logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మరుగుతున్న సాంబార్ పాత్రలో పడి మహిళ మృతి : అన్నదాన కార్యక్రమంలో విషాదం విజయవాడలో వినాయక చవితి అన్నదాన కార్యక్రమంలో విషాద ఘటన చోటు చేసుకుంది.చిట్టినగర్‌లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వంట పనులకు సహాయం చేస్తుండగా సుజాత అనే 46 ఏళ్ల మహిళ ప్రమాదవశాత్తు మరిగుతున్న సాంబార్ పాత్రలో పడిపోయారు.ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో సుజాత మృతి చెందారు.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదైనట్లు తెలుస్తోంది. అన్నదాన కార్యక్రమం నిర్వహణలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.వినాయక చవితి వేడుకల్లో అందరికీ అన్నదానం చేయాలనే సేవా కార్యక్రమం.. ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.

1 hr ago
user_దాసరి నటరాజు
దాసరి నటరాజు
ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

మరుగుతున్న సాంబార్ పాత్రలో పడి మహిళ మృతి : అన్నదాన కార్యక్రమంలో విషాదం విజయవాడలో వినాయక చవితి అన్నదాన కార్యక్రమంలో విషాద ఘటన చోటు చేసుకుంది.చిట్టినగర్‌లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వంట పనులకు సహాయం చేస్తుండగా సుజాత అనే 46 ఏళ్ల మహిళ ప్రమాదవశాత్తు మరిగుతున్న సాంబార్ పాత్రలో పడిపోయారు.ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో సుజాత మృతి చెందారు.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదైనట్లు తెలుస్తోంది. అన్నదాన కార్యక్రమం నిర్వహణలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.వినాయక చవితి వేడుకల్లో అందరికీ అన్నదానం చేయాలనే సేవా కార్యక్రమం.. ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.

More news from Krishna and nearby areas
  • మచిలీపట్నం ఆర్టీసీ కాలనీ శ్రీ విజయం గణపతి దేవాలయం ప్రాంగణం నందు శ్రీగణపతి నవరాత్రి మహ్మోత్సవాలు స్థానిక మచిలీపట్నం ఆర్టీసి కాలనీ శ్రీవిజయ గణపతి దేవాలయం ప్రాంగణం నందు శ్రీగణపతి నవరాత్రి మహ్మోత్సవాలసందర్భంగా భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు
    1
    మచిలీపట్నం ఆర్టీసీ కాలనీ శ్రీ విజయం గణపతి దేవాలయం ప్రాంగణం నందు శ్రీగణపతి నవరాత్రి మహ్మోత్సవాలు 
స్థానిక మచిలీపట్నం ఆర్టీసి కాలనీ శ్రీవిజయ గణపతి దేవాలయం ప్రాంగణం నందు శ్రీగణపతి నవరాత్రి మహ్మోత్సవాలసందర్భంగా భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు
    user_MANDAPAKALA RAO
    MANDAPAKALA RAO
    Insurance Agent Challapalle, Krishna•
    16 hrs ago
  • లోకేష్ అన్న రాకతో రాప్తాడు దద్దరిల్లింది 🔥🔥 రాప్తాడు లో అడుగడుగునా లోకేష్ గారికి ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ప్రజలు😍🥰👏
    1
    లోకేష్ అన్న రాకతో రాప్తాడు దద్దరిల్లింది 🔥🔥
రాప్తాడు లో అడుగడుగునా లోకేష్ గారికి ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ప్రజలు😍🥰👏
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • పేర్ని నాని తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే కాగిత *కృష్ణా జిల్లా,పెడన* పెడన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేక అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విమర్శించారు. సోమవారం పెడనలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి, వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తనపై చేసిన ఆరోపణలకు మంగళవారం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలు ఇప్పటికే అవినీతి, అక్రమాల ఆరోపణల్లో కూరుకుపోయారని, వాటిని కప్పిపుచ్చుకునేందుకే కూటమి నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పేర్ని నాని హయాంలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన ఫోర్జరీ సంతకాలతో పట్టాల వ్యవహారం, రేషన్ బియ్యం కేసులను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, గత ఎన్నికల్లో వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసిన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
    1
    పేర్ని నాని తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే కాగిత 
*కృష్ణా జిల్లా,పెడన* 
పెడన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేక అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విమర్శించారు.
సోమవారం పెడనలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి, వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తనపై చేసిన ఆరోపణలకు మంగళవారం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ నేతలు ఇప్పటికే అవినీతి, అక్రమాల ఆరోపణల్లో కూరుకుపోయారని, వాటిని కప్పిపుచ్చుకునేందుకే కూటమి నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పేర్ని నాని హయాంలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన ఫోర్జరీ సంతకాలతో పట్టాల వ్యవహారం, రేషన్ బియ్యం కేసులను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, గత ఎన్నికల్లో వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసిన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
    user_Hareesh Gopu
    Hareesh Gopu
    బంటుమిల్లి, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • *మూమెంట్ ఫర్ పీసెస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక ఉద్యమ పోస్టర్ల ఆవిష్కరణ..* *అవినీతికి పాల్పడిన రాజకీయ, ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి..* *అవినీతి మూలంగా దేశ అభివృద్ధి తిరోగమన దిశలో నడుస్తుంది..* *ప్రజలు ఉద్యమించినప్పుడు మాత్రమే అవినీతిని కూకటివేళ్లతో పెకిలించవచ్చు..* MPJ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 21 నుంచి 30వ తేదీ వరకు "అవినీతి వ్యతిరేక ఉద్యమం " చేపట్టిందని, అందులో భాగంగా నేడు గుంటూరు పట్టణంలో నడిబొడ్డున ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాం ముందు అవినీతి వ్యతిరేక ఉద్యమ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యంపీజే -ఏపి రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ..‌ ప్రజల ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయల ప్రజా ధనం ప్రజల అభివృద్ధికి పాటుబడాల్సి పోయి, సంక్షేమ పథకాల ఎంపికలో అవినీతి, కాంట్రాక్టర్ల పనుల్లో నాసిరకం, ప్రతి పనిలో కమీషన్లు, వనరుల దుర్వినియోగం, ప్రతి రంగంలోనూ అవినీతి- ఆశ్రిత పక్షపాతం, దేశ, రాష్ట్ర ప్రజల వనరులు దోపిడికి గురౌతున్నాయని, ప్రజల పన్నులతో వేతనాలు తీసుకుంటూ రాజకీయ నాయకులు- అధికారులు అవినీతికి పాల్పడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు..? ప్రజల పన్నులతో చేపడుతున్న పనులల్లో నాణ్యత లోపించడం, సంక్షేమ పథకాల్లో అవినీతి, అవినీతి సర్వసాధారణం కావడం, దేశ అభివృద్ధి, దేశ భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మునిసిపల్ శాఖ, గృహనిర్మాణ శాఖ, విద్యా, వైద్య - ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ, గనులు-సహజ వనరులు, పౌర సరఫరాల శాఖ, రవాణాశాఖ, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ ఇలా అన్ని రంగాల్లో అవినీతి పేరుకుపోయి.. *కంచే చేను మేసిన చందంగా అవినీతితో సమాజం కుళ్లిపోయిందని అన్నారు.* అవినీతిని కూకటివేళ్లతో పెకిలించాలంటే ప్రజలు చైతన్యవంతులై నిలబడాలని, అందుకు ఎంపీజే ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను ఉంచింది.. *ముఖ్యమైన 10 డిమాండ్లు..* 1. ప్రతి ప్రభుత్వ శాఖలో అవినీతి నిరోధక వ్యవస్థను బలోపేతం చేయాలి. 2. ప్రభుత్వ పథకాలకు వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. 3. టెండర్లు, కాంట్రాక్టులు, కొనుగోళ్లలో పూర్తి పారదర్శకత ఉండాలి. 4. ప్రభుత్వ అభివృద్ధి పనుల వివరాలను సంబంధిత ప్రాంతాలలో బహిరంగంగా ప్రదర్శించాలి. 5. లబ్ధిదారుల ఎంపిక స్పష్టంగా జరగాలి. 6. లంచం, అవినీతి ఆరోపణలపై స్వతంత్ర నిష్పక్షపాత విచారణ జరపాలి. 7. ఫిర్యాదు చేసే ప్రజలకు, సామాజిక కార్యకర్తలకు రక్షణ కల్పించాలి. 8. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని ప్రజా ధనాన్ని రికవరీ చేయాలి. 9. అవినీతి కేసుల్లో పార్టీ, పదవి, హోదా, అధికారం అనే తేడా లేకుండా చర్యలు తీసుకోవాలి. 10. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అవినీతి నిరోధకానికి తీసుకున్న చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. 2025 లో అవినీతి నిరోధక శాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం మొత్తం 115 కేసులు నమోదైతే.. 69 కేసులు అవినీతికి సంబంధించినవి ఉండటం గమనార్హం, అందులో శిక్షలు పడిన వారు చాలా అరుదు. ప్రజలు చైతన్య వంతులై అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడే అవినీతిని పారద్రోలగలుగుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా యంపీజే అధ్యక్షులు షేక్ ఖాశిం, మార్కాపురం పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరావలి, ఉపాధ్యక్షులు సయ్యద్ మస్తాన్ వలీ, షేక్ అబ్బాస్, నాయకులు షేక్ అమీర్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.
    1
    *మూమెంట్ ఫర్ పీసెస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక ఉద్యమ పోస్టర్ల ఆవిష్కరణ..*
*అవినీతికి పాల్పడిన రాజకీయ, ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి..*
*అవినీతి మూలంగా దేశ అభివృద్ధి తిరోగమన దిశలో నడుస్తుంది..*
*ప్రజలు ఉద్యమించినప్పుడు మాత్రమే అవినీతిని కూకటివేళ్లతో పెకిలించవచ్చు..*
MPJ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 21 నుంచి 30వ తేదీ వరకు "అవినీతి వ్యతిరేక ఉద్యమం " చేపట్టిందని, అందులో భాగంగా నేడు గుంటూరు పట్టణంలో నడిబొడ్డున ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాం ముందు అవినీతి వ్యతిరేక ఉద్యమ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యంపీజే -ఏపి రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ..‌ 
ప్రజల ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయల ప్రజా ధనం ప్రజల అభివృద్ధికి పాటుబడాల్సి పోయి,  సంక్షేమ పథకాల ఎంపికలో అవినీతి,  కాంట్రాక్టర్ల పనుల్లో నాసిరకం, ప్రతి పనిలో కమీషన్లు, వనరుల దుర్వినియోగం, ప్రతి రంగంలోనూ అవినీతి- ఆశ్రిత పక్షపాతం, దేశ, రాష్ట్ర ప్రజల వనరులు దోపిడికి గురౌతున్నాయని, ప్రజల పన్నులతో వేతనాలు తీసుకుంటూ రాజకీయ నాయకులు- అధికారులు అవినీతికి పాల్పడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు..?
ప్రజల పన్నులతో చేపడుతున్న పనులల్లో నాణ్యత లోపించడం, సంక్షేమ పథకాల్లో అవినీతి, అవినీతి సర్వసాధారణం కావడం, దేశ అభివృద్ధి, దేశ భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి ఏర్పడింది. 
ముఖ్యంగా మునిసిపల్ శాఖ, గృహనిర్మాణ శాఖ, విద్యా, వైద్య - ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ, గనులు-సహజ వనరులు, పౌర సరఫరాల శాఖ, రవాణాశాఖ, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ ఇలా అన్ని రంగాల్లో అవినీతి పేరుకుపోయి.. 
*కంచే చేను మేసిన చందంగా అవినీతితో సమాజం కుళ్లిపోయిందని అన్నారు.*
అవినీతిని కూకటివేళ్లతో పెకిలించాలంటే ప్రజలు చైతన్యవంతులై నిలబడాలని, అందుకు ఎంపీజే ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను ఉంచింది..
*ముఖ్యమైన 10 డిమాండ్లు..*
1. ప్రతి ప్రభుత్వ శాఖలో అవినీతి నిరోధక వ్యవస్థను బలోపేతం చేయాలి.
2. ప్రభుత్వ పథకాలకు వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
3. టెండర్లు, కాంట్రాక్టులు, కొనుగోళ్లలో పూర్తి పారదర్శకత ఉండాలి.
4. ప్రభుత్వ అభివృద్ధి పనుల వివరాలను సంబంధిత ప్రాంతాలలో బహిరంగంగా ప్రదర్శించాలి.
5. లబ్ధిదారుల ఎంపిక స్పష్టంగా జరగాలి.
6. లంచం, అవినీతి ఆరోపణలపై స్వతంత్ర నిష్పక్షపాత విచారణ జరపాలి.
7. ఫిర్యాదు చేసే ప్రజలకు, సామాజిక కార్యకర్తలకు రక్షణ కల్పించాలి.
8. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని ప్రజా ధనాన్ని రికవరీ చేయాలి.
9. అవినీతి కేసుల్లో పార్టీ, పదవి, హోదా, అధికారం అనే తేడా లేకుండా చర్యలు తీసుకోవాలి.
10. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అవినీతి నిరోధకానికి తీసుకున్న చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
2025 లో అవినీతి నిరోధక శాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం మొత్తం 115 కేసులు నమోదైతే.. 69 కేసులు అవినీతికి సంబంధించినవి ఉండటం గమనార్హం, అందులో శిక్షలు పడిన వారు చాలా అరుదు. 
ప్రజలు చైతన్య వంతులై అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడే అవినీతిని పారద్రోలగలుగుతామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా యంపీజే అధ్యక్షులు షేక్ ఖాశిం, మార్కాపురం పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరావలి, ఉపాధ్యక్షులు సయ్యద్ మస్తాన్ వలీ, షేక్ అబ్బాస్, నాయకులు షేక్ అమీర్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    14 hrs ago
  • భారీ ధర పలికిన వినాయక చవితి లడ్డు. లక్ష 8 వేలకు దక్కించుకున్న వంగరు విజయ్ కుమార్. చెరుకుపల్లి మండలం, గుళ్లపల్లి గ్రామంలో 'పద్మశాలి యూత్' ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపంలో గణపతి లడ్డూ వేలం పాట ఘనంగా నిర్వహించారు. ఈ వేలం పాటలో భక్తులు పోటీపడి పాల్గొన్నారు. 21 కేజీల మొదటి లడ్డూను వంగరు విజయ్ కుమార్ (విజయ్ కుమార్ జ్యువెలరీస్) రూ. 1,08,216/- దక్కించుకున్నారు.5 కేజీల రెండవ లడ్డూను వంగరు వెంకట లక్ష్మణ రావు రూ. 26,500/- పాడుకుని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి లడ్డూను దక్కించుకున్న భక్తులకు పద్మశాలి యూత్ సభ్యులు మరియు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. లడ్డూ వేలం పాట ద్వారా వచ్చిన సొమ్మును తదుపరి ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని పద్మశాలి యూత్ కమిటీ అధ్యక్షుడు పట్టెం భాను తెలిపారు. తెలిపారు. కార్యక్రమంలో పద్మశాలి యూత్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ వంగరు నాగార్జున, సెక్రటరీ వంగరు షణ్ముఖ సాయి, క్యాషియర్ పడితపు చరణ్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    1
    భారీ ధర పలికిన వినాయక చవితి లడ్డు. లక్ష 8 వేలకు దక్కించుకున్న వంగరు విజయ్ కుమార్.
చెరుకుపల్లి మండలం, గుళ్లపల్లి గ్రామంలో 'పద్మశాలి యూత్' ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపంలో గణపతి లడ్డూ వేలం పాట ఘనంగా నిర్వహించారు. ఈ వేలం పాటలో భక్తులు పోటీపడి పాల్గొన్నారు. 21 కేజీల మొదటి లడ్డూను వంగరు విజయ్ కుమార్ (విజయ్ కుమార్ జ్యువెలరీస్) రూ. 1,08,216/- దక్కించుకున్నారు.5 కేజీల రెండవ లడ్డూను వంగరు వెంకట లక్ష్మణ రావు రూ. 26,500/- పాడుకుని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.
స్వామివారి లడ్డూను దక్కించుకున్న భక్తులకు పద్మశాలి యూత్ సభ్యులు మరియు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. లడ్డూ వేలం పాట ద్వారా వచ్చిన సొమ్మును తదుపరి ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని పద్మశాలి యూత్ కమిటీ అధ్యక్షుడు పట్టెం భాను తెలిపారు. తెలిపారు. కార్యక్రమంలో పద్మశాలి యూత్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ వంగరు నాగార్జున, సెక్రటరీ వంగరు షణ్ముఖ సాయి, క్యాషియర్ పడితపు చరణ్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    14 hrs ago
  • 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో నేషనల్ అవార్డు అందుకున్న నిహారిక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు అద్భుత ప్రతిభ కనబరిచాయి. ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును సుకుమార్ ‘పుష్ప 2’ కోసం, ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’ (నిర్మాత: నిహారిక కొణిదెల) నిలిచాయి. ‘పుష్ప 2’ చిత్రానికి దీపాళి నూర్, శీతల్ శర్మ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్‌కు, ‘కల్కి 2898 AD’ చిత్రానికి నితిన్ జిహానీ చౌదరి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్‌కు, వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి ఉత్తమ సంభాషణలకు అవార్డులు అందుకున్నారు. తెలుగు చిత్రసీమ జాతీయ స్థాయిలో సాధించిన ఈ ఘనతపై సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు.
    1
    72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో నేషనల్ అవార్డు అందుకున్న నిహారిక 
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు అద్భుత ప్రతిభ కనబరిచాయి. ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును సుకుమార్ ‘పుష్ప 2’ కోసం, ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’ (నిర్మాత: నిహారిక కొణిదెల) నిలిచాయి. ‘పుష్ప 2’ చిత్రానికి దీపాళి నూర్, శీతల్ శర్మ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్‌కు, ‘కల్కి 2898 AD’ చిత్రానికి నితిన్ జిహానీ చౌదరి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్‌కు, వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి ఉత్తమ సంభాషణలకు అవార్డులు అందుకున్నారు. తెలుగు చిత్రసీమ జాతీయ స్థాయిలో సాధించిన ఈ ఘనతపై సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    46 min ago
  • త్రిపురాంతకం మండలం గొల్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి బ్రిడ్జి సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమేపల్లి గ్రామానికి చెందిన పల్లెపోగు ప్రసాద్, నార్నెపాటి కోటేష్ పనిమీద బైక్‌పై మార్కాపురం వైపు వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన సుండిపెంటకు చెందిన అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం అనంతరం అంబులెన్స్‌ను అక్కడే వదిలి డ్రైవర్ పరారైనట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇద్దరి మృతితో సోమేపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
    1
    త్రిపురాంతకం మండలం గొల్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి బ్రిడ్జి సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమేపల్లి గ్రామానికి చెందిన పల్లెపోగు ప్రసాద్, నార్నెపాటి కోటేష్ పనిమీద బైక్‌పై మార్కాపురం వైపు వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన సుండిపెంటకు చెందిన అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం అనంతరం అంబులెన్స్‌ను అక్కడే వదిలి డ్రైవర్ పరారైనట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇద్దరి మృతితో సోమేపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    35 min ago
  • చిన్నారి తలపై నుంచి వెళ్లిన స్కూల్ బస్సు. . .. ముప్పాళ్ళ మండలం లంకలకూరపాడులో మంగళవారం విషాద ఘటనచోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి రెండున్నరేళ్ల కోడవాటి నితిన్ చనిపోయాడు. వివరాలు ఇలా.. పెద్ద కొడుకు సిద్ధార్థను స్కూల్ బస్సు ఎక్కించేందుకు నితిన్ను కూడా తీసుకుని తల్లి రాజకుమారి వచ్చింది. ఈ క్రమంలో నితిన్ బస్సు ముందుకు వెళ్లగా డ్రైవర్ గమనించకుండా పోనివ్వడంతో నితిన్ టైర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
    1
    చిన్నారి తలపై నుంచి వెళ్లిన స్కూల్ బస్సు.               .
..
ముప్పాళ్ళ మండలం లంకలకూరపాడులో మంగళవారం విషాద ఘటనచోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి రెండున్నరేళ్ల కోడవాటి నితిన్ చనిపోయాడు. వివరాలు ఇలా.. పెద్ద కొడుకు సిద్ధార్థను స్కూల్ బస్సు ఎక్కించేందుకు నితిన్ను కూడా తీసుకుని తల్లి రాజకుమారి వచ్చింది. ఈ క్రమంలో నితిన్ బస్సు ముందుకు వెళ్లగా డ్రైవర్ గమనించకుండా పోనివ్వడంతో నితిన్ టైర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
    user_Raju Paragati
    Raju Paragati
    పెదకూరపాడు, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.