logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఇబ్రహీంపట్నంలో గంజాయి నిర్మూలనకు ఖాకీ నిఘా: సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భారీ అవగాహన ఎన్టీఆర్ జిల్లా. ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సిపి రాజశేఖర్ బాబు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నంలో మత్తుపదార్థాల రహిత ర్యాలీ. సమాజమే లక్ష్యంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఏ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గంజాయి నివారణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. గంజాయి మూలాలను పూర్తిగా నిర్మూలించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే, *ఇబ్రహీంపట్నం సర్కిల్* *ఇన్‌స్పెక్టర్ (సీఐ)* *సుబ్రహ్మణ్యంఆధ్వర్యంలో* పట్టణవ్యాప్తంగా శనివారం ఒక భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు.పట్టణంలోని ముఖ్య కూడళ్ల గుండా సాగిన ఈ ర్యాలీ అనంతరం, ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద పోలీసులు ప్రజలను, యువతను ఉద్దేశించి మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిస కావడం వల్ల జీవితాలు ఏ విధంగా నాశనమవుతాయో సీఐ సుబ్రహ్మణ్యం క్షేత్రస్థాయి ఉదాహరణలతో వివరించారు.యువతే లక్ష్యంగా అవగాహన:ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, యువత క్షణికానందం కోసం మత్తు వైపు మళ్లీ తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని హితవు పలికారు. గంజాయి వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను, చట్టపరమైన దుష్ఫలితాలను యువతకు స్పష్టంగా వివరించారు. విద్యార్థులు, యువత చదువుపై, కెరీర్‌పై దృష్టి పెట్టాలని కోరారు.ప్రజలు సమాచారం అందించాలి:ఇబ్రహీంపట్నం పరిధిలో ఎక్కడైనా గంజాయి విక్రయించినా, రవాణా చేసినా లేదా నిల్వ ఉంచినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. సమాజ సంక్షేమం కోసం ప్రజలందరూ పోలీసులతో చేతులు కలిపి, గంజాయి రహిత ఇబ్రహీంపట్నంగా మార్చడానికి సహకరించాలని కోరారు.

4 hrs ago
user_Seelam Ashok Reddy Flex Print
Seelam Ashok Reddy Flex Print
Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

ఇబ్రహీంపట్నంలో గంజాయి నిర్మూలనకు ఖాకీ నిఘా: సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భారీ అవగాహన ఎన్టీఆర్ జిల్లా. ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సిపి రాజశేఖర్ బాబు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నంలో మత్తుపదార్థాల రహిత ర్యాలీ. సమాజమే లక్ష్యంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఏ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గంజాయి నివారణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. గంజాయి మూలాలను పూర్తిగా నిర్మూలించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే, *ఇబ్రహీంపట్నం సర్కిల్* *ఇన్‌స్పెక్టర్ (సీఐ)* *సుబ్రహ్మణ్యంఆధ్వర్యంలో* పట్టణవ్యాప్తంగా శనివారం ఒక భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు.పట్టణంలోని ముఖ్య కూడళ్ల గుండా సాగిన ఈ ర్యాలీ అనంతరం, ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద పోలీసులు ప్రజలను, యువతను ఉద్దేశించి మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిస కావడం వల్ల జీవితాలు ఏ విధంగా నాశనమవుతాయో సీఐ సుబ్రహ్మణ్యం క్షేత్రస్థాయి ఉదాహరణలతో వివరించారు.యువతే లక్ష్యంగా అవగాహన:ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, యువత క్షణికానందం కోసం మత్తు వైపు మళ్లీ తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని హితవు పలికారు. గంజాయి వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను, చట్టపరమైన దుష్ఫలితాలను యువతకు స్పష్టంగా వివరించారు. విద్యార్థులు, యువత చదువుపై, కెరీర్‌పై దృష్టి పెట్టాలని కోరారు.ప్రజలు సమాచారం అందించాలి:ఇబ్రహీంపట్నం పరిధిలో ఎక్కడైనా గంజాయి విక్రయించినా, రవాణా చేసినా లేదా నిల్వ ఉంచినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. సమాజ సంక్షేమం కోసం ప్రజలందరూ పోలీసులతో చేతులు కలిపి, గంజాయి రహిత ఇబ్రహీంపట్నంగా మార్చడానికి సహకరించాలని కోరారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పిడుగురాళ్ల తారక రామ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా 18వ గణపతి మహోత్సవములు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని శివాలయం బజార్, బ్రహ్మంగారి దేవాలయం (కాకతీయ కళ్యాణమండపం)వద్ద తారక రామ యూత్ ఆధ్వర్యంలో 18వ గణపతి మహోత్సవములు ఘనంగా నిర్వహించారు ఈ ప్రాంతంలోనే ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల భారీ గణనాధుడు విగ్రహం, స్టేజి డెకరేషన్ ప్రజలను భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
    1
    పిడుగురాళ్ల తారక రామ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా 18వ గణపతి మహోత్సవములు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని  శివాలయం బజార్, బ్రహ్మంగారి దేవాలయం (కాకతీయ కళ్యాణమండపం)వద్ద తారక రామ యూత్ ఆధ్వర్యంలో 18వ గణపతి మహోత్సవములు ఘనంగా నిర్వహించారు 
ఈ ప్రాంతంలోనే ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల భారీ గణనాధుడు విగ్రహం, స్టేజి డెకరేషన్ ప్రజలను భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా  నిలిచింది.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేసీఆర్‌కు పాలాభిషేకం ఖమ్మం జిల్లా కల్లూరులో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల పెంపు నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 17న కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గిరిజనులు, ఆదివాసీలు, తండాల్లో నివసించే లంబాడీల విద్య, ఉద్యోగ అవకాశాల కోసం అప్పటి ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచిందని సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని గుర్తుచేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన కోరారు.
    1
    గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేసీఆర్‌కు పాలాభిషేకం
ఖమ్మం జిల్లా కల్లూరులో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు.
రిజర్వేషన్ల పెంపు నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 17న కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
గిరిజనులు, ఆదివాసీలు, తండాల్లో నివసించే లంబాడీల విద్య, ఉద్యోగ అవకాశాల కోసం అప్పటి ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచిందని సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు.
ఈ నిర్ణయాన్ని గుర్తుచేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన కోరారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • *డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పశ్చిమ టీడీపీ శ్రేణులకు వెలిగొండ – శ్రీశైలం పర్యటన* *ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో 10 బస్సుల్లో 450 మంది నాయకులు, కార్యకర్తల సందర్శన* ప్రకాశం, రాయలసీమలను కొనసీమగా మార్చగల నాయకుడు వాటర్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అపరభగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన “ఇంటింటికి కూటమి ప్రభుత్వం – సంక్షేమ విజయాలు” డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక ప్రోత్సాహకంగా వెలిగొండ ప్రాజెక్టు, శ్రీశైలం దేవస్థానం పర్యటనను ఏర్పాటు చేశారు. ఆదివారం శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి 10 బస్సులను ప్రారంభించారు. ఈ పర్యటనలో సుమారు 450 మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టును సందర్శించిన కార్యకర్తలు ప్రధాన టన్నెల్ ప్రాంతం, నీటి ప్రవాహ మార్గాలు, ఫీడర్ కాలువలు, 40 కిలోమీటర్ల ప్రధాన కాలువ వ్యవస్థతో పాటు ప్రాజెక్టు నిర్మాణ విశేషాలను పరిశీలించారు. కరువు ప్రాంతాలకు జీవనాడిగా మారిన ఈ ప్రాజెక్టు ద్వారా చేరుతున్న నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీశైలం క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకున్నారు. *ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ....* కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన డోర్ టు డోర్ కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు అత్యంత బాధ్యతతో నిర్వహించారని తెలిపారు. కేవలం 20 రోజుల్లోనే కార్యక్రమాన్ని పూర్తి చేసి రాష్ట్రవ్యాప్తంగా 7వ స్థానంలో నిలవడం పశ్చిమ నియోజకవర్గ టీడీపీ శ్రేణుల నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతగా ఈ పర్యటన ఏర్పాటు చేశామని, అభివృద్ధి అంటే కేవలం మాటలు కాదని, ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకొచ్చే మహత్తర ప్రాజెక్టులేనని పేర్కొన్నారు. అందుకే అమరావతి కాకుండా వెలిగొండ ప్రాజెక్టును సందర్శనకు ఎంపిక చేశామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు అనేది కేవలం ఒక నీటిపారుదల ప్రాజెక్టు కాదని, అది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న అంకితభావానికి ప్రతీక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 1996లో శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నప్పటికీ, చివరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ప్రజలకు అంకితం కావడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. లక్షలాది మంది ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు. "వెలిగొండ అనేది ఒక సాధారణ ప్రాజెక్టు కాదు. ఇది మూడు దశాబ్దాల కల, వేలాది కుటుంబాల ఆశల ప్రతిరూపం. ఈ ప్రాజెక్టు వెనుక స్థానిక ప్రజల త్యాగం, ఇంజనీర్ల అంకితభావం, ప్రభుత్వ నిబద్ధత, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఉన్నాయి. అందుకే ప్రతి తెలుగు వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాజెక్టును సందర్శించాలి" అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. నదుల అనుసంధానం, జల సంరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగంలో చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి కారణంగానే ఆయనకు “ఆంధ్రప్రదేశ్ వాటర్ మ్యాన్”, “అపర భగీరథుడు” అనే గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇంజనీర్లు, స్థానిక ప్రజలు, ముంపు గ్రామాల ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని తెలిపారు. ఈ పర్యటనలో పాల్గొన్న కార్యకర్తలు మాట్లాడుతూ, వెలిగొండ వంటి మహత్తర ప్రాజెక్టును ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి దృక్పథం ఎంత విస్తృతమైనదో అర్థమైందన్నారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చగలిగే ప్రాజెక్టుల వెనుక ఉన్న కృషి, సంకల్పాన్ని తెలుసుకునే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ పర్యటన తమలో మరింత ఉత్తేజాన్ని నింపిందని, పార్టీ బలోపేతం కోసం రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని తెలిపారు.
    1
    *డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పశ్చిమ టీడీపీ శ్రేణులకు వెలిగొండ – శ్రీశైలం పర్యటన*
*ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో 10 బస్సుల్లో 450 మంది నాయకులు, కార్యకర్తల సందర్శన*
ప్రకాశం, రాయలసీమలను కొనసీమగా మార్చగల నాయకుడు వాటర్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అపరభగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన “ఇంటింటికి కూటమి ప్రభుత్వం – సంక్షేమ విజయాలు” డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక ప్రోత్సాహకంగా వెలిగొండ ప్రాజెక్టు, శ్రీశైలం దేవస్థానం పర్యటనను ఏర్పాటు చేశారు. ఆదివారం శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి 10 బస్సులను ప్రారంభించారు. ఈ పర్యటనలో సుమారు 450 మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టును సందర్శించిన కార్యకర్తలు ప్రధాన టన్నెల్ ప్రాంతం, నీటి ప్రవాహ మార్గాలు, ఫీడర్ కాలువలు, 40 కిలోమీటర్ల ప్రధాన కాలువ వ్యవస్థతో పాటు ప్రాజెక్టు నిర్మాణ విశేషాలను పరిశీలించారు. కరువు ప్రాంతాలకు జీవనాడిగా మారిన ఈ ప్రాజెక్టు ద్వారా చేరుతున్న నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీశైలం క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ....* కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన డోర్ టు డోర్ కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు అత్యంత బాధ్యతతో నిర్వహించారని తెలిపారు. కేవలం 20 రోజుల్లోనే కార్యక్రమాన్ని పూర్తి చేసి రాష్ట్రవ్యాప్తంగా 7వ స్థానంలో నిలవడం పశ్చిమ నియోజకవర్గ టీడీపీ శ్రేణుల నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు.
డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతగా ఈ పర్యటన ఏర్పాటు చేశామని, అభివృద్ధి అంటే కేవలం మాటలు కాదని, ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకొచ్చే మహత్తర ప్రాజెక్టులేనని పేర్కొన్నారు. అందుకే అమరావతి కాకుండా వెలిగొండ ప్రాజెక్టును సందర్శనకు ఎంపిక చేశామని తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్టు అనేది కేవలం ఒక నీటిపారుదల ప్రాజెక్టు కాదని, అది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న అంకితభావానికి ప్రతీక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 1996లో శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నప్పటికీ, చివరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ప్రజలకు అంకితం కావడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. లక్షలాది మంది ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు.
"వెలిగొండ అనేది ఒక సాధారణ ప్రాజెక్టు కాదు. ఇది మూడు దశాబ్దాల కల, వేలాది కుటుంబాల ఆశల ప్రతిరూపం. ఈ ప్రాజెక్టు వెనుక స్థానిక ప్రజల త్యాగం, ఇంజనీర్ల అంకితభావం, ప్రభుత్వ నిబద్ధత, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఉన్నాయి. అందుకే ప్రతి తెలుగు వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాజెక్టును సందర్శించాలి" అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు.
నదుల అనుసంధానం, జల సంరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగంలో చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి కారణంగానే ఆయనకు “ఆంధ్రప్రదేశ్ వాటర్ మ్యాన్”, “అపర భగీరథుడు” అనే గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇంజనీర్లు, స్థానిక ప్రజలు, ముంపు గ్రామాల ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని తెలిపారు.
ఈ పర్యటనలో పాల్గొన్న కార్యకర్తలు మాట్లాడుతూ, వెలిగొండ వంటి మహత్తర ప్రాజెక్టును ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి దృక్పథం ఎంత విస్తృతమైనదో అర్థమైందన్నారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చగలిగే ప్రాజెక్టుల వెనుక ఉన్న కృషి, సంకల్పాన్ని తెలుసుకునే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ పర్యటన తమలో మరింత ఉత్తేజాన్ని నింపిందని, పార్టీ బలోపేతం కోసం రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని తెలిపారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    23 hrs ago
  • ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కిక్కిరిసింది ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కిక్కిరిసింది. వరుస సెలవులు ముగిశాక ఆస్పత్రికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు. వాతావరణంలో వచ్చే మార్పులతో దగ్గు, జలుబు, జ్వరం, ఒంటినొప్పులతో బాధపడుతున్న పలువురు ఆస్పత్రి బాట పట్టారు. దీంతో ఓపీ వద్ద ఉదయం 9గంటలకే క్యూ మొదలైంది. అలాగే, మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సైతం రద్దీ నెలకొంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఓపీ కూడా రద్దీగా మారింది.
    1
    ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి          కిక్కిరిసింది
ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కిక్కిరిసింది. వరుస సెలవులు ముగిశాక ఆస్పత్రికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు. వాతావరణంలో వచ్చే మార్పులతో దగ్గు, జలుబు, జ్వరం, ఒంటినొప్పులతో బాధపడుతున్న పలువురు ఆస్పత్రి బాట పట్టారు. దీంతో ఓపీ వద్ద ఉదయం 9గంటలకే క్యూ మొదలైంది. అలాగే, మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సైతం రద్దీ నెలకొంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఓపీ కూడా రద్దీగా మారింది.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
  • ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న మిర్చి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.9,200, కొత్త పత్తి ధర 8,911రూ.గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పాత పత్తి రూ.100 తగ్గింది. కొత్త పత్తి రూ.100 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.
    1
    ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న మిర్చి ధరలు 
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.9,200, కొత్త పత్తి ధర 8,911రూ.గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పాత పత్తి రూ.100 తగ్గింది. కొత్త పత్తి రూ.100 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
  • మాచవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి మగ శిశువు మృతి పల్నాడు జిల్లా మాచవరం లో దారుణం మాచవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి మగ శిశువు మృతి కాన్పు కోసం మాచవరం ఆసుపత్రికి వచ్చిన పిన్నెల్లికి చెందిన కొమ్ము మహిమ అనే బాలింత అందుబాటులో లేకుండా పోయిన వైద్య సిబ్బంది వైద్య సిబ్బంది అందుబాటులో లేక పోవడంతో బాలింతకి కాన్పు చేసిన ఆసుపత్రి ఆయా వైద్యం వికటించి అక్కడిక్కడే పుట్టిన మగ శిశువు మృతి తల్లికి అస్వస్థత శిశువు మృతికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్న తల్లిదండ్రుల బంధువులు ఆయా ద్వారా కాన్పు చేపించడంతోనే పరిస్థితి విషమించి మగ శిశువు మృతి చెందిదని తల్లిదండ్రులు ఆరోపణ విధుల్లో ఉండాల్సిన స్టాఫ్ నర్సులు లేకపోవడం పై బంధువులు తీవ్ర ఆగ్రహం శిశువు మృతి చెందటంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
    2
    మాచవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి మగ శిశువు మృతి 
పల్నాడు జిల్లా మాచవరం లో దారుణం 
మాచవరం ప్రభుత్వ ఆసుపత్రిలో  వైద్యం వికటించి మగ శిశువు మృతి
కాన్పు కోసం మాచవరం  ఆసుపత్రికి వచ్చిన పిన్నెల్లికి చెందిన  కొమ్ము మహిమ అనే బాలింత
అందుబాటులో లేకుండా పోయిన వైద్య సిబ్బంది 
వైద్య సిబ్బంది అందుబాటులో లేక పోవడంతో  బాలింతకి కాన్పు చేసిన  ఆసుపత్రి ఆయా 
వైద్యం వికటించి అక్కడిక్కడే పుట్టిన మగ శిశువు మృతి తల్లికి అస్వస్థత
శిశువు మృతికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్న తల్లిదండ్రుల బంధువులు 
ఆయా ద్వారా కాన్పు చేపించడంతోనే పరిస్థితి విషమించి మగ శిశువు మృతి చెందిదని తల్లిదండ్రులు ఆరోపణ
విధుల్లో ఉండాల్సిన స్టాఫ్ నర్సులు లేకపోవడం పై బంధువులు తీవ్ర ఆగ్రహం
శిశువు మృతి చెందటంతో  కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    23 hrs ago
  • *ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లి* *విద్యుత్ వైర్లు తగిలి లారీ దగ్ధం* మట్టి లోడ్ తో భారీ లారీ కొత్తూరు తాడేపల్లి గ్రామంలో 11కెవి విద్యుత్ వైర్ తగిలి దగ్ధం క్షేమంగా బయటపడ్డ లారీ డ్రైవర్ కొత్తూరు తాడేపల్లిలో సంఘటన అక్రమంగా మట్టి తరలింపు పై ఇప్పటికే పలు ఆరోపణలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికుల విమర్శలు అక్రమ మట్టి రవాణా ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు నిరసనలు దిగిన స్థానికులు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్
    1
    *ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లి*

*విద్యుత్ వైర్లు తగిలి లారీ దగ్ధం* 

మట్టి లోడ్ తో భారీ లారీ కొత్తూరు తాడేపల్లి గ్రామంలో 11కెవి విద్యుత్ వైర్ తగిలి దగ్ధం
క్షేమంగా బయటపడ్డ లారీ డ్రైవర్ 
కొత్తూరు తాడేపల్లిలో సంఘటన
అక్రమంగా మట్టి తరలింపు పై ఇప్పటికే పలు ఆరోపణలు 
అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికుల విమర్శలు 
అక్రమ మట్టి రవాణా ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు నిరసనలు దిగిన స్థానికులు 
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రతి ఇంట్లో 'ఆశీర్వాద దీపం' వెలిగిద్దాం! దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయంలో ప్రతి ఇంట్లో ఆశీర్వాద దీపం వెలిగిద్దాం కార్యక్రమం జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు, మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు బొమ్మదేవర రత్నకుమారి తెలిపారు.25 ఏళ్లుగా దేశమే శ్వాసగా జీవిస్తూ, ప్రజాసేవకే అంకితమై.. కోట్లాది మంది పేదల దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్మదినం సందర్భంగావితాల్లో మార్పు తీసుకొచ్చి, వికసిత భారత్ దిశగా దేశాన్ని నడిపిస్తున్ నరేంద్రుడికి ఆశీస్సులు, మద్దతు తెలియజేద్దామని విజ్ఞప్తి చేశారు మీ బొమ్మదేవర రత్నకుమారి, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు, మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు బొమ్మదేవర రత్నకుమారి,
    1
    నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రతి ఇంట్లో 'ఆశీర్వాద దీపం' వెలిగిద్దాం!
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయంలో ప్రతి ఇంట్లో ఆశీర్వాద దీపం వెలిగిద్దాం కార్యక్రమం జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు, మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు బొమ్మదేవర రత్నకుమారి తెలిపారు.25 ఏళ్లుగా దేశమే శ్వాసగా జీవిస్తూ, ప్రజాసేవకే అంకితమై..
కోట్లాది మంది పేదల దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్మదినం సందర్భంగావితాల్లో మార్పు తీసుకొచ్చి, వికసిత భారత్ దిశగా దేశాన్ని నడిపిస్తున్ నరేంద్రుడికి ఆశీస్సులు, మద్దతు తెలియజేద్దామని విజ్ఞప్తి చేశారు 
మీ 
బొమ్మదేవర రత్నకుమారి,
బీజేపీ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు, మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు బొమ్మదేవర రత్నకుమారి,
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • * ఎన్టీఆర్ జిల్లా: * తిరువూరులో ఫోన్ చోరీ.. ఆ వెంటనే రూ.లక్ష బదిలీ * గుర్రం జగన్మోహన్‌రావు చెప్పుల షాపులో ఘటన * ఫోన్ కావాలంటూ యజమానిని అడిగిన యువకుడు * మాటల్లో పెట్టి మొబైల్‌తో ఉడాయించిన వ్యక్తి * చెప్పులు తెచ్చేలోపే షాప్ నుంచి మాయమైన నిందితుడు * చోరీకి గురైన ఫోన్ నుంచే రూ.లక్ష ట్రాన్స్‌ఫర్ * హెల్మెట్‌తో వచ్చిన వ్యక్తి కదలికలు సీసీ కెమెరాలో నమోదు * మరో వ్యక్తితో బైక్‌పై కలిసి వెళ్లిన దృశ్యాలు రికార్డ్ * సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం ఆరా తీస్తున్న పోలీసులు.
    1
    * ఎన్టీఆర్ జిల్లా:

* తిరువూరులో ఫోన్ చోరీ.. ఆ వెంటనే రూ.లక్ష బదిలీ

* గుర్రం జగన్మోహన్‌రావు చెప్పుల షాపులో ఘటన

* ఫోన్ కావాలంటూ యజమానిని అడిగిన యువకుడు

* మాటల్లో పెట్టి మొబైల్‌తో ఉడాయించిన వ్యక్తి

* చెప్పులు తెచ్చేలోపే షాప్ నుంచి మాయమైన నిందితుడు

* చోరీకి గురైన ఫోన్ నుంచే రూ.లక్ష ట్రాన్స్‌ఫర్

* హెల్మెట్‌తో వచ్చిన వ్యక్తి కదలికలు సీసీ కెమెరాలో నమోదు

* మరో వ్యక్తితో బైక్‌పై కలిసి వెళ్లిన దృశ్యాలు రికార్డ్

* సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం ఆరా తీస్తున్న పోలీసులు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.