పేర్ని నాని తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే కాగిత *కృష్ణా జిల్లా,పెడన* పెడన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేక అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విమర్శించారు. సోమవారం పెడనలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి, వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తనపై చేసిన ఆరోపణలకు మంగళవారం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలు ఇప్పటికే అవినీతి, అక్రమాల ఆరోపణల్లో కూరుకుపోయారని, వాటిని కప్పిపుచ్చుకునేందుకే కూటమి నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పేర్ని నాని హయాంలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన ఫోర్జరీ సంతకాలతో పట్టాల వ్యవహారం, రేషన్ బియ్యం కేసులను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, గత ఎన్నికల్లో వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసిన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
పేర్ని నాని తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే కాగిత *కృష్ణా జిల్లా,పెడన* పెడన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేక అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విమర్శించారు. సోమవారం పెడనలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి, వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తనపై చేసిన ఆరోపణలకు మంగళవారం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలు ఇప్పటికే అవినీతి, అక్రమాల ఆరోపణల్లో కూరుకుపోయారని, వాటిని కప్పిపుచ్చుకునేందుకే కూటమి నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పేర్ని నాని హయాంలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన ఫోర్జరీ సంతకాలతో పట్టాల వ్యవహారం, రేషన్ బియ్యం కేసులను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, గత ఎన్నికల్లో వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసిన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
- పేర్ని నాని తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే కాగిత *కృష్ణా జిల్లా,పెడన* పెడన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేక అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విమర్శించారు. సోమవారం పెడనలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి, వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తనపై చేసిన ఆరోపణలకు మంగళవారం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలు ఇప్పటికే అవినీతి, అక్రమాల ఆరోపణల్లో కూరుకుపోయారని, వాటిని కప్పిపుచ్చుకునేందుకే కూటమి నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పేర్ని నాని హయాంలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన ఫోర్జరీ సంతకాలతో పట్టాల వ్యవహారం, రేషన్ బియ్యం కేసులను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, గత ఎన్నికల్లో వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసిన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.1
- గురువులపై దాడులతో వైసీపీ అసలు నైజం బయటపడింది : రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువులపై దాడులతో వైసీపీ అసలు నైజం బయటపడిందని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యానించారు.ఉద్యోగాలు సాధించిన టీచర్లను ‘ఫేక్’ అంటూ అవమానించడం వైసీపీ దిగజారుడుతనం ఆధారాలుంటే బయటపెట్టాలి.. దాడులతో భయపెట్టడం కాదని డీఎస్సీపై వైసీపీ ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెబుతామని మంత్రి తెలిపారు.టీచర్లు ప్రశ్నిస్తే వైసీపీ దాడులకు దిగడం దారుణమన్నారు. గురువుల ఆత్మగౌరవంతో వైసీపీ రాజకీయాలు చేయొద్దని నియామకాలను అడ్డుకునే ప్రయత్నాలు విఫలమవడంతో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.అభ్యంతరాలుంటే కోర్టుకు వెళ్లాలి.. రౌడీయిజం ఎందుకని వైసీపీ బెదిరింపులకు ఉపాధ్యాయులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. గురువుల భద్రత, గౌరవం విషయంలో ప్రభుత్వం రాజీపడదని, దాడులకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని అసత్య ప్రచారంతో నిజాన్ని దాచలేరని ప్రజల ముందు వాస్తవాలు పెడతామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.1
- మచిలీపట్నం ఆర్టీసీ కాలనీ శ్రీ విజయం గణపతి దేవాలయం ప్రాంగణం నందు శ్రీగణపతి నవరాత్రి మహ్మోత్సవాలు స్థానిక మచిలీపట్నం ఆర్టీసి కాలనీ శ్రీవిజయ గణపతి దేవాలయం ప్రాంగణం నందు శ్రీగణపతి నవరాత్రి మహ్మోత్సవాలసందర్భంగా భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు1
- తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముందడుగు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. పట్టణంలో మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను మరింత విస్తరించే దిశగా రూ.33 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో విలువైన సిసి రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మ్యూచువల్ గా 33 కోట్ల నిధులను మంజూరు చేయడం హర్షణనియమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో, దేశ అభివృద్ధి ప్రదాత ప్రధాని నరేంద్ర మోడీ ,కి ప్రజా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్... అంటే హెచ్‌ఏఎం విధానం ద్వారా ఈ అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పట్టణంలో మౌలిక వసతులను ఆధునీకరించడం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం ఈ పనుల ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు. రూ.33 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులు పూర్తయితే తాడేపల్లిగూడెం పట్టణంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. పట్టణ అభివృద్ధిలో భాగంగా అవసరమైన వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రజలకు మెరుగైన జీవన సౌకర్యాలు అందించేందుకు ఈ ప్రాజెక్టులు దోహదపడనున్నాయి. హెచ్‌ఏఎం విధానం ద్వారా చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులు పట్టణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా తాడేపల్లిగూడెం పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా రూ.33 కోట్ల విలువైన పనులకు ఆమోదం లభించడం పట్టణ అభివృద్ధిలో మరో కీలక అడుగుగా నిలుస్తోంది. మొత్తంగా చూస్తే... తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.33 కోట్లతో చేపట్టనున్న ఈ పనులు పూర్తయితే ప్రజలకు మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పట్టణ అభివృద్ధికి మరింత ఊతమిస్తూ... భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తాడేపల్లిగూడెం అభివృద్ధి పథంలో ముందుకు సాగనుంది.4
- ఏలూరు జిల్లా: ఏలూరు SBI మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో “సోలార్ సఖి” కార్యక్రమం మహిళలను సౌర విద్యుత్ రంగంలో భాగస్వామ్యం చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక భాగస్వామిగా “సోలార్ సఖి – నారీ శక్తి సోలార్ శక్తి అనుసంధాన్ అభియాన్” కార్యక్రమాన్ని చేపడుతోంది. మహిళలకు సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థల ఏర్పాటు, నిర్వహణ, గ్రిడ్ కనెక్షన్, మానిటరింగ్, భద్రతా అంశాలపై శిక్షణ, అవగాహన కల్పించనున్నారు. మహిళలకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడమే కార్యక్రమం లక్ష్యం. సోలార్ సఖి కార్యక్రమంపై SBI, కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ADB ఆధ్వర్యంలో సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థల నిర్వహణపై మహిళలకు శిక్షణ అందించే మార్గదర్శిని రూపొందించారు. సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడంతో పాటు మహిళలకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.1
- సిద్ధాంతంలో వైభవంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి గ్రామోత్సవం పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ విఘ్నేశ్వర స్వామి గ్రామోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. కచేరి సెంటర్‌కు చెందిన గణేష్ యూత్ ఆధ్వర్యంలో స్వామివారి విగ్రహాన్ని పచ్చి పూలతో అందంగా అలంకరించిన ప్రత్యేక వాహనంపై ప్రతిష్ఠించి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. యువత ఉత్సాహంగా పాల్గొని భక్తి పాటలు, నృత్యాలతో సందడి చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, గణనాథుడిని భక్తుల నామస్మరణల మధ్య వశిష్ట గోదావరి కేదార్ ఘాట్‌కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు1
- వీఆర్ఏల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి ఏడో రోజుకు చేరిన సహాయ నిరాకరణ ఉద్యమం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం గాంధీ బొమ్మల రోడ్డు కచేరి సెంటర్ వద్ద వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం ఏడో రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. అర్హత, అనుభవం ఉన్న వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని, వేతన స్కేలు అమలు చేయాలని, నామినీ వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని కోరారు. దీర్ఘకాలంగా తమ సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి డిమాండ్లను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వీఆర్ఏలు స్పష్టం చేశారు.1
- ఉయ్యూరులో గణేష్ నిమజ్జనంnకులాల మధ్య బలప్రదర్శనగా మారకూడదు ఉయ్యూరులో గణేష్ నిమజ్జన వేడుకలు భక్తి, ఆనందం, సోదరభావంతో సాగాలని ఉయ్యూరు టౌన్ సీఐ టి.వి.వి. రామారావు పిలుపునిచ్చారు. రెండు వేర్వేరు వర్గాలకు చెందిన మండపాల ఊరేగింపుల సందర్భంగా పోటీ వాతావరణానికి తావులేకుండా నిర్వాహకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. రెండు మండపాల నిర్వాహకులు మంచి స్నేహితులని, తమ తమ వ్యాపారాల్లో కష్టపడి ఎదిగి జీవితంలో స్థిరపడిన యువకులని పేర్కొన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలంటే వారి స్నేహాన్ని, కష్టపడే తత్వాన్ని, ఎదుగుదలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇది పోటీ కాదు పండుగ : గణేష్ నిమజ్జనాన్ని కులాల మధ్య బలప్రదర్శనగా మార్చవద్దు. డాన్స్ చేయండి, ఆనందంగా వేడుక చేసుకోండి… కానీ మన ఆనందం మరొకరి ఇబ్బందికి కారణం కాకూడదు. చిన్న మాటలకు రెచ్చిపోవడం, గొడవలకు వెళ్లడం వద్దు. మన వేడుక మన ఉయ్యూరుకు మంచి పేరు తీసుకురావాలి” అని సీఐ రామారావు కోరారు.గణపతి ఉత్సవం మనుషులను కలిపే వేదిక కావాలి తప్ప విడదీసే సందర్భం కాకూడదని, ప్రతి ఒక్కరూ భక్తి, క్రమశిక్షణ, పరస్పర గౌరవంతో నిమజ్జన వేడుకల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.1