Shuru
Apke Nagar Ki App…
* ఎన్టీఆర్ జిల్లా: * తిరువూరులో ఫోన్ చోరీ.. ఆ వెంటనే రూ.లక్ష బదిలీ * గుర్రం జగన్మోహన్‌రావు చెప్పుల షాపులో ఘటన * ఫోన్ కావాలంటూ యజమానిని అడిగిన యువకుడు * మాటల్లో పెట్టి మొబైల్‌తో ఉడాయించిన వ్యక్తి * చెప్పులు తెచ్చేలోపే షాప్ నుంచి మాయమైన నిందితుడు * చోరీకి గురైన ఫోన్ నుంచే రూ.లక్ష ట్రాన్స్‌ఫర్ * హెల్మెట్‌తో వచ్చిన వ్యక్తి కదలికలు సీసీ కెమెరాలో నమోదు * మరో వ్యక్తితో బైక్‌పై కలిసి వెళ్లిన దృశ్యాలు రికార్డ్ * సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం ఆరా తీస్తున్న పోలీసులు.
V Ramarao
* ఎన్టీఆర్ జిల్లా: * తిరువూరులో ఫోన్ చోరీ.. ఆ వెంటనే రూ.లక్ష బదిలీ * గుర్రం జగన్మోహన్‌రావు చెప్పుల షాపులో ఘటన * ఫోన్ కావాలంటూ యజమానిని అడిగిన యువకుడు * మాటల్లో పెట్టి మొబైల్‌తో ఉడాయించిన వ్యక్తి * చెప్పులు తెచ్చేలోపే షాప్ నుంచి మాయమైన నిందితుడు * చోరీకి గురైన ఫోన్ నుంచే రూ.లక్ష ట్రాన్స్‌ఫర్ * హెల్మెట్‌తో వచ్చిన వ్యక్తి కదలికలు సీసీ కెమెరాలో నమోదు * మరో వ్యక్తితో బైక్‌పై కలిసి వెళ్లిన దృశ్యాలు రికార్డ్ * సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం ఆరా తీస్తున్న పోలీసులు.
More news from తెలంగాణ and nearby areas
- ఖమ్మం నగరం 27 డివిజన్ శ్రీనివాస్ నగర్ ఏరియాలో ఇల్లులు కూలగొట్టడానికి వస్తున్న వారిని అడ్డుకొని శ్రీనివాస్ నగర్ బ్రిడ్జి పై ధర్నా చేస్తున్న బాధితులు....మాకు ఇచ్చిన నోటీసులు వెంటనే ఉపసంహారించు కొని ఇళ్ళు కూల్చే పనిని మానుకోవాలని డిమాండ్ చెస్తున్నారు, వీరికి మద్దతు గా బీజేపీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు....1
- నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు.. ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో శిక్షణ... భద్రాచలం: నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. శిక్షణలో భాగంగా హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, బ్యూటీషియన్, ఎలక్ట్రికల్, ఆటోమోటివ్, బేసిక్ గ్రాఫిక్ డిజైన్, షోరూమ్ హోస్ట్, టూర్ గైడ్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యూటీషియన్ కోర్సు భద్రాచలంలో 30 రోజుల పాటు, ఎలక్ట్రికల్ కోర్సు బూర్గంపాడు, హైదరాబాద్, మెదక్ ప్రాంతాల్లో 45 రోజులు, హెల్త్‌కేర్ కోర్సు హైదరాబాద్‌లో 50 రోజులు, హాస్పిటాలిటీ కోర్సు షాద్‌నగర్‌లో 65 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల, కోర్సును బట్టి 8వ తరగతి, 10వ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులైన యువత దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్/ఎస్‌ఎస్‌సీ మెమో, నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు అవసరమని తెలిపారు. శిక్షణలో 80 శాతం ప్రాక్టికల్, 20 శాతం థియరీతో పాటు ప్రీ, పోస్ట్ పరీక్షలు నిర్వహిస్తామని, అర్హత కలిగిన వారికి ఉద్యోగ మద్దతు అందిస్తామని పేర్కొన్నారు. సంప్రదించండి: కో-ఆర్డినేటర్ ఆర్. గోపాల్ – 8231821693. టోల్‌ఫ్రీ: 1800-12-000-4007.1
- భద్రాచలానికి మూడో వంతెన పాండురంగాపురం–భద్రాచలం–మల్కాన్‌గిరి రైల్వే లైన్‌కు కృతజ్ఞతగా మోదీ చిత్రపటానికి పాలాభిషేకం భద్రాచలం ప్రాంత ప్రజల చిరకాల రైల్వే కలను సాకారం చేసే దిశగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాండురంగాపురం–భద్రాచలం–మల్కాన్‌గిరి 173.61 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్‌ను మంజూరు చేయడాన్ని* స్వాగతిస్తూ భద్రాచలంలో బీజేపీ శ్రేణులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్ సెంటర్‌లో రాజ్యాంగ నిర్మాత *డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.* ముఖ్య అతిథిగా పాల్గొన్న *బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి* మాట్లాడుతూ.. భద్రాచలం ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్న రైల్వే కనెక్టివిటీ కోసం గతంలో *పాండురంగాపురం–సారపాక వరకు సుమారు 8 కి.మీ. రైల్వే లైన్‌ను* కోరుకున్నామని, అయితే మోదీ ప్రభుత్వం *పాండురంగాపురం నుంచి భద్రాచలం మీదుగా మల్కాన్‌గిరి వరకు 2864 కోట్లతో 2031లోగా పూర్తి చేసేలా 173.61 కి.మీ. రైల్వే లైన్‌ను మంజూరు చేయడం* గొప్ప విషయమన్నారు. ఈ ప్రాజెక్టులో *భద్రాచలం వద్ద గోదావరిపై మూడో రైల్వే వంతెన నిర్మాణం* జరగడం ద్వారా భద్రాచలం నేరుగా రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానం కానుందని తెలిపారు. ఇది *దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం* ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంచడంతో పాటు, ఏజెన్సీ గిరిజన ప్రాంతాల *విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార అభివృద్ధికి* ఎంతో దోహదపడుతుందన్నారు. ఇప్పటికే మంజూరైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి *భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసి, ఎలాంటి జాప్యం లేకుండా రైల్వే శాఖకు భూమిని అప్పగించాలని* బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో *బీజేపీ నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్, కందుల రాంకిషోర్, పసుమర్తి సతీష్, అట్లూరి రఘురామ్, ములిశెట్టి రాంమోహన్ రావు, ముత్యాల శ్రీనివాస్, కండ్రపు త్రినాథ్ రెడ్డి, నూప రమేష్, రామెళ్ళ రాజశేఖర్, పెద్ది జగపతి బాబు, నిడదవోలు నాగబాబు, తాటిపాముల ఐలయ్య, ముత్యాల చంద్రశేఖర్, దేవరపల్లి వెంకటేశ్వర్లు, ములిశెట్టి నిఖిల్, షేర్ శ్రీను, జీవా, మాలోత్ సాయి, కారం చిన్నయ్య, కోర్స గంగరాజు, సోలం చంటిబాబు* తదితరులు పాల్గొన్నారు.1
- ఇబ్రహీంపట్నంలో గంజాయి నిర్మూలనకు ఖాకీ నిఘా: సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భారీ అవగాహన ఎన్టీఆర్ జిల్లా. ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సిపి రాజశేఖర్ బాబు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నంలో మత్తుపదార్థాల రహిత ర్యాలీ. సమాజమే లక్ష్యంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఏ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గంజాయి నివారణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. గంజాయి మూలాలను పూర్తిగా నిర్మూలించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే, *ఇబ్రహీంపట్నం సర్కిల్* *ఇన్‌స్పెక్టర్ (సీఐ)* *సుబ్రహ్మణ్యంఆధ్వర్యంలో* పట్టణవ్యాప్తంగా శనివారం ఒక భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు.పట్టణంలోని ముఖ్య కూడళ్ల గుండా సాగిన ఈ ర్యాలీ అనంతరం, ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద పోలీసులు ప్రజలను, యువతను ఉద్దేశించి మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిస కావడం వల్ల జీవితాలు ఏ విధంగా నాశనమవుతాయో సీఐ సుబ్రహ్మణ్యం క్షేత్రస్థాయి ఉదాహరణలతో వివరించారు.యువతే లక్ష్యంగా అవగాహన:ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, యువత క్షణికానందం కోసం మత్తు వైపు మళ్లీ తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని హితవు పలికారు. గంజాయి వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను, చట్టపరమైన దుష్ఫలితాలను యువతకు స్పష్టంగా వివరించారు. విద్యార్థులు, యువత చదువుపై, కెరీర్‌పై దృష్టి పెట్టాలని కోరారు.ప్రజలు సమాచారం అందించాలి:ఇబ్రహీంపట్నం పరిధిలో ఎక్కడైనా గంజాయి విక్రయించినా, రవాణా చేసినా లేదా నిల్వ ఉంచినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. సమాజ సంక్షేమం కోసం ప్రజలందరూ పోలీసులతో చేతులు కలిపి, గంజాయి రహిత ఇబ్రహీంపట్నంగా మార్చడానికి సహకరించాలని కోరారు.1
- తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ప్రజా గోంతుక మల్లన్న గా మీ ముందుకు బిసి యాత్ర ఆకుల హనుమాండ్లు1
- ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న మిర్చి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.9,200, కొత్త పత్తి ధర 8,911రూ.గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పాత పత్తి రూ.100 తగ్గింది. కొత్త పత్తి రూ.100 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.1
- ధ్యాన బుద్ధ ప్రాజెక్ట్ సమీపంలోని కృష్ణా నది వద్ద కోలాహలంగా వినాయక నిమజ్జనం ధరణికోట : పల్నాడు జిల్లా అమరావతి మండలం లోని ధరణికోట గ్రామంలో గల యానబుద్ధ ప్రాజెక్టు వద్ద కృష్ణా నది ఒడ్డున వినాయక నిమజ్జనం కోలాహలంగా జరుగుతుంది. రెండు రోజుల నుండి సమీప గ్రామాల నుండి వివిధ రూపాల్లో ఉన్న గణనాథుల విగ్రహాలను ప్రత్యేక వాహనాలలో తీసుకువచ్చి కృష్ణా నదిలో నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జన ప్రదేశానికి వచ్చిన వినాయకుడి విగ్రహాలను క్రేన్ల ద్వారా ప్రవళిలోకి ఎక్కించి నది మధ్యలోకి తీసుకువెళ్లి నిమజ్జనఓ చేస్తున్నారు. నిమజ్జన ప్రదేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.1
- గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేసీఆర్‌కు పాలాభిషేకం ఖమ్మం జిల్లా కల్లూరులో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల పెంపు నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 17న కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గిరిజనులు, ఆదివాసీలు, తండాల్లో నివసించే లంబాడీల విద్య, ఉద్యోగ అవకాశాల కోసం అప్పటి ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచిందని సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని గుర్తుచేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన కోరారు.1