logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వీఆర్ఏల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి ఏడో రోజుకు చేరిన సహాయ నిరాకరణ ఉద్యమం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం గాంధీ బొమ్మల రోడ్డు కచేరి సెంటర్‌ వద్ద వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం ఏడో రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. అర్హత, అనుభవం ఉన్న వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని, వేతన స్కేలు అమలు చేయాలని, నామినీ వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని కోరారు. దీర్ఘకాలంగా తమ సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి డిమాండ్లను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వీఆర్ఏలు స్పష్టం చేశారు.

16 hrs ago
user_V. surya
V. surya
Local News Reporter ఆచంట, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
16 hrs ago

వీఆర్ఏల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి ఏడో రోజుకు చేరిన సహాయ నిరాకరణ ఉద్యమం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం గాంధీ బొమ్మల రోడ్డు కచేరి సెంటర్‌ వద్ద వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం ఏడో రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. అర్హత, అనుభవం ఉన్న వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని, వేతన స్కేలు అమలు చేయాలని, నామినీ వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని కోరారు. దీర్ఘకాలంగా తమ సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి డిమాండ్లను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వీఆర్ఏలు స్పష్టం చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చింతలపూడి నగర పంచాయతీ నాలుగవ సచివాలయ పరిధిలో వృధా అవుతున్న త్రాగునీరు. చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో త్రాగునీరు వృధా అవుతుంది. ఐదవ సచివాలయం పరిధిలోని బోయగూడెం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వెనుక త్రాగునీరు వృధా అవుతుందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు.
    1
    చింతలపూడి నగర పంచాయతీ నాలుగవ సచివాలయ పరిధిలో వృధా అవుతున్న త్రాగునీరు.
చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో త్రాగునీరు వృధా అవుతుంది. ఐదవ సచివాలయం పరిధిలోని బోయగూడెం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వెనుక త్రాగునీరు వృధా అవుతుందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు.
    user_Mogaparthi.Devakrupavaram
    Mogaparthi.Devakrupavaram
    చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • మచిలీపట్నం ఆర్టీసీ కాలనీ శ్రీ విజయం గణపతి దేవాలయం ప్రాంగణం నందు శ్రీగణపతి నవరాత్రి మహ్మోత్సవాలు స్థానిక మచిలీపట్నం ఆర్టీసి కాలనీ శ్రీవిజయ గణపతి దేవాలయం ప్రాంగణం నందు శ్రీగణపతి నవరాత్రి మహ్మోత్సవాలసందర్భంగా భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు
    1
    మచిలీపట్నం ఆర్టీసీ కాలనీ శ్రీ విజయం గణపతి దేవాలయం ప్రాంగణం నందు శ్రీగణపతి నవరాత్రి మహ్మోత్సవాలు 
స్థానిక మచిలీపట్నం ఆర్టీసి కాలనీ శ్రీవిజయ గణపతి దేవాలయం ప్రాంగణం నందు శ్రీగణపతి నవరాత్రి మహ్మోత్సవాలసందర్భంగా భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు
    user_MANDAPAKALA RAO
    MANDAPAKALA RAO
    Insurance Agent Challapalle, Krishna•
    15 hrs ago
  • లోకేష్ అన్న రాకతో రాప్తాడు దద్దరిల్లింది 🔥🔥 రాప్తాడు లో అడుగడుగునా లోకేష్ గారికి ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ప్రజలు😍🥰👏
    1
    లోకేష్ అన్న రాకతో రాప్తాడు దద్దరిల్లింది 🔥🔥
రాప్తాడు లో అడుగడుగునా లోకేష్ గారికి ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ప్రజలు😍🥰👏
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • సత్తుపల్లిలో ఘనంగా గణేష్ నవరాత్రి పూజలు – మండపాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ వివిధ గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తల్లాడ, కల్లూరు ఖాన్‌ఖాన్‌పేట, పెనుబల్లి మండపాలతో పాటు సత్తుపల్లి పట్టణంలోని పలు వినాయక మండపాల్లో పూజలు చేసి, భక్తులతో కలిసి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    సత్తుపల్లిలో ఘనంగా గణేష్ నవరాత్రి పూజలు – మండపాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ వివిధ గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
తల్లాడ, కల్లూరు ఖాన్‌ఖాన్‌పేట, పెనుబల్లి మండపాలతో పాటు సత్తుపల్లి పట్టణంలోని పలు వినాయక మండపాల్లో పూజలు చేసి, భక్తులతో కలిసి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • బెస్తగూడెం గ్రామంలో డ్రైనేజి వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు.. ఇకనైనా సమస్యకు పరిస్కారం చూపాలి ప్రజలు డిమాండ్ కుక్కునూరు మండలంలోని బెస్తగూడెం గ్రామంలో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. ముఖ్యంగా డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంతో ఇళ్ల పక్కనే మురుగు నీరు నిల్వ ఉండి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఈ నీటి నిల్వల కారణంగా దోమలు విపరీతంగా పెరిగి స్థానికులు జ్వరాల బారిన పడుతున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    బెస్తగూడెం గ్రామంలో డ్రైనేజి వ్యవస్థ లేక  తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు.. ఇకనైనా సమస్యకు పరిస్కారం చూపాలి ప్రజలు డిమాండ్ 
కుక్కునూరు మండలంలోని బెస్తగూడెం గ్రామంలో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. ముఖ్యంగా డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంతో ఇళ్ల పక్కనే మురుగు నీరు నిల్వ ఉండి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఈ నీటి నిల్వల కారణంగా దోమలు విపరీతంగా పెరిగి స్థానికులు జ్వరాల బారిన పడుతున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_Venkat
    Venkat
    కుకునూరు, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • గురువులపై దాడులతో వైసీపీ అసలు నైజం బయటపడింది : రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువులపై దాడులతో వైసీపీ అసలు నైజం బయటపడిందని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యానించారు.ఉద్యోగాలు సాధించిన టీచర్లను ‘ఫేక్’ అంటూ అవమానించడం వైసీపీ దిగజారుడుతనం ఆధారాలుంటే బయటపెట్టాలి.. దాడులతో భయపెట్టడం కాదని డీఎస్సీపై వైసీపీ ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెబుతామని మంత్రి తెలిపారు.టీచర్లు ప్రశ్నిస్తే వైసీపీ దాడులకు దిగడం దారుణమన్నారు. గురువుల ఆత్మగౌరవంతో వైసీపీ రాజకీయాలు చేయొద్దని నియామకాలను అడ్డుకునే ప్రయత్నాలు విఫలమవడంతో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.అభ్యంతరాలుంటే కోర్టుకు వెళ్లాలి.. రౌడీయిజం ఎందుకని వైసీపీ బెదిరింపులకు ఉపాధ్యాయులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. గురువుల భద్రత, గౌరవం విషయంలో ప్రభుత్వం రాజీపడదని, దాడులకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని అసత్య ప్రచారంతో నిజాన్ని దాచలేరని ప్రజల ముందు వాస్తవాలు పెడతామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.
    1
    గురువులపై దాడులతో వైసీపీ అసలు నైజం బయటపడింది : రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్
గురువులపై దాడులతో వైసీపీ అసలు నైజం బయటపడిందని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యానించారు.ఉద్యోగాలు సాధించిన టీచర్లను ‘ఫేక్’ అంటూ అవమానించడం వైసీపీ దిగజారుడుతనం 
ఆధారాలుంటే బయటపెట్టాలి.. దాడులతో భయపెట్టడం కాదని  డీఎస్సీపై వైసీపీ ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెబుతామని మంత్రి తెలిపారు.టీచర్లు ప్రశ్నిస్తే వైసీపీ దాడులకు దిగడం దారుణమన్నారు. గురువుల ఆత్మగౌరవంతో వైసీపీ రాజకీయాలు చేయొద్దని నియామకాలను అడ్డుకునే ప్రయత్నాలు విఫలమవడంతో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.అభ్యంతరాలుంటే కోర్టుకు వెళ్లాలి.. రౌడీయిజం ఎందుకని 
వైసీపీ బెదిరింపులకు ఉపాధ్యాయులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
గురువుల భద్రత, గౌరవం విషయంలో ప్రభుత్వం రాజీపడదని, దాడులకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని అసత్య ప్రచారంతో నిజాన్ని దాచలేరని ప్రజల ముందు వాస్తవాలు పెడతామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • పార్టీ కోసం ప్రాణం ఇచ్చిన మన పరిటాల రవి బిడ్డ పరిటాల శ్రీరామ్ అన్న అలానే మన పార్టీ భవిషత్తు లోకేష్ అన్న..👏👏👏 కార్యకర్తలకి పండగే పండగ🙏🙏🙏@IParitalaSriram
    1
    పార్టీ కోసం ప్రాణం ఇచ్చిన మన పరిటాల రవి బిడ్డ పరిటాల శ్రీరామ్ అన్న అలానే మన పార్టీ భవిషత్తు లోకేష్ అన్న..👏👏👏
కార్యకర్తలకి పండగే పండగ🙏🙏🙏@IParitalaSriram
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • పెనుబల్లి మండలం లో లింగుగూడెం వెళ్లే రోడ్లో ఈరోజు కోతులు ఆహారం లేక రోడ్లమీద ఇండ్లలో చేరి ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న పట్టించుకునే నాధుడు లేరు అధికారులు నిర్లక్ష్యం.. పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా, పెనుబల్లి గ్రామపంచాయతీలో లింగగూడెం రూట్ లో కోతులు హడేవుడి చేస్తున్నాయి కోతులకు ఆహారం లేక రోడ్లమీద స్టోర్లో వేస్ట్ రైస్ ప్రాబ్లం ఇండ్ల పక్కన పోయటం వలన గ్రామంలో ప్రజల మీద కోతులు ఇబ్బందులు కలగజేస్తున్నాయి గ్రామపంచాయతీ అధికారులు కోతులు బంధించి వాటి మీద చర్యలు తీసుకోవాలని గ్రామంలో ఉన్న ప్రజలు ఆవేదన చెందుతున్నారు అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం వలన పిల్లల మీద పెద్దదల మీద కోతులు దాడి చేస్తున్నాయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు ఆవేదన చెందుతున్నారు కాబట్టి గ్రామపంచాయతీ అధికారులు వెంటనే కోతుల మీద చర్యలు తీసుకొని వాటిని నిర్బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు...
    4
    పెనుబల్లి మండలం లో లింగుగూడెం వెళ్లే రోడ్లో ఈరోజు కోతులు ఆహారం లేక రోడ్లమీద ఇండ్లలో చేరి ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న పట్టించుకునే నాధుడు లేరు అధికారులు నిర్లక్ష్యం..
పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా, పెనుబల్లి  గ్రామపంచాయతీలో లింగగూడెం రూట్ లో కోతులు హడేవుడి చేస్తున్నాయి కోతులకు ఆహారం లేక రోడ్లమీద స్టోర్లో వేస్ట్ రైస్ ప్రాబ్లం  ఇండ్ల పక్కన పోయటం వలన గ్రామంలో ప్రజల మీద కోతులు ఇబ్బందులు కలగజేస్తున్నాయి గ్రామపంచాయతీ అధికారులు కోతులు బంధించి వాటి మీద చర్యలు తీసుకోవాలని గ్రామంలో ఉన్న ప్రజలు ఆవేదన చెందుతున్నారు అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం వలన పిల్లల మీద పెద్దదల మీద కోతులు దాడి చేస్తున్నాయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు ఆవేదన చెందుతున్నారు కాబట్టి గ్రామపంచాయతీ అధికారులు వెంటనే కోతుల మీద చర్యలు తీసుకొని వాటిని నిర్బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు...
    user_K Y RAJU
    K Y RAJU
    Tour Guide పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
  • మరుగుతున్న సాంబార్ పాత్రలో పడి మహిళ మృతి : అన్నదాన కార్యక్రమంలో విషాదం విజయవాడలో వినాయక చవితి అన్నదాన కార్యక్రమంలో విషాద ఘటన చోటు చేసుకుంది.చిట్టినగర్‌లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వంట పనులకు సహాయం చేస్తుండగా సుజాత అనే 46 ఏళ్ల మహిళ ప్రమాదవశాత్తు మరిగుతున్న సాంబార్ పాత్రలో పడిపోయారు.ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో సుజాత మృతి చెందారు.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదైనట్లు తెలుస్తోంది. అన్నదాన కార్యక్రమం నిర్వహణలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.వినాయక చవితి వేడుకల్లో అందరికీ అన్నదానం చేయాలనే సేవా కార్యక్రమం.. ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
    1
    మరుగుతున్న సాంబార్ పాత్రలో పడి మహిళ మృతి : అన్నదాన కార్యక్రమంలో విషాదం
విజయవాడలో వినాయక చవితి అన్నదాన కార్యక్రమంలో విషాద ఘటన చోటు చేసుకుంది.చిట్టినగర్‌లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వంట పనులకు సహాయం చేస్తుండగా సుజాత అనే 46 ఏళ్ల మహిళ ప్రమాదవశాత్తు మరిగుతున్న సాంబార్ పాత్రలో పడిపోయారు.ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో సుజాత మృతి చెందారు.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదైనట్లు తెలుస్తోంది. అన్నదాన కార్యక్రమం నిర్వహణలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.వినాయక చవితి వేడుకల్లో అందరికీ అన్నదానం చేయాలనే సేవా కార్యక్రమం.. ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    37 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.