ఖమ్మం ఏఎంసీ మార్కెట్‌లో సమస్యల కుప్పలు.. చెత్తతో కంపుకొడుతున్న కూరగాయల మార్కెట్ ఖమ్మం జిల్లా మొత్తానికి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ.. ప్రస్తుతం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. మార్కెట్‌లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి ఉండటంతో వ్యాపారులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మార్కెట్‌లో తాగునీటి సమస్య కూడా వేధిస్తోంది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన నాలుగు మంచినీటి పంపులు పనిచేయకపోవడంతో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు కూరగాయల వ్యర్థాలు ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో మార్కెట్ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. వేలాది మంది ప్రజలు, వ్యాపారులు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన మార్కెట్‌లో కనీస పారిశుధ్య, తాగునీటి వసతులు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెట్‌లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, పనిచేయని మంచినీటి పంపులను వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు, ప్రజలు కోరుతున్నారు.
ఖమ్మం ఏఎంసీ మార్కెట్‌లో సమస్యల కుప్పలు.. చెత్తతో కంపుకొడుతున్న కూరగాయల మార్కెట్ ఖమ్మం జిల్లా మొత్తానికి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ.. ప్రస్తుతం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. మార్కెట్‌లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం
పేరుకుపోయి ఉండటంతో వ్యాపారులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మార్కెట్‌లో తాగునీటి సమస్య కూడా వేధిస్తోంది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన నాలుగు మంచినీటి పంపులు పనిచేయకపోవడంతో
నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు కూరగాయల వ్యర్థాలు ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో మార్కెట్ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. వేలాది మంది ప్రజలు, వ్యాపారులు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన మార్కెట్‌లో కనీస పారిశుధ్య, తాగునీటి
వసతులు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెట్‌లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, పనిచేయని మంచినీటి పంపులను వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు, ప్రజలు కోరుతున్నారు.
- ఖమ్మం నగరంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల బస్సుల్లో విద్యార్థుల తరలింపుపై తీవ్ర వివాదం నెలకొంది. పరిమితికి మించి ఒకే బస్సులో భారీ సంఖ్యలో విద్యార్థులను తరలిస్తున్నారంటూ యుఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. బస్సును అడ్డుకుని విద్యా సంస్థ యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. విద్యార్థుల నుంచి భారీగా బస్సు ఫీజులు వసూలు చేస్తూ కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని యుఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. సీటింగ్ సామర్థ్యానికి మించి సుమారు 100 మందికి పైగా విద్యార్థులను ఒకే బస్సులో తరలించడం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటమేనని మండిపడ్డారు. ఇదే సమయంలో యుఎస్ఎఫ్ఐ చేసిన నిరసన, ఫిర్యాదుపై రవాణా శాఖ అధికారులు స్పందించారు. పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నట్లు గుర్తించిన శ్రీ చైతన్య విద్యా సంస్థకు చెందిన బస్సును అక్కడికక్కడే సీజ్ చేశారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల బస్సుల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలను సమగ్రంగా తనిఖీ చేయాలని యుఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది.4
- మధిర మున్సిపల్ సమస్యలు పరిష్కరించాలి:బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.1
- రత్నవరంలో బోనాల సందడి.................................... సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలోని హరిహర క్షేత్రంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు తీసుకొచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆటపాటలతో సందడి చేశారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. మహిళల బోనాల సమర్పణతో ఆలయ పరిసరాలు భక్తిభావంతో కళకళలాడాయి.1
- సండ్రా ఫైబర్ కేటుగాడు పిడమర్తి రవి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు నమస్కారం మీ అందరికీ ముందు నుంచే నేను హెచ్చరిస్తున్న సండ్ర వెంకట వీరయ్య సైబర్ నేరగాడు సైబర్ కేటు గాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న యువకులను జమ చేసుకొని వాళ్ళ ద్వారా ఆస్ట్రేలియాలో ఒక కంపెనీ పెట్టి ఆ సైబర్ కంపెనీ ద్వారా 1000 కోట్ల రూపాయలు సంపాదించిండు సత్తుపల్లి నియోజకవర్గంలో మూడుసార్లు గెలిచి చేసిన గొప్ప పని ఇది. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మద్యం మాఫియా దొంగ నోట్ల ముద్రణ జూదం బెట్టింగ్ అన్ని మాఫియాల వెనుక సండ్ర వెంకట వీర ఉన్నాడు ఆయన పని డబ్బు సంపాదనని ఆయన సత్తుపల్లికి అభివృద్ధి ఆయననే అభివృద్ధి చెందింది ఇటువంటి లోఫర్ పనులు చేసుకుంటా ఈ ప్రాంత యువకులైనటువంటి పట్టాభి ప్రవీణ్ లు కాదు ముందుగా సండ్రా వెంకట వీరిని అరెస్ట్ చేయాలి ఆస్ట్రేలియా ఉంటున్న తన కొడుకుని అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకురావాలి పోలీసులు ప్రభుత్వము సండ్ర వెంకటవీరని అరెస్టు చేస్తే మొత్తం నిజ నిజాలు బయటపడతాయి ఈ విషయాలు వెలుగులోకి రావడంతో సత్తుపల్లి నియోజకవర్గం ముఖం చాట్ చేసిన వీరయ్య నిజంగా సత్తుపల్లి మీద నిజంగా అతని మీద వస్తున్న నేపథ్యంలో సత్తుపల్లి కి రాకుండా కీరవాణి సంభాషణలు జరుపుతున్నాడు1
- మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ లో సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఏఎస్ఐ కి గాయాలు మరిపెడ పోలీస్ స్టేషన్‌లో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. పాత పోలీస్ స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరడంతో, సీలింగ్ పెచ్చులు ఊడిపడి విధుల్లో ఉన్న ఏఎస్ఐ శ్రీనివాసరావు భుజంపై పడ్డాయి. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. భవనం పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరడంతో ఇప్పటికే అన్ని ఆధునిక వసతులు, హంగులతో పక్కనే నూతన పోలీస్ స్టేషన్‌ను నిర్మించారు. పాత భవనం నుండి కొత్త భవనంలోకి మారే ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. నిజానికి నిన్న 'జైల్ భరో' కార్యక్రమం ఉండటంతో, స్టేషన్‌లోని కంప్యూటర్ల ముందు పనిచేసే సిబ్బంది అంతా అదనపు భద్రతా విధుల కోసం బయటకు వెళ్లారు. దీంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఒకవేళ అందరూ లోపలే ఉండి ఉంటే నష్టం మరింత తీవ్రంగా ఉండేదని అధికారులు భావిస్తున్నారు. ఏఎస్ఐ శ్రీనివాసరావు ఒక్కరే అక్కడ విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్త భవనంలోకి పూర్తిస్థాయిలో మారేలోపే ఈ ఘటన జరగడం పట్ల స్థానిక పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.1
- సీపీఐ ప్రజా చైతన్య యాత్ర.. ‘బద్లావ్ జరూరీ హై.. దేశంలో మార్పు కావాలి’ నినాదంతో ముందుకు సాగుతున్న సీపీఐ కొత్తగూడెంలోకి సీపీఐ ప్రజా చైతన్య యాత్ర.. ‘బద్లావ్ జరూరీ హై.. దేశంలో మార్పు కావాలి’ నినాదంతో ముందుకు సాగుతున్న సీపీఐ కొత్తగూడెంలో ‘బద్లావ్ జరూరీ హై.. దేశంలో మార్పు కావాలి’ అనే నినాదంతో కదం తొక్కిన కామ్రేడ్లు అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు.. ఎరుపెక్కిన కోల్ టౌన్ కొత్తగూడెం.. సీపీఐ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి కొనసాగుతున్న ప్రజా చైతన్య యాత్ర సోమవారం కొత్తగూడెంలోకి ప్రవేశించింది. యాత్రకు అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. గడ్డం శాంతిప్రియ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ప్రజలు యాత్రకు స్వాగతం పలికి, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషాకు పూలమాలలు వేసి సంఘీభావం, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘చేంజ్ ఇండియా.. సేవ్ ఇండియా’ నినాదంతో పాలనలో మార్పు కోసం దేశవ్యాప్తంగా ప్రచార ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో గత ఆరు రోజులుగా ప్రజా చైతన్య యాత్ర 144 కేంద్రాలు, గ్రామాల్లో పర్యటించి బహిరంగ సభలు నిర్వహిస్తూ కొత్తగూడెం చేరుకుందని తెలిపారు. గత 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని తిరోగమన దిశగా తీసుకెళ్తోందని ఆయన విమర్శించారు. ఈ ప్రభుత్వం రైతు, కార్మిక, మహిళా, యువజన, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించాల్సిన సమయంలో దేశంలో విద్వేషాలను ప్రోత్సహించే విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ఈ తిరోగమన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల సంఘటిత పోరాటం అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సాబీర్ పాషా డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించి, సీతారామ ప్రాజెక్టు నీటిని జిల్లాలోని ప్రతి గ్రామం, మండలానికి అందించాలని కోరారు. జిల్లాలో కొత్త బొగ్గు బావులు ఏర్పాటు చేయాలని, జీవో 76 ద్వారా ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, కార్మిక వర్గానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనం ఎజెండాను విస్మరించిన పాలకవర్గాలపై ప్రజల తరఫున పోరాటం చేయడమే ఈ ప్రజా చైతన్య యాత్ర లక్ష్యమని తెలిపారు. యాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఎవరి పక్షం కాదు.. ప్రజల పక్షం అని సాబీర్ పాషా స్పష్టం చేశారు. ప్రజల మేలు, భద్రత, వారి జీవితాల్లో మార్పు కోసం పోరాట అజెండాతో ఎర్రజెండా ముందుకు సాగుతోందన్నారు. ప్రజా చైతన్య యాత్రకు స్వాగతం పలుకుతున్న ప్రతి ఒక్కరికీ, యాత్రలో భాగస్వాములవుతున్న ప్రజలకు విప్లవాభివందనాలు తెలిపారు.1
- ఖమ్మం ఏఎంసీ మార్కెట్‌లో సమస్యల కుప్పలు.. చెత్తతో కంపుకొడుతున్న కూరగాయల మార్కెట్ ఖమ్మం జిల్లా మొత్తానికి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ.. ప్రస్తుతం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. మార్కెట్‌లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి ఉండటంతో వ్యాపారులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మార్కెట్‌లో తాగునీటి సమస్య కూడా వేధిస్తోంది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన నాలుగు మంచినీటి పంపులు పనిచేయకపోవడంతో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు కూరగాయల వ్యర్థాలు ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో మార్కెట్ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. వేలాది మంది ప్రజలు, వ్యాపారులు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన మార్కెట్‌లో కనీస పారిశుధ్య, తాగునీటి వసతులు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెట్‌లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, పనిచేయని మంచినీటి పంపులను వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు, ప్రజలు కోరుతున్నారు.4
- గ్రామీణ ప్రజలకు పెద్ద ఊరట గువ్వలగూడంలో వారాంతపు సంత ప్రారంభమైంది. గ్రామీణ ప్రజలకు పెద్ద ఊరట. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడంలో వారాంతపు సంత ప్రారంభమైంది. దీంతో రైతుల నుండి నేరుగా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ...ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడం గ్రామంలో వారాంతపు సంతను నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, మాజీ చైర్మన్ శాఖమూరి రమేష్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో కూడా వారాంతపు సంత నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సంత వల్ల రైతులు తమ పంటను మధ్య దళారులు లేకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముకోవచ్చు. ప్రజలకు కూడా తక్కువ ధరకు తాజా కూరగాయలు,నిత్యావసరాలు అందుతాయి. ఇది గ్రామ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఉపయోగపడుతుంది. సంతలో రైతులు తమ పంటలను, గృహిణులు ఇంట్లో తయారు చేసిన వస్తువులను అమ్ముకోవటానికి అవకాశం కల్పించారు.ఇలాంటి సంతలు ప్రతి గ్రామంలో ఉండాలి. దీని వల్ల మహిళలు, చిన్న వ్యాపారులకు ఉపాధి లభిస్తుంది. ప్రజలకు ఒకే చోట అన్ని సరుకులు దొరుకుతాయి. అని అన్నారు.1