Shuru
Apke Nagar Ki App…
రత్నవరంలో బోనాల సందడి.................................... సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలోని హరిహర క్షేత్రంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు తీసుకొచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆటపాటలతో సందడి చేశారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. మహిళల బోనాల సమర్పణతో ఆలయ పరిసరాలు భక్తిభావంతో కళకళలాడాయి.
K. UPENDER
రత్నవరంలో బోనాల సందడి.................................... సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలోని హరిహర క్షేత్రంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు తీసుకొచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆటపాటలతో సందడి చేశారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. మహిళల బోనాల సమర్పణతో ఆలయ పరిసరాలు భక్తిభావంతో కళకళలాడాయి.
More news from తెలంగాణ and nearby areas
- రత్నవరంలో బోనాల సందడి.................................... సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలోని హరిహర క్షేత్రంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు తీసుకొచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆటపాటలతో సందడి చేశారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. మహిళల బోనాల సమర్పణతో ఆలయ పరిసరాలు భక్తిభావంతో కళకళలాడాయి.1
- మధిర మున్సిపల్ సమస్యలు పరిష్కరించాలి:బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.1
- ఖమ్మం ఏఎంసీ మార్కెట్‌లో సమస్యల కుప్పలు.. చెత్తతో కంపుకొడుతున్న కూరగాయల మార్కెట్ ఖమ్మం జిల్లా మొత్తానికి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ.. ప్రస్తుతం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. మార్కెట్‌లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి ఉండటంతో వ్యాపారులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మార్కెట్‌లో తాగునీటి సమస్య కూడా వేధిస్తోంది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన నాలుగు మంచినీటి పంపులు పనిచేయకపోవడంతో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు కూరగాయల వ్యర్థాలు ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో మార్కెట్ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. వేలాది మంది ప్రజలు, వ్యాపారులు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన మార్కెట్‌లో కనీస పారిశుధ్య, తాగునీటి వసతులు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెట్‌లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, పనిచేయని మంచినీటి పంపులను వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు, ప్రజలు కోరుతున్నారు.4
- మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ లో సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఏఎస్ఐ కి గాయాలు మరిపెడ పోలీస్ స్టేషన్‌లో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. పాత పోలీస్ స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరడంతో, సీలింగ్ పెచ్చులు ఊడిపడి విధుల్లో ఉన్న ఏఎస్ఐ శ్రీనివాసరావు భుజంపై పడ్డాయి. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. భవనం పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరడంతో ఇప్పటికే అన్ని ఆధునిక వసతులు, హంగులతో పక్కనే నూతన పోలీస్ స్టేషన్‌ను నిర్మించారు. పాత భవనం నుండి కొత్త భవనంలోకి మారే ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. నిజానికి నిన్న 'జైల్ భరో' కార్యక్రమం ఉండటంతో, స్టేషన్‌లోని కంప్యూటర్ల ముందు పనిచేసే సిబ్బంది అంతా అదనపు భద్రతా విధుల కోసం బయటకు వెళ్లారు. దీంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఒకవేళ అందరూ లోపలే ఉండి ఉంటే నష్టం మరింత తీవ్రంగా ఉండేదని అధికారులు భావిస్తున్నారు. ఏఎస్ఐ శ్రీనివాసరావు ఒక్కరే అక్కడ విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్త భవనంలోకి పూర్తిస్థాయిలో మారేలోపే ఈ ఘటన జరగడం పట్ల స్థానిక పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.1
- బీసీల పక్షపాతి పుంజాల శివ శంకర్ గారి జయంతి సందర్భంగా ఆయనను మనసారా స్మరించుకుందాం🙏 బీసీలకు 27% ఉద్యోగ రిజర్వేషన్ కల్పించిన మహనీయుడు పుంజాల శివ శంకర్ గారు బీసీల పక్షపాతి పుంజాల శివ శంకర్ గారి జయంతి సందర్భంగా ఆయనను మనసారా స్మరించుకుందాం🙏💐1
- అమ్మో 80 ఏళ్ల కింద నాటి బావి వైరల్ వీడియో చూసి తరించండి జనగాం జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలోని అతి పురాతనమైన బావి ఉంది. ఇది దగ్గర దగ్గర 7 గోళల లోతు ఉంటుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. వీలుంటే మీరు కూడా అటు పక్కకు పోయినప్పుడు చూసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించండి.1
- ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విస్తృతంగా పర్యటించి అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం హనుమకొండలో... తలసేమియా, సికిల్ సెల్ వ్యాధితో బాధపడే చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ మంజూరూ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుపుతూ హనుమకొండ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వారు నిర్వహించిన కృతజ్ఞతా సభలో మంత్రి పొంగులేటి గారు ముఖ్యఅతిథిగా పాల్గొని, చిన్నారులకు పెన్షన్ కు సంబంధించిన హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు. ఆ తరువాత ఇషా సూపర్ స్పెషాలిటీ & క్రిటికల్ కేర్ ఆసుపత్రికి మంత్రిగారు ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన రైతుమేళా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం వరంగల్ పట్టణంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయం అభివృద్ధి పనులను పరిశీలించి, కాతీయ మ్యూజికల్ గార్డెన్ ప్రారంభించారు. దీంతో పాటు కాజీపేట దర్గా లో ముస్లీం మత పెద్దల సమక్షంలో నిర్వహించిన ఉర్సు వేడుకల్లో మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్ గారు, కొండా సురేఖ గారితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాల్లొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ సారయ్య గారు, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి గారు, కే. ఎల్. నాగరాజు గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లు, సంబంధిత ఆయా శాఖల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, మైనార్టీ సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.1
- గ్రామీణ ప్రజలకు పెద్ద ఊరట గువ్వలగూడంలో వారాంతపు సంత ప్రారంభమైంది. గ్రామీణ ప్రజలకు పెద్ద ఊరట. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడంలో వారాంతపు సంత ప్రారంభమైంది. దీంతో రైతుల నుండి నేరుగా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ...ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడం గ్రామంలో వారాంతపు సంతను నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, మాజీ చైర్మన్ శాఖమూరి రమేష్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో కూడా వారాంతపు సంత నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సంత వల్ల రైతులు తమ పంటను మధ్య దళారులు లేకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముకోవచ్చు. ప్రజలకు కూడా తక్కువ ధరకు తాజా కూరగాయలు,నిత్యావసరాలు అందుతాయి. ఇది గ్రామ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఉపయోగపడుతుంది. సంతలో రైతులు తమ పంటలను, గృహిణులు ఇంట్లో తయారు చేసిన వస్తువులను అమ్ముకోవటానికి అవకాశం కల్పించారు.ఇలాంటి సంతలు ప్రతి గ్రామంలో ఉండాలి. దీని వల్ల మహిళలు, చిన్న వ్యాపారులకు ఉపాధి లభిస్తుంది. ప్రజలకు ఒకే చోట అన్ని సరుకులు దొరుకుతాయి. అని అన్నారు.1