ తీసుకున్నారు. నిన్న జరగాల్సిన సమావేశం అనివార్య కారణాలవల్ల ఈరోజు జరగడంతో డిసిసి అధ్యక్షులు నందయ్య నేతృత్వంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణంతో పాటు 50 మంది నాయకులు సీఎం వద్దకు వెళ్లారు. పార్టీ మారే ఉద్దేశం తమకు లేదని, సీనియర్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నామని సీనియర్లు అంటున్నారు. సీఎం నుండి తమకు ఎలాంటి భరోసా లభిస్తుందో చూస్తామని చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తోపాటు డిసిసి అధ్యక్షులు మాత్రం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అందరం కలిసే సీనియర్ లను సీఎం వద్దకు తీసుకెళ్ళాలని నిర్ణయించినట్లు తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    55 min ago
  • గత కొంతకాలంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వ్యాపారవేత్తలను చంపుతానని బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న విత్తనాల నాగరాజు అను రౌడీ షీటర్ ని , జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారి ఆదేశాల మేరకు, మెట్టుపల్లి డి.ఎస్.పి ఏ రాములు గారి ఆధ్వర్యంలో, ఈరోజు కోరుట్ల పట్టణంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది గతంలో కూడా విత్తనాలు నాగరాజు పై రెండు మర్డర్ కేసులు మరియు ఎక్స్ట్రాక్షన్ కేసులు నమోదు కాబడినవి అలాగే ఇతనిపై గతంలో PD Act కూడా నమోదు చేసి జైలుకు పంపించనైనది. అలాగే ఈరోజు అరెస్టు చేసిన కేసులో విత్తనాల నాగరాజు తో పాటు మరొక నిందితుడు కూడా ఉన్నట్లు ఆ దర్యాప్తులో తెలిసినది ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు తొందర్లోనే అతని పట్టుకుని అరెస్టు చేస్తాం వీరిద్దరే కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే కూడా వారిని కూడా రిమాండ్ చేస్తాం ఈ కేసుని చాలా మైనేట్గా దర్యాప్తు చేస్తున్నాం, అదేవిధంగా విత్తనాల నాగరాజు అనే రౌడీషీటర్ తో కానీ ఇతని సహచరులతో కానీ ఎవరైనా సంబంధాలు కలిగి ఉండి వారితో తిరిగిన ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిగా పెట్టి వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోబడును, అలాగే ఎవరైనా ఎవరినైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడి బలవంతపు వసూలు చేస్తే వారిపై చట్టపరంగా చాలా కఠిన చర్యలు తీసుకోబడును. ముఖ్యంగా కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ పోలీస్ తరఫున విన్నపం ఏమనగా ఎవరు కూడా ఇలాంటి భయాలకు ఆందోళనలకు గురికావాల్సిన పనిలేదు మిమ్మల్ని ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసిన బెదిరించిన నిర్భయంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వవచ్చు అదేవిధంగా మీ వివరాలు చాలా రహస్యంగా ఉంచబడతాయి.
    1
    గత కొంతకాలంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వ్యాపారవేత్తలను చంపుతానని బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న విత్తనాల నాగరాజు అను రౌడీ షీటర్ ని , జగిత్యాల జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  గారి ఆదేశాల మేరకు, మెట్టుపల్లి డి.ఎస్.పి ఏ రాములు గారి ఆధ్వర్యంలో, ఈరోజు కోరుట్ల పట్టణంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది గతంలో కూడా విత్తనాలు నాగరాజు పై రెండు మర్డర్ కేసులు మరియు ఎక్స్ట్రాక్షన్ కేసులు నమోదు కాబడినవి అలాగే ఇతనిపై గతంలో PD Act కూడా నమోదు చేసి జైలుకు పంపించనైనది. 
అలాగే ఈరోజు అరెస్టు చేసిన కేసులో విత్తనాల నాగరాజు తో పాటు మరొక నిందితుడు కూడా ఉన్నట్లు ఆ దర్యాప్తులో తెలిసినది ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు తొందర్లోనే అతని పట్టుకుని అరెస్టు చేస్తాం వీరిద్దరే కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే కూడా వారిని కూడా రిమాండ్ చేస్తాం ఈ కేసుని చాలా మైనేట్గా దర్యాప్తు చేస్తున్నాం, అదేవిధంగా విత్తనాల నాగరాజు అనే రౌడీషీటర్ తో కానీ ఇతని సహచరులతో కానీ ఎవరైనా సంబంధాలు కలిగి ఉండి వారితో తిరిగిన ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిగా పెట్టి వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోబడును, అలాగే ఎవరైనా ఎవరినైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడి బలవంతపు వసూలు చేస్తే వారిపై చట్టపరంగా చాలా కఠిన చర్యలు తీసుకోబడును. ముఖ్యంగా కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ పోలీస్ తరఫున విన్నపం ఏమనగా ఎవరు కూడా ఇలాంటి భయాలకు ఆందోళనలకు గురికావాల్సిన పనిలేదు మిమ్మల్ని ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసిన బెదిరించిన నిర్భయంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వవచ్చు అదేవిధంగా మీ వివరాలు చాలా రహస్యంగా ఉంచబడతాయి.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లి గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతి, నాయకులు దొనకొండ తిరుపతి, దొనకొండ మహేష్, అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
    1
    గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లి గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతి, నాయకులు దొనకొండ తిరుపతి, దొనకొండ మహేష్, అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
    user_ATUKULA PREM KUMAR
    ATUKULA PREM KUMAR
    జగిత్యాల రూరల్, జగిత్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • జగిత్యాల : జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో ఈ నెల 20 న నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభకోసం  సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామాల నుండి బహిరంగ సభకు వేలాది మందిని తరలించి, బహిరంగ సభను విజయవంతం చేయాలనీ నిర్ణయించారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీ బలోపేతం కోసం ఒకే కుటుంబంగా పనిచేసినామన్నారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పాలనకు ప్రజలు విసిగిపోయి, కేసీఆర్ పాలనే బాగుండే అనే చర్చ వచ్చింది. రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో నుండి వచ్చింది. నేను అంటున్నది కాదు. గ్రామ సర్పంచ్ ను ఎవరు ఏమి చేయలేరు..15 వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా వస్తాయి.. విధిలేని పరిస్థితిలో పార్టీ నీ వీడాల్సి వచ్చిందనీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కే సి ఆర్ దశాబ్దకాలం, రైతులకు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారు.
    2
    జగిత్యాల :
జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో ఈ నెల 20 న నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభకోసం  సన్నాహక సమావేశం నిర్వహించారు.
గ్రామాల నుండి బహిరంగ సభకు వేలాది మందిని తరలించి, బహిరంగ సభను విజయవంతం చేయాలనీ నిర్ణయించారు.
నాలుగు దశాబ్దాల పాటు పార్టీ బలోపేతం కోసం ఒకే కుటుంబంగా పనిచేసినామన్నారు.
రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పాలనకు ప్రజలు విసిగిపోయి, కేసీఆర్ పాలనే బాగుండే అనే చర్చ వచ్చింది.
రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో నుండి వచ్చింది. నేను అంటున్నది కాదు.
గ్రామ సర్పంచ్ ను ఎవరు ఏమి చేయలేరు..15 వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా వస్తాయి..
విధిలేని పరిస్థితిలో పార్టీ నీ వీడాల్సి వచ్చిందనీ,
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కే సి ఆర్ దశాబ్దకాలం, రైతులకు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల•
    19 hrs ago
  • పత్రిక ప్రకటన తేది: 13-04-2026 కామారెడ్డి జిల్లా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 135 దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలపై తమ వినతిపత్రాలను సమర్పించగా, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి, వేగవంతమైన పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, మేడంమోహన్, సీఈఓ జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
    1
    పత్రిక ప్రకటన
తేది: 13-04-2026
కామారెడ్డి జిల్లా
సోమవారం
కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 135 దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలపై తమ వినతిపత్రాలను సమర్పించగా, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి, వేగవంతమైన పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ విక్టర్, మేడంమోహన్, సీఈఓ జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
  • హుస్నాబాద్ మండలం పరిసర గ్రామాల్లో యాసంగి వరి కోతలు సోమవారం ప్రారంభమయ్యాయి. సాగునీరు అందుబాటులో ఉండటంతో ముందస్తుగా సాగు చేసిన రైతులు.. వాతావరణ మార్పుల భయంతో పంటను త్వరగా కోత చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ ఏడాది మోగి పురుగు ప్రభావంతో ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదని, దిగుబడి గణనీయంగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    1
    హుస్నాబాద్ మండలం పరిసర గ్రామాల్లో యాసంగి వరి కోతలు సోమవారం ప్రారంభమయ్యాయి. సాగునీరు అందుబాటులో ఉండటంతో ముందస్తుగా సాగు చేసిన రైతులు.. వాతావరణ మార్పుల భయంతో పంటను త్వరగా కోత చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ ఏడాది మోగి పురుగు ప్రభావంతో ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదని, దిగుబడి గణనీయంగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    21 hrs ago
  • షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్
    1
    షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.