logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కేసీఆర్ ఫాంహౌజ్‌పై కాంగ్రెస్ నేతల పర్యటన... రాజకీయ దుమారం! “ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా?” అంటూ కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్! ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం మీకెక్కడిది? ప్రభుత్వ భూములుంటే... స్వాధీనం చేసుకోండి! భూదోపిడీ జరిగిందంటే... ఆధారాలతో సహా బయటపెట్టండి! క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్! అంతేకాదు... 22ఏ భూముల సమస్యపై కీలక వ్యాఖ్యలు... అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని బండి సంజయ్ హెచ్చరిక! ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నికపై కూడా సంచలన వ్యాఖ్యలు... కాంగ్రెస్ ఉప ఎన్నికలకు భయపడుతోందని బండి సంజయ్ ఆరోపణ! ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం తప్పదంటూ తీవ్ర వ్యాఖ్యలు! మరోవైపు... కరీంనగర్ గణేశ్ నిమజ్జన ఉత్సవాలపై ప్రజలకు కీలక పిలుపు... “ప్రశాంతతకు మారుపేరు కరీంనగర్ అని నిరూపిద్దాం” అంటూ బండి సంజయ్ విజ్ఞప్తి!

20 hrs ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
20 hrs ago

కేసీఆర్ ఫాంహౌజ్‌పై కాంగ్రెస్ నేతల పర్యటన... రాజకీయ దుమారం! “ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా?” అంటూ కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్! ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం మీకెక్కడిది? ప్రభుత్వ భూములుంటే... స్వాధీనం చేసుకోండి! భూదోపిడీ జరిగిందంటే... ఆధారాలతో సహా బయటపెట్టండి! క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్! అంతేకాదు... 22ఏ భూముల సమస్యపై కీలక వ్యాఖ్యలు... అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని బండి సంజయ్ హెచ్చరిక! ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నికపై కూడా సంచలన వ్యాఖ్యలు... కాంగ్రెస్ ఉప ఎన్నికలకు భయపడుతోందని బండి సంజయ్ ఆరోపణ! ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం తప్పదంటూ తీవ్ర వ్యాఖ్యలు! మరోవైపు... కరీంనగర్ గణేశ్ నిమజ్జన ఉత్సవాలపై ప్రజలకు కీలక పిలుపు... “ప్రశాంతతకు మారుపేరు కరీంనగర్ అని నిరూపిద్దాం” అంటూ బండి సంజయ్ విజ్ఞప్తి!

More news from తెలంగాణ and nearby areas
  • కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలే స్ఫూర్తి.. తెలంగాణకు ఆయన సేవలు చిరస్మరణీయం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ పాలకులకు, తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా సేవలందించిన సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి మంత్రిగా ఆయన చరిత్రలో నిలిచారని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి తనదైన మద్దతు అందిస్తూ, ఉద్యమ నాయకులకు సూచనలు, సలహాలు ఇచ్చి మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, పద్మశాలీల సమస్యల పరిష్కారం, ఐక్యత కోసం విశేష కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను నేటి తరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న జరగనున్న కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ప్రజలు, ముఖ్యంగా పద్మశాలి కులబాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, యువజన సంఘం అధ్యక్షుడు సబ్బని హరీష్, వివిధ సంఘాల ప్రతినిధులు, పద్మశాలి కులబాంధవులు, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
    1
    కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలే స్ఫూర్తి.. తెలంగాణకు ఆయన సేవలు చిరస్మరణీయం
ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ పాలకులకు, తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా సేవలందించిన సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి మంత్రిగా ఆయన చరిత్రలో నిలిచారని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి తనదైన మద్దతు అందిస్తూ, ఉద్యమ నాయకులకు సూచనలు, సలహాలు ఇచ్చి మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, పద్మశాలీల సమస్యల పరిష్కారం, ఐక్యత కోసం విశేష కృషి చేశారని గుర్తుచేశారు.
ఆయన ఆశయాలను నేటి తరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న జరగనున్న కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ప్రజలు, ముఖ్యంగా పద్మశాలి కులబాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, యువజన సంఘం అధ్యక్షుడు సబ్బని హరీష్, వివిధ సంఘాల ప్రతినిధులు, పద్మశాలి కులబాంధవులు, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
    user_Megana valgot
    Megana valgot
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    17 min ago
  • అందరూ బాగుండాలి,అందులో మనం ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్-మంత్రి శ్రీధర్ బాబు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని రావుల చెరువు కట్ట హనుమాన్ టెంపుల్‌లో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడికి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడికి పూజలు చేసి హోమ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... అనంతరం మంథనిలోని మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు... మంథని నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో ప్రజలు సంకల్పించిన పనులన్నీ దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేలా ఆశీస్సులు ఇవ్వాలని విఘ్నేశ్వరుడిని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలందరూ బాగుండాలి... అందులో మనం ఉండాలి అనే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీకి ఉందని శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సింగరేణి ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న కార్మికుల ఇళ్లను రెగ్యులరైజ్ చేశారని గుర్తు చేశారు. అదే విధంగా ప్రస్తుతం సింగరేణి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న కార్మికులందరికీ రెగ్యులరైజేషన్ చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తూ... అవి పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులతో మంథని నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి శ్రీధర్ బాబు... సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు కొనసాగిస్తోందని తెలిపారు.
    2
    అందరూ బాగుండాలి,అందులో మనం ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్-మంత్రి శ్రీధర్ బాబు
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని రావుల చెరువు కట్ట హనుమాన్ టెంపుల్‌లో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడికి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విఘ్నేశ్వరుడికి పూజలు చేసి హోమ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... అనంతరం మంథనిలోని మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు...
మంథని నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
ప్రతి ఇంట్లో ప్రజలు సంకల్పించిన పనులన్నీ దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేలా ఆశీస్సులు ఇవ్వాలని విఘ్నేశ్వరుడిని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలందరూ బాగుండాలి... అందులో మనం ఉండాలి అనే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీకి ఉందని శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సింగరేణి ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న కార్మికుల ఇళ్లను రెగ్యులరైజ్ చేశారని గుర్తు చేశారు. అదే విధంగా ప్రస్తుతం సింగరేణి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న కార్మికులందరికీ రెగ్యులరైజేషన్ చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తూ... అవి పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులతో మంథని నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి శ్రీధర్ బాబు... సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు కొనసాగిస్తోందని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    18 hrs ago
  • గణేశుడి చెంతకు మూషికం.. వైరల్‌గా మారిన వీడియో........... హుస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపంలోకి ఓ మూషికం వచ్చి గణేశుడి విగ్రహం వద్ద సంచరించింది. గణేశుడి ముందు మూషికం తిరుగుతున్న దృశ్యాలు అక్కడున్న భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ ఆసక్తికర దృశ్యాలను స్థానిక యువత తమ సెల్‌ఫోన్లలో వీడియోగా చిత్రీకరించారు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. గణేశుడి వాహనమైన మూషికం స్వామివారి చెంతకు రావడాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు
    1
    గణేశుడి చెంతకు మూషికం.. వైరల్‌గా మారిన వీడియో...........
హుస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపంలోకి ఓ మూషికం వచ్చి గణేశుడి విగ్రహం వద్ద సంచరించింది. గణేశుడి ముందు మూషికం తిరుగుతున్న దృశ్యాలు అక్కడున్న భక్తులను ఆకట్టుకున్నాయి.
ఈ ఆసక్తికర దృశ్యాలను స్థానిక యువత తమ సెల్‌ఫోన్లలో వీడియోగా చిత్రీకరించారు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. గణేశుడి వాహనమైన మూషికం స్వామివారి చెంతకు రావడాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    Farmer హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    2 hrs ago
  • వేములవాడ రాజన్న క్షేత్రంలో వైభవంగా 7వ రోజు గణపతి నవరాత్రులు ఏకాంతంగా మూలవిరాట్‌కు విశేష పూజలు.. భీమేశ్వర ఆలయంలో భక్తులకు సిద్ధిబుద్ధి వినాయకుడి దర్శనం ఘనంగా లక్ష్మీ గణపతికి ఉపనిషత్ పారాయణ అభిషేకాలు, అమ్మవారికి ఉపచార పూజలు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, అనుబంధ ఆలయాలలో గణేశ నవరాత్రి మహోత్సవాలు 7వ రోజు వైభవంగా కొనసాగాయి. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో మూలవిరాట్ ఆంతరంగిక ఆలయంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల దర్శనార్థం అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ మండపంలో మట్టితో రూపొందించిన సిద్ధిబుద్ధి సమేత వినాయకుడికి నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఉదయం ఆంతరంగిక ఆలయంలో మూలవిరాట్ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎనిమిది మంది బ్రాహ్మణుల చేత లక్ష్మీ గణపతికి గణేశ ఉపనిషత్ పారాయణంతో విశేష అభిషేకాలు, పార్వతీ రాజరాజేశ్వరి దేవికి ఉపచార పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. అలాగే భీమేశ్వర ఆలయంలో కొలువుదీరిన మట్టి గణపతికి ఉదయం ప్రాతఃకాల పూజలు, సాయంత్రం వేళల్లో షోడశోపచార పూజలు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారి అంతరాలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అమ్మవారికి ఉపచార పూజలు ఏకాంతంగా కొనసాగుతాయని తెలిపారు. భీమేశ్వర ఆలయంలోని మట్టి వినాయకుడికి రోజూ షోడశోపచార పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు మంత్ర అనుష్ఠానాలతో విశేష హోమం, ద్వాదశి నాడు పూర్ణాహుతి నిర్వహించి స్వామివారి నిమజ్జనం జరుపుతామని వెల్లడించారు. భక్తులు భీమేశ్వర ఆలయంలో కొలువుదీరిన సిద్ధిబుద్ధి సమేత వినాయకుడిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ వేడుకల్లో ఆలయ అధికారులు, అర్చక బృందం, వేద పండితులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.
    1
    వేములవాడ రాజన్న క్షేత్రంలో వైభవంగా 7వ రోజు గణపతి నవరాత్రులు 
ఏకాంతంగా మూలవిరాట్‌కు విశేష పూజలు.. భీమేశ్వర ఆలయంలో భక్తులకు సిద్ధిబుద్ధి వినాయకుడి దర్శనం
ఘనంగా లక్ష్మీ గణపతికి ఉపనిషత్ పారాయణ అభిషేకాలు, అమ్మవారికి ఉపచార పూజలు
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, అనుబంధ ఆలయాలలో గణేశ నవరాత్రి మహోత్సవాలు 7వ రోజు వైభవంగా కొనసాగాయి. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో మూలవిరాట్ ఆంతరంగిక ఆలయంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల దర్శనార్థం అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ మండపంలో మట్టితో రూపొందించిన సిద్ధిబుద్ధి సమేత వినాయకుడికి నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. 
ఉదయం ఆంతరంగిక ఆలయంలో మూలవిరాట్ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎనిమిది మంది బ్రాహ్మణుల చేత లక్ష్మీ గణపతికి గణేశ ఉపనిషత్ పారాయణంతో విశేష అభిషేకాలు, పార్వతీ రాజరాజేశ్వరి దేవికి ఉపచార పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. అలాగే భీమేశ్వర ఆలయంలో కొలువుదీరిన మట్టి గణపతికి ఉదయం ప్రాతఃకాల పూజలు, సాయంత్రం వేళల్లో షోడశోపచార పూజలు వైభవంగా నిర్వహించారు. 
స్వామివారికి నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారి అంతరాలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అమ్మవారికి ఉపచార పూజలు ఏకాంతంగా కొనసాగుతాయని తెలిపారు. భీమేశ్వర ఆలయంలోని మట్టి వినాయకుడికి రోజూ షోడశోపచార పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు మంత్ర అనుష్ఠానాలతో విశేష హోమం, ద్వాదశి నాడు పూర్ణాహుతి నిర్వహించి స్వామివారి నిమజ్జనం జరుపుతామని వెల్లడించారు. భక్తులు భీమేశ్వర ఆలయంలో కొలువుదీరిన సిద్ధిబుద్ధి సమేత వినాయకుడిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఈ వేడుకల్లో ఆలయ అధికారులు, అర్చక బృందం, వేద పండితులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    18 hrs ago
  • సిరిసిల్లలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. సిరిసిల్లలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగ అభివృద్ధికి సంఘం మరింత కృషి చేయాలని అన్నారు.
    1
    సిరిసిల్లలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం.
సిరిసిల్లలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగ అభివృద్ధికి సంఘం మరింత కృషి చేయాలని అన్నారు.
    user_Sircilla jilla updates
    Sircilla jilla updates
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    19 hrs ago
  • ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ భాద్రపద మాసం సోమవారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని, అనుబంధ ఆలయాల్లోని స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
    1
    ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
భాద్రపద మాసం సోమవారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని, అనుబంధ ఆలయాల్లోని స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • కేసీఆర్ ఫాంహౌజ్‌పై కాంగ్రెస్ నేతల పర్యటన... రాజకీయ దుమారం! “ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా?” అంటూ కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్! ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం మీకెక్కడిది? ప్రభుత్వ భూములుంటే... స్వాధీనం చేసుకోండి! భూదోపిడీ జరిగిందంటే... ఆధారాలతో సహా బయటపెట్టండి! క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్! అంతేకాదు... 22ఏ భూముల సమస్యపై కీలక వ్యాఖ్యలు... అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని బండి సంజయ్ హెచ్చరిక! ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నికపై కూడా సంచలన వ్యాఖ్యలు... కాంగ్రెస్ ఉప ఎన్నికలకు భయపడుతోందని బండి సంజయ్ ఆరోపణ! ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం తప్పదంటూ తీవ్ర వ్యాఖ్యలు! మరోవైపు... కరీంనగర్ గణేశ్ నిమజ్జన ఉత్సవాలపై ప్రజలకు కీలక పిలుపు... “ప్రశాంతతకు మారుపేరు కరీంనగర్ అని నిరూపిద్దాం” అంటూ బండి సంజయ్ విజ్ఞప్తి!
    1
    కేసీఆర్ ఫాంహౌజ్‌పై కాంగ్రెస్ నేతల పర్యటన... రాజకీయ దుమారం!
“ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా?” అంటూ కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్!
ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం మీకెక్కడిది?
ప్రభుత్వ భూములుంటే... స్వాధీనం చేసుకోండి!
భూదోపిడీ జరిగిందంటే... ఆధారాలతో సహా బయటపెట్టండి!
క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్!
అంతేకాదు...
22ఏ భూముల సమస్యపై కీలక వ్యాఖ్యలు... అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని బండి సంజయ్ హెచ్చరిక!
ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నికపై కూడా సంచలన వ్యాఖ్యలు...
కాంగ్రెస్ ఉప ఎన్నికలకు భయపడుతోందని బండి సంజయ్ ఆరోపణ!
ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం తప్పదంటూ తీవ్ర వ్యాఖ్యలు!
మరోవైపు... కరీంనగర్ గణేశ్ నిమజ్జన ఉత్సవాలపై ప్రజలకు కీలక పిలుపు...
“ప్రశాంతతకు మారుపేరు కరీంనగర్ అని నిరూపిద్దాం” అంటూ బండి సంజయ్ విజ్ఞప్తి!
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    20 hrs ago
  • భక్తిశ్రద్ధలతో శ్రీ అల్లూరి సీతారామరాజు వినాయక మండలిలో కుంకుమ పూజ రుద్రంగి మండలం మానాల గ్రామంలో శ్రీ అల్లూరి సీతారామరాజు వినాయక మండలి ఆధ్వర్యంలో కుంకుమ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళహారతులతో మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు గణపతి నామస్మరణతో ఉత్సాహంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
    1
    భక్తిశ్రద్ధలతో శ్రీ అల్లూరి సీతారామరాజు వినాయక మండలిలో కుంకుమ పూజ
రుద్రంగి మండలం మానాల గ్రామంలో శ్రీ అల్లూరి సీతారామరాజు వినాయక మండలి ఆధ్వర్యంలో కుంకుమ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళహారతులతో మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు గణపతి నామస్మరణతో ఉత్సాహంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
    user_Megana valgot
    Megana valgot
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • కరీంనగర్ లో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం...సెలయేరులై పారిన దారులు...ఇక్కట్ల పాలైన నగర ప్రజలు భారీ వర్షం కరీంనగర్ ను ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. కరీంనగర్ లో గంటపాటు వాన దంచికొట్టింది. నగరంలో పలు కాలనీలోని ఇళ్ళలోకి నీళ్లు చేరాయి. కలెక్టరేట్ రోడ్, మంకమ్మ తోట, ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద రోడ్లు చెరువులను తలపించాయి. ఆ రూట్లలో వాహనాలను పోలీసులు దారి మళ్ళించారు. ముకరంపుర సాయికృష్ణ థియేటర్ సమీపంలో డ్రైనేజీ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రహదారిపై భారీగా నీరు చేరింది. భారీ వర్షానికి వరదలతో నగర ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. జనజీవనం అస్తవ్యస్తమైంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీప ప్రాంతం పూర్తిగా జలమయమైంది. కరీంనగర్-వేములవాడ ప్రధాన రహదారిపై వర్షపు నీరు భారీగా నిలిచింది. రోడ్డుపై వరద ప్రవహించడంతో పోలీసులు అప్రమత్తమై ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. సిరిసిల్ల వైపు వెళ్లే బస్సులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నడిపిస్తున్నారు. జగిత్యాల రూట్ లో ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద అదే పరిస్థితి ఏర్పడింది. వర్షం తగ్గాక వరద నీరు బయటకు పోయేలా అధికారులు, మున్సిపల్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ప్రతిసారి భారీ వర్షం పడ్డప్పుడు ఇదే పరిస్థితి వస్తుందని శాశ్వత పరిష్కారం మార్గం చూపాలని లోతట్టు ప్రాంత ప్రజలు కోరారు.
    4
    కరీంనగర్ లో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం...సెలయేరులై పారిన దారులు...ఇక్కట్ల పాలైన నగర ప్రజలు
భారీ వర్షం కరీంనగర్ ను ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. కరీంనగర్ లో గంటపాటు వాన దంచికొట్టింది. నగరంలో పలు కాలనీలోని ఇళ్ళలోకి నీళ్లు చేరాయి. కలెక్టరేట్ రోడ్, మంకమ్మ తోట, ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద రోడ్లు చెరువులను తలపించాయి. ఆ రూట్లలో వాహనాలను పోలీసులు దారి మళ్ళించారు. ముకరంపుర సాయికృష్ణ థియేటర్ సమీపంలో డ్రైనేజీ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రహదారిపై భారీగా నీరు చేరింది. భారీ వర్షానికి వరదలతో నగర ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. జనజీవనం అస్తవ్యస్తమైంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీప ప్రాంతం పూర్తిగా జలమయమైంది. కరీంనగర్-వేములవాడ ప్రధాన రహదారిపై వర్షపు నీరు భారీగా నిలిచింది. రోడ్డుపై వరద ప్రవహించడంతో పోలీసులు అప్రమత్తమై ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. సిరిసిల్ల వైపు వెళ్లే బస్సులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నడిపిస్తున్నారు. జగిత్యాల రూట్ లో ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద అదే పరిస్థితి ఏర్పడింది. వర్షం తగ్గాక వరద నీరు బయటకు పోయేలా అధికారులు, మున్సిపల్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ప్రతిసారి భారీ వర్షం పడ్డప్పుడు ఇదే పరిస్థితి వస్తుందని శాశ్వత పరిష్కారం మార్గం చూపాలని లోతట్టు ప్రాంత ప్రజలు కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.