Shuru
Apke Nagar Ki App…
గణేశుడి చెంతకు మూషికం.. వైరల్‌గా మారిన వీడియో........... హుస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపంలోకి ఓ మూషికం వచ్చి గణేశుడి విగ్రహం వద్ద సంచరించింది. గణేశుడి ముందు మూషికం తిరుగుతున్న దృశ్యాలు అక్కడున్న భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ ఆసక్తికర దృశ్యాలను స్థానిక యువత తమ సెల్‌ఫోన్లలో వీడియోగా చిత్రీకరించారు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. గణేశుడి వాహనమైన మూషికం స్వామివారి చెంతకు రావడాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు
వేణు విలేకరి
గణేశుడి చెంతకు మూషికం.. వైరల్‌గా మారిన వీడియో........... హుస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపంలోకి ఓ మూషికం వచ్చి గణేశుడి విగ్రహం వద్ద సంచరించింది. గణేశుడి ముందు మూషికం తిరుగుతున్న దృశ్యాలు అక్కడున్న భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ ఆసక్తికర దృశ్యాలను స్థానిక యువత తమ సెల్‌ఫోన్లలో వీడియోగా చిత్రీకరించారు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. గణేశుడి వాహనమైన మూషికం స్వామివారి చెంతకు రావడాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు
More news from తెలంగాణ and nearby areas
- అందరూ బాగుండాలి,అందులో మనం ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్-మంత్రి శ్రీధర్ బాబు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని రావుల చెరువు కట్ట హనుమాన్ టెంపుల్‌లో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడికి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడికి పూజలు చేసి హోమ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... అనంతరం మంథనిలోని మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు... మంథని నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో ప్రజలు సంకల్పించిన పనులన్నీ దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేలా ఆశీస్సులు ఇవ్వాలని విఘ్నేశ్వరుడిని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలందరూ బాగుండాలి... అందులో మనం ఉండాలి అనే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీకి ఉందని శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సింగరేణి ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న కార్మికుల ఇళ్లను రెగ్యులరైజ్ చేశారని గుర్తు చేశారు. అదే విధంగా ప్రస్తుతం సింగరేణి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న కార్మికులందరికీ రెగ్యులరైజేషన్ చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తూ... అవి పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులతో మంథని నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి శ్రీధర్ బాబు... సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు కొనసాగిస్తోందని తెలిపారు.2
- కేసీఆర్ ఫాంహౌజ్‌పై కాంగ్రెస్ నేతల పర్యటన... రాజకీయ దుమారం! “ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా?” అంటూ కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్! ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం మీకెక్కడిది? ప్రభుత్వ భూములుంటే... స్వాధీనం చేసుకోండి! భూదోపిడీ జరిగిందంటే... ఆధారాలతో సహా బయటపెట్టండి! క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్! అంతేకాదు... 22ఏ భూముల సమస్యపై కీలక వ్యాఖ్యలు... అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని బండి సంజయ్ హెచ్చరిక! ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నికపై కూడా సంచలన వ్యాఖ్యలు... కాంగ్రెస్ ఉప ఎన్నికలకు భయపడుతోందని బండి సంజయ్ ఆరోపణ! ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం తప్పదంటూ తీవ్ర వ్యాఖ్యలు! మరోవైపు... కరీంనగర్ గణేశ్ నిమజ్జన ఉత్సవాలపై ప్రజలకు కీలక పిలుపు... “ప్రశాంతతకు మారుపేరు కరీంనగర్ అని నిరూపిద్దాం” అంటూ బండి సంజయ్ విజ్ఞప్తి!1
- యాల యాలాలో మనసుల ప్రాణం ముఖ్యమును రో చట్టాన్ని ఇరకటం పెట్టకురా కన్నతల్లుల బాధ పెట్టకురా యాల యాలాలో మనసుల ప్రాణం ముఖ్యమును రో చట్టాన్ని ఇరకటం పెట్టకురా కన్నతల్లుల బాధ పెట్టకురా1
- ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్జీల స్వీకరణ జనగాం కలెక్టరేట్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా వివిధ సమస్యలతో విచ్చేసిన ప్రజల వద్ద నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్జీలను స్వీకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.1
- భక్తిశ్రద్ధలతో శ్రీ అల్లూరి సీతారామరాజు వినాయక మండలిలో కుంకుమ పూజ రుద్రంగి మండలం మానాల గ్రామంలో శ్రీ అల్లూరి సీతారామరాజు వినాయక మండలి ఆధ్వర్యంలో కుంకుమ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళహారతులతో మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు గణపతి నామస్మరణతో ఉత్సాహంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.1
- ఎల్లారెడ్డిపేట లో దంచి కొట్టిన వాన జలకలను సంతరించుకున్న చెరువులు కుంటలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పాటు ఆయా గ్రామాలలో భారీ వర్షం కురిసింది దేనితో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఏకధాటివిగా కురిసిన వర్షాలకు స్థానిక చెరువులు జలకలను సంతరించుకున్నాయి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.1
- హుస్నాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తి అదుపులోకి.......... హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు స్మశానవాటిక పరిసర ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉంటున్నాడు. అతడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి హిందీలో మాట్లాడుతున్నట్లు, తన వివరాలను స్పష్టంగా చెప్పలేకపోతున్నట్లు సమాచారం. అతడి ప్రవర్తనను బట్టి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు వ్యక్తి వివరాలు, స్వస్థలం తదితర సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.1
- కరీంనగర్ లో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం...సెలయేరులై పారిన దారులు...ఇక్కట్ల పాలైన నగర ప్రజలు భారీ వర్షం కరీంనగర్ ను ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. కరీంనగర్ లో గంటపాటు వాన దంచికొట్టింది. నగరంలో పలు కాలనీలోని ఇళ్ళలోకి నీళ్లు చేరాయి. కలెక్టరేట్ రోడ్, మంకమ్మ తోట, ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద రోడ్లు చెరువులను తలపించాయి. ఆ రూట్లలో వాహనాలను పోలీసులు దారి మళ్ళించారు. ముకరంపుర సాయికృష్ణ థియేటర్ సమీపంలో డ్రైనేజీ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రహదారిపై భారీగా నీరు చేరింది. భారీ వర్షానికి వరదలతో నగర ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. జనజీవనం అస్తవ్యస్తమైంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీప ప్రాంతం పూర్తిగా జలమయమైంది. కరీంనగర్-వేములవాడ ప్రధాన రహదారిపై వర్షపు నీరు భారీగా నిలిచింది. రోడ్డుపై వరద ప్రవహించడంతో పోలీసులు అప్రమత్తమై ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. సిరిసిల్ల వైపు వెళ్లే బస్సులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నడిపిస్తున్నారు. జగిత్యాల రూట్ లో ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద అదే పరిస్థితి ఏర్పడింది. వర్షం తగ్గాక వరద నీరు బయటకు పోయేలా అధికారులు, మున్సిపల్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ప్రతిసారి భారీ వర్షం పడ్డప్పుడు ఇదే పరిస్థితి వస్తుందని శాశ్వత పరిష్కారం మార్గం చూపాలని లోతట్టు ప్రాంత ప్రజలు కోరారు.4
- పూసుకున్న మీ డూప్లికేట్ గాంధీల పేరు పెట్టుకొనేరు సార్ పెట్టుకుంటే మాత్రం తిరుగపడడమే.* _బండి సంజయ్ *పూసుకున్న మీ డూప్లికేట్ గాంధీల పేరు పెట్టుకొనేరు సార్ పెట్టుకుంటే మాత్రం తిరుగపడడమే.* _బండి సంజయ్1