logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హుస్నాబాద్‌లో స్వచ్ఛత కార్యక్రమం..ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమం... హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛత హి సేవా 2026లో భాగంగా 16వ వార్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ రోడ్డులో CTU ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, అధికారులు, శానిటేషన్ సిబ్బంది కలిసి డ్రైనేజీ ఇరువైపులా గడ్డి, చెత్తను తొలగించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చైర్‌పర్సన్ కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

1 hr ago
user_వేణు విలేకరి
వేణు విలేకరి
Farmer హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
1 hr ago

హుస్నాబాద్‌లో స్వచ్ఛత కార్యక్రమం..ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమం... హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛత హి సేవా 2026లో భాగంగా 16వ వార్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ రోడ్డులో CTU ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, అధికారులు, శానిటేషన్ సిబ్బంది కలిసి డ్రైనేజీ ఇరువైపులా గడ్డి, చెత్తను తొలగించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చైర్‌పర్సన్ కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • హుస్నాబాద్‌లో స్వచ్ఛత కార్యక్రమం..ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమం... హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛత హి సేవా 2026లో భాగంగా 16వ వార్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ రోడ్డులో CTU ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, అధికారులు, శానిటేషన్ సిబ్బంది కలిసి డ్రైనేజీ ఇరువైపులా గడ్డి, చెత్తను తొలగించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చైర్‌పర్సన్ కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    హుస్నాబాద్‌లో స్వచ్ఛత కార్యక్రమం..ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమం...
హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛత హి సేవా 2026లో భాగంగా 16వ వార్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ రోడ్డులో CTU ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, అధికారులు, శానిటేషన్ సిబ్బంది కలిసి డ్రైనేజీ ఇరువైపులా గడ్డి, చెత్తను తొలగించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చైర్‌పర్సన్ కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    Farmer హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్ లో గణేష్ నిమజ్జనానికి నీటి కోసం బిజెపి ఆందోళన ఉద్రిక్తం... పోలీసుల లాఠీ చార్జ్...పలువురు అరెస్టు కరీంనగర్ లో బిజెపి కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. గణేష్ నిమజ్జనోత్సవానికి కాకతీయ కెనాల్ ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో చింతకుంట కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. నీటిని విడుదల చేసే వరకు కదలమని బీస్మించడంతో బీజేపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. బిజేపి ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ పోలీస్ వాహనంపైకి ఎక్కి నిరసన తెలపడంతో పోలీసులు లాఠీ చార్జి చేసి చితకొట్టారు. పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయకుల నిమజ్జనానికి నీళ్లు అడుగుతే పోలీసులతో కొట్టిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై మండిపడ్డారు.‌ బిజెపి కార్యకర్తల నిరసన, పోలీసుల అరెస్టు తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. అటు ప్రభుత్వం ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం వరకు చింతకుంట కు నీళ్ళు చేరుకోనున్నాయి.
    4
    కరీంనగర్ లో గణేష్ నిమజ్జనానికి నీటి కోసం బిజెపి ఆందోళన ఉద్రిక్తం... పోలీసుల లాఠీ చార్జ్...పలువురు అరెస్టు
కరీంనగర్ లో బిజెపి కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. గణేష్ నిమజ్జనోత్సవానికి కాకతీయ కెనాల్ ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో చింతకుంట కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. నీటిని విడుదల చేసే వరకు కదలమని బీస్మించడంతో బీజేపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. బిజేపి ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ పోలీస్ వాహనంపైకి ఎక్కి నిరసన తెలపడంతో పోలీసులు లాఠీ చార్జి చేసి చితకొట్టారు. పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయకుల నిమజ్జనానికి నీళ్లు అడుగుతే పోలీసులతో కొట్టిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై మండిపడ్డారు.‌ బిజెపి కార్యకర్తల నిరసన, పోలీసుల అరెస్టు తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. అటు ప్రభుత్వం ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం వరకు చింతకుంట కు నీళ్ళు చేరుకోనున్నాయి.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    42 min ago
  • మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసన్న కార్యక్రమం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. వారు గణపతికి భక్తిశ్రద్ధలతో పూలు పండ్లు కొబ్బరికాయలతో నైవేద్యం సమర్పించారు. అనంతరం అన్న ప్రసన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈకార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    2
    మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసన్న కార్యక్రమం 
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో   అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. వారు గణపతికి భక్తిశ్రద్ధలతో పూలు పండ్లు కొబ్బరికాయలతో నైవేద్యం సమర్పించారు. అనంతరం అన్న ప్రసన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈకార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Parsha chandu
    Parsha chandu
    వి. సైదాపూర్, కరీంనగర్, తెలంగాణ•
    16 hrs ago
  • BJP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్ చింతకుంట కెనాల్ వద్ద ఉద్రిక్తత ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తల ఆగ్రహం ఏసీపీ విజయ్ కుమార్, కొత్తపల్లి సీఐ కోటేశ్ తీరుపై మండిపడుతున్న కార్యకర్తలు కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు లను అరెస్ట్ చేసి బలవంతంగా స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు నీళ్లను వదిలేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం... నిమజ్జనానికి నీళ్లివ్వాలని అడిగితే లాఠీలతో కొట్టిస్తారా? పోలీసుల లాఠీఛార్జ్ హేయనీయం
    3
    BJP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్
చింతకుంట కెనాల్ వద్ద ఉద్రిక్తత
ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తల ఆగ్రహం ఏసీపీ విజయ్ కుమార్, కొత్తపల్లి సీఐ కోటేశ్ తీరుపై మండిపడుతున్న కార్యకర్తలు
కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు లను  అరెస్ట్ చేసి బలవంతంగా స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు
నీళ్లను వదిలేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం... నిమజ్జనానికి నీళ్లివ్వాలని అడిగితే లాఠీలతో కొట్టిస్తారా?
పోలీసుల లాఠీఛార్జ్ హేయనీయం
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    43 min ago
  • కరీంనగర్ మున్సిపల్ సిబ్బందికి ట్రై సైకిల్స్, ఫాగ్ మిషన్స్ అందజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి నూతనంగా కొనుగోలు చేసిన ట్రైసైకిల్స్, ఫాగ్ మిషన్స్ ను అందజేశారు. అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ లో చెత్త సేకరణ కోసం ప్రతి డివిజన్ కు ఒక ట్రై సైకిల్ ను మున్సిపల్ సిబ్బందికి అందజేస్తున్నాం. కొత్తగా కొనుగోలు చేసిన ఫాగ్ మిషన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అదనంగా ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నాం. కరీంనగర్ లో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించబోతున్నాం.
    1
    కరీంనగర్ మున్సిపల్ సిబ్బందికి ట్రై సైకిల్స్, ఫాగ్ మిషన్స్ అందజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్
 
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి నూతనంగా కొనుగోలు చేసిన ట్రైసైకిల్స్, ఫాగ్ మిషన్స్ ను అందజేశారు. అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడారు.
కరీంనగర్ లో చెత్త సేకరణ కోసం ప్రతి డివిజన్ కు ఒక ట్రై సైకిల్ ను మున్సిపల్ సిబ్బందికి అందజేస్తున్నాం. కొత్తగా కొనుగోలు చేసిన ఫాగ్ మిషన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అదనంగా ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నాం. కరీంనగర్ లో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించబోతున్నాం.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    17 hrs ago
  • విలేకరుల సమావేశంలో. రాజయ్య వ్యాఖ్యలను ఖండించిన కనకం రమేష్ స్టేషన్ ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనగామ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కనకం రమేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కనకం రమేష్ మాట్లాడుతూ.. “మా నాయకుడు కడియం శ్రీహరి గురించి ఫస్ట్ వికెట్, సెకండ్ వికెట్ అంటూ మాట్లాడటం సరికాదు. ఇది క్రికెట్ ఆట కాదు. ప్రజా సేవలో ఉన్న నాయకుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి” అని అన్నారు. కడియం శ్రీహరి ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడని, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. దళితుల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తమ నాయకుడు చేసిన కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాజయ్య తన హయాంలో చేపట్టినట్లు చెబుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ప్రస్తుతం నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న లేదా పూర్తయిన పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంటి అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ప్రజలకు వివరించాలని కనకం రమేష్ కోరారు. వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై రాజకీయ నాయకులు చర్చించాలని ఆయన సూచించారు.
    1
    విలేకరుల సమావేశంలో. రాజయ్య వ్యాఖ్యలను ఖండించిన కనకం రమేష్ 
స్టేషన్ ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనగామ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కనకం రమేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
కనకం రమేష్ మాట్లాడుతూ.. “మా నాయకుడు కడియం శ్రీహరి గురించి ఫస్ట్ వికెట్, సెకండ్ వికెట్ అంటూ మాట్లాడటం సరికాదు. ఇది క్రికెట్ ఆట కాదు. ప్రజా సేవలో ఉన్న నాయకుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి” అని అన్నారు.
కడియం శ్రీహరి ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడని, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. దళితుల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తమ నాయకుడు చేసిన కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
రాజయ్య తన హయాంలో చేపట్టినట్లు చెబుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ప్రస్తుతం నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న లేదా పూర్తయిన పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంటి అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ప్రజలకు వివరించాలని కనకం రమేష్ కోరారు.
వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై రాజకీయ నాయకులు చర్చించాలని ఆయన సూచించారు.
    user_Ramanakar
    Ramanakar
    Local News Reporter ఘన్‌పూర్ (స్టేషన్), జనగాం, తెలంగాణ•
    19 hrs ago
  • గణేశుడి చెంతకు మూషికం.. వైరల్‌గా మారిన వీడియో........... హుస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపంలోకి ఓ మూషికం వచ్చి గణేశుడి విగ్రహం వద్ద సంచరించింది. గణేశుడి ముందు మూషికం తిరుగుతున్న దృశ్యాలు అక్కడున్న భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ ఆసక్తికర దృశ్యాలను స్థానిక యువత తమ సెల్‌ఫోన్లలో వీడియోగా చిత్రీకరించారు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. గణేశుడి వాహనమైన మూషికం స్వామివారి చెంతకు రావడాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు
    1
    గణేశుడి చెంతకు మూషికం.. వైరల్‌గా మారిన వీడియో...........
హుస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపంలోకి ఓ మూషికం వచ్చి గణేశుడి విగ్రహం వద్ద సంచరించింది. గణేశుడి ముందు మూషికం తిరుగుతున్న దృశ్యాలు అక్కడున్న భక్తులను ఆకట్టుకున్నాయి.
ఈ ఆసక్తికర దృశ్యాలను స్థానిక యువత తమ సెల్‌ఫోన్లలో వీడియోగా చిత్రీకరించారు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. గణేశుడి వాహనమైన మూషికం స్వామివారి చెంతకు రావడాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    Farmer హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • మానవత దృక్పథాన్ని చాటుకున్న ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జోగుల రవి గారు.. మానవత దృక్పథాన్ని చాటుకున్న ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జోగుల రవి గారు.. *_NH-44పై రోడ్డు ప్రమాదం.. మాజీ ఇరిగేషన్ అధికారి బీసన్నకు తీవ్ర గాయాలు..!_* *_ప్రమాద స్థలంలో 108 అందుబాటులో లేకపోవడంతో సొంత వాహనంలో ఆసుపత్రికి తరలింపు..!_* *_బీసన్నకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన జోగుల రవి_* _పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామ పరిధిలోని NH-44 జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు బైక్‌ను ఢీకొనడంతో ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన మాజీ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారి బీసన్న తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం అయినట్లు సమాచారం._ _ప్రమాదం జరిగిన సమయంలో సంఘటనా స్థలంలో 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో, అదే మార్గంలో వెళ్తున్న ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్, అలంపూర్ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు జోగుల రవి స్పందించారు. వెంటనే తన సొంత వాహనంలో గాయపడిన బీసన్నను తీసుకుని పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు._ _అనంతరం ఆసుపత్రి వైద్యులను కలిసి బీసన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జోగుల రవి, బీసన్నకు అవసరమైన వైద్యం తక్షణమే అందించి, మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రానికి తరలించాలని వైద్యులను కోరారు._ *_ప్రమాద సమయంలో స్పందించి గాయపడిన వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తరలించిన జోగుల రవి మానవతా దృక్పథాన్ని పలువురు అభినందించారు._*
    1
    మానవత దృక్పథాన్ని చాటుకున్న ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జోగుల రవి గారు..
మానవత దృక్పథాన్ని చాటుకున్న ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జోగుల రవి గారు..
*_NH-44పై రోడ్డు ప్రమాదం.. మాజీ ఇరిగేషన్ అధికారి బీసన్నకు తీవ్ర గాయాలు..!_*
*_ప్రమాద స్థలంలో 108 అందుబాటులో లేకపోవడంతో సొంత వాహనంలో ఆసుపత్రికి తరలింపు..!_*
*_బీసన్నకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన జోగుల రవి_*
_పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామ పరిధిలోని NH-44 జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు బైక్‌ను ఢీకొనడంతో ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన మాజీ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారి బీసన్న తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం అయినట్లు సమాచారం._
_ప్రమాదం జరిగిన సమయంలో సంఘటనా స్థలంలో 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో, అదే మార్గంలో వెళ్తున్న ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్, అలంపూర్ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు జోగుల రవి స్పందించారు. వెంటనే తన సొంత వాహనంలో గాయపడిన బీసన్నను తీసుకుని పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు._
_అనంతరం ఆసుపత్రి వైద్యులను కలిసి బీసన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జోగుల రవి, బీసన్నకు అవసరమైన వైద్యం తక్షణమే అందించి, మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రానికి తరలించాలని వైద్యులను కోరారు._
*_ప్రమాద సమయంలో స్పందించి గాయపడిన వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తరలించిన జోగుల రవి మానవతా దృక్పథాన్ని పలువురు అభినందించారు._*
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.