వేములవాడ రాజన్న క్షేత్రంలో వైభవంగా 7వ రోజు గణపతి నవరాత్రులు ఏకాంతంగా మూలవిరాట్‌కు విశేష పూజలు.. భీమేశ్వర ఆలయంలో భక్తులకు సిద్ధిబుద్ధి వినాయకుడి దర్శనం ఘనంగా లక్ష్మీ గణపతికి ఉపనిషత్ పారాయణ అభిషేకాలు, అమ్మవారికి ఉపచార పూజలు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, అనుబంధ ఆలయాలలో గణేశ నవరాత్రి మహోత్సవాలు 7వ రోజు వైభవంగా కొనసాగాయి. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో మూలవిరాట్ ఆంతరంగిక ఆలయంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల దర్శనార్థం అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ మండపంలో మట్టితో రూపొందించిన సిద్ధిబుద్ధి సమేత వినాయకుడికి నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఉదయం ఆంతరంగిక ఆలయంలో మూలవిరాట్ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎనిమిది మంది బ్రాహ్మణుల చేత లక్ష్మీ గణపతికి గణేశ ఉపనిషత్ పారాయణంతో విశేష అభిషేకాలు, పార్వతీ రాజరాజేశ్వరి దేవికి ఉపచార పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. అలాగే భీమేశ్వర ఆలయంలో కొలువుదీరిన మట్టి గణపతికి ఉదయం ప్రాతఃకాల పూజలు, సాయంత్రం వేళల్లో షోడశోపచార పూజలు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారి అంతరాలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అమ్మవారికి ఉపచార పూజలు ఏకాంతంగా కొనసాగుతాయని తెలిపారు. భీమేశ్వర ఆలయంలోని మట్టి వినాయకుడికి రోజూ షోడశోపచార పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు మంత్ర అనుష్ఠానాలతో విశేష హోమం, ద్వాదశి నాడు పూర్ణాహుతి నిర్వహించి స్వామివారి నిమజ్జనం జరుపుతామని వెల్లడించారు. భక్తులు భీమేశ్వర ఆలయంలో కొలువుదీరిన సిద్ధిబుద్ధి సమేత వినాయకుడిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ వేడుకల్లో ఆలయ అధికారులు, అర్చక బృందం, వేద పండితులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.

- విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతికోద్యమ ప్రస్థానంపై 50 గంటల ప్రజా కళాజాతర హైదరాబాద్‌లో అరుణోదయ విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతికోద్యమ ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో 50 గంటల నిర్విరామ ప్రజా కళాజాతర నిర్వహించనున్నట్లు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పోతుల తెలిపారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగే కార్యక్రమాల వివరాలను వెల్లడించేందుకు సెప్టెంబర్ 19న సాయంత్రం 5 గంటలకు నాగోల్ మెయిన్ రోడ్‌లోని సుప్రజ హాస్పిటల్ 5వ అంతస్తులో జర్నలిస్టులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కళాకారులు, కవులు, రచయితలు, ప్రజా సాంస్కృతిక కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.1
- BJP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్ చింతకుంట కెనాల్ వద్ద ఉద్రిక్తత ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తల ఆగ్రహం ఏసీపీ విజయ్ కుమార్, కొత్తపల్లి సీఐ కోటేశ్ తీరుపై మండిపడుతున్న కార్యకర్తలు కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు లను అరెస్ట్ చేసి బలవంతంగా స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు నీళ్లను వదిలేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం... నిమజ్జనానికి నీళ్లివ్వాలని అడిగితే లాఠీలతో కొట్టిస్తారా? పోలీసుల లాఠీఛార్జ్ హేయనీయం3
- అందరూ బాగుండాలి,అందులో మనం ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్-మంత్రి శ్రీధర్ బాబు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని రావుల చెరువు కట్ట హనుమాన్ టెంపుల్‌లో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడికి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడికి పూజలు చేసి హోమ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... అనంతరం మంథనిలోని మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు... మంథని నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో ప్రజలు సంకల్పించిన పనులన్నీ దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేలా ఆశీస్సులు ఇవ్వాలని విఘ్నేశ్వరుడిని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలందరూ బాగుండాలి... అందులో మనం ఉండాలి అనే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీకి ఉందని శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సింగరేణి ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న కార్మికుల ఇళ్లను రెగ్యులరైజ్ చేశారని గుర్తు చేశారు. అదే విధంగా ప్రస్తుతం సింగరేణి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న కార్మికులందరికీ రెగ్యులరైజేషన్ చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తూ... అవి పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులతో మంథని నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి శ్రీధర్ బాబు... సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు కొనసాగిస్తోందని తెలిపారు.2
- హుస్నాబాద్‌లో స్వచ్ఛత కార్యక్రమం..ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమం... హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛత హి సేవా 2026లో భాగంగా 16వ వార్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ రోడ్డులో CTU ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, అధికారులు, శానిటేషన్ సిబ్బంది కలిసి డ్రైనేజీ ఇరువైపులా గడ్డి, చెత్తను తొలగించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చైర్‌పర్సన్ కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1
- మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసన్న కార్యక్రమం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. వారు గణపతికి భక్తిశ్రద్ధలతో పూలు పండ్లు కొబ్బరికాయలతో నైవేద్యం సమర్పించారు. అనంతరం అన్న ప్రసన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈకార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.2
- ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ భాద్రపద మాసం సోమవారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని, అనుబంధ ఆలయాల్లోని స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.1
- కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలే స్ఫూర్తి.. తెలంగాణకు ఆయన సేవలు చిరస్మరణీయం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ పాలకులకు, తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా సేవలందించిన సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి మంత్రిగా ఆయన చరిత్రలో నిలిచారని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి తనదైన మద్దతు అందిస్తూ, ఉద్యమ నాయకులకు సూచనలు, సలహాలు ఇచ్చి మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, పద్మశాలీల సమస్యల పరిష్కారం, ఐక్యత కోసం విశేష కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను నేటి తరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న జరగనున్న కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ప్రజలు, ముఖ్యంగా పద్మశాలి కులబాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, యువజన సంఘం అధ్యక్షుడు సబ్బని హరీష్, వివిధ సంఘాల ప్రతినిధులు, పద్మశాలి కులబాంధవులు, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.1
- కేసీఆర్ ఫాంహౌజ్‌పై కాంగ్రెస్ నేతల పర్యటన... రాజకీయ దుమారం! “ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా?” అంటూ కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్! ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం మీకెక్కడిది? ప్రభుత్వ భూములుంటే... స్వాధీనం చేసుకోండి! భూదోపిడీ జరిగిందంటే... ఆధారాలతో సహా బయటపెట్టండి! క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్! అంతేకాదు... 22ఏ భూముల సమస్యపై కీలక వ్యాఖ్యలు... అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని బండి సంజయ్ హెచ్చరిక! ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నికపై కూడా సంచలన వ్యాఖ్యలు... కాంగ్రెస్ ఉప ఎన్నికలకు భయపడుతోందని బండి సంజయ్ ఆరోపణ! ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం తప్పదంటూ తీవ్ర వ్యాఖ్యలు! మరోవైపు... కరీంనగర్ గణేశ్ నిమజ్జన ఉత్సవాలపై ప్రజలకు కీలక పిలుపు... “ప్రశాంతతకు మారుపేరు కరీంనగర్ అని నిరూపిద్దాం” అంటూ బండి సంజయ్ విజ్ఞప్తి!1
- కరీంనగర్ లో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం...సెలయేరులై పారిన దారులు...ఇక్కట్ల పాలైన నగర ప్రజలు భారీ వర్షం కరీంనగర్ ను ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. కరీంనగర్ లో గంటపాటు వాన దంచికొట్టింది. నగరంలో పలు కాలనీలోని ఇళ్ళలోకి నీళ్లు చేరాయి. కలెక్టరేట్ రోడ్, మంకమ్మ తోట, ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద రోడ్లు చెరువులను తలపించాయి. ఆ రూట్లలో వాహనాలను పోలీసులు దారి మళ్ళించారు. ముకరంపుర సాయికృష్ణ థియేటర్ సమీపంలో డ్రైనేజీ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రహదారిపై భారీగా నీరు చేరింది. భారీ వర్షానికి వరదలతో నగర ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. జనజీవనం అస్తవ్యస్తమైంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీప ప్రాంతం పూర్తిగా జలమయమైంది. కరీంనగర్-వేములవాడ ప్రధాన రహదారిపై వర్షపు నీరు భారీగా నిలిచింది. రోడ్డుపై వరద ప్రవహించడంతో పోలీసులు అప్రమత్తమై ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. సిరిసిల్ల వైపు వెళ్లే బస్సులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నడిపిస్తున్నారు. జగిత్యాల రూట్ లో ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద అదే పరిస్థితి ఏర్పడింది. వర్షం తగ్గాక వరద నీరు బయటకు పోయేలా అధికారులు, మున్సిపల్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ప్రతిసారి భారీ వర్షం పడ్డప్పుడు ఇదే పరిస్థితి వస్తుందని శాశ్వత పరిష్కారం మార్గం చూపాలని లోతట్టు ప్రాంత ప్రజలు కోరారు.4