విలేకరుల సమావేశంలో. రాజయ్య వ్యాఖ్యలను ఖండించిన కనకం రమేష్ స్టేషన్ ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనగామ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కనకం రమేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కనకం రమేష్ మాట్లాడుతూ.. “మా నాయకుడు కడియం శ్రీహరి గురించి ఫస్ట్ వికెట్, సెకండ్ వికెట్ అంటూ మాట్లాడటం సరికాదు. ఇది క్రికెట్ ఆట కాదు. ప్రజా సేవలో ఉన్న నాయకుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి” అని అన్నారు. కడియం శ్రీహరి ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడని, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. దళితుల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తమ నాయకుడు చేసిన కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాజయ్య తన హయాంలో చేపట్టినట్లు చెబుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ప్రస్తుతం నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న లేదా పూర్తయిన పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంటి అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ప్రజలకు వివరించాలని కనకం రమేష్ కోరారు. వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై రాజకీయ నాయకులు చర్చించాలని ఆయన సూచించారు.
విలేకరుల సమావేశంలో. రాజయ్య వ్యాఖ్యలను ఖండించిన కనకం రమేష్ స్టేషన్ ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనగామ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కనకం రమేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కనకం రమేష్ మాట్లాడుతూ.. “మా నాయకుడు కడియం శ్రీహరి గురించి ఫస్ట్ వికెట్, సెకండ్ వికెట్ అంటూ మాట్లాడటం సరికాదు. ఇది క్రికెట్ ఆట కాదు. ప్రజా సేవలో ఉన్న నాయకుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి” అని అన్నారు. కడియం శ్రీహరి ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడని, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. దళితుల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తమ నాయకుడు చేసిన కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాజయ్య తన హయాంలో చేపట్టినట్లు చెబుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ప్రస్తుతం నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న లేదా పూర్తయిన పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంటి అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ప్రజలకు వివరించాలని కనకం రమేష్ కోరారు. వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై రాజకీయ నాయకులు చర్చించాలని ఆయన సూచించారు.
- గణేశుడి చెంతకు మూషికం.. వైరల్‌గా మారిన వీడియో........... హుస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపంలోకి ఓ మూషికం వచ్చి గణేశుడి విగ్రహం వద్ద సంచరించింది. గణేశుడి ముందు మూషికం తిరుగుతున్న దృశ్యాలు అక్కడున్న భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ ఆసక్తికర దృశ్యాలను స్థానిక యువత తమ సెల్‌ఫోన్లలో వీడియోగా చిత్రీకరించారు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. గణేశుడి వాహనమైన మూషికం స్వామివారి చెంతకు రావడాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు1
- యాల యాలాలో మనసుల ప్రాణం ముఖ్యమును రో చట్టాన్ని ఇరకటం పెట్టకురా కన్నతల్లుల బాధ పెట్టకురా యాల యాలాలో మనసుల ప్రాణం ముఖ్యమును రో చట్టాన్ని ఇరకటం పెట్టకురా కన్నతల్లుల బాధ పెట్టకురా1
- అందరూ బాగుండాలి,అందులో మనం ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్-మంత్రి శ్రీధర్ బాబు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని రావుల చెరువు కట్ట హనుమాన్ టెంపుల్‌లో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడికి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడికి పూజలు చేసి హోమ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... అనంతరం మంథనిలోని మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు... మంథని నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో ప్రజలు సంకల్పించిన పనులన్నీ దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేలా ఆశీస్సులు ఇవ్వాలని విఘ్నేశ్వరుడిని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలందరూ బాగుండాలి... అందులో మనం ఉండాలి అనే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీకి ఉందని శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సింగరేణి ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న కార్మికుల ఇళ్లను రెగ్యులరైజ్ చేశారని గుర్తు చేశారు. అదే విధంగా ప్రస్తుతం సింగరేణి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న కార్మికులందరికీ రెగ్యులరైజేషన్ చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తూ... అవి పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులతో మంథని నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి శ్రీధర్ బాబు... సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు కొనసాగిస్తోందని తెలిపారు.2
- డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి.... డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి తాడేపల్లిగూడెం వినాయక నిమజ్జనంలో విషాదం.. నిమజ్జన వేడుకల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి తాడేపల్లిగూడెం: వినాయక నిమజ్జన వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజే పాటలకు డాన్స్ చేస్తూ కాకర్లమూడి ఏసు (48) అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి పాటకు ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తాజా వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. ఏసు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడున్న వారు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆదివారం ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు ఆదివారం రూ.30,06,857 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్ రూ.1,53,200, బ్రేక్ దర్శనం రూ.2,07,600, VIP దర్శనం రూ.3,37,350, కార్ పార్కింగ్ రూ.5 లక్షలు, ప్రసాదాలు రూ.11,00,150, వ్రతాలు రూ.1 లక్ష, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.1
- “హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్ ఎక్కిన వినాయకుడు... శ్రీశైలానికి భక్త బృందం ప్రయాణం!” * హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ ఎక్కిన వినాయకుడు.. హైదరాబాద్ ; మహానగరంలో రామంతాపూర్ కు చెందిన భక్త బృందం గణపతి విగ్రహంతో నిమజ్జనం కొరకు ఆర్టీసీ బస్ లో శ్రీశైలం కు బయలుదేరి వెళ్లి అక్కడ గణనాధుని మనసారా స్మరించుకొని నిమజ్జనం చేయనున్నారు....1
- హుస్నాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తి అదుపులోకి.......... హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు స్మశానవాటిక పరిసర ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉంటున్నాడు. అతడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి హిందీలో మాట్లాడుతున్నట్లు, తన వివరాలను స్పష్టంగా చెప్పలేకపోతున్నట్లు సమాచారం. అతడి ప్రవర్తనను బట్టి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు వ్యక్తి వివరాలు, స్వస్థలం తదితర సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.1
- పూసుకున్న మీ డూప్లికేట్ గాంధీల పేరు పెట్టుకొనేరు సార్ పెట్టుకుంటే మాత్రం తిరుగపడడమే.* _బండి సంజయ్ *పూసుకున్న మీ డూప్లికేట్ గాంధీల పేరు పెట్టుకొనేరు సార్ పెట్టుకుంటే మాత్రం తిరుగపడడమే.* _బండి సంజయ్1
- కరీంనగర్ లో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం...సెలయేరులై పారిన దారులు...ఇక్కట్ల పాలైన నగర ప్రజలు భారీ వర్షం కరీంనగర్ ను ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. కరీంనగర్ లో గంటపాటు వాన దంచికొట్టింది. నగరంలో పలు కాలనీలోని ఇళ్ళలోకి నీళ్లు చేరాయి. కలెక్టరేట్ రోడ్, మంకమ్మ తోట, ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద రోడ్లు చెరువులను తలపించాయి. ఆ రూట్లలో వాహనాలను పోలీసులు దారి మళ్ళించారు. ముకరంపుర సాయికృష్ణ థియేటర్ సమీపంలో డ్రైనేజీ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రహదారిపై భారీగా నీరు చేరింది. భారీ వర్షానికి వరదలతో నగర ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. జనజీవనం అస్తవ్యస్తమైంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీప ప్రాంతం పూర్తిగా జలమయమైంది. కరీంనగర్-వేములవాడ ప్రధాన రహదారిపై వర్షపు నీరు భారీగా నిలిచింది. రోడ్డుపై వరద ప్రవహించడంతో పోలీసులు అప్రమత్తమై ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. సిరిసిల్ల వైపు వెళ్లే బస్సులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నడిపిస్తున్నారు. జగిత్యాల రూట్ లో ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద అదే పరిస్థితి ఏర్పడింది. వర్షం తగ్గాక వరద నీరు బయటకు పోయేలా అధికారులు, మున్సిపల్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ప్రతిసారి భారీ వర్షం పడ్డప్పుడు ఇదే పరిస్థితి వస్తుందని శాశ్వత పరిష్కారం మార్గం చూపాలని లోతట్టు ప్రాంత ప్రజలు కోరారు.4