రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక నాయకులు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకలను పండుగలా నిర్వహించారు. ఉదయాన్నే పార్టీ కార్యాలయం వద్ద రమేష్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక మృత్యుంజయశ్వర స్వామి ఆలయం ఎదుట కొబ్బరికాయలు కొట్టారు ప్రభుత్వ ఆసుపత్రిలో పాలు బ్రెడ్ రోగులకు పంపిణీ చేశారు చంద్రబాబు నాయుడు చిరకాలం ఆరోగ్యంగా ఉండి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని వారు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ స్థానిక ఆలయాల్లో రమేష్ రెడ్డి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. "అలుపెరగని నాయకుడు, నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు నాయుడు గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. ఆయన దార్శనికత వల్లే నేడు రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా, ప్రతి కార్యకర్త ప్రజల కోసం కష్టపడి పనిచేయాలి" అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, తెలుగు యువత ప్రతినిధులు, అధిక సంఖ్యలో మహిళలు మరియు అభిమానులు పాల్గొని చంద్రబాబు నాయుడుకు నినాదాలతో శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి నాయకులు బోయకొండ సుబ్బు సోము రెడ్డి నారాయణరాజు ప్రభాకర్ రమేష్ ముని వెంకటప్ప కళ్యాణ్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక నాయకులు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకలను పండుగలా నిర్వహించారు. ఉదయాన్నే పార్టీ కార్యాలయం వద్ద రమేష్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక మృత్యుంజయశ్వర స్వామి ఆలయం ఎదుట కొబ్బరికాయలు కొట్టారు ప్రభుత్వ ఆసుపత్రిలో పాలు బ్రెడ్ రోగులకు పంపిణీ చేశారు చంద్రబాబు నాయుడు చిరకాలం ఆరోగ్యంగా ఉండి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని వారు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో
ఉండాలని కోరుతూ స్థానిక ఆలయాల్లో రమేష్ రెడ్డి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. "అలుపెరగని నాయకుడు, నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు నాయుడు గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. ఆయన దార్శనికత వల్లే నేడు రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా, ప్రతి కార్యకర్త ప్రజల కోసం కష్టపడి పనిచేయాలి" అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, తెలుగు యువత ప్రతినిధులు, అధిక సంఖ్యలో మహిళలు మరియు అభిమానులు పాల్గొని చంద్రబాబు నాయుడుకు నినాదాలతో శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి నాయకులు బోయకొండ సుబ్బు సోము రెడ్డి నారాయణరాజు ప్రభాకర్ రమేష్ ముని వెంకటప్ప కళ్యాణ్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
- గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది1
- బద్వేలు:సరస్వతి శిశు మందిరంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితభావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ వేదికపై ఘనంగా సన్మానం జరిగింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానంతో పాటు, విద్యా విలువలను చాటిచెప్పే పలు కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. క్రమశిక్షణ, విద్య మరియు సంస్కృతుల కలయికగా సాగిన ఈ ఉత్సవం అందరినీ అలరించింది. ఈ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న పలువురికి సరస్వతి శిశు మందిరం కమిటీ సభ్యులు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు, అనంతరం శిశు మందిరం వార్షికోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులతో పాటు కమిటీ సభ్యులు పలువురు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు2
- Post by Bondhu Suresh1
- కోవూరు అన్న క్యాంటీన్ లో ఘనంగా సిఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు - ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలన్న సిఎం చంద్రబాబు నాయుడులక్ష్యం. - చంద్రన్న జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్ల పేదలు ఒక రోజు ఉచితంగా భోజనం చేసేందుకై నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. - నాయకులు అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూల మాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వండి. - విడవలూరు మండలంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రారంభించిన విపిఆర్ నేత్ర బస్సు మరియు బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ సిఎం చంద్రబాబు జన్మదిన కానుకగా అందిస్తున్నాం. - కోవూరు అన్నా క్యాంటీన్‌లో సామాన్యులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా అన్న క్యాంటీన్లో భోజనం చేసే పేదల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఆయన సతీమణినారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు అన్న క్యాంటీన్ లో సిఎం చంద్రబాబు నాయుడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేసారు. అనంతరం అన్నా క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడమే పరమావధిగా భావించే నాయకుడు చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టిన అన్నా క్యాంటీన్లు నేడు లక్షలాది మందికి ఆకలి తీరుస్తున్నాయని కొనియాడారు. అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూలమాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా యివ్వాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నాయకులకు హితోపదేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన కానుకగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విడవలూరు మండలంలో ఈరోజు ప్రారంభించిన విపిఆర్ నేత్ర గురించి ప్రస్తావించారు. అలాగే బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో సిఎం చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ కూడా జన్మదిన కానుకగా అందివ్వనున్నట్టు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల తెలుగుదేశం ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.4
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కాలువ తలపెట్టిన 10 రోజుల హోమాలు నేటితో ముగిసాయి. నేడు చంద్రబాబు జన్మదినం సందర్భంగా మహా చండీయాగం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే దైవబలం ఆయనకు సమకూరాలని తాము యజ్ఞాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రభుత్వ విప్ కాలువ శుభాకాంక్షలు తెలిపారు.1
- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అధికారులు సోమవారం నంద్యాలలో మహానంది జూవెలర్ దుకాణంలో తనిఖీలు చేశారు. ఆల్ మార్కు లేని 3 కేజీల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిసి నంద్యాలలో ఉన్న అన్ని బంగారు దుకాణాలు మూసివేశారు.1
- అన్నమయ్య జిల్లా – మదనపల్లె మదనపల్లెతో పాటు కడప, సత్యసాయి, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న లక్కిరెడ్డిపల్లికి చెందిన మంజునాథ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.... ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడించారు.... నిందితుడి వద్ద నుంచి రూ.4.61 లక్షల విలువైన 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.... స్వాధీనం చేసుకున్న వాహనాలు ఎక్కువగా యూనికాన్, హోండా కంపెనీలకు చెందినవిగా పోలీసులు తెలిపారు.... వాహనదారులు తమ బైక్‌లకు సురక్షితమైన లాకులు వేసుకోవాలని ఎస్పీ సూచించారు... నిందితుడిపై ఇప్పటికే సుమారు 20 కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించారు.... ఇలాంటి నేరస్తులపై పిడి యాక్ట్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు....2
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు1
- బద్వేలు: ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది.1