రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్ పి వి కార్యక్రమం విజయవంతం అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ కె వి శ్రావణి, డాక్టర్ మసీదా బేగం ఆధ్వర్యంలో హెచ్ పి వి టీకాలు కార్యక్రమం నిర్వహించారు.సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ రాబోయే కాలంలో సర్వైకల్ క్యాన్సర్ మహమ్మారి నుండి రక్షించుకుని, వాటి బారిన పడకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ఈ హెచ్.పి.వి వ్యాక్సిన్. కార్యక్రమాన్ని 14 సంవత్సరాలు పూర్తి చేసి 15 సంవత్సరాలు పూర్తి కాని అమ్మాయిలకు ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని అమ్మాయిల తల్లిదండ్రులకు విద్యార్థులకు విపులంగా వివరించారు. అందరూ వినియోగించుకోవాలని కోరారు. మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షించడానికి ఈ వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.కార్యక్రమంలో సర్పంచ్ కె వరలక్ష్మి, ఎంపీటీసి ఎస్ రామకృష్ణ, జెపీటీసి పి లక్ష్మి శ్రీనువాస్ రావు, ఎంపీహెచ్‌ఈও వై కృష్ణ, ఎంపీహెచ్‌ఎస్ ఎస్ గోవిందరావు, హెచ్‌వి ఎస్కే సాజహాన్, ఎంఎల్‌హెచ్‌పి కె వరహలమ్మ, ఏఎన్‌ఎమ్ అబిగైల్, వెంకటలక్ష్మి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు

- Post by Shyam1
- Joining Avvandi WhatsApp Group lo1
- Post by Rai Narendra1
- హుకుంపేట మండలం గడుగుపల్లి–కొట్నాపల్లి రహదారిలో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. అరకు నుంచి పాడేరు వైపు వస్తున్న పాల వ్యాన్ డ్రైవర్‌కు నిద్ర రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వ్యాన్ కింద డ్రైవర్ చేయి ఇరుక్కుపోవడంతో విరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి వాహనాన్ని పైకి లేపి క్షతగాత్రుడిని బయటకు తీశారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం పాడేరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు1
- గంగవరం మండలంలోని నెమల్లి చెట్టూ సెంటర్ వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి భారీగా పట్టుబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షణలో గంగవరం ఎస్సై సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో, గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా మరియు హ్యుందాయ్ i-20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజీవ్ పిట్చేశ్రావు, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్ హనుమంతలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోలా ప్రభు అనే ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.1
- రాయవరంలో ఘనంగా 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవం పిఠాపురం: రైతులు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించి ప్రకృతి సిద్ధమైన పద్ధతులు పాటించినప్పుడే భూసారం పెరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి (జెడి) ఎన్. విజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పిఠాపురం మండలం రాయవరం గ్రామంలో నిర్వహించిన 'మంచి వ్యవసాయ పద్ధతులు' మరియు 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడి ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ పంట కోతలకు ముందే పొలంలో నవధాన్యాలు లేదా పి.ఎం.డి.ఎస్ విత్తనాలు చల్లడం వల్ల భూమికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయని తెలిపారు. రాయవరంలో ఇప్పటికే 100 ఎకరాల్లో ఈ పద్ధతిని అమలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే, హార్వెస్టర్ల ద్వారా కోత కోసే సమయంలో బ్లోయర్ వాడటం వల్ల ధాన్యంలో తేమ తగ్గి రైతులకు మంచి ధర లభిస్తుందని సూచించారు. 14 వారాల పొలంబడి శిక్షణలో నేర్చుకున్న అనుభవాలను రైతులు ఈ సందర్భంగా వివరించారు. సహజ కషాయాల వాడకంతో ఎకరానికి రూ.10,000 పెట్టుబడి తగ్గిందని రైతు కర్నీడి జగ్గారావు తెలిపారు. జీవామృతం,పి.ఎం.డి.ఎస్ పద్ధతుల వల్ల పంట బలంగా ఉండి తుపానులకు కూడా పడిపోలేదని రైతు పెదపూడి విష్ణు చక్రం వివరించారు. జిల్లేడు కషాయం,మట్టి ద్రావణం వంటి పద్ధతులతో దెబ్బతిన్న పంటను మళ్ళీ ఆరోగ్యవంతంగా మార్చి మంచి దిగుబడి సాధించానని కౌలు రైతు మాదేపల్లి సీతారాములు గర్వంగా చెప్పారు. సహాయ వ్యవసాయ సంచాలకులు ఏడీఏ స్వాతి మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయానికి రాయవరం గ్రామాన్ని ఆదర్శంగా నిలపాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి ఏవో గంగాధర్ 14 వారాల పొలంబడి ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఏపీ సీ ఎన్ ఎఫ్ సిబ్బంది మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- Post by Rai Narendra1