logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*నందిగామలో బైక్ దొంగలు హల్చల్..!!*ఎన్టీఆర్ జిల్లా, నందిగామ:- *నందిగామలో బైక్ దొంగలు హల్చల్..!!* *ఎన్టీఆర్ జిల్లా, నందిగామ:-* నందిగామలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఆగస్టు మూడో తారీకున నందిగామ రథం బజార్ సెంటర్లో బైక్ దొంగతనం జరిగిన వైనం. మనసటి మరుసటి రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోని వైనం,కనీసం సిసి ఫుటేజ్ చెక్ చేయటానికి రాని కానిస్టేబుల్ సంతోష్. ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం మండలం, తూనికిపాడు లో ముసుగు దొంగల హల్చల్ చేస్తుంటే మరోపక్క నందిగామలో దొంగలు బైకు దొంగతనాలు చేస్తుంటే భయపడుతున్న జనం ఇకనైనా పోలీస్ అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం!!

1 hr ago
user_RAVELLA NEWS
RAVELLA NEWS
ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
1 hr ago

*నందిగామలో బైక్ దొంగలు హల్చల్..!!*ఎన్టీఆర్ జిల్లా, నందిగామ:- *నందిగామలో బైక్ దొంగలు హల్చల్..!!* *ఎన్టీఆర్ జిల్లా, నందిగామ:-* నందిగామలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఆగస్టు మూడో తారీకున నందిగామ రథం బజార్ సెంటర్లో బైక్ దొంగతనం జరిగిన వైనం. మనసటి మరుసటి రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోని వైనం,కనీసం సిసి ఫుటేజ్ చెక్ చేయటానికి రాని కానిస్టేబుల్ సంతోష్. ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం మండలం, తూనికిపాడు లో ముసుగు దొంగల హల్చల్ చేస్తుంటే మరోపక్క నందిగామలో దొంగలు బైకు దొంగతనాలు చేస్తుంటే భయపడుతున్న జనం ఇకనైనా పోలీస్ అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం!!

More news from తెలంగాణ and nearby areas
  • ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారు విస్తృతంగా పర్యటించి అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం హనుమకొండలో... తలసేమియా, సికిల్ సెల్ వ్యాధితో బాధపడే చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ మంజూరూ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుపుతూ హనుమకొండ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వారు నిర్వహించిన కృతజ్ఞతా సభలో మంత్రి పొంగులేటి గారు ముఖ్యఅతిథిగా పాల్గొని, చిన్నారులకు పెన్షన్ కు సంబంధించిన హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు. ఆ తరువాత ఇషా సూపర్ స్పెషాలిటీ & క్రిటికల్ కేర్ ఆసుపత్రికి మంత్రిగారు ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన రైతుమేళా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం వరంగల్ పట్టణంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయం అభివృద్ధి పనులను పరిశీలించి, కాతీయ మ్యూజికల్ గార్డెన్ ప్రారంభించారు. దీంతో పాటు కాజీపేట దర్గా లో ముస్లీం మత పెద్దల సమక్షంలో నిర్వహించిన ఉర్సు వేడుకల్లో మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్ గారు, కొండా సురేఖ గారితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాల్లొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ సారయ్య గారు, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి గారు, కే. ఎల్. నాగరాజు గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లు, సంబంధిత ఆయా శాఖల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, మైనార్టీ సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో  భాగంగా ఈరోజు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారు విస్తృతంగా పర్యటించి అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు.
అనంతరం హనుమకొండలో...  తలసేమియా, సికిల్ సెల్ వ్యాధితో బాధపడే చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ మంజూరూ కార్యక్రమానికి  ధన్యవాదాలు తెలుపుతూ హనుమకొండ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వారు నిర్వహించిన కృతజ్ఞతా సభలో మంత్రి పొంగులేటి గారు ముఖ్యఅతిథిగా పాల్గొని, చిన్నారులకు పెన్షన్ కు సంబంధించిన హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు. ఆ తరువాత ఇషా సూపర్ స్పెషాలిటీ & క్రిటికల్ కేర్ ఆసుపత్రికి మంత్రిగారు ప్రారంభోత్సవం చేశారు.
అదేవిధంగా ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన రైతుమేళా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం వరంగల్ పట్టణంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి  దేవాలయం అభివృద్ధి పనులను పరిశీలించి, కాతీయ మ్యూజికల్ గార్డెన్  ప్రారంభించారు. 
దీంతో పాటు కాజీపేట దర్గా లో ముస్లీం మత పెద్దల సమక్షంలో నిర్వహించిన ఉర్సు వేడుకల్లో మంత్రులు  మహమ్మద్ అజారుద్దీన్ గారు, కొండా సురేఖ గారితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాల్లొన్నారు.
ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ సారయ్య గారు, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి గారు,  కే. ఎల్. నాగరాజు గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లు, సంబంధిత ఆయా శాఖల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, మైనార్టీ సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • 🎂 **జన్మదిన వేడుకలు** 🎂 📍 సత్తుపల్లి పట్టణంలోని అంబేడ్కర్ నగర్ 3వ వార్డులో గౌరవ సత్తుపల్లి ఎమ్మెల్యే **శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ గారి జన్మదినం** సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. 🔹 ఈ కార్యక్రమం **సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు ఏలూరి రవి గారి ఆధ్వర్యంలో** జరిగింది. 🔹 **బొంతు సుమలత గారు** – సత్తుపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ 🔹 **చల్లగుళ్ళ కృష్ణయ్య గారు** – సత్తుపల్లి సొసైటీ అధ్యక్షులు 🔹 ** నాగుల నాగేశ్వరరావు** – 3వ వార్డు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 🔹 **ఖమ్మంపాటి కాంతారావు** 🔹 **బీర అబ్బులు** 🔹 **మల్లెల అనిల్** 🔹 **కశిని శ్రీను** 🔹 **జొన్నలగడ్డ రాజు** 🔹 **సాయి శ్రీనివాస్** 🔹 **దాట్ల రాము** 🔹 3వ వార్డు కాంగ్రెస్ కార్యకర్తలు 🔹 గ్రామ ప్రజలు 🔹 తదితరులు పాల్గొన్నారు. 🎉💐
    1
    🎂 **జన్మదిన వేడుకలు** 🎂
📍 సత్తుపల్లి పట్టణంలోని అంబేడ్కర్ నగర్ 3వ వార్డులో గౌరవ సత్తుపల్లి ఎమ్మెల్యే **శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ గారి జన్మదినం** సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది.
🔹 ఈ కార్యక్రమం **సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు ఏలూరి రవి గారి ఆధ్వర్యంలో** జరిగింది.
🔹 **బొంతు సుమలత గారు** – సత్తుపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్
🔹 **చల్లగుళ్ళ కృష్ణయ్య గారు** – సత్తుపల్లి సొసైటీ అధ్యక్షులు
🔹 ** నాగుల నాగేశ్వరరావు** – 3వ వార్డు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
🔹 **ఖమ్మంపాటి కాంతారావు**
🔹 **బీర అబ్బులు**
🔹 **మల్లెల అనిల్**
🔹 **కశిని శ్రీను**
🔹 **జొన్నలగడ్డ రాజు**
🔹 **సాయి శ్రీనివాస్**
🔹 **దాట్ల రాము**
🔹 3వ వార్డు కాంగ్రెస్ కార్యకర్తలు
🔹 గ్రామ ప్రజలు
🔹 తదితరులు పాల్గొన్నారు. 🎉💐
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ లో సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఏఎస్ఐ కి గాయాలు మరిపెడ పోలీస్ స్టేషన్‌లో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. పాత పోలీస్ స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరడంతో, సీలింగ్ పెచ్చులు ఊడిపడి విధుల్లో ఉన్న ఏఎస్ఐ శ్రీనివాసరావు భుజంపై పడ్డాయి. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ​భవనం పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరడంతో ఇప్పటికే అన్ని ఆధునిక వసతులు, హంగులతో పక్కనే నూతన పోలీస్ స్టేషన్‌ను నిర్మించారు. పాత భవనం నుండి కొత్త భవనంలోకి మారే ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ​నిజానికి నిన్న 'జైల్ భరో' కార్యక్రమం ఉండటంతో, స్టేషన్‌లోని కంప్యూటర్ల ముందు పనిచేసే సిబ్బంది అంతా అదనపు భద్రతా విధుల కోసం బయటకు వెళ్లారు. దీంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఒకవేళ అందరూ లోపలే ఉండి ఉంటే నష్టం మరింత తీవ్రంగా ఉండేదని అధికారులు భావిస్తున్నారు. ఏఎస్ఐ శ్రీనివాసరావు ఒక్కరే అక్కడ విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్త భవనంలోకి పూర్తిస్థాయిలో మారేలోపే ఈ ఘటన జరగడం పట్ల స్థానిక పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
    1
    మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ లో సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఏఎస్ఐ కి గాయాలు 
మరిపెడ పోలీస్ స్టేషన్‌లో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. పాత పోలీస్ స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరడంతో, సీలింగ్ పెచ్చులు ఊడిపడి విధుల్లో ఉన్న ఏఎస్ఐ శ్రీనివాసరావు భుజంపై పడ్డాయి. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.
​భవనం పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరడంతో ఇప్పటికే అన్ని ఆధునిక వసతులు, హంగులతో పక్కనే నూతన పోలీస్ స్టేషన్‌ను నిర్మించారు. పాత భవనం నుండి కొత్త భవనంలోకి మారే ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.
​నిజానికి నిన్న 'జైల్ భరో' కార్యక్రమం ఉండటంతో, స్టేషన్‌లోని కంప్యూటర్ల ముందు పనిచేసే సిబ్బంది అంతా అదనపు భద్రతా విధుల కోసం బయటకు వెళ్లారు. దీంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఒకవేళ అందరూ లోపలే ఉండి ఉంటే నష్టం మరింత తీవ్రంగా ఉండేదని అధికారులు భావిస్తున్నారు. ఏఎస్ఐ శ్రీనివాసరావు ఒక్కరే అక్కడ విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్త భవనంలోకి పూర్తిస్థాయిలో మారేలోపే ఈ ఘటన జరగడం పట్ల స్థానిక పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • సీపీఐ ప్రజా చైతన్య యాత్ర.. ‘బద్లావ్ జరూరీ హై.. దేశంలో మార్పు కావాలి’ నినాదంతో ముందుకు సాగుతున్న సీపీఐ కొత్తగూడెంలోకి సీపీఐ ప్రజా చైతన్య యాత్ర.. ‘బద్లావ్ జరూరీ హై.. దేశంలో మార్పు కావాలి’ నినాదంతో ముందుకు సాగుతున్న సీపీఐ కొత్తగూడెంలో ‘బద్లావ్ జరూరీ హై.. దేశంలో మార్పు కావాలి’ అనే నినాదంతో కదం తొక్కిన కామ్రేడ్లు అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు.. ఎరుపెక్కిన కోల్ టౌన్ కొత్తగూడెం.. సీపీఐ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి కొనసాగుతున్న ప్రజా చైతన్య యాత్ర సోమవారం కొత్తగూడెంలోకి ప్రవేశించింది. యాత్రకు అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. గడ్డం శాంతిప్రియ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ప్రజలు యాత్రకు స్వాగతం పలికి, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషాకు పూలమాలలు వేసి సంఘీభావం, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘చేంజ్ ఇండియా.. సేవ్ ఇండియా’ నినాదంతో పాలనలో మార్పు కోసం దేశవ్యాప్తంగా ప్రచార ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో గత ఆరు రోజులుగా ప్రజా చైతన్య యాత్ర 144 కేంద్రాలు, గ్రామాల్లో పర్యటించి బహిరంగ సభలు నిర్వహిస్తూ కొత్తగూడెం చేరుకుందని తెలిపారు. గత 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని తిరోగమన దిశగా తీసుకెళ్తోందని ఆయన విమర్శించారు. ఈ ప్రభుత్వం రైతు, కార్మిక, మహిళా, యువజన, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించాల్సిన సమయంలో దేశంలో విద్వేషాలను ప్రోత్సహించే విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ఈ తిరోగమన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల సంఘటిత పోరాటం అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సాబీర్ పాషా డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించి, సీతారామ ప్రాజెక్టు నీటిని జిల్లాలోని ప్రతి గ్రామం, మండలానికి అందించాలని కోరారు. జిల్లాలో కొత్త బొగ్గు బావులు ఏర్పాటు చేయాలని, జీవో 76 ద్వారా ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, కార్మిక వర్గానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనం ఎజెండాను విస్మరించిన పాలకవర్గాలపై ప్రజల తరఫున పోరాటం చేయడమే ఈ ప్రజా చైతన్య యాత్ర లక్ష్యమని తెలిపారు. యాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఎవరి పక్షం కాదు.. ప్రజల పక్షం అని సాబీర్ పాషా స్పష్టం చేశారు. ప్రజల మేలు, భద్రత, వారి జీవితాల్లో మార్పు కోసం పోరాట అజెండాతో ఎర్రజెండా ముందుకు సాగుతోందన్నారు. ప్రజా చైతన్య యాత్రకు స్వాగతం పలుకుతున్న ప్రతి ఒక్కరికీ, యాత్రలో భాగస్వాములవుతున్న ప్రజలకు విప్లవాభివందనాలు తెలిపారు.
    1
    సీపీఐ ప్రజా చైతన్య యాత్ర..
‘బద్లావ్ జరూరీ హై.. దేశంలో మార్పు కావాలి’ నినాదంతో ముందుకు సాగుతున్న సీపీఐ
కొత్తగూడెంలోకి సీపీఐ ప్రజా చైతన్య యాత్ర..
‘బద్లావ్ జరూరీ హై.. దేశంలో మార్పు కావాలి’ నినాదంతో ముందుకు సాగుతున్న సీపీఐ
కొత్తగూడెంలో ‘బద్లావ్ జరూరీ హై.. దేశంలో మార్పు కావాలి’ అనే నినాదంతో కదం తొక్కిన కామ్రేడ్లు అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు..
ఎరుపెక్కిన కోల్ టౌన్ కొత్తగూడెం..
సీపీఐ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి కొనసాగుతున్న ప్రజా చైతన్య యాత్ర సోమవారం కొత్తగూడెంలోకి ప్రవేశించింది. యాత్రకు అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. గడ్డం శాంతిప్రియ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ప్రజలు యాత్రకు స్వాగతం పలికి, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషాకు పూలమాలలు వేసి సంఘీభావం, మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘చేంజ్ ఇండియా.. సేవ్ ఇండియా’ నినాదంతో పాలనలో మార్పు కోసం దేశవ్యాప్తంగా ప్రచార ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
జిల్లాలో గత ఆరు రోజులుగా ప్రజా చైతన్య యాత్ర 144 కేంద్రాలు, గ్రామాల్లో పర్యటించి బహిరంగ సభలు నిర్వహిస్తూ కొత్తగూడెం చేరుకుందని తెలిపారు. గత 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని తిరోగమన దిశగా తీసుకెళ్తోందని ఆయన విమర్శించారు.
ఈ ప్రభుత్వం రైతు, కార్మిక, మహిళా, యువజన, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించాల్సిన సమయంలో దేశంలో విద్వేషాలను ప్రోత్సహించే విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ఈ తిరోగమన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల సంఘటిత పోరాటం అవసరమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సాబీర్ పాషా డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించి, సీతారామ ప్రాజెక్టు నీటిని జిల్లాలోని ప్రతి గ్రామం, మండలానికి అందించాలని కోరారు. జిల్లాలో కొత్త బొగ్గు బావులు ఏర్పాటు చేయాలని, జీవో 76 ద్వారా ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, కార్మిక వర్గానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జనం ఎజెండాను విస్మరించిన పాలకవర్గాలపై ప్రజల తరఫున పోరాటం చేయడమే ఈ ప్రజా చైతన్య యాత్ర లక్ష్యమని తెలిపారు. యాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు.
కమ్యూనిస్టు పార్టీ ఎవరి పక్షం కాదు.. ప్రజల పక్షం అని సాబీర్ పాషా స్పష్టం చేశారు. ప్రజల మేలు, భద్రత, వారి జీవితాల్లో మార్పు కోసం పోరాట అజెండాతో ఎర్రజెండా ముందుకు సాగుతోందన్నారు. ప్రజా చైతన్య యాత్రకు స్వాగతం పలుకుతున్న ప్రతి ఒక్కరికీ, యాత్రలో భాగస్వాములవుతున్న ప్రజలకు విప్లవాభివందనాలు తెలిపారు.
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    12 hrs ago
  • ఎమ్మెల్యే మట్టా రాగమయి పుట్టిన రోజు సందర్భంగా విద్యార్ధులకు,బుక్స్ యూనిఫాం పంపిణీ..! ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని జేవీఆర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేసిన కలెక్టర్ దివాకర్.. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పదవ తరగతి నుండి డిగ్రీ చదివే విద్యార్థినీ విద్యార్థులకు బ్యాగ్స్, పుస్తకాలు, ఫ్యాడ్స్ యూనిఫామ్స్ పంపిణీ చేసిన కలెక్టర్ దివాకర్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్
    1
    ఎమ్మెల్యే మట్టా రాగమయి పుట్టిన రోజు సందర్భంగా విద్యార్ధులకు,బుక్స్ యూనిఫాం పంపిణీ..!
ఖమ్మం జిల్లా 
సత్తుపల్లి పట్టణంలోని జేవీఆర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేసిన కలెక్టర్ దివాకర్..
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పదవ తరగతి నుండి డిగ్రీ చదివే విద్యార్థినీ విద్యార్థులకు బ్యాగ్స్, పుస్తకాలు, ఫ్యాడ్స్  యూనిఫామ్స్ పంపిణీ చేసిన కలెక్టర్ దివాకర్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • మంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన పనులు.. మధ్యలోనే మాయం! ఖమ్మం బైపాస్‌పై ప్రజల అవస్థలు ఖమ్మం బైపాస్‌ రోడ్డుపై అసంపూర్తి కాలువ పనులతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాకు ప్రధాన రహదారిగా ఉన్న బైపాస్‌ రోడ్డు పక్కన కాలువ మరమ్మతు పనులను ప్రారంభించి.. అధికారులు, పాలకులు మధ్యలోనే వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి నోచుకోని స్థితిలోనే పనులు నిలిచిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగం పనులు పూర్తయిన తర్వాత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో.. రోడ్డు పక్కన మట్టి, నిర్మాణ సామగ్రి పేరుకుపోయి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాపర్తి నగర్‌ వైపు వెళ్లే ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారిన ఈ అసంపూర్తి కాలువ పనులను వెంటనే పూర్తి చేసి.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    మంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన పనులు.. మధ్యలోనే మాయం! ఖమ్మం బైపాస్‌పై ప్రజల అవస్థలు
ఖమ్మం బైపాస్‌ రోడ్డుపై అసంపూర్తి కాలువ పనులతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఖమ్మం జిల్లాకు ప్రధాన రహదారిగా ఉన్న బైపాస్‌ రోడ్డు పక్కన కాలువ మరమ్మతు పనులను ప్రారంభించి.. అధికారులు, పాలకులు మధ్యలోనే వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి నోచుకోని స్థితిలోనే పనులు నిలిచిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సగం పనులు పూర్తయిన తర్వాత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో.. రోడ్డు పక్కన మట్టి, నిర్మాణ సామగ్రి పేరుకుపోయి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాపర్తి నగర్‌ వైపు వెళ్లే ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారిన ఈ అసంపూర్తి కాలువ పనులను వెంటనే పూర్తి చేసి.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • *ఖబర్దార్ పిడమర్తి రవి* - *సత్తుపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్.*
    1
    *ఖబర్దార్ పిడమర్తి రవి* - *సత్తుపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్.*
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • ఖమ్మం జిల్లా రూరల్ పోలీసులు నలుగురు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 10 మోటార్లు,100 కేజీల కాపర్ వైర్ స్వాధీనం ఖమ్మం జిల్లా రూరల్ పోలీసులు నలుగురు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 10 మోటార్లు,100 కేజీల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నారు.ఖమ్మం పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ మోటార్లు, స్టార్టర్ బాక్సులతో పాటు ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ వైర్ను చోరీ చేస్తున్నారు.రూరల్ పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి పది మోటార్లు, 100 కిలోల కాపర్ వైర్, ఆటోను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.
    1
    ఖమ్మం జిల్లా రూరల్ పోలీసులు నలుగురు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 10 మోటార్లు,100 కేజీల కాపర్ వైర్ స్వాధీనం
ఖమ్మం జిల్లా రూరల్ పోలీసులు నలుగురు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 10 మోటార్లు,100 కేజీల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నారు.ఖమ్మం పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ మోటార్లు, స్టార్టర్ బాక్సులతో పాటు ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ వైర్ను చోరీ చేస్తున్నారు.రూరల్ పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి పది మోటార్లు, 100 కిలోల కాపర్ వైర్, ఆటోను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.