Shuru
Apke Nagar Ki App…
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా.. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకి గాను నేషనల్ అవార్డు అందుకున్న నిర్మాత నిహారిక కొణిదెల..
Seelam Ashok Reddy Flex Print
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా.. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకి గాను నేషనల్ అవార్డు అందుకున్న నిర్మాత నిహారిక కొణిదెల..
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఉయ్యూరులో గణేష్ నిమజ్జనంnకులాల మధ్య బలప్రదర్శనగా మారకూడదు ఉయ్యూరులో గణేష్ నిమజ్జన వేడుకలు భక్తి, ఆనందం, సోదరభావంతో సాగాలని ఉయ్యూరు టౌన్ సీఐ టి.వి.వి. రామారావు పిలుపునిచ్చారు. రెండు వేర్వేరు వర్గాలకు చెందిన మండపాల ఊరేగింపుల సందర్భంగా పోటీ వాతావరణానికి తావులేకుండా నిర్వాహకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. రెండు మండపాల నిర్వాహకులు మంచి స్నేహితులని, తమ తమ వ్యాపారాల్లో కష్టపడి ఎదిగి జీవితంలో స్థిరపడిన యువకులని పేర్కొన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలంటే వారి స్నేహాన్ని, కష్టపడే తత్వాన్ని, ఎదుగుదలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇది పోటీ కాదు పండుగ : గణేష్ నిమజ్జనాన్ని కులాల మధ్య బలప్రదర్శనగా మార్చవద్దు. డాన్స్ చేయండి, ఆనందంగా వేడుక చేసుకోండి… కానీ మన ఆనందం మరొకరి ఇబ్బందికి కారణం కాకూడదు. చిన్న మాటలకు రెచ్చిపోవడం, గొడవలకు వెళ్లడం వద్దు. మన వేడుక మన ఉయ్యూరుకు మంచి పేరు తీసుకురావాలి” అని సీఐ రామారావు కోరారు.గణపతి ఉత్సవం మనుషులను కలిపే వేదిక కావాలి తప్ప విడదీసే సందర్భం కాకూడదని, ప్రతి ఒక్కరూ భక్తి, క్రమశిక్షణ, పరస్పర గౌరవంతో నిమజ్జన వేడుకల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.1
- గంగాదేవిపాడు నుండి లింగుగూడెం వాయల్పాడు వైపు వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారింది పట్టించుకోని అధికారులు రోడ్లో మరమ్మత్తులు చేయించాలని ప్రజల ఆవేదన చెందుతున్నారు పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా గంగదేవి పాడు గ్రామం లింగుగూడెం వాయలపాడు వైపు వెళ్లే రోడ్డు రోడ్డులో వాహనాలు రైతులు పంట పొలాల మీదికి వెళ్లే రోడ్డు కాస్త గుంతలు గుంతల మయంగా మారింది రైతులు పొలాలకు వెళ్లాలన్న ప్రయాణికులు ప్రయాణించాలన్న గుంతలోలు భయంగా ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు అధికారులకు తెలియపరిచిన పట్టించుకునే నాధుడే లేడు వెంటనే రోడ్లు మరమ్మత్తులు చేయించాలని ప్రజలు ఆవేదన చెందుతున్నారు...1
- స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం స్థానిక నేలకొండపల్లి శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయంలో నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ఆధ్వర్యంలో గణేష్ మండపం ఏర్పాటు చేయడం జరిగినది ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో భక్తులకు ఉదయం సాయంత్రం 300 మంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతున్నది నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు ఈరోజు రేగూరి వాసవి హనుమంతరావు కుమార్తె అల్లుడు పారేపల్లి తేజ వెంకట సీతారాం సాయి స్నేహిత దంపతులు మరియు దేవరశెట్టి లక్ష్మణరావు ఉదయలక్ష్మి దంపతులు స్వామివార్లకు అభిషేకములు ప్రత్యేక పూజలు నిర్వహించారు నేలకొండపల్లి పట్టణ ఆర్యవైశ్య మహిళలు 108 ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ అధ్యక్షులు రేగూరి హనుమంతరావు ప్రధాన కార్యదర్శి కొత్త వేణుబాబు, మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ ,కమిటీ సభ్యులు అయ్యప్ప శ్రీను, రాయపూడి శ్రీను, కనుమలపూడి శ్రీధర్, బుస శీను, భవనాసి వెంకటేశ్వరరావు, కొత్త క్రాంతి కిరణ్, అత్తులూరి సుబ్బయ్య, రేగూరి వాసవి, దోసపాటి కల్పన, దోసపాటి ఉషారాణి, కొత్త కరుణ, కొత్త భవాని, గెల్లా సువర్ణ, నాగలక్ష్మి, వసంత, సుమారు 100 మంది ఆర్యవైశ్య మహిళలు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మరియు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పట్టణ అధ్యక్షులు రేగురి హనుమంతరావు ధన్యవాదాలు తెలియజేశారు1
- 🕉️ రాపత్రి నగర్‌లో కొలువుదీరిన శ్రీ సిద్ధి వినాయకుడు.. ఘనంగా పూజలు, అన్నదానం! రాపత్రి నగర్‌లో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక స్వామి పూజలు ఖమ్మం నగరంలోని రాపత్రి నగర్ రోడ్ నెంబర్ 5లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో వినాయక స్వామి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులు మరియు స్థానికుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కమిటీ సభ్యులు యశ్వంత్, దీపక్, సోయల్, యువరాజు, శ్యాము, విజ్జు, మాలతి, రేణుక, వెన్నెల, రేఖ, కవిత తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమం అనంతరం అన్నదానం చేయడంతో రాపత్రి నగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.2
- పేర్ని నాని తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే కాగిత *కృష్ణా జిల్లా,పెడన* పెడన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేక అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విమర్శించారు. సోమవారం పెడనలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి, వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తనపై చేసిన ఆరోపణలకు మంగళవారం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలు ఇప్పటికే అవినీతి, అక్రమాల ఆరోపణల్లో కూరుకుపోయారని, వాటిని కప్పిపుచ్చుకునేందుకే కూటమి నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పేర్ని నాని హయాంలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన ఫోర్జరీ సంతకాలతో పట్టాల వ్యవహారం, రేషన్ బియ్యం కేసులను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, గత ఎన్నికల్లో వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసిన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.1
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా.. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకి గాను నేషనల్ అవార్డు అందుకున్న నిర్మాత నిహారిక కొణిదెల..1
- చూప్పరపాలెం గ్రామ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి—ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ రంపచోడవరం మండలం బోలగొండ గ్రామపంచాయతీ పరిధిలోని చూప్పరపాలెం గ్రామ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ కి వినతిపత్రం సమర్పించారు. బోలగొండ నుంచి చూప్పరపాలెం వరకు తారు రోడ్డు నిర్మాణం, మంచినీటి సమస్య పరిష్కారం కోసం వాటర్ ట్యాంక్ నిర్మాణం, విద్యుత్ సమస్యల పరిష్కారం, మొబైల్ సిగ్నల్ టవర్ ఏర్పాటు, పాఠశాలకు ప్రహరీ గోడ మరియు మౌలిక సదుపాయాలు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సరైన రహదారి లేకపోవడంతో ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులు మరియు అత్యవసర వైద్యం అవసరమైన వారు ఆసుపత్రులకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తాగునీటి సమస్యతో కూడా గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.ఈ సమస్యలపై గతంలో పలుమార్లు గ్రీవెన్స్‌లో వినతిపత్రాలు సమర్పించినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 17-08-2026న కూడా గ్రీవెన్స్‌లో వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్న సమయంలో, జాయింట్ కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు గ్రామ సమస్యలను పరిశీలించి, అక్టోబర్ 10లోగా రోడ్డు మరియు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ప్రస్తుత ఆందోళనను విరమించినట్లు తెలిపారు.ఇచ్చిన హామీ మేరకు అక్టోబర్ 10లోగా పనులు ప్రారంభించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదివాసీ గిరిజన సంఘం మరియు చూప్పరపాలెం గ్రామస్తులు కోరారు.చూప్పరపాలెం గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించాలి” అని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు ఈతపల్లి సిరిమల్లి రెడ్డి, రంపచోడవరం మండల అధ్యక్షులు సాదల విద్యాసాగర్ రెడ్డి, రంపచోడవరం మండల నాయకులు కొనుతూరి క్రాంతి కుమార్,మడకం ప్రేమ్ కుమార్ దొర, పొడియం వెంకటేశ్, చోడి కన్నం దొర, మడకం కన్నం దొర తదితరులు పాల్గొన్నారు1
- మిట్ట గణపయ్య...వెళ్లి రావయ్యా. . పెదకూరపాడు మిట్ట సెంటర్లో ఏర్పాటు చేసిన గణనాథుడి ఊరేగింపు మహోత్సవం మంగళవారం రాత్రి కన్నుల పండుగగా సాగింది.. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడిని వివిధ రకాల పుష్ప జాతులతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చాడు. తీన్మార్ డబ్బులు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మేళతాళాలు మంగళ వాయిద్యాలు, బాణాసంచా కాల్పుల నడుమ గణనాథుడు గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా తరలారు. శోభయాత్రను గ్రామ పెద్దలు అర్థిమళ్ళ రమేష్, ఏటుకూరి బ్రహ్మయ్య, ఏటుకూరి రత్నకుమార్, గళ్ళ బాబు, భాష్యం ఆంజనేయులు, అండ్ర ప్రసాద్ గుడిపూడి చిన్నరాజు, మక్కెన సాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు.. ఈ సందర్బంగా ప్రదర్శించిన నృత్య ప్రదర్శన తిలకించేందుకు పెద్ద ఎత్తున యువత, పెద్దలు తరలివచ్చి సందడి చేశారు3
- పెదకూరపాడు లో తాపీ మేస్త్రి పై వెల్డింగ్ షాప్ ఎక్కి పరికరాలతో దాడి. పెదకూరపాడు-తాపీ మేస్త్రి పై వెల్డింగ్ షాప్ వ్యక్తి కత్తితోదాడి. పెదకూరపాడు. బస్టాండ్ సమీపంలో నివాసముంటున్న షేక్ నాగుల తన స్నేహితుడితో కలిసి వెల్డింగ్ షాపు వద్దకు వెళ్లి ఫ్రెండ్ వాహనానికి వెల్డింగ్ చేయించాడు. అక్కడ ఇరువురి మధ్య గొడవ జరగడంతో తాపీ మేస్త్రి నాగులపై షబ్బీర్ అనే వెల్డింగు షాప్ వ్యక్తి పరికరాలతో దాడి చేయడంతో పొట్టపై ఇరువైపులా మెడపై గాయాలయ్యాయి.2