Shuru
Apke Nagar Ki App…
సిరిసిల్లలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. సిరిసిల్లలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగ అభివృద్ధికి సంఘం మరింత కృషి చేయాలని అన్నారు.
Sircilla jilla updates
సిరిసిల్లలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. సిరిసిల్లలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగ అభివృద్ధికి సంఘం మరింత కృషి చేయాలని అన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఎల్లారెడ్డిపేట లో దంచి కొట్టిన వాన జలకలను సంతరించుకున్న చెరువులు కుంటలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పాటు ఆయా గ్రామాలలో భారీ వర్షం కురిసింది దేనితో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఏకధాటివిగా కురిసిన వర్షాలకు స్థానిక చెరువులు జలకలను సంతరించుకున్నాయి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.1
- వేములవాడ రాజన్న క్షేత్రంలో వైభవంగా 7వ రోజు గణపతి నవరాత్రులు ఏకాంతంగా మూలవిరాట్‌కు విశేష పూజలు.. భీమేశ్వర ఆలయంలో భక్తులకు సిద్ధిబుద్ధి వినాయకుడి దర్శనం ఘనంగా లక్ష్మీ గణపతికి ఉపనిషత్ పారాయణ అభిషేకాలు, అమ్మవారికి ఉపచార పూజలు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, అనుబంధ ఆలయాలలో గణేశ నవరాత్రి మహోత్సవాలు 7వ రోజు వైభవంగా కొనసాగాయి. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో మూలవిరాట్ ఆంతరంగిక ఆలయంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల దర్శనార్థం అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ మండపంలో మట్టితో రూపొందించిన సిద్ధిబుద్ధి సమేత వినాయకుడికి నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఉదయం ఆంతరంగిక ఆలయంలో మూలవిరాట్ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎనిమిది మంది బ్రాహ్మణుల చేత లక్ష్మీ గణపతికి గణేశ ఉపనిషత్ పారాయణంతో విశేష అభిషేకాలు, పార్వతీ రాజరాజేశ్వరి దేవికి ఉపచార పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. అలాగే భీమేశ్వర ఆలయంలో కొలువుదీరిన మట్టి గణపతికి ఉదయం ప్రాతఃకాల పూజలు, సాయంత్రం వేళల్లో షోడశోపచార పూజలు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారి అంతరాలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అమ్మవారికి ఉపచార పూజలు ఏకాంతంగా కొనసాగుతాయని తెలిపారు. భీమేశ్వర ఆలయంలోని మట్టి వినాయకుడికి రోజూ షోడశోపచార పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు మంత్ర అనుష్ఠానాలతో విశేష హోమం, ద్వాదశి నాడు పూర్ణాహుతి నిర్వహించి స్వామివారి నిమజ్జనం జరుపుతామని వెల్లడించారు. భక్తులు భీమేశ్వర ఆలయంలో కొలువుదీరిన సిద్ధిబుద్ధి సమేత వినాయకుడిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ వేడుకల్లో ఆలయ అధికారులు, అర్చక బృందం, వేద పండితులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.1
- సిరిసిల్లలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. సిరిసిల్లలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగ అభివృద్ధికి సంఘం మరింత కృషి చేయాలని అన్నారు.1
- విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతికోద్యమ ప్రస్థానంపై 50 గంటల ప్రజా కళాజాతర హైదరాబాద్‌లో అరుణోదయ విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతికోద్యమ ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో 50 గంటల నిర్విరామ ప్రజా కళాజాతర నిర్వహించనున్నట్లు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పోతుల తెలిపారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగే కార్యక్రమాల వివరాలను వెల్లడించేందుకు సెప్టెంబర్ 19న సాయంత్రం 5 గంటలకు నాగోల్ మెయిన్ రోడ్‌లోని సుప్రజ హాస్పిటల్ 5వ అంతస్తులో జర్నలిస్టులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కళాకారులు, కవులు, రచయితలు, ప్రజా సాంస్కృతిక కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.1
- గణేశ్ నిమజ్జనానికి వెంటనే నీటిని విడుదల చేయాలి ‘ఛలో చింతకుంట’లో ధ్వజమెత్తిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గణేశ్ నిమజ్జన ఉత్సవాలను పురస్కరించుకుని ఎస్సారెస్పీ/ఎల్ఎండీ కాలువలకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ సమీపంలోని చింతకుంట కెనాల్ వద్ద బిజెపి జిల్లా శాఖ సాయిని మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘ఛలో చింతకుంట’’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మనం ఏ పని చేపట్టినా విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని మొట్టమొదట వేడుకునేది విఘ్నేశ్వరుడినే. ఇయాళ ఆ విఘ్నేశ్వరుడి నిమజ్జనానికే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు స్రుష్టించడం బాధాకరం. మనందరికీ తెలుసు ....తెలంగాణలో గణేశ్ నిమజ్జనం అంటే కేవలం ఒక పండుగ కాదు... ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన భక్తి, మన సామూహిక ఆధ్యాత్మిక ఉత్సవం. హిందువులంతా ఐకమత్యంగా జరుపుకునే గొప్ప పండుగ. ఊరూవాడా గల్లీగల్లీలో ప్రతి ఒక్క హిందువు గణేశ్ ను ప్రతిష్టించుకుని నిర్వహించుకునే ఈ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇయ్యలేదు. ఇతర మతాల పండుగల నిర్వహణకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నరు. అయినా భరించాం. కానీ ఇయాళ గణపతిని నిమజ్జనం చేయడానికి నీళ్లు విడుదల చేయాలని 10 రోజుల నుండి అడుగుతున్నం. ఇరిగేషన్ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్, రాష్ట్ర మంత్రికి విజ్ఝప్త చేసినం. కానీ ఇప్పటి వరకు చుక్క నీరు కూడా విడుదల చేయలేదు. నేనడుగుతున్నా.... కాలువల్లో నీళ్లు లేవు. ఎండిపోయినయ్. “నిమజ్జనం ఎక్కడ చేయాలి?”. ఇప్పుడు నీళ్లు వదిలితే తాగడానికి నీళ్లుండవని రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్పడం ఎంత వరకు సమంజసం? ఎస్సారెస్పీ లో 47 టీఎంసీలకు పైగా నీళ్లున్నయ్. నీళ్లు వదలడానికి ఇబ్బంది ఏంది? గణేశ్ నిమజ్జనానికి అర టీఎంసీ నీళ్లు వదిలితే చాలు. గతంలో ఎస్సారెస్పీలో 17 టీఎంసీలు మాత్రమే నీళ్లు నిల్వ ఉన్నప్పుడు కూడా నీళ్లు వదిలారు కదా? మరి ఇప్పుడెందుకు వదలడం లేదు? గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా భక్తులను ఎందుకు ఆందోళనకు గురి చేస్తున్నరు? ‘‘కేబినెట్ లో సీఎంకు, కొందరు మంత్రులకు పడటం లేదు. ఎవరికి వాళ్లే సీఎం కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తానే సీఎం అని భావిస్తున్నారు. కాలువలకు నీళ్లు వదలకపోతే సీఎంకు చెడ్డ పేరొస్తది, హైకమాండ్ రేవంత్ రెడ్డి దించేస్తే తానే సీఎం సీట్లో కూర్చోవాలని అనుకుంటున్నారేమో... మీ కొట్లాటలు మాకు అనవసరం. మాకు నీళ్లివ్వండి. గణేష్ నిమజ్జనాన్ని భక్తియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నా...’’అని చెప్పండి. ఇదిగో....కరీంనగర్‌లో చింతకుంట కాలువ. చుక్క నీరు లేదు. ఇక్కడికి వందలాది గణేశ్ విగ్రహాలు నిమజ్జనం కోసం వస్తాయి. నీళ్లు లేకుండా ఆ గణపతులను ఏం చేయాలి? ఇక్కడే రోడ్లపై వదిలి వెళ్లాలా? ఒక్క చింతకుంటే కాదు, ఎస్సారెస్పీ పరిధిలోని దాదాపు అన్ని కాలువల్లోనూ ఇదే పరిస్థితి. ఏటా ఆయా కాలువల్లో నిమజ్జనం చేసే వాళ్ల పరిస్థితి ఏంది? కావాల్సినన్ని నీళ్లున్నా పంటలకు నీళ్లు వదలడం లేదు. పంటలు ఎండిపోయి రైతులు ఆగమవుతున్నా పట్టించుకోరు. చివరకు భక్తుల మనోభావాలను కూడా పట్టించుకోరు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? గణేశ్ నిమజ్జనం తేదీలు ముందే తెలియవా? ఎక్కడెక్కడ నిమజ్జనాలు జరుగుతాయో అధికారులకు ముందే తెలియదా? ఆ ప్రాంతాల్లో నీటి లభ్యతను ముందుగానే ఎందుకు అంచనా వేయలేదు? అవసరమైన చోట్ల రిజర్వాయర్లు, కాలువలు, చెరువులకు నీటిని ఎందుకు మళ్లించలేదు? రైతుల పంటలను కాపాడటానికి సమగ్ర నీటి విడుదల ప్రణాళిక ఎందుకు లేదు? భక్తులకు చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చెబుతున్నారు? “తెలంగాణలో గణపతిని నిమజ్జనం చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావాలా?”. తెలంగాణ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి హిందువులే కదా? గణేశ్ నిమజ్జన ప్రాముఖ్యత, హిందువుల మనోభావాలు వాళ్లకు తెలియవా? ఇదేం పద్దతి. ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన హామీలను గాలికొదిలేశారు. ఇప్పుడు నిమజ్జనానికి కూడా నీళ్లవ్వకుండా వేధిస్తున్నరు. హిందువులంటే కాంగ్రెస్ కు అంత చులకన ఎందుకు? హిందువులు ఓటర్లు కాదా? వాళ్ల ఓట్లు అవసరం లేదా? గణేశ్ నిమజ్జనానికి కూడా నీళ్లు వదలండి మహాప్రభో వేడుకోవాల్సిన దుస్థితి కలిగిస్తారా? బీజేపీ పక్షాన, హిందువుల పక్షాన మేం కోరేదొక్కటే. తక్షణమే గణేశ్ నిమజ్జనానికి సరిపడ నీళ్లను విడుదల చేయాలి. నిమజ్జనానికి ఏ అటంకం లేకుండా భక్తిపారవశ్యంతో గణేష్ నిమజ్జనమయ్యేలా చూడాలి. అట్లాగే ప్రభుత్వం వెంటనే SRSP, కాకతీయ కాలువలు, స్థానిక చెరువులు, నిమజ్జన ప్రాంతాలకు అవసరమైన నీటి విడుదలపై అత్యవసర ప్రణాళిక ప్రకటించాలి. ఏ ప్రాంతంలో ఎంత నీరు అవసరం? ఎక్కడి నుంచి ఎంత నీరు విడుదల చేస్తారు? ఎప్పుడు చేరుతుంది? నిమజ్జనానికి సురక్షితమైన ప్రాంతాలు ఏవి? .....అనే అంశాలపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. చివరగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. సాయంత్రంలోపు నిమజ్జనానికి నీళ్లు విడుదల చేయకపోతే....కాంగ్రెస్ ను రాజకీయ నిమజ్జనం చేస్తాం. హిందువుల దమ్మేందో చూపిస్తాం. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్ రావు, బండారి వేణు, గాజ శివరాం, ఎన్నం ప్రకాష్, ఏపీపీ చంద్ర (టీంకు), చొప్పరి జయశ్రీ, బండ రమణ రెడ్డి, సౌగాని కొమురయ్య, సోమిడి వేణు,బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..3
- కరీంనగర్ మున్సిపల్ సిబ్బందికి ట్రై సైకిల్స్, ఫాగ్ మిషన్స్ అందజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి నూతనంగా కొనుగోలు చేసిన ట్రైసైకిల్స్, ఫాగ్ మిషన్స్ ను అందజేశారు. అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ లో చెత్త సేకరణ కోసం ప్రతి డివిజన్ కు ఒక ట్రై సైకిల్ ను మున్సిపల్ సిబ్బందికి అందజేస్తున్నాం. కొత్తగా కొనుగోలు చేసిన ఫాగ్ మిషన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అదనంగా ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నాం. కరీంనగర్ లో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించబోతున్నాం.1
- కరీంనగర్ లో గణేష్ నిమజ్జనానికి నీటి కోసం బిజెపి ఆందోళన ఉద్రిక్తం... పోలీసుల లాఠీ చార్జ్...పలువురు అరెస్టు కరీంనగర్ లో బిజెపి కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. గణేష్ నిమజ్జనోత్సవానికి కాకతీయ కెనాల్ ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో చింతకుంట కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. నీటిని విడుదల చేసే వరకు కదలమని బీస్మించడంతో బీజేపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. బిజేపి ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ పోలీస్ వాహనంపైకి ఎక్కి నిరసన తెలపడంతో పోలీసులు లాఠీ చార్జి చేసి చితకొట్టారు. పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయకుల నిమజ్జనానికి నీళ్లు అడుగుతే పోలీసులతో కొట్టిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. బిజెపి కార్యకర్తల నిరసన, పోలీసుల అరెస్టు తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. అటు ప్రభుత్వం ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం వరకు చింతకుంట కు నీళ్ళు చేరుకోనున్నాయి.4
- కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలే స్ఫూర్తి.. తెలంగాణకు ఆయన సేవలు చిరస్మరణీయం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ పాలకులకు, తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా సేవలందించిన సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి మంత్రిగా ఆయన చరిత్రలో నిలిచారని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి తనదైన మద్దతు అందిస్తూ, ఉద్యమ నాయకులకు సూచనలు, సలహాలు ఇచ్చి మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, పద్మశాలీల సమస్యల పరిష్కారం, ఐక్యత కోసం విశేష కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను నేటి తరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న జరగనున్న కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ప్రజలు, ముఖ్యంగా పద్మశాలి కులబాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, యువజన సంఘం అధ్యక్షుడు సబ్బని హరీష్, వివిధ సంఘాల ప్రతినిధులు, పద్మశాలి కులబాంధవులు, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.1