Shuru
Apke Nagar Ki App…
ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్జీల స్వీకరణ జనగాం కలెక్టరేట్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా వివిధ సమస్యలతో విచ్చేసిన ప్రజల వద్ద నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్జీలను స్వీకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.
Shareef pasha
ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్జీల స్వీకరణ జనగాం కలెక్టరేట్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా వివిధ సమస్యలతో విచ్చేసిన ప్రజల వద్ద నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్జీలను స్వీకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- యాల యాలాలో మనసుల ప్రాణం ముఖ్యమును రో చట్టాన్ని ఇరకటం పెట్టకురా కన్నతల్లుల బాధ పెట్టకురా యాల యాలాలో మనసుల ప్రాణం ముఖ్యమును రో చట్టాన్ని ఇరకటం పెట్టకురా కన్నతల్లుల బాధ పెట్టకురా1
- గణేశుడి చెంతకు మూషికం.. వైరల్‌గా మారిన వీడియో........... హుస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపంలోకి ఓ మూషికం వచ్చి గణేశుడి విగ్రహం వద్ద సంచరించింది. గణేశుడి ముందు మూషికం తిరుగుతున్న దృశ్యాలు అక్కడున్న భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ ఆసక్తికర దృశ్యాలను స్థానిక యువత తమ సెల్‌ఫోన్లలో వీడియోగా చిత్రీకరించారు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. గణేశుడి వాహనమైన మూషికం స్వామివారి చెంతకు రావడాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు1
- వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా ఊడిపడిన స్లాబ్ పెచ్చులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా ఊడిపడిన స్లాబ్ పెచ్చులు ఈ ఘటనలో మస్తాన్(55), అటెండర్లు ఎల్లమ్మ(50), ఓంకార్(33)కు గాయాలు గాయపడిన వారిని మరో వార్డుకు తరలించి చికిత్స ప్రమాదంతో వార్డులోని రోగులు, అటెండర్లలో భయాందోళన ప్రమాదం జరిగిన వార్డును తాత్కాలికంగా మూసివేసిన సిబ్బంది పాత భవనం కావడంతో పైకప్పు లీకేజీలే కారణమై ఉండొచ్చని అధికారుల అంచనా ఉత్తర తెలంగాణకు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న ఎంజీఎంలో మౌలిక వసతులపై మరోసారి ప్రశ్నలు పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఎంజీఎం పరిస్థితి ఉందంటూ విమర్శలు1
- రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు విద్యుత్, సాగునీరు సక్రమంగా అందించాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గo:- నార్కెట్‌పల్లి మండలం కొండపానగూడెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రైతులను కలిసి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాలు పెరిగాయని విమర్శించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సక్రమంగా అందకపోవడం, సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నార్కెట్‌పల్లి మండల పరిధిలోని భ్రమణవెల్లెం గ్రామాల వద్ద ఉన్న ఉదయ సముద్రం ప్రాజెక్టుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించామని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన పనులకు కొత్తగా ప్రారంభోత్సవాలు, రిబ్బన్ కటింగ్‌లు చేయడం తప్ప రైతులకు సాగునీరు అందించడంపై తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు రోజుకు 12 గంటల విద్యుత్ అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, కనీసం 5 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ అందించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రాజకీయ దాడులు, విమర్శల కంటే రైతులకు నిరంతరాయంగా విద్యుత్, సాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా ఉండాలని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, సాగునీరు మరియు విద్యుత్‌ను సక్రమంగా అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆదివారం ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు ఆదివారం రూ.30,06,857 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్ రూ.1,53,200, బ్రేక్ దర్శనం రూ.2,07,600, VIP దర్శనం రూ.3,37,350, కార్ పార్కింగ్ రూ.5 లక్షలు, ప్రసాదాలు రూ.11,00,150, వ్రతాలు రూ.1 లక్ష, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.1
- కరీంనగర్ లో గణేష్ నిమజ్జనానికి నీటి కోసం బిజెపి ఆందోళన ఉద్రిక్తం... పోలీసుల లాఠీ చార్జ్...పలువురు అరెస్టు కరీంనగర్ లో బిజెపి కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. గణేష్ నిమజ్జనోత్సవానికి కాకతీయ కెనాల్ ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో చింతకుంట కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. నీటిని విడుదల చేసే వరకు కదలమని బీస్మించడంతో బీజేపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. బిజేపి ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ పోలీస్ వాహనంపైకి ఎక్కి నిరసన తెలపడంతో పోలీసులు లాఠీ చార్జి చేసి చితకొట్టారు. పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయకుల నిమజ్జనానికి నీళ్లు అడుగుతే పోలీసులతో కొట్టిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. బిజెపి కార్యకర్తల నిరసన, పోలీసుల అరెస్టు తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. అటు ప్రభుత్వం ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం వరకు చింతకుంట కు నీళ్ళు చేరుకోనున్నాయి.4
- పూసుకున్న మీ డూప్లికేట్ గాంధీల పేరు పెట్టుకొనేరు సార్ పెట్టుకుంటే మాత్రం తిరుగపడడమే.* _బండి సంజయ్ *పూసుకున్న మీ డూప్లికేట్ గాంధీల పేరు పెట్టుకొనేరు సార్ పెట్టుకుంటే మాత్రం తిరుగపడడమే.* _బండి సంజయ్1
- హుస్నాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తి అదుపులోకి.......... హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు స్మశానవాటిక పరిసర ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉంటున్నాడు. అతడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి హిందీలో మాట్లాడుతున్నట్లు, తన వివరాలను స్పష్టంగా చెప్పలేకపోతున్నట్లు సమాచారం. అతడి ప్రవర్తనను బట్టి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు వ్యక్తి వివరాలు, స్వస్థలం తదితర సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.1
- వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్వయంగా ప్రాజెక్టు నుండి నీళ్లు వదులుకున్న రైతులు జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత రెగ్యులేటర్ పైకి ఎక్కి సాగునీరు వదులుకున్న రైతులు వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ధర్నా చేసినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహించి జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ రెగ్యులేటర్‌పైకి ఎక్కి స్వయంగా నీటిని విడుదల చేసుకున్న రైతులు1