logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అందరూ బాగుండాలి,అందులో మనం ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్-మంత్రి శ్రీధర్ బాబు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని రావుల చెరువు కట్ట హనుమాన్ టెంపుల్‌లో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడికి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడికి పూజలు చేసి హోమ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... అనంతరం మంథనిలోని మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు... మంథని నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో ప్రజలు సంకల్పించిన పనులన్నీ దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేలా ఆశీస్సులు ఇవ్వాలని విఘ్నేశ్వరుడిని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలందరూ బాగుండాలి... అందులో మనం ఉండాలి అనే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీకి ఉందని శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సింగరేణి ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న కార్మికుల ఇళ్లను రెగ్యులరైజ్ చేశారని గుర్తు చేశారు. అదే విధంగా ప్రస్తుతం సింగరేణి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న కార్మికులందరికీ రెగ్యులరైజేషన్ చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తూ... అవి పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులతో మంథని నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి శ్రీధర్ బాబు... సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు కొనసాగిస్తోందని తెలిపారు.

18 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
18 hrs ago

అందరూ బాగుండాలి,అందులో మనం ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్-మంత్రి శ్రీధర్ బాబు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని రావుల చెరువు కట్ట హనుమాన్ టెంపుల్‌లో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడికి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడికి పూజలు చేసి హోమ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... అనంతరం మంథనిలోని మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు... మంథని నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో ప్రజలు సంకల్పించిన పనులన్నీ దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేలా ఆశీస్సులు ఇవ్వాలని విఘ్నేశ్వరుడిని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలందరూ బాగుండాలి... అందులో మనం ఉండాలి అనే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీకి ఉందని

శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సింగరేణి ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న కార్మికుల ఇళ్లను రెగ్యులరైజ్ చేశారని గుర్తు చేశారు. అదే విధంగా ప్రస్తుతం సింగరేణి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న కార్మికులందరికీ రెగ్యులరైజేషన్ చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తూ... అవి పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులతో మంథని నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి శ్రీధర్ బాబు... సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు కొనసాగిస్తోందని తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్ లో గణేష్ నిమజ్జనానికి నీటి కోసం బిజెపి ఆందోళన ఉద్రిక్తం... పోలీసుల లాఠీ చార్జ్...పలువురు అరెస్టు కరీంనగర్ లో బిజెపి కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. గణేష్ నిమజ్జనోత్సవానికి కాకతీయ కెనాల్ ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో చింతకుంట కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. నీటిని విడుదల చేసే వరకు కదలమని బీస్మించడంతో బీజేపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. బిజేపి ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ పోలీస్ వాహనంపైకి ఎక్కి నిరసన తెలపడంతో పోలీసులు లాఠీ చార్జి చేసి చితకొట్టారు. పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయకుల నిమజ్జనానికి నీళ్లు అడుగుతే పోలీసులతో కొట్టిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై మండిపడ్డారు.‌ బిజెపి కార్యకర్తల నిరసన, పోలీసుల అరెస్టు తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. అటు ప్రభుత్వం ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం వరకు చింతకుంట కు నీళ్ళు చేరుకోనున్నాయి.
    4
    కరీంనగర్ లో గణేష్ నిమజ్జనానికి నీటి కోసం బిజెపి ఆందోళన ఉద్రిక్తం... పోలీసుల లాఠీ చార్జ్...పలువురు అరెస్టు
కరీంనగర్ లో బిజెపి కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. గణేష్ నిమజ్జనోత్సవానికి కాకతీయ కెనాల్ ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో చింతకుంట కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. నీటిని విడుదల చేసే వరకు కదలమని బీస్మించడంతో బీజేపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. బిజేపి ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ పోలీస్ వాహనంపైకి ఎక్కి నిరసన తెలపడంతో పోలీసులు లాఠీ చార్జి చేసి చితకొట్టారు. పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయకుల నిమజ్జనానికి నీళ్లు అడుగుతే పోలీసులతో కొట్టిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై మండిపడ్డారు.‌ బిజెపి కార్యకర్తల నిరసన, పోలీసుల అరెస్టు తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. అటు ప్రభుత్వం ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం వరకు చింతకుంట కు నీళ్ళు చేరుకోనున్నాయి.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • హుస్నాబాద్‌లో స్వచ్ఛత కార్యక్రమం..ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమం... హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛత హి సేవా 2026లో భాగంగా 16వ వార్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ రోడ్డులో CTU ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, అధికారులు, శానిటేషన్ సిబ్బంది కలిసి డ్రైనేజీ ఇరువైపులా గడ్డి, చెత్తను తొలగించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చైర్‌పర్సన్ కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    హుస్నాబాద్‌లో స్వచ్ఛత కార్యక్రమం..ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమం...
హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛత హి సేవా 2026లో భాగంగా 16వ వార్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ రోడ్డులో CTU ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, అధికారులు, శానిటేషన్ సిబ్బంది కలిసి డ్రైనేజీ ఇరువైపులా గడ్డి, చెత్తను తొలగించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చైర్‌పర్సన్ కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    Farmer హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసన్న కార్యక్రమం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. వారు గణపతికి భక్తిశ్రద్ధలతో పూలు పండ్లు కొబ్బరికాయలతో నైవేద్యం సమర్పించారు. అనంతరం అన్న ప్రసన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈకార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    2
    మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసన్న కార్యక్రమం 
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో   అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. వారు గణపతికి భక్తిశ్రద్ధలతో పూలు పండ్లు కొబ్బరికాయలతో నైవేద్యం సమర్పించారు. అనంతరం అన్న ప్రసన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈకార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Parsha chandu
    Parsha chandu
    వి. సైదాపూర్, కరీంనగర్, తెలంగాణ•
    17 hrs ago
  • గణేశ్ నిమజ్జనానికి వెంటనే నీటిని విడుదల చేయాలి ‘ఛలో చింతకుంట’లో ధ్వజమెత్తిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గణేశ్ నిమజ్జన ఉత్సవాలను పురస్కరించుకుని ఎస్సారెస్పీ/ఎల్ఎండీ కాలువలకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ సమీపంలోని చింతకుంట కెనాల్ వద్ద బిజెపి జిల్లా శాఖ సాయిని మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘ఛలో చింతకుంట’’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మనం ఏ పని చేపట్టినా విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని మొట్టమొదట వేడుకునేది విఘ్నేశ్వరుడినే. ఇయాళ ఆ విఘ్నేశ్వరుడి నిమజ్జనానికే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు స్రుష్టించడం బాధాకరం. మనందరికీ తెలుసు ....తెలంగాణలో గణేశ్ నిమజ్జనం అంటే కేవలం ఒక పండుగ కాదు... ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన భక్తి, మన సామూహిక ఆధ్యాత్మిక ఉత్సవం. హిందువులంతా ఐకమత్యంగా జరుపుకునే గొప్ప పండుగ. ఊరూవాడా గల్లీగల్లీలో ప్రతి ఒక్క హిందువు గణేశ్ ను ప్రతిష్టించుకుని నిర్వహించుకునే ఈ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇయ్యలేదు. ఇతర మతాల పండుగల నిర్వహణకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నరు. అయినా భరించాం. కానీ ఇయాళ గణపతిని నిమజ్జనం చేయడానికి నీళ్లు విడుదల చేయాలని 10 రోజుల నుండి అడుగుతున్నం. ఇరిగేషన్ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్, రాష్ట్ర మంత్రికి విజ్ఝప్త చేసినం. కానీ ఇప్పటి వరకు చుక్క నీరు కూడా విడుదల చేయలేదు. నేనడుగుతున్నా.... కాలువల్లో నీళ్లు లేవు. ఎండిపోయినయ్. “నిమజ్జనం ఎక్కడ చేయాలి?”. ఇప్పుడు నీళ్లు వదిలితే తాగడానికి నీళ్లుండవని రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్పడం ఎంత వరకు సమంజసం? ఎస్సారెస్పీ లో 47 టీఎంసీలకు పైగా నీళ్లున్నయ్. నీళ్లు వదలడానికి ఇబ్బంది ఏంది? గణేశ్ నిమజ్జనానికి అర టీఎంసీ నీళ్లు వదిలితే చాలు. గతంలో ఎస్సారెస్పీలో 17 టీఎంసీలు మాత్రమే నీళ్లు నిల్వ ఉన్నప్పుడు కూడా నీళ్లు వదిలారు కదా? మరి ఇప్పుడెందుకు వదలడం లేదు? గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా భక్తులను ఎందుకు ఆందోళనకు గురి చేస్తున్నరు? ‘‘కేబినెట్ లో సీఎంకు, కొందరు మంత్రులకు పడటం లేదు. ఎవరికి వాళ్లే సీఎం కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తానే సీఎం అని భావిస్తున్నారు. కాలువలకు నీళ్లు వదలకపోతే సీఎంకు చెడ్డ పేరొస్తది, హైకమాండ్ రేవంత్ రెడ్డి దించేస్తే తానే సీఎం సీట్లో కూర్చోవాలని అనుకుంటున్నారేమో... మీ కొట్లాటలు మాకు అనవసరం. మాకు నీళ్లివ్వండి. గణేష్ నిమజ్జనాన్ని భక్తియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నా...’’అని చెప్పండి. ఇదిగో....కరీంనగర్‌లో చింతకుంట కాలువ. చుక్క నీరు లేదు. ఇక్కడికి వందలాది గణేశ్ విగ్రహాలు నిమజ్జనం కోసం వస్తాయి. నీళ్లు లేకుండా ఆ గణపతులను ఏం చేయాలి? ఇక్కడే రోడ్లపై వదిలి వెళ్లాలా? ఒక్క చింతకుంటే కాదు, ఎస్సారెస్పీ పరిధిలోని దాదాపు అన్ని కాలువల్లోనూ ఇదే పరిస్థితి. ఏటా ఆయా కాలువల్లో నిమజ్జనం చేసే వాళ్ల పరిస్థితి ఏంది? కావాల్సినన్ని నీళ్లున్నా పంటలకు నీళ్లు వదలడం లేదు. పంటలు ఎండిపోయి రైతులు ఆగమవుతున్నా పట్టించుకోరు. చివరకు భక్తుల మనోభావాలను కూడా పట్టించుకోరు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? గణేశ్ నిమజ్జనం తేదీలు ముందే తెలియవా? ఎక్కడెక్కడ నిమజ్జనాలు జరుగుతాయో అధికారులకు ముందే తెలియదా? ఆ ప్రాంతాల్లో నీటి లభ్యతను ముందుగానే ఎందుకు అంచనా వేయలేదు? అవసరమైన చోట్ల రిజర్వాయర్లు, కాలువలు, చెరువులకు నీటిని ఎందుకు మళ్లించలేదు? రైతుల పంటలను కాపాడటానికి సమగ్ర నీటి విడుదల ప్రణాళిక ఎందుకు లేదు? భక్తులకు చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చెబుతున్నారు? “తెలంగాణలో గణపతిని నిమజ్జనం చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావాలా?”. తెలంగాణ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి హిందువులే కదా? గణేశ్ నిమజ్జన ప్రాముఖ్యత, హిందువుల మనోభావాలు వాళ్లకు తెలియవా? ఇదేం పద్దతి. ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన హామీలను గాలికొదిలేశారు. ఇప్పుడు నిమజ్జనానికి కూడా నీళ్లవ్వకుండా వేధిస్తున్నరు. హిందువులంటే కాంగ్రెస్ కు అంత చులకన ఎందుకు? హిందువులు ఓటర్లు కాదా? వాళ్ల ఓట్లు అవసరం లేదా? గణేశ్ నిమజ్జనానికి కూడా నీళ్లు వదలండి మహాప్రభో వేడుకోవాల్సిన దుస్థితి కలిగిస్తారా? బీజేపీ పక్షాన, హిందువుల పక్షాన మేం కోరేదొక్కటే. తక్షణమే గణేశ్ నిమజ్జనానికి సరిపడ నీళ్లను విడుదల చేయాలి. నిమజ్జనానికి ఏ అటంకం లేకుండా భక్తిపారవశ్యంతో గణేష్ నిమజ్జనమయ్యేలా చూడాలి. అట్లాగే ప్రభుత్వం వెంటనే SRSP, కాకతీయ కాలువలు, స్థానిక చెరువులు, నిమజ్జన ప్రాంతాలకు అవసరమైన నీటి విడుదలపై అత్యవసర ప్రణాళిక ప్రకటించాలి. ఏ ప్రాంతంలో ఎంత నీరు అవసరం? ఎక్కడి నుంచి ఎంత నీరు విడుదల చేస్తారు? ఎప్పుడు చేరుతుంది? నిమజ్జనానికి సురక్షితమైన ప్రాంతాలు ఏవి? .....అనే అంశాలపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. చివరగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. సాయంత్రంలోపు నిమజ్జనానికి నీళ్లు విడుదల చేయకపోతే....కాంగ్రెస్ ను రాజకీయ నిమజ్జనం చేస్తాం. హిందువుల దమ్మేందో చూపిస్తాం. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్ రావు, బండారి వేణు, గాజ శివరాం, ఎన్నం ప్రకాష్, ఏపీపీ చంద్ర (టీంకు), చొప్పరి జయశ్రీ, బండ రమణ రెడ్డి, సౌగాని కొమురయ్య, సోమిడి వేణు,బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
    3
    గణేశ్ నిమజ్జనానికి వెంటనే నీటిని విడుదల చేయాలి ‘ఛలో చింతకుంట’లో ధ్వజమెత్తిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు
గణేశ్ నిమజ్జన ఉత్సవాలను పురస్కరించుకుని ఎస్సారెస్పీ/ఎల్ఎండీ కాలువలకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ సమీపంలోని చింతకుంట కెనాల్ వద్ద బిజెపి జిల్లా శాఖ సాయిని మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘ఛలో చింతకుంట’’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మనం ఏ పని చేపట్టినా విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని మొట్టమొదట వేడుకునేది విఘ్నేశ్వరుడినే. ఇయాళ ఆ విఘ్నేశ్వరుడి నిమజ్జనానికే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు స్రుష్టించడం బాధాకరం. మనందరికీ తెలుసు ....తెలంగాణలో గణేశ్ నిమజ్జనం అంటే కేవలం ఒక పండుగ కాదు... ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన భక్తి, మన సామూహిక ఆధ్యాత్మిక ఉత్సవం. హిందువులంతా ఐకమత్యంగా జరుపుకునే గొప్ప పండుగ.
ఊరూవాడా గల్లీగల్లీలో ప్రతి ఒక్క హిందువు గణేశ్ ను ప్రతిష్టించుకుని నిర్వహించుకునే ఈ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇయ్యలేదు. ఇతర మతాల పండుగల నిర్వహణకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నరు. అయినా భరించాం. కానీ ఇయాళ గణపతిని నిమజ్జనం చేయడానికి నీళ్లు విడుదల చేయాలని 10 రోజుల నుండి అడుగుతున్నం. ఇరిగేషన్ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్, రాష్ట్ర మంత్రికి విజ్ఝప్త చేసినం. కానీ ఇప్పటి వరకు చుక్క నీరు కూడా విడుదల చేయలేదు.
నేనడుగుతున్నా.... కాలువల్లో నీళ్లు లేవు. ఎండిపోయినయ్. “నిమజ్జనం ఎక్కడ చేయాలి?”.
ఇప్పుడు నీళ్లు వదిలితే తాగడానికి నీళ్లుండవని రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్పడం ఎంత వరకు సమంజసం? ఎస్సారెస్పీ లో 47 టీఎంసీలకు పైగా నీళ్లున్నయ్. నీళ్లు వదలడానికి ఇబ్బంది ఏంది? గణేశ్ నిమజ్జనానికి అర టీఎంసీ నీళ్లు వదిలితే చాలు. గతంలో ఎస్సారెస్పీలో 17 టీఎంసీలు మాత్రమే నీళ్లు నిల్వ ఉన్నప్పుడు కూడా నీళ్లు వదిలారు కదా? మరి ఇప్పుడెందుకు వదలడం లేదు? గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా భక్తులను ఎందుకు ఆందోళనకు గురి చేస్తున్నరు?
‘‘కేబినెట్ లో సీఎంకు, కొందరు మంత్రులకు పడటం లేదు. ఎవరికి వాళ్లే సీఎం కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తానే సీఎం అని భావిస్తున్నారు. కాలువలకు నీళ్లు వదలకపోతే సీఎంకు చెడ్డ పేరొస్తది, హైకమాండ్ రేవంత్ రెడ్డి దించేస్తే తానే సీఎం సీట్లో కూర్చోవాలని అనుకుంటున్నారేమో... మీ కొట్లాటలు మాకు అనవసరం. మాకు నీళ్లివ్వండి. గణేష్ నిమజ్జనాన్ని భక్తియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నా...’’అని చెప్పండి.
ఇదిగో....కరీంనగర్‌లో చింతకుంట కాలువ. చుక్క నీరు లేదు. ఇక్కడికి వందలాది గణేశ్ విగ్రహాలు నిమజ్జనం కోసం వస్తాయి. నీళ్లు లేకుండా ఆ గణపతులను ఏం చేయాలి? ఇక్కడే రోడ్లపై వదిలి వెళ్లాలా? ఒక్క చింతకుంటే కాదు, ఎస్సారెస్పీ పరిధిలోని దాదాపు అన్ని కాలువల్లోనూ ఇదే పరిస్థితి. ఏటా ఆయా కాలువల్లో నిమజ్జనం చేసే వాళ్ల పరిస్థితి ఏంది?
కావాల్సినన్ని నీళ్లున్నా పంటలకు నీళ్లు వదలడం లేదు. పంటలు ఎండిపోయి రైతులు ఆగమవుతున్నా పట్టించుకోరు. చివరకు భక్తుల మనోభావాలను కూడా పట్టించుకోరు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?
గణేశ్ నిమజ్జనం తేదీలు ముందే తెలియవా? ఎక్కడెక్కడ నిమజ్జనాలు జరుగుతాయో అధికారులకు ముందే తెలియదా? ఆ ప్రాంతాల్లో నీటి లభ్యతను ముందుగానే ఎందుకు అంచనా వేయలేదు? అవసరమైన చోట్ల రిజర్వాయర్లు, కాలువలు, చెరువులకు నీటిని ఎందుకు మళ్లించలేదు? రైతుల పంటలను కాపాడటానికి సమగ్ర నీటి విడుదల ప్రణాళిక ఎందుకు లేదు? భక్తులకు చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చెబుతున్నారు?
“తెలంగాణలో గణపతిని నిమజ్జనం చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావాలా?”. తెలంగాణ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి హిందువులే కదా? గణేశ్ నిమజ్జన ప్రాముఖ్యత, హిందువుల మనోభావాలు వాళ్లకు తెలియవా? ఇదేం పద్దతి.
ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన హామీలను గాలికొదిలేశారు. ఇప్పుడు నిమజ్జనానికి కూడా నీళ్లవ్వకుండా వేధిస్తున్నరు. హిందువులంటే కాంగ్రెస్ కు అంత చులకన ఎందుకు? హిందువులు ఓటర్లు కాదా? వాళ్ల ఓట్లు అవసరం లేదా? గణేశ్ నిమజ్జనానికి కూడా నీళ్లు వదలండి మహాప్రభో వేడుకోవాల్సిన దుస్థితి కలిగిస్తారా?
బీజేపీ పక్షాన, హిందువుల పక్షాన మేం కోరేదొక్కటే. తక్షణమే గణేశ్ నిమజ్జనానికి సరిపడ నీళ్లను విడుదల చేయాలి. నిమజ్జనానికి ఏ అటంకం లేకుండా భక్తిపారవశ్యంతో గణేష్ నిమజ్జనమయ్యేలా చూడాలి.
అట్లాగే ప్రభుత్వం వెంటనే SRSP, కాకతీయ కాలువలు, స్థానిక చెరువులు, నిమజ్జన ప్రాంతాలకు అవసరమైన నీటి విడుదలపై అత్యవసర ప్రణాళిక ప్రకటించాలి. ఏ ప్రాంతంలో ఎంత నీరు అవసరం? ఎక్కడి నుంచి ఎంత నీరు విడుదల చేస్తారు? ఎప్పుడు చేరుతుంది? నిమజ్జనానికి సురక్షితమైన ప్రాంతాలు ఏవి? .....అనే అంశాలపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలి.
చివరగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. సాయంత్రంలోపు నిమజ్జనానికి నీళ్లు విడుదల చేయకపోతే....కాంగ్రెస్ ను రాజకీయ నిమజ్జనం చేస్తాం. హిందువుల దమ్మేందో చూపిస్తాం.
ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్ రావు, బండారి వేణు, గాజ శివరాం, ఎన్నం ప్రకాష్, ఏపీపీ చంద్ర (టీంకు), చొప్పరి జయశ్రీ, బండ రమణ రెడ్డి, సౌగాని కొమురయ్య, సోమిడి వేణు,బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    43 min ago
  • కరీంనగర్ మున్సిపల్ సిబ్బందికి ట్రై సైకిల్స్, ఫాగ్ మిషన్స్ అందజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి నూతనంగా కొనుగోలు చేసిన ట్రైసైకిల్స్, ఫాగ్ మిషన్స్ ను అందజేశారు. అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ లో చెత్త సేకరణ కోసం ప్రతి డివిజన్ కు ఒక ట్రై సైకిల్ ను మున్సిపల్ సిబ్బందికి అందజేస్తున్నాం. కొత్తగా కొనుగోలు చేసిన ఫాగ్ మిషన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అదనంగా ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నాం. కరీంనగర్ లో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించబోతున్నాం.
    1
    కరీంనగర్ మున్సిపల్ సిబ్బందికి ట్రై సైకిల్స్, ఫాగ్ మిషన్స్ అందజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్
 
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి నూతనంగా కొనుగోలు చేసిన ట్రైసైకిల్స్, ఫాగ్ మిషన్స్ ను అందజేశారు. అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడారు.
కరీంనగర్ లో చెత్త సేకరణ కోసం ప్రతి డివిజన్ కు ఒక ట్రై సైకిల్ ను మున్సిపల్ సిబ్బందికి అందజేస్తున్నాం. కొత్తగా కొనుగోలు చేసిన ఫాగ్ మిషన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అదనంగా ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నాం. కరీంనగర్ లో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించబోతున్నాం.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    18 hrs ago
  • విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతికోద్యమ ప్రస్థానంపై 50 గంటల ప్రజా కళాజాతర హైదరాబాద్‌లో అరుణోదయ విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతికోద్యమ ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో 50 గంటల నిర్విరామ ప్రజా కళాజాతర నిర్వహించనున్నట్లు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పోతుల తెలిపారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగే కార్యక్రమాల వివరాలను వెల్లడించేందుకు సెప్టెంబర్ 19న సాయంత్రం 5 గంటలకు నాగోల్ మెయిన్ రోడ్‌లోని సుప్రజ హాస్పిటల్ 5వ అంతస్తులో జర్నలిస్టులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కళాకారులు, కవులు, రచయితలు, ప్రజా సాంస్కృతిక కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
    1
    విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతికోద్యమ ప్రస్థానంపై 50 గంటల ప్రజా కళాజాతర
హైదరాబాద్‌లో అరుణోదయ విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతికోద్యమ ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో 50 గంటల నిర్విరామ ప్రజా కళాజాతర నిర్వహించనున్నట్లు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పోతుల తెలిపారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగే కార్యక్రమాల వివరాలను వెల్లడించేందుకు సెప్టెంబర్ 19న సాయంత్రం 5 గంటలకు నాగోల్ మెయిన్ రోడ్‌లోని సుప్రజ హాస్పిటల్ 5వ అంతస్తులో జర్నలిస్టులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కళాకారులు, కవులు, రచయితలు, ప్రజా సాంస్కృతిక కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
    user_Megana valgot
    Megana valgot
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 min ago
  • ఎల్లారెడ్డిపేట లో దంచి కొట్టిన వాన జలకలను సంతరించుకున్న చెరువులు కుంటలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పాటు ఆయా గ్రామాలలో భారీ వర్షం కురిసింది దేనితో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఏకధాటివిగా కురిసిన వర్షాలకు స్థానిక చెరువులు జలకలను సంతరించుకున్నాయి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
    1
    ఎల్లారెడ్డిపేట లో దంచి కొట్టిన వాన జలకలను సంతరించుకున్న చెరువులు కుంటలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పాటు ఆయా గ్రామాలలో భారీ వర్షం కురిసింది దేనితో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఏకధాటివిగా కురిసిన వర్షాలకు స్థానిక చెరువులు జలకలను సంతరించుకున్నాయి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
    user_Prime 9
    Prime 9
    Dairy farm ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • అందరూ బాగుండాలి,అందులో మనం ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్-మంత్రి శ్రీధర్ బాబు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని రావుల చెరువు కట్ట హనుమాన్ టెంపుల్‌లో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడికి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడికి పూజలు చేసి హోమ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... అనంతరం మంథనిలోని మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు... మంథని నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో ప్రజలు సంకల్పించిన పనులన్నీ దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేలా ఆశీస్సులు ఇవ్వాలని విఘ్నేశ్వరుడిని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలందరూ బాగుండాలి... అందులో మనం ఉండాలి అనే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీకి ఉందని శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సింగరేణి ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న కార్మికుల ఇళ్లను రెగ్యులరైజ్ చేశారని గుర్తు చేశారు. అదే విధంగా ప్రస్తుతం సింగరేణి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న కార్మికులందరికీ రెగ్యులరైజేషన్ చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తూ... అవి పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులతో మంథని నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి శ్రీధర్ బాబు... సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు కొనసాగిస్తోందని తెలిపారు.
    2
    అందరూ బాగుండాలి,అందులో మనం ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్-మంత్రి శ్రీధర్ బాబు
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని రావుల చెరువు కట్ట హనుమాన్ టెంపుల్‌లో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడికి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విఘ్నేశ్వరుడికి పూజలు చేసి హోమ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... అనంతరం మంథనిలోని మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు...
మంథని నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
ప్రతి ఇంట్లో ప్రజలు సంకల్పించిన పనులన్నీ దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేలా ఆశీస్సులు ఇవ్వాలని విఘ్నేశ్వరుడిని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలందరూ బాగుండాలి... అందులో మనం ఉండాలి అనే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీకి ఉందని శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సింగరేణి ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న కార్మికుల ఇళ్లను రెగ్యులరైజ్ చేశారని గుర్తు చేశారు. అదే విధంగా ప్రస్తుతం సింగరేణి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న కార్మికులందరికీ రెగ్యులరైజేషన్ చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తూ... అవి పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులతో మంథని నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి శ్రీధర్ బాబు... సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు కొనసాగిస్తోందని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.