Shuru
Apke Nagar Ki App…
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో నేషనల్ అవార్డు అందుకున్న నిహారిక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు అద్భుత ప్రతిభ కనబరిచాయి. ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును సుకుమార్ ‘పుష్ప 2’ కోసం, ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’ (నిర్మాత: నిహారిక కొణిదెల) నిలిచాయి. ‘పుష్ప 2’ చిత్రానికి దీపాళి నూర్, శీతల్ శర్మ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్‌కు, ‘కల్కి 2898 AD’ చిత్రానికి నితిన్ జిహానీ చౌదరి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్‌కు, వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి ఉత్తమ సంభాషణలకు అవార్డులు అందుకున్నారు. తెలుగు చిత్రసీమ జాతీయ స్థాయిలో సాధించిన ఈ ఘనతపై సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు.
దాసరి నటరాజు
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో నేషనల్ అవార్డు అందుకున్న నిహారిక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు అద్భుత ప్రతిభ కనబరిచాయి. ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును సుకుమార్ ‘పుష్ప 2’ కోసం, ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’ (నిర్మాత: నిహారిక కొణిదెల) నిలిచాయి. ‘పుష్ప 2’ చిత్రానికి దీపాళి నూర్, శీతల్ శర్మ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్‌కు, ‘కల్కి 2898 AD’ చిత్రానికి నితిన్ జిహానీ చౌదరి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్‌కు, వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి ఉత్తమ సంభాషణలకు అవార్డులు అందుకున్నారు. తెలుగు చిత్రసీమ జాతీయ స్థాయిలో సాధించిన ఈ ఘనతపై సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పార్టీ కోసం ప్రాణం ఇచ్చిన మన పరిటాల రవి బిడ్డ పరిటాల శ్రీరామ్ అన్న అలానే మన పార్టీ భవిషత్తు లోకేష్ అన్న..👏👏👏 కార్యకర్తలకి పండగే పండగ🙏🙏🙏@IParitalaSriram1
- రేపల్లె పట్టణంలో 30 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి సత్య ప్రసాద్ శంకుస్థాపన. ఏపీలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేపల్లెలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పథకం ద్వారా రూ.30 కోట్లతో అభివృద్ధి పనులకు బృహత్తర అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని విమర్శించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పట్టణాల స్వరూపాన్ని మార్చి, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. నాణ్యతతో కూడిన రహదారులు, తాగునీరు, పారిశుధ్యం తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.2
- చింతలపూడి నగర పంచాయతీ నాలుగవ సచివాలయ పరిధిలో వృధా అవుతున్న త్రాగునీరు. చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో త్రాగునీరు వృధా అవుతుంది. ఐదవ సచివాలయం పరిధిలోని బోయగూడెం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వెనుక త్రాగునీరు వృధా అవుతుందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు.1
- తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముందడుగు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. పట్టణంలో మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను మరింత విస్తరించే దిశగా రూ.33 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో విలువైన సిసి రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మ్యూచువల్ గా 33 కోట్ల నిధులను మంజూరు చేయడం హర్షణనియమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో, దేశ అభివృద్ధి ప్రదాత ప్రధాని నరేంద్ర మోడీ ,కి ప్రజా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్... అంటే హెచ్‌ఏఎం విధానం ద్వారా ఈ అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పట్టణంలో మౌలిక వసతులను ఆధునీకరించడం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం ఈ పనుల ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు. రూ.33 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులు పూర్తయితే తాడేపల్లిగూడెం పట్టణంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. పట్టణ అభివృద్ధిలో భాగంగా అవసరమైన వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రజలకు మెరుగైన జీవన సౌకర్యాలు అందించేందుకు ఈ ప్రాజెక్టులు దోహదపడనున్నాయి. హెచ్‌ఏఎం విధానం ద్వారా చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులు పట్టణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా తాడేపల్లిగూడెం పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా రూ.33 కోట్ల విలువైన పనులకు ఆమోదం లభించడం పట్టణ అభివృద్ధిలో మరో కీలక అడుగుగా నిలుస్తోంది. మొత్తంగా చూస్తే... తాడేపల్లిగూడెం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.33 కోట్లతో చేపట్టనున్న ఈ పనులు పూర్తయితే ప్రజలకు మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పట్టణ అభివృద్ధికి మరింత ఊతమిస్తూ... భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తాడేపల్లిగూడెం అభివృద్ధి పథంలో ముందుకు సాగనుంది.4
- సత్తుపల్లిలో ఘనంగా గణేష్ నవరాత్రి పూజలు – మండపాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ వివిధ గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తల్లాడ, కల్లూరు ఖాన్‌ఖాన్‌పేట, పెనుబల్లి మండపాలతో పాటు సత్తుపల్లి పట్టణంలోని పలు వినాయక మండపాల్లో పూజలు చేసి, భక్తులతో కలిసి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- రోడ్డు గుంతలుగా మారడంతో పాఠశాలలకు వెళ్లలేకపోతున్నామని విద్యార్థుల నిరసన రోడ్డు గుంతలుగా మారడంతో పాఠశాలలకు వెళ్లలేకపోతున్నామని విద్యార్థులు నిరసనకి దిగారు.కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం లోడ్‌పల్లి వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగిన విద్యార్థులు. వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన విద్యార్థులు.1
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా.. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకి గాను నేషనల్ అవార్డు అందుకున్న నిర్మాత నిహారిక కొణిదెల..1
- మిట్ట గణపయ్య...వెళ్లి రావయ్యా. . పెదకూరపాడు మిట్ట సెంటర్లో ఏర్పాటు చేసిన గణనాథుడి ఊరేగింపు మహోత్సవం మంగళవారం రాత్రి కన్నుల పండుగగా సాగింది.. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడిని వివిధ రకాల పుష్ప జాతులతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చాడు. తీన్మార్ డబ్బులు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మేళతాళాలు మంగళ వాయిద్యాలు, బాణాసంచా కాల్పుల నడుమ గణనాథుడు గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా తరలారు. శోభయాత్రను గ్రామ పెద్దలు అర్థిమళ్ళ రమేష్, ఏటుకూరి బ్రహ్మయ్య, ఏటుకూరి రత్నకుమార్, గళ్ళ బాబు, భాష్యం ఆంజనేయులు, అండ్ర ప్రసాద్ గుడిపూడి చిన్నరాజు, మక్కెన సాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు.. ఈ సందర్బంగా ప్రదర్శించిన నృత్య ప్రదర్శన తిలకించేందుకు పెద్ద ఎత్తున యువత, పెద్దలు తరలివచ్చి సందడి చేశారు3
- పెదకూరపాడు లో తాపీ మేస్త్రి పై వెల్డింగ్ షాప్ ఎక్కి పరికరాలతో దాడి. పెదకూరపాడు-తాపీ మేస్త్రి పై వెల్డింగ్ షాప్ వ్యక్తి కత్తితోదాడి. పెదకూరపాడు. బస్టాండ్ సమీపంలో నివాసముంటున్న షేక్ నాగుల తన స్నేహితుడితో కలిసి వెల్డింగ్ షాపు వద్దకు వెళ్లి ఫ్రెండ్ వాహనానికి వెల్డింగ్ చేయించాడు. అక్కడ ఇరువురి మధ్య గొడవ జరగడంతో తాపీ మేస్త్రి నాగులపై షబ్బీర్ అనే వెల్డింగు షాప్ వ్యక్తి పరికరాలతో దాడి చేయడంతో పొట్టపై ఇరువైపులా మెడపై గాయాలయ్యాయి.2