logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పెదకూరపాడు లో తాపీ మేస్త్రి పై వెల్డింగ్ షాప్ ఎక్కి పరికరాలతో దాడి. పెదకూరపాడు-తాపీ మేస్త్రి పై వెల్డింగ్ షాప్ వ్యక్తి కత్తితోదాడి. పెదకూరపాడు. బస్టాండ్ సమీపంలో నివాసముంటున్న షేక్ నాగుల తన స్నేహితుడితో కలిసి వెల్డింగ్ షాపు వద్దకు వెళ్లి ఫ్రెండ్ వాహనానికి వెల్డింగ్ చేయించాడు. అక్కడ ఇరువురి మధ్య గొడవ జరగడంతో తాపీ మేస్త్రి నాగులపై షబ్బీర్ అనే వెల్డింగు షాప్ వ్యక్తి పరికరాలతో దాడి చేయడంతో పొట్టపై ఇరువైపులా మెడపై గాయాలయ్యాయి.

2 hrs ago
user_Raju Paragati
Raju Paragati
పెదకూరపాడు, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

పెదకూరపాడు లో తాపీ మేస్త్రి పై వెల్డింగ్ షాప్ ఎక్కి పరికరాలతో దాడి. పెదకూరపాడు-తాపీ మేస్త్రి పై వెల్డింగ్ షాప్ వ్యక్తి కత్తితోదాడి. పెదకూరపాడు. బస్టాండ్ సమీపంలో నివాసముంటున్న షేక్ నాగుల తన స్నేహితుడితో కలిసి వెల్డింగ్ షాపు వద్దకు వెళ్లి ఫ్రెండ్ వాహనానికి వెల్డింగ్ చేయించాడు. అక్కడ ఇరువురి మధ్య గొడవ జరగడంతో తాపీ మేస్త్రి నాగులపై షబ్బీర్ అనే వెల్డింగు షాప్ వ్యక్తి పరికరాలతో దాడి చేయడంతో పొట్టపై ఇరువైపులా మెడపై గాయాలయ్యాయి.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పార్టీ కోసం ప్రాణం ఇచ్చిన మన పరిటాల రవి బిడ్డ పరిటాల శ్రీరామ్ అన్న అలానే మన పార్టీ భవిషత్తు లోకేష్ అన్న..👏👏👏 కార్యకర్తలకి పండగే పండగ🙏🙏🙏@IParitalaSriram
    1
    పార్టీ కోసం ప్రాణం ఇచ్చిన మన పరిటాల రవి బిడ్డ పరిటాల శ్రీరామ్ అన్న అలానే మన పార్టీ భవిషత్తు లోకేష్ అన్న..👏👏👏
కార్యకర్తలకి పండగే పండగ🙏🙏🙏@IParitalaSriram
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • రేపల్లె పట్టణంలో 30 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి సత్య ప్రసాద్ శంకుస్థాపన. ఏపీలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేపల్లెలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పథకం ద్వారా రూ.30 కోట్లతో అభివృద్ధి పనులకు బృహత్తర అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని విమర్శించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పట్టణాల స్వరూపాన్ని మార్చి, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. నాణ్యతతో కూడిన రహదారులు, తాగునీరు, పారిశుధ్యం తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
    2
    రేపల్లె పట్టణంలో 30 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి సత్య ప్రసాద్ శంకుస్థాపన.
ఏపీలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేపల్లెలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పథకం ద్వారా రూ.30 కోట్లతో అభివృద్ధి పనులకు బృహత్తర అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని విమర్శించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పట్టణాల స్వరూపాన్ని మార్చి, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. నాణ్యతతో కూడిన రహదారులు, తాగునీరు, పారిశుధ్యం తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    10 hrs ago
  • ఉయ్యూరులో గణేష్ నిమజ్జనంnకులాల మధ్య బలప్రదర్శనగా మారకూడదు ఉయ్యూరులో గణేష్ నిమజ్జన వేడుకలు భక్తి, ఆనందం, సోదరభావంతో సాగాలని ఉయ్యూరు టౌన్ సీఐ టి.వి.వి. రామారావు పిలుపునిచ్చారు. రెండు వేర్వేరు వర్గాలకు చెందిన మండపాల ఊరేగింపుల సందర్భంగా పోటీ వాతావరణానికి తావులేకుండా నిర్వాహకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. రెండు మండపాల నిర్వాహకులు మంచి స్నేహితులని, తమ తమ వ్యాపారాల్లో కష్టపడి ఎదిగి జీవితంలో స్థిరపడిన యువకులని పేర్కొన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలంటే వారి స్నేహాన్ని, కష్టపడే తత్వాన్ని, ఎదుగుదలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇది పోటీ కాదు పండుగ : గణేష్ నిమజ్జనాన్ని కులాల మధ్య బలప్రదర్శనగా మార్చవద్దు. డాన్స్ చేయండి, ఆనందంగా వేడుక చేసుకోండి… కానీ మన ఆనందం మరొకరి ఇబ్బందికి కారణం కాకూడదు. చిన్న మాటలకు రెచ్చిపోవడం, గొడవలకు వెళ్లడం వద్దు. మన వేడుక మన ఉయ్యూరుకు మంచి పేరు తీసుకురావాలి” అని సీఐ రామారావు కోరారు.గణపతి ఉత్సవం మనుషులను కలిపే వేదిక కావాలి తప్ప విడదీసే సందర్భం కాకూడదని, ప్రతి ఒక్కరూ భక్తి, క్రమశిక్షణ, పరస్పర గౌరవంతో నిమజ్జన వేడుకల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
    1
    ఉయ్యూరులో గణేష్ నిమజ్జనంnకులాల మధ్య బలప్రదర్శనగా మారకూడదు 
ఉయ్యూరులో గణేష్ నిమజ్జన వేడుకలు భక్తి, ఆనందం, సోదరభావంతో సాగాలని ఉయ్యూరు టౌన్ సీఐ టి.వి.వి. రామారావు పిలుపునిచ్చారు. రెండు వేర్వేరు వర్గాలకు చెందిన మండపాల ఊరేగింపుల సందర్భంగా పోటీ వాతావరణానికి తావులేకుండా నిర్వాహకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. రెండు మండపాల నిర్వాహకులు మంచి స్నేహితులని, తమ తమ వ్యాపారాల్లో కష్టపడి ఎదిగి జీవితంలో స్థిరపడిన యువకులని పేర్కొన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలంటే వారి స్నేహాన్ని, కష్టపడే తత్వాన్ని, ఎదుగుదలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఇది పోటీ కాదు పండుగ : గణేష్ నిమజ్జనాన్ని కులాల మధ్య బలప్రదర్శనగా మార్చవద్దు. డాన్స్ చేయండి, ఆనందంగా వేడుక చేసుకోండి… కానీ మన ఆనందం మరొకరి ఇబ్బందికి కారణం కాకూడదు. చిన్న మాటలకు రెచ్చిపోవడం, గొడవలకు వెళ్లడం వద్దు. మన వేడుక మన ఉయ్యూరుకు మంచి పేరు తీసుకురావాలి” అని సీఐ రామారావు కోరారు.గణపతి ఉత్సవం మనుషులను కలిపే వేదిక కావాలి తప్ప విడదీసే సందర్భం కాకూడదని, ప్రతి ఒక్కరూ భక్తి, క్రమశిక్షణ, పరస్పర గౌరవంతో నిమజ్జన వేడుకల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • ఖమ్మం మమత హాస్పిటల్లో జరిగిన డాక్టర్ జగదీశ్ సంస్మరణ సభలో డాక్టర్ చైతన్య భావోద్వేగానికి గురయ్యారు ఖమ్మం మమత హాస్పిటల్లో జరిగిన డాక్టర్ జగదీశ్ సంస్మరణ సభలో డాక్టర్ చైతన్య భావోద్వేగానికి గురయ్యారు. చివరిసారిగా ఓ పేషెంట్కు చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటూ, ఆయన మందుల ఖర్చును కూడా తానే భరిస్తానని జగదీశ్ చెప్పారని తెలిపారు. ఎంతోమంది పేదలకు సహాయం చేశారని, రోజుకు 3–4 సర్జరీలు చేసేవారని పేర్కొన్నారు. అలాంటి డాక్టర్ మళ్లీ పుట్టరని, ఆయన లేని లోటు తీరనిదని కన్నీటిపర్యంతమయ్యారు.
    1
    ఖమ్మం మమత హాస్పిటల్లో జరిగిన డాక్టర్ జగదీశ్ సంస్మరణ సభలో డాక్టర్ చైతన్య భావోద్వేగానికి గురయ్యారు
ఖమ్మం మమత హాస్పిటల్లో జరిగిన డాక్టర్ జగదీశ్ సంస్మరణ సభలో డాక్టర్ చైతన్య భావోద్వేగానికి గురయ్యారు. చివరిసారిగా ఓ పేషెంట్కు చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటూ, ఆయన మందుల ఖర్చును కూడా తానే భరిస్తానని జగదీశ్ చెప్పారని తెలిపారు. ఎంతోమంది పేదలకు సహాయం చేశారని, రోజుకు 3–4 సర్జరీలు చేసేవారని పేర్కొన్నారు. అలాంటి డాక్టర్ మళ్లీ పుట్టరని, ఆయన లేని లోటు తీరనిదని కన్నీటిపర్యంతమయ్యారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    14 hrs ago
  • స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ఆధ్వర్యంలో గణేష్ మండపం ఏర్పాటు చేయడం జరిగినది ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో భక్తులకు ఉదయం సాయంత్రం 300 మంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతున్నది నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు ఈరోజు రేగూరి వాసవి హనుమంతరావు కుమార్తె అల్లుడు పారేపల్లి తేజ వెంకట సీతారాం సాయి స్నేహిత దంపతులు మరియు దేవరశెట్టి లక్ష్మణరావు ఉదయలక్ష్మి దంపతులు స్వామివార్లకు అభిషేకములు ప్రత్యేక పూజలు నిర్వహించారు నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య మహిళలు 108 ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ప్రధాన కార్యదర్శి కొత్త వేణుబాబు, మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ ,కమిటీ సభ్యులు అయ్యప్ప శ్రీను, రాయపూడి శ్రీను, కనుమలపూడి శ్రీధర్, బుస శీను, భవనాసి వెంకటేశ్వరరావు, కొత్త క్రాంతి కిరణ్, అత్తులూరి సుబ్బయ్య, రేగూరి వాసవి, దోసపాటి కల్పన, దోసపాటి ఉషారాణి, కొత్త కరుణ, కొత్త భవాని, గెల్లా సువర్ణ, నాగలక్ష్మి, వసంత, సుమారు 100 మంది ఆర్యవైశ్య మహిళలు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మరియు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పట్టణ అధ్యక్షులు రేగురి హనుమంతరావు ధన్యవాదాలు తెలియజేశారు
    1
    స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం
స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ఆధ్వర్యంలో గణేష్ మండపం ఏర్పాటు చేయడం జరిగినది ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో భక్తులకు ఉదయం సాయంత్రం 300 మంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతున్నది నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు ఈరోజు రేగూరి వాసవి హనుమంతరావు కుమార్తె అల్లుడు పారేపల్లి తేజ వెంకట సీతారాం సాయి స్నేహిత దంపతులు మరియు దేవరశెట్టి లక్ష్మణరావు ఉదయలక్ష్మి దంపతులు స్వామివార్లకు అభిషేకములు ప్రత్యేక పూజలు నిర్వహించారు  నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య మహిళలు 108 ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ప్రధాన కార్యదర్శి కొత్త వేణుబాబు, మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ ,కమిటీ సభ్యులు అయ్యప్ప శ్రీను, రాయపూడి శ్రీను,  కనుమలపూడి శ్రీధర్, బుస శీను, భవనాసి వెంకటేశ్వరరావు, కొత్త క్రాంతి కిరణ్, అత్తులూరి సుబ్బయ్య, రేగూరి వాసవి, దోసపాటి కల్పన, దోసపాటి ఉషారాణి, కొత్త కరుణ, కొత్త భవాని, గెల్లా సువర్ణ, నాగలక్ష్మి, వసంత, సుమారు 100 మంది ఆర్యవైశ్య మహిళలు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మరియు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పట్టణ అధ్యక్షులు రేగురి హనుమంతరావు ధన్యవాదాలు తెలియజేశారు
    user_RAVELLA NEWS
    RAVELLA NEWS
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • 🕉️ రాపత్రి నగర్‌లో కొలువుదీరిన శ్రీ సిద్ధి వినాయకుడు.. ఘనంగా పూజలు, అన్నదానం! రాపత్రి నగర్‌లో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక స్వామి పూజలు ఖమ్మం నగరంలోని రాపత్రి నగర్ రోడ్ నెంబర్ 5లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో వినాయక స్వామి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులు మరియు స్థానికుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కమిటీ సభ్యులు యశ్వంత్, దీపక్, సోయల్, యువరాజు, శ్యాము, విజ్జు, మాలతి, రేణుక, వెన్నెల, రేఖ, కవిత తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమం అనంతరం అన్నదానం చేయడంతో రాపత్రి నగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    2
    🕉️ రాపత్రి నగర్‌లో కొలువుదీరిన శ్రీ సిద్ధి వినాయకుడు.. ఘనంగా పూజలు, అన్నదానం!
రాపత్రి నగర్‌లో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక స్వామి పూజలు
ఖమ్మం నగరంలోని రాపత్రి నగర్ రోడ్ నెంబర్ 5లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో వినాయక స్వామి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులు మరియు స్థానికుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కమిటీ సభ్యులు యశ్వంత్, దీపక్, సోయల్, యువరాజు, శ్యాము, విజ్జు, మాలతి, రేణుక, వెన్నెల, రేఖ, కవిత తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమం అనంతరం అన్నదానం చేయడంతో రాపత్రి నగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • మిట్ట గణపయ్య...వెళ్లి రావయ్యా. . పెదకూరపాడు మిట్ట సెంటర్లో ఏర్పాటు చేసిన గణనాథుడి ఊరేగింపు మహోత్సవం మంగళవారం రాత్రి కన్నుల పండుగగా సాగింది.. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడిని వివిధ రకాల పుష్ప జాతులతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చాడు. తీన్మార్ డబ్బులు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మేళతాళాలు మంగళ వాయిద్యాలు, బాణాసంచా కాల్పుల నడుమ గణనాథుడు గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా తరలారు. శోభయాత్రను గ్రామ పెద్దలు అర్థిమళ్ళ రమేష్, ఏటుకూరి బ్రహ్మయ్య, ఏటుకూరి రత్నకుమార్, గళ్ళ బాబు, భాష్యం ఆంజనేయులు, అండ్ర ప్రసాద్ గుడిపూడి చిన్నరాజు, మక్కెన సాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు.. ఈ సందర్బంగా ప్రదర్శించిన నృత్య ప్రదర్శన తిలకించేందుకు పెద్ద ఎత్తున యువత, పెద్దలు తరలివచ్చి సందడి చేశారు
    3
    మిట్ట గణపయ్య...వెళ్లి రావయ్యా.                         .
పెదకూరపాడు మిట్ట సెంటర్లో ఏర్పాటు చేసిన గణనాథుడి ఊరేగింపు మహోత్సవం మంగళవారం రాత్రి కన్నుల పండుగగా సాగింది.. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడిని వివిధ రకాల పుష్ప జాతులతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చాడు. తీన్మార్ డబ్బులు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మేళతాళాలు మంగళ వాయిద్యాలు, బాణాసంచా కాల్పుల నడుమ గణనాథుడు గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా తరలారు. శోభయాత్రను గ్రామ పెద్దలు అర్థిమళ్ళ రమేష్, ఏటుకూరి బ్రహ్మయ్య, ఏటుకూరి రత్నకుమార్, గళ్ళ బాబు, భాష్యం ఆంజనేయులు, అండ్ర ప్రసాద్ గుడిపూడి చిన్నరాజు, మక్కెన సాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా   ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు..  ఈ సందర్బంగా ప్రదర్శించిన నృత్య ప్రదర్శన  తిలకించేందుకు పెద్ద ఎత్తున యువత, పెద్దలు తరలివచ్చి సందడి చేశారు
    user_Raju Paragati
    Raju Paragati
    పెదకూరపాడు, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా.. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకి గాను నేషనల్ అవార్డు అందుకున్న నిర్మాత నిహారిక కొణిదెల..
    1
    రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా.. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకి గాను నేషనల్ అవార్డు అందుకున్న నిర్మాత నిహారిక కొణిదెల..
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • రేపల్లె నియోజకవర్గంలో కోటి 23 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అత్యవసర వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కొండంత భరోసా ఇస్తుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రేపల్లె నియోజకవర్గం లోని వివిధ మండలాలకు చెందిన 154 మంది లబ్ధిదారులకు 1 కోటి 23 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి సత్య ప్రసాద్ పంపిణీ చేశారు. ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వైద్య సహాయం త్వరితగతిన అందేలా చూస్తామన్నారు.నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని మంత్రి తెలిపారు.
    1
    రేపల్లె నియోజకవర్గంలో కోటి 23 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
అత్యవసర వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కొండంత భరోసా ఇస్తుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రేపల్లె నియోజకవర్గం లోని వివిధ మండలాలకు చెందిన 154 మంది లబ్ధిదారులకు 1 కోటి 23 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి సత్య ప్రసాద్ పంపిణీ చేశారు. ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వైద్య సహాయం త్వరితగతిన అందేలా చూస్తామన్నారు.నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని మంత్రి తెలిపారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.