మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ లో సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఏఎస్ఐ కి గాయాలు మరిపెడ పోలీస్ స్టేషన్‌లో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. పాత పోలీస్ స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరడంతో, సీలింగ్ పెచ్చులు ఊడిపడి విధుల్లో ఉన్న ఏఎస్ఐ శ్రీనివాసరావు భుజంపై పడ్డాయి. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. భవనం పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరడంతో ఇప్పటికే అన్ని ఆధునిక వసతులు, హంగులతో పక్కనే నూతన పోలీస్ స్టేషన్‌ను నిర్మించారు. పాత భవనం నుండి కొత్త భవనంలోకి మారే ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. నిజానికి నిన్న 'జైల్ భరో' కార్యక్రమం ఉండటంతో, స్టేషన్‌లోని కంప్యూటర్ల ముందు పనిచేసే సిబ్బంది అంతా అదనపు భద్రతా విధుల కోసం బయటకు వెళ్లారు. దీంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఒకవేళ అందరూ లోపలే ఉండి ఉంటే నష్టం మరింత తీవ్రంగా ఉండేదని అధికారులు భావిస్తున్నారు. ఏఎస్ఐ శ్రీనివాసరావు ఒక్కరే అక్కడ విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్త భవనంలోకి పూర్తిస్థాయిలో మారేలోపే ఈ ఘటన జరగడం పట్ల స్థానిక పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ లో సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఏఎస్ఐ కి గాయాలు మరిపెడ పోలీస్ స్టేషన్‌లో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. పాత పోలీస్ స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరడంతో, సీలింగ్ పెచ్చులు ఊడిపడి విధుల్లో ఉన్న ఏఎస్ఐ శ్రీనివాసరావు భుజంపై పడ్డాయి. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. భవనం పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరడంతో ఇప్పటికే అన్ని ఆధునిక వసతులు, హంగులతో పక్కనే నూతన పోలీస్ స్టేషన్‌ను నిర్మించారు. పాత భవనం నుండి కొత్త భవనంలోకి మారే ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. నిజానికి నిన్న 'జైల్ భరో' కార్యక్రమం ఉండటంతో, స్టేషన్‌లోని కంప్యూటర్ల ముందు పనిచేసే సిబ్బంది అంతా అదనపు భద్రతా విధుల కోసం బయటకు వెళ్లారు. దీంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఒకవేళ అందరూ లోపలే ఉండి ఉంటే నష్టం మరింత తీవ్రంగా ఉండేదని అధికారులు భావిస్తున్నారు. ఏఎస్ఐ శ్రీనివాసరావు ఒక్కరే అక్కడ విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్త భవనంలోకి పూర్తిస్థాయిలో మారేలోపే ఈ ఘటన జరగడం పట్ల స్థానిక పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
- మావోయిస్టు ప్రభావం నుంచి పర్యాటక ప్రాంతంగా కరిగుట్ట.. డీజీపీ కీలక ప్రకటన ములుగు జిల్లా కరిగుట్టలో శాంతి వాతావరణం నెలకొంటోంది. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కరిగుట్టలో పర్యటించి రోడ్డు పనులను పరిశీలించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, శాంతికి ప్రతీకగా తెల్ల పావురాలను విడుదల చేశారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో తెలంగాణ పోలీస్, గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా, ఛత్తీస్‌గఢ్ పోలీసుల సమన్వయాన్ని డీజీపీ ప్రశంసించారు. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కరిగుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రోడ్లు, విద్యుత్, మొబైల్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. పామూరు–చలమాదవ రహదారి పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.1
- ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విస్తృతంగా పర్యటించి అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం హనుమకొండలో... తలసేమియా, సికిల్ సెల్ వ్యాధితో బాధపడే చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ మంజూరూ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుపుతూ హనుమకొండ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వారు నిర్వహించిన కృతజ్ఞతా సభలో మంత్రి పొంగులేటి గారు ముఖ్యఅతిథిగా పాల్గొని, చిన్నారులకు పెన్షన్ కు సంబంధించిన హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు. ఆ తరువాత ఇషా సూపర్ స్పెషాలిటీ & క్రిటికల్ కేర్ ఆసుపత్రికి మంత్రిగారు ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన రైతుమేళా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం వరంగల్ పట్టణంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయం అభివృద్ధి పనులను పరిశీలించి, కాతీయ మ్యూజికల్ గార్డెన్ ప్రారంభించారు. దీంతో పాటు కాజీపేట దర్గా లో ముస్లీం మత పెద్దల సమక్షంలో నిర్వహించిన ఉర్సు వేడుకల్లో మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్ గారు, కొండా సురేఖ గారితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాల్లొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ సారయ్య గారు, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి గారు, కే. ఎల్. నాగరాజు గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లు, సంబంధిత ఆయా శాఖల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, మైనార్టీ సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.1
- రత్నవరంలో బోనాల సందడి.................................... సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలోని హరిహర క్షేత్రంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు తీసుకొచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆటపాటలతో సందడి చేశారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. మహిళల బోనాల సమర్పణతో ఆలయ పరిసరాలు భక్తిభావంతో కళకళలాడాయి.1
- సీఎం సభకు పటిష్ట ఏర్పాట్లపై వరంగల్ సిపి శ్వేతతో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ హనుమకొండ జిల్లా పరకాలలో ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే సభకు పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం పరకాలలో సీఎం పర్యటన నేపథ్యంలో ప్రతిపాదిత హెలిప్యాడ్, సభా వేదిక, వాహనాల పార్కింగ్, రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద సీఎం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.ప్రతిపాదిత హెలిప్యాడ్ కోసం లలితా కన్వెన్షన్ హాల్ సమీపంలోని స్థలాన్ని, సభా వేదిక, వాహనాల పార్కింగ్ కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అంగడి స్థలాలను పరిశీలించారు. సభకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోకలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ, సీఎం పర్యటనలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హెలిప్యాడ్ నుంచి సీఎం ప్రయాణించే మార్గం, ఆసుపత్రి ప్రారంభోత్సవం, సభా వేదిక, ప్రజల రాకపోకలు, పార్కింగ్, రహదారులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ, సీఎం భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ హెలిప్యాడ్, రూట్ మ్యాప్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన భద్రతా ప్రణాళిక అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.అనంతరం సీఎం పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ ప్రణాళికపై కలెక్టర్, పోలీస్ కమిషనర్ అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ రవి, డీఆర్డీవో మేన శ్రీను, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సురేష్ బాబు, ఈఈ దేవిక, టీడబ్ల్యూఐడీసీ ఈఈ అరుణ్ కుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య, పరకాల మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పవన్, ఏసీపీ సతీష్ బాబు, పరకాల సీఐ క్రాంతి కుమార్, కౌన్సిలర్లు శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1
- కాజిపేట్ చౌరస్తా లో పెద్ది సుదర్శన్ రెడ్డి భారీ చిత్రపటానికి నివాళులు అర్పించిన దాస్యం వినయ్ భాస్కర్ *పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ ఘన నివాళులు* * *దాస్యం వినయభాస్కర్* * *ఈరోజు కాజీపేట చౌరస్తాలో బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధానకార్యదర్శి గబ్బేట శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో* జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిధిగా దాస్యం వినయ్ భాస్కర్ గారు పాల్గొని ఉద్యమ నాయకులు నర్సంపేట మాజీ శాసనసభ్యులు క్రీ:శే : పెద్ది సుదర్శన్ రెడ్డి గారి భారీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఛీప్ విప్ హనుమకొండ బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ బాస్కర్ గారు అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ మాట్లాడుతూ పెద్ది లేని లోటు పూడ్చలేనిది పెద్ది విగ్రహ ఏర్పాటు గద్దె కూల్చివేత దుర్మార్గం *ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు* కాజీపేట చౌరస్తాలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు, ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి యాదిలో కార్యక్రమాన్ని సోమవారం రోజున నిర్వహించారు మొదట పెద్ది చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ నిస్వార్ధమైన గొప్ప తెలంగాణ ఉద్యమకారుడు, గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు పెద్దితో నాకు ఉన్నది ఉద్యమ అనుబంధం తెలంగాణ కోసం కలిసి పోరాడం ఇదే కాజీపేట కేంద్రంగా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, బంద్లు, వంటా వార్పులు చేశాం ఎన్నో రాస్తారోకోలు, రైల్ రోకోలు చేశాము ఎన్నో కేసులు ఎదుర్కొని కోర్టులకు వెళ్ళాం పెద్ది మనల్ని విడిచి వెళ్లడం బాధాకరం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఇద్దరం కలిసి పోరాడిన సందర్భాలు అనేకం నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ది విగ్రహ ఏర్పాటు గద్దె కూల్చివేత దుర్మార్గం స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన గద్దె గుల్చివేత కూల్చివేత దుర్మార్గం ఒక ఉద్యమకారుడు, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ ప్రజాప్రతినిధి విగ్రహ ఏర్పాటును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వమే పెద్ది విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.. ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* సుంచు కృష్ణ మాజీ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్ మాజీ కార్పొరేటర్లు సంకు నర్సింగరావు సోద కిరణ్ వద్దిరాజు గణేష్ ఎండి అఫ్జల్ ఎండి హుస్సేన్ బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పాలడుగుల శివకుమార్ దువ్వ కనకరాజ్ బెదురుకోట రంజిత్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు *గబ్బేట కరుణ్ (సిద్దు)* బరిగెల వినయ్ ఎస్.కె మహమూద్ దువ్వ నరేష్ (కిట్టు)మాచర్ల ప్రభాకర్ కంజర్ల మనోజ్ కొండ శంకర్ మరియాల కృష్ణ తండముల వేణు రాబర్ట్ సయ్యద్ యాకూబ్ మంద రాజ్ కుమార్ బండి రామచందర్ పడిదల శేఖర్ బరబరి శ్రీకాంత్ గౌరీ శంకర్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించినారు.. 🙏🙏🙏🙏🙏 **మీ..* *గబ్బేట శ్రీనివాస్* *బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధానకార్యదర్శి వరంగల్**1
- మంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన పనులు.. మధ్యలోనే మాయం! ఖమ్మం బైపాస్‌పై ప్రజల అవస్థలు ఖమ్మం బైపాస్ రోడ్డుపై అసంపూర్తి కాలువ పనులతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాకు ప్రధాన రహదారిగా ఉన్న బైపాస్ రోడ్డు పక్కన కాలువ మరమ్మతు పనులను ప్రారంభించి.. అధికారులు, పాలకులు మధ్యలోనే వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి నోచుకోని స్థితిలోనే పనులు నిలిచిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగం పనులు పూర్తయిన తర్వాత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో.. రోడ్డు పక్కన మట్టి, నిర్మాణ సామగ్రి పేరుకుపోయి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాపర్తి నగర్ వైపు వెళ్లే ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారిన ఈ అసంపూర్తి కాలువ పనులను వెంటనే పూర్తి చేసి.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.1
- రాత్రివేళ గ్రామాల్లో పర్యటిస్తూ కార్యకర్తలకు భరోసా.. అనారోగ్యంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తకు ఎమ్మెల్యే పరామర్శ ఆపదలో ఉన్న కార్యకర్తలు ఏ సమయంలోనైనా తనకు ఫోన్ చేయాలని, వారికి అండగా నిలిచే విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ భరోసా ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామంలో అనారోగ్యంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తను రామచంద్ర నాయక్ పరామర్శించారు. రాత్రివేళ గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలను కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆపద సమయంలో వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే తమకు భరోసా కల్పించడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.1
- ఖమ్మం జిల్లా రూరల్ పోలీసులు నలుగురు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 10 మోటార్లు,100 కేజీల కాపర్ వైర్ స్వాధీనం ఖమ్మం జిల్లా రూరల్ పోలీసులు నలుగురు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 10 మోటార్లు,100 కేజీల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నారు.ఖమ్మం పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ మోటార్లు, స్టార్టర్ బాక్సులతో పాటు ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ వైర్ను చోరీ చేస్తున్నారు.రూరల్ పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి పది మోటార్లు, 100 కిలోల కాపర్ వైర్, ఆటోను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.1