Shuru
Apke Nagar Ki App…
తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ప్రజా గోంతుక మల్లన్న గా మీ ముందుకు బిసి యాత్ర ఆకుల హనుమాండ్లు
NIMMANAGANTI ANIL BABU
తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ప్రజా గోంతుక మల్లన్న గా మీ ముందుకు బిసి యాత్ర ఆకుల హనుమాండ్లు
More news from తెలంగాణ and nearby areas
- తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ప్రజా గోంతుక మల్లన్న గా మీ ముందుకు బిసి యాత్ర ఆకుల హనుమాండ్లు1
- ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న మిర్చి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.9,200, కొత్త పత్తి ధర 8,911రూ.గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పాత పత్తి రూ.100 తగ్గింది. కొత్త పత్తి రూ.100 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.1
- సుబ్లేడు లో తెలంగాణా విమోచన వారోత్సవాలలో భాగంగా తెలంగాణా సాయుధ పోరాట యోధుడు షోయబుల్లాఖాన్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జలాభిషేకం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు లో తెలంగాణా విమోచన వారోత్సవాలలో భాగంగా తెలంగాణా సాయుధ పోరాట యోధుడు షోయబుల్లాఖాన్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జలాభిషేకం చేశారు.ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తరువాత తెలంగాణా ప్రాంతం నిజాం నవాబు కబంధ హస్తాలలో మగ్గిందన్నారు.తెలంగాణా ప్రాంతానికి కూడా విముక్తి కావాలని పోరాడిన అమర వీరులకు గౌరవం రావాలని బీజేపీ ఉద్యమం చేస్తుంది.ఖమ్మం జిల్లా లో తొలితరం పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ నిజాం నవాబు కు వ్యతిరేకంగా సంపాదకీయం రాసినందుకు ఆయన్ను హతం చేశారని తెలిపారు. షోయబుల్లాఖాన్ జన్మించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసామని ఆయన చెప్పారు.1
- తెలంగాణ రైతాoగా పోరాట యోధుల్ని స్మరించుకుందాం :సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో సీపీఐ పార్టీ 78 వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నిజాం నిరాకుశ పాలనకు వ్యతిరేకంగా ఎందరో పోరాట యోధులు తన విప్లవ పందాను కొనసాగిస్తూ ప్రజల హక్కుల కోసం తపించారాని పేర్కొన్నారు.. అమరవీరులను స్మరిస్తూ వారి త్యాగాలను కొనియాడారు.. ఈ కార్యక్రమం లోజిల్లా కౌన్సిల్ సభ్యులు రషీద్ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు..2
- "భూమి, భుక్తి ,వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బావి తరాలకు అందించాలి: నల్లు సుధాకర్ రెడ్డి" *నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు* భూమి,బుక్తి,వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషుల తిరుగుబాటే కమ్యూనిస్టులనాయకత్వం లో సాగిన సాయుధ పోరాటమని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు మహబూబాబాద్ జిల్లా ; మరిపెడ మండల కేంద్రం గాంధీ సెంటర్ లో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 78వ వార్షికోత్సవాల సందర్భంగా అమరవీరుల చిత్ర పటానికి పూలమాలవేసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దొరలు, భూస్వాములు, జాగిర్దారుల, రజాకార్ల దాస్టికాలకు వ్యతిరేకంగా, భూమికోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టు నాయకులైన రావి నారాయణరెడ్డి,బద్దం ఎల్లారెడ్డి,ముగ్దుo మొయినుద్దీన్ పిలుపుతో ఎర్రజెండా నాయకత్వంలో కొనసాగి 10 లక్షల ఎకరాల భూమిని పంచి, మూడువేల గ్రామాలను విముక్తి చేసి,వేలాది కామ్రేడ్స్ త్యాగాల ఫలితంగా నాటి నిజాం తోక ముడిచే సందర్భంలో, సైన్యాలు రావడంతో హైదరాబాదు రాష్ట్రం భారత్ లో విలీనమైందనేది చారిత్రాత్మక సత్యమని,దీనిని మసిపూసి మారేడు కాయలు చేసే విధంగా, సాయుధ పోరాటంతో సంబంధంలేని బిజెపి లాంటి కుహన శక్తులు ముస్లిం రాజు పై హిందువుల పోరాటంగా చిత్రికరించే ప్రయత్నాలు చేయడాన్ని ప్రగతిశీల శక్తులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు .. *నాటి సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి, సాయుధ పోరాట స్మారక చిహ్నాన్ని ట్యాంకు బండపై ఏర్పాటు చేసి, సెప్టెంబర్ 17 విలీన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు* ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మారగని బాలకృష్ణ,జిల్లా కౌన్సిల్తు సభ్యులు అబ్దుల్ రషీద్,తురక రమేష్,అంజి, వీరేందేర్, వెంకన్న, నర్సయ్య,కన్నె వెంకన్న, కలగుర నాగరాజు, యుగేందర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు...1
- దారి ఉన్నా.. తన స్థలంపైనే కన్నా? దారి కోసం.. దండయాత్రా? ఇంటి జాగా లాక్కునేందుకు రెండేళ్లుగా వేధింపులంటున్న శంకర్ ఇంటివెనుక సీసీ కెమెరాలు.. కుటుంబ కదలికలపై నిఘా? సీసీ కెమెరాలతో నిఘా.. అధికారుల జోక్యంతోనూ ఆగని వివాదం! అధికారుల జోక్యం.. గ్రామస్తుల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచన దంతాలపల్లి మండలంలోని తూర్పుతండా గ్రామపంచాయతీ పరిధిలో ఇంటి జాగా, దారి విషయంలో రెండేళ్లుగా వివాదం కొనసాగుతోంది. తన పాలివారైన గుగులోతు మున్య, సర్జన్, వారి కుటుంబీకులు తన స్థలాన్ని దారి కోసం లాక్కునేందుకు ఒత్తిడి చేస్తూ గొడవలకు దిగుతున్నారని గుగులోతు శంకర్ ఆరోపించారు. తమ కుటుంబంపై కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మున్య ఇంటికి రాకపోకల కోసం సురేష్ ఇంటి వెనుక ఉన్న సుమారు రెండు అడుగుల ఖాళీ బాటను ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, తన స్థలాన్ని ఆనుకుని కార్లు, పెద్ద వాహనాలు వెళ్లేందుకు మార్గం కల్పించాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని శంకర్ పేర్కొన్నారు.వివాదంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా తహశీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, జీపీఓ, ఎస్‌ఐ తదితరులు స్పందించి ఇరువర్గాలతో మాట్లాడినట్లు శంకర్ తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఎలాంటి గొడవలకు వెళ్లకూడదని అధికారులు సూచించినట్లు చెప్పారు.మున్య కుటుంబీకులు రూప్‌సింగ్, ధూప్‌సింగ్‌లు ఇంటి వెనుక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ కుటుంబ సభ్యుల కదలికలను రికార్డు చేస్తున్నారని శంకర్ ఆరోపించారు. తమకు స్వేచ్ఛగా బయట ఉండే పరిస్థితి లేకుండా పోయిందని, ఇంట్లో స్థలం సరిపోక ఆరుబయట నిద్రించే సందర్భాల్లో కూడా కెమెరాల నిఘా ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా, దారి వివాదంలో శంకర్ దగ్గర ఎస్‌ఐ లంచం తీసుకుని వారి కుటుంబాలకు మద్దతు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బాధితులు ఖండించారు. ఆ ప్రచారం అసత్యమని, ఎలాంటి ఆధారాలు లేకుండా జరుగుతున్న ప్రచారంపై కూడా వాస్తవాలు వెలుగులోకి తేవాలని కోరారు. ఇంటి జాగా, దారి వివాదంతో పాటు సీసీ కెమెరాల అంశం, సోషల్ మీడియా ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని, తమకు న్యాయం చేయాలని గుగులోతు శంకర్ కుటుంబం కోరారు.4
- హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు 🤔రూమ్ ఫ్రీ. జీతం :20,000₹. below 10th. #hyderabad #security1
- ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కిక్కిరిసింది ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కిక్కిరిసింది. వరుస సెలవులు ముగిశాక ఆస్పత్రికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు. వాతావరణంలో వచ్చే మార్పులతో దగ్గు, జలుబు, జ్వరం, ఒంటినొప్పులతో బాధపడుతున్న పలువురు ఆస్పత్రి బాట పట్టారు. దీంతో ఓపీ వద్ద ఉదయం 9గంటలకే క్యూ మొదలైంది. అలాగే, మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సైతం రద్దీ నెలకొంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఓపీ కూడా రద్దీగా మారింది.1