ఆపదమిత్రశిక్షణలోటీజీఎస్‌డబ్ల్యూఆర్‌డీసీడబ్ల్యూ నల్గొండ విద్యార్థినులు... నల్గొండ, సెప్టెంబర్ 16: విపత్తుల సమయంలో ప్రజలకు సమర్థవంతమైన సహాయ సహకారాలు అందించేలా యువతను తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్న యువ ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమంలో టీజీఎస్‌డబ్ల్యూఆర్‌డీసీడబ్ల్యూ నల్గొండ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. నల్గొండలోని 12వ బెటాలియన్ ప్రాంగణంలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ శిక్షణలో విపత్తుల సన్నద్ధత, అత్యవసర పరిస్థితుల్లో స్పందన, సెర్చ్ అండ్ రెస్క్యూ, తాడుతో రక్షణ చర్యలు, ప్రథమ చికిత్స, బాధితుల తరలింపు, సహాయక చర్యల సమన్వయం తదితర అంశాలపై సిద్ధాంతపరమైన అవగాహనతో పాటు ఆచరణాత్మక శిక్షణ అందిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో సమాజానికి సేవలందించేలా విద్యార్థినుల్లో నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. శిక్షణలో పాల్గొంటున్న విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పవిత్రవాణి కర్ష, వైస్ ప్రిన్సిపల్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు సుల్తానా షేక్, డాక్టర్ సీహెచ్ రజితతో పాటు అధ్యాపక బృందం అభినందించారు. శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలను సమాజ సేవలో వినియోగించి ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలవాలని వారు విద్యార్థినులకు సూచించారు.
ఆపదమిత్రశిక్షణలోటీజీఎస్‌డబ్ల్యూఆర్‌డీసీడబ్ల్యూ నల్గొండ విద్యార్థినులు... నల్గొండ, సెప్టెంబర్ 16: విపత్తుల సమయంలో ప్రజలకు సమర్థవంతమైన సహాయ సహకారాలు అందించేలా యువతను తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్న యువ ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమంలో టీజీఎస్‌డబ్ల్యూఆర్‌డీసీడబ్ల్యూ నల్గొండ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. నల్గొండలోని 12వ బెటాలియన్ ప్రాంగణంలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ శిక్షణలో విపత్తుల సన్నద్ధత, అత్యవసర పరిస్థితుల్లో స్పందన, సెర్చ్ అండ్ రెస్క్యూ, తాడుతో రక్షణ చర్యలు, ప్రథమ చికిత్స, బాధితుల తరలింపు, సహాయక చర్యల సమన్వయం తదితర అంశాలపై సిద్ధాంతపరమైన అవగాహనతో పాటు ఆచరణాత్మక శిక్షణ అందిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో సమాజానికి సేవలందించేలా విద్యార్థినుల్లో నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. శిక్షణలో పాల్గొంటున్న విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పవిత్రవాణి కర్ష, వైస్ ప్రిన్సిపల్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు సుల్తానా షేక్, డాక్టర్ సీహెచ్ రజితతో పాటు అధ్యాపక బృందం అభినందించారు. శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలను సమాజ సేవలో వినియోగించి ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలవాలని వారు విద్యార్థినులకు సూచించారు.
- కెసిఆర్ ని లంబాడీలు మరవకూడదు మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్..... మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ *ఈ నెల 17 న ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించాలని అన్నారు లంబాడీలకు 6 నుండి 10 శాతం రిజర్వేషన్ పెంచిన కేసీఆర్ గారిని లంబాడీలు జీవితాంతం మరువకూడదు అని మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. నేడు మరిపెడ లో జరిగిన నియోజకవర్గ లంబాడీల ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 17 వ తారీఖు తో లంబాడీలకు రిజర్వేషన్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. మా తండాలో మా రాజ్యం అని కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేస్తే దానిని గమనించిన కేసీఆర్ గారు 3146 తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన గొప్ప నాయకుడని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో బంజారాహిల్స్ లో బంజారా భవన్ నిర్మించి లంబాడీలకు ఆత్మగౌరవం పెరిగే విధంగా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు .రాష్ట్రంలోనీ దాదాపు నాలుగు లక్షల పైచిలుకు ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకున్న మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. గిరిజనుల దీనావస్థను చూసి ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి అని అన్నారు.కిలోమీటర్ల దూరం మంచి నీటి కోసం నడిచే గిరిజన మహిళల బాధను గమనించి మిషన్ భగీరథ పథకం అమలు చేశారని అన్నారు. వ్యవసాయ మార్కెట్ లలో రిజర్వేషన్లు కల్పించి,మద్యం దుకాణాలలో కూడా 5% రిజర్వేషన్ లు ST లకు కేటాయించిన మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం BRS ప్రభుత్వం అని అన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండి పడ్డారు. సేవాలాల్ కార్పొరేషన్ కు ఇప్పటివరకు అతి గతి లేదని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం చూస్తే,లంబాడీల మీద ఈ ప్రభుత్వంకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని అన్నారు. CM రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గిరిజనుల భూములు లాక్కొని,ఎదురు తిరిగిన లంబాడీల చేతులకు బేడీలు వేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని మండి పడ్డారు. సర్వేల పేరిట గిరిజనుల భూములను గుంజుకోడం,నిషేధిత జాబితాలో పెట్టడం అన్యాయం అన్నారు. ST,SC సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారని,గిరిజనుల నోట్లో మన్ను పోస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ లంబాడి ముఖ్య నాయకులు, సర్పంచ్ లు,మాజీ ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు. ..1
- సుబ్లేడు లో తెలంగాణా విమోచన వారోత్సవాలలో భాగంగా తెలంగాణా సాయుధ పోరాట యోధుడు షోయబుల్లాఖాన్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జలాభిషేకం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు లో తెలంగాణా విమోచన వారోత్సవాలలో భాగంగా తెలంగాణా సాయుధ పోరాట యోధుడు షోయబుల్లాఖాన్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జలాభిషేకం చేశారు.ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తరువాత తెలంగాణా ప్రాంతం నిజాం నవాబు కబంధ హస్తాలలో మగ్గిందన్నారు.తెలంగాణా ప్రాంతానికి కూడా విముక్తి కావాలని పోరాడిన అమర వీరులకు గౌరవం రావాలని బీజేపీ ఉద్యమం చేస్తుంది.ఖమ్మం జిల్లా లో తొలితరం పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ నిజాం నవాబు కు వ్యతిరేకంగా సంపాదకీయం రాసినందుకు ఆయన్ను హతం చేశారని తెలిపారు. షోయబుల్లాఖాన్ జన్మించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసామని ఆయన చెప్పారు.1
- పడగవిప్పి కదలకుండా కనువిందు చేసిన నాగుపాము............ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జాతీయ రహదారిపై నాగుపాము హల్ చల్ చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.పడగవిప్పి కదలకుండా కనువిందు చేస్తూ కనిపించిన నాగుపామును స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు.అరగంట పాటు ఆసక్తిగా తిలకించిన వాహనదారులు పాదాచారులు దానంతట అదే రోడ్డు దాటి ఓపెన్ ప్లాట్ లలోని చెట్ల పొదల్లోకి నాగుపాము వెళ్లిన తర్వాత ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు.1
- ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న మిర్చి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.9,200, కొత్త పత్తి ధర 8,911రూ.గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పాత పత్తి రూ.100 తగ్గింది. కొత్త పత్తి రూ.100 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.1
- తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ప్రజా గోంతుక మల్లన్న గా మీ ముందుకు బిసి యాత్ర ఆకుల హనుమాండ్లు1
- రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా? రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా?2
- ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కిక్కిరిసింది ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కిక్కిరిసింది. వరుస సెలవులు ముగిశాక ఆస్పత్రికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు. వాతావరణంలో వచ్చే మార్పులతో దగ్గు, జలుబు, జ్వరం, ఒంటినొప్పులతో బాధపడుతున్న పలువురు ఆస్పత్రి బాట పట్టారు. దీంతో ఓపీ వద్ద ఉదయం 9గంటలకే క్యూ మొదలైంది. అలాగే, మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సైతం రద్దీ నెలకొంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఓపీ కూడా రద్దీగా మారింది.1
- తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మా తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్1
- గణనాధుడి సేవలో కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఘనంగా గంగమ్మ తల్లి ఒడికి గణనాథుని పంపుతున్న పోలీసులు ఉత్సవాలకు కుల మతాలు, అధికార తారతమ్యాలు లేవని పోలీసులు రుజువు చేశారు... విజ్ఞాలను తొలగించే గణనాథుడిని సాంప్రదాయ బద్ధంగా పూజలు చేసిన ట్రాఫిక్ పోలీసులు ఆ గణనాథుడి విగ్రహ ఊరేగింపు అత్యంత ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు... కాచిగూడ ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది కలిసి ఆడుతూ పాడుతూ ఆ గణనాథుడి విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో సందడి చేశారు... హైదరాబాద్ కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కలిసి గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు గణనాథుడికి సాంప్రదాయపద్ధంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు... కాచిగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కౌశిక్ నేతృత్వంలో ఎస్ఐలు సిబ్బంది కలిసి బ్యాండ్ మేళా కనుగొనగా నృత్యాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు....3