సీపీఐ ప్రజా చైతన్య యాత్ర.. ‘బద్లావ్ జరూరీ హై.. దేశంలో మార్పు కావాలి’ నినాదంతో ముందుకు సాగుతున్న సీపీఐ కొత్తగూడెంలోకి సీపీఐ ప్రజా చైతన్య యాత్ర.. ‘బద్లావ్ జరూరీ హై.. దేశంలో మార్పు కావాలి’ నినాదంతో ముందుకు సాగుతున్న సీపీఐ కొత్తగూడెంలో ‘బద్లావ్ జరూరీ హై.. దేశంలో మార్పు కావాలి’ అనే నినాదంతో కదం తొక్కిన కామ్రేడ్లు అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు.. ఎరుపెక్కిన కోల్ టౌన్ కొత్తగూడెం.. సీపీఐ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి కొనసాగుతున్న ప్రజా చైతన్య యాత్ర సోమవారం కొత్తగూడెంలోకి ప్రవేశించింది. యాత్రకు అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. గడ్డం శాంతిప్రియ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ప్రజలు యాత్రకు స్వాగతం పలికి, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషాకు పూలమాలలు వేసి సంఘీభావం, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘చేంజ్ ఇండియా.. సేవ్ ఇండియా’ నినాదంతో పాలనలో మార్పు కోసం దేశవ్యాప్తంగా ప్రచార ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో గత ఆరు రోజులుగా ప్రజా చైతన్య యాత్ర 144 కేంద్రాలు, గ్రామాల్లో పర్యటించి బహిరంగ సభలు నిర్వహిస్తూ కొత్తగూడెం చేరుకుందని తెలిపారు. గత 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని తిరోగమన దిశగా తీసుకెళ్తోందని ఆయన విమర్శించారు. ఈ ప్రభుత్వం రైతు, కార్మిక, మహిళా, యువజన, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించాల్సిన సమయంలో దేశంలో విద్వేషాలను ప్రోత్సహించే విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ఈ తిరోగమన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల సంఘటిత పోరాటం అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సాబీర్ పాషా డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించి, సీతారామ ప్రాజెక్టు నీటిని జిల్లాలోని ప్రతి గ్రామం, మండలానికి అందించాలని కోరారు. జిల్లాలో కొత్త బొగ్గు బావులు ఏర్పాటు చేయాలని, జీవో 76 ద్వారా ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, కార్మిక వర్గానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనం ఎజెండాను విస్మరించిన పాలకవర్గాలపై ప్రజల తరఫున పోరాటం చేయడమే ఈ ప్రజా చైతన్య యాత్ర లక్ష్యమని తెలిపారు. యాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఎవరి పక్షం కాదు.. ప్రజల పక్షం అని సాబీర్ పాషా స్పష్టం చేశారు. ప్రజల మేలు, భద్రత, వారి జీవితాల్లో మార్పు కోసం పోరాట అజెండాతో ఎర్రజెండా ముందుకు సాగుతోందన్నారు. ప్రజా చైతన్య యాత్రకు స్వాగతం పలుకుతున్న ప్రతి ఒక్కరికీ, యాత్రలో భాగస్వాములవుతున్న ప్రజలకు విప్లవాభివందనాలు తెలిపారు.
సీపీఐ ప్రజా చైతన్య యాత్ర.. ‘బద్లావ్ జరూరీ హై.. దేశంలో మార్పు కావాలి’ నినాదంతో ముందుకు సాగుతున్న సీపీఐ కొత్తగూడెంలోకి సీపీఐ ప్రజా చైతన్య యాత్ర.. ‘బద్లావ్ జరూరీ హై.. దేశంలో మార్పు కావాలి’ నినాదంతో ముందుకు సాగుతున్న సీపీఐ కొత్తగూడెంలో ‘బద్లావ్ జరూరీ హై.. దేశంలో మార్పు కావాలి’ అనే నినాదంతో కదం తొక్కిన కామ్రేడ్లు అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు.. ఎరుపెక్కిన కోల్ టౌన్ కొత్తగూడెం.. సీపీఐ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి కొనసాగుతున్న ప్రజా చైతన్య యాత్ర సోమవారం కొత్తగూడెంలోకి ప్రవేశించింది. యాత్రకు అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. గడ్డం శాంతిప్రియ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ప్రజలు యాత్రకు స్వాగతం పలికి, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషాకు పూలమాలలు వేసి సంఘీభావం, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘చేంజ్ ఇండియా.. సేవ్ ఇండియా’ నినాదంతో పాలనలో మార్పు కోసం దేశవ్యాప్తంగా ప్రచార ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో గత ఆరు రోజులుగా ప్రజా చైతన్య యాత్ర 144 కేంద్రాలు, గ్రామాల్లో పర్యటించి బహిరంగ సభలు నిర్వహిస్తూ కొత్తగూడెం చేరుకుందని తెలిపారు. గత 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని తిరోగమన దిశగా తీసుకెళ్తోందని ఆయన విమర్శించారు. ఈ ప్రభుత్వం రైతు, కార్మిక, మహిళా, యువజన, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించాల్సిన సమయంలో దేశంలో విద్వేషాలను ప్రోత్సహించే విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ఈ తిరోగమన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల సంఘటిత పోరాటం అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సాబీర్ పాషా డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించి, సీతారామ ప్రాజెక్టు నీటిని జిల్లాలోని ప్రతి గ్రామం, మండలానికి అందించాలని కోరారు. జిల్లాలో కొత్త బొగ్గు బావులు ఏర్పాటు చేయాలని, జీవో 76 ద్వారా ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, కార్మిక వర్గానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనం ఎజెండాను విస్మరించిన పాలకవర్గాలపై ప్రజల తరఫున పోరాటం చేయడమే ఈ ప్రజా చైతన్య యాత్ర లక్ష్యమని తెలిపారు. యాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఎవరి పక్షం కాదు.. ప్రజల పక్షం అని సాబీర్ పాషా స్పష్టం చేశారు. ప్రజల మేలు, భద్రత, వారి జీవితాల్లో మార్పు కోసం పోరాట అజెండాతో ఎర్రజెండా ముందుకు సాగుతోందన్నారు. ప్రజా చైతన్య యాత్రకు స్వాగతం పలుకుతున్న ప్రతి ఒక్కరికీ, యాత్రలో భాగస్వాములవుతున్న ప్రజలకు విప్లవాభివందనాలు తెలిపారు.
- సీపీఐ ప్రజా చైతన్య యాత్ర.. ‘బద్లావ్ జరూరీ హై.. దేశంలో మార్పు కావాలి’ నినాదంతో ముందుకు సాగుతున్న సీపీఐ కొత్తగూడెంలోకి సీపీఐ ప్రజా చైతన్య యాత్ర.. ‘బద్లావ్ జరూరీ హై.. దేశంలో మార్పు కావాలి’ నినాదంతో ముందుకు సాగుతున్న సీపీఐ కొత్తగూడెంలో ‘బద్లావ్ జరూరీ హై.. దేశంలో మార్పు కావాలి’ అనే నినాదంతో కదం తొక్కిన కామ్రేడ్లు అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు.. ఎరుపెక్కిన కోల్ టౌన్ కొత్తగూడెం.. సీపీఐ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి కొనసాగుతున్న ప్రజా చైతన్య యాత్ర సోమవారం కొత్తగూడెంలోకి ప్రవేశించింది. యాత్రకు అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. గడ్డం శాంతిప్రియ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ప్రజలు యాత్రకు స్వాగతం పలికి, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషాకు పూలమాలలు వేసి సంఘీభావం, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘చేంజ్ ఇండియా.. సేవ్ ఇండియా’ నినాదంతో పాలనలో మార్పు కోసం దేశవ్యాప్తంగా ప్రచార ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో గత ఆరు రోజులుగా ప్రజా చైతన్య యాత్ర 144 కేంద్రాలు, గ్రామాల్లో పర్యటించి బహిరంగ సభలు నిర్వహిస్తూ కొత్తగూడెం చేరుకుందని తెలిపారు. గత 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని తిరోగమన దిశగా తీసుకెళ్తోందని ఆయన విమర్శించారు. ఈ ప్రభుత్వం రైతు, కార్మిక, మహిళా, యువజన, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించాల్సిన సమయంలో దేశంలో విద్వేషాలను ప్రోత్సహించే విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ఈ తిరోగమన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల సంఘటిత పోరాటం అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సాబీర్ పాషా డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించి, సీతారామ ప్రాజెక్టు నీటిని జిల్లాలోని ప్రతి గ్రామం, మండలానికి అందించాలని కోరారు. జిల్లాలో కొత్త బొగ్గు బావులు ఏర్పాటు చేయాలని, జీవో 76 ద్వారా ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, కార్మిక వర్గానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనం ఎజెండాను విస్మరించిన పాలకవర్గాలపై ప్రజల తరఫున పోరాటం చేయడమే ఈ ప్రజా చైతన్య యాత్ర లక్ష్యమని తెలిపారు. యాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఎవరి పక్షం కాదు.. ప్రజల పక్షం అని సాబీర్ పాషా స్పష్టం చేశారు. ప్రజల మేలు, భద్రత, వారి జీవితాల్లో మార్పు కోసం పోరాట అజెండాతో ఎర్రజెండా ముందుకు సాగుతోందన్నారు. ప్రజా చైతన్య యాత్రకు స్వాగతం పలుకుతున్న ప్రతి ఒక్కరికీ, యాత్రలో భాగస్వాములవుతున్న ప్రజలకు విప్లవాభివందనాలు తెలిపారు.1
- మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ లో సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఏఎస్ఐ కి గాయాలు మరిపెడ పోలీస్ స్టేషన్‌లో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. పాత పోలీస్ స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరడంతో, సీలింగ్ పెచ్చులు ఊడిపడి విధుల్లో ఉన్న ఏఎస్ఐ శ్రీనివాసరావు భుజంపై పడ్డాయి. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. భవనం పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరడంతో ఇప్పటికే అన్ని ఆధునిక వసతులు, హంగులతో పక్కనే నూతన పోలీస్ స్టేషన్‌ను నిర్మించారు. పాత భవనం నుండి కొత్త భవనంలోకి మారే ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. నిజానికి నిన్న 'జైల్ భరో' కార్యక్రమం ఉండటంతో, స్టేషన్‌లోని కంప్యూటర్ల ముందు పనిచేసే సిబ్బంది అంతా అదనపు భద్రతా విధుల కోసం బయటకు వెళ్లారు. దీంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఒకవేళ అందరూ లోపలే ఉండి ఉంటే నష్టం మరింత తీవ్రంగా ఉండేదని అధికారులు భావిస్తున్నారు. ఏఎస్ఐ శ్రీనివాసరావు ఒక్కరే అక్కడ విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్త భవనంలోకి పూర్తిస్థాయిలో మారేలోపే ఈ ఘటన జరగడం పట్ల స్థానిక పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.1
- ఖమ్మం నగరంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల బస్సుల్లో విద్యార్థుల తరలింపుపై తీవ్ర వివాదం నెలకొంది. పరిమితికి మించి ఒకే బస్సులో భారీ సంఖ్యలో విద్యార్థులను తరలిస్తున్నారంటూ యుఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. బస్సును అడ్డుకుని విద్యా సంస్థ యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. విద్యార్థుల నుంచి భారీగా బస్సు ఫీజులు వసూలు చేస్తూ కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని యుఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. సీటింగ్ సామర్థ్యానికి మించి సుమారు 100 మందికి పైగా విద్యార్థులను ఒకే బస్సులో తరలించడం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటమేనని మండిపడ్డారు. ఇదే సమయంలో యుఎస్ఎఫ్ఐ చేసిన నిరసన, ఫిర్యాదుపై రవాణా శాఖ అధికారులు స్పందించారు. పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నట్లు గుర్తించిన శ్రీ చైతన్య విద్యా సంస్థకు చెందిన బస్సును అక్కడికక్కడే సీజ్ చేశారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల బస్సుల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలను సమగ్రంగా తనిఖీ చేయాలని యుఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది.4
- సండ్రా ఫైబర్ కేటుగాడు పిడమర్తి రవి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు నమస్కారం మీ అందరికీ ముందు నుంచే నేను హెచ్చరిస్తున్న సండ్ర వెంకట వీరయ్య సైబర్ నేరగాడు సైబర్ కేటు గాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న యువకులను జమ చేసుకొని వాళ్ళ ద్వారా ఆస్ట్రేలియాలో ఒక కంపెనీ పెట్టి ఆ సైబర్ కంపెనీ ద్వారా 1000 కోట్ల రూపాయలు సంపాదించిండు సత్తుపల్లి నియోజకవర్గంలో మూడుసార్లు గెలిచి చేసిన గొప్ప పని ఇది. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మద్యం మాఫియా దొంగ నోట్ల ముద్రణ జూదం బెట్టింగ్ అన్ని మాఫియాల వెనుక సండ్ర వెంకట వీర ఉన్నాడు ఆయన పని డబ్బు సంపాదనని ఆయన సత్తుపల్లికి అభివృద్ధి ఆయననే అభివృద్ధి చెందింది ఇటువంటి లోఫర్ పనులు చేసుకుంటా ఈ ప్రాంత యువకులైనటువంటి పట్టాభి ప్రవీణ్ లు కాదు ముందుగా సండ్రా వెంకట వీరిని అరెస్ట్ చేయాలి ఆస్ట్రేలియా ఉంటున్న తన కొడుకుని అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకురావాలి పోలీసులు ప్రభుత్వము సండ్ర వెంకటవీరని అరెస్టు చేస్తే మొత్తం నిజ నిజాలు బయటపడతాయి ఈ విషయాలు వెలుగులోకి రావడంతో సత్తుపల్లి నియోజకవర్గం ముఖం చాట్ చేసిన వీరయ్య నిజంగా సత్తుపల్లి మీద నిజంగా అతని మీద వస్తున్న నేపథ్యంలో సత్తుపల్లి కి రాకుండా కీరవాణి సంభాషణలు జరుపుతున్నాడు1
- భూకబ్జా యత్నాలను అడ్డుకుని బాధిత రైతుకు రక్షణ కల్పించాలి: భూక్యా సీతారాం నాయక్ కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం గట్టు మల్ల గ్రామ పరిధిలోని వ్యవసాయ భూమిలో అక్రమంగా ప్రవేశించి పంటను ధ్వంసం చేయడం, బలవంతంగా పామాయిల్ మొక్కలు నాటడం, భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడం, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా నాయకులు భూక్యా సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధిత రైతు భట్టు హరి తరఫున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించారు. కలెక్టర్ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఫిర్యాదు కాపీని ఏవో రామకృష్ణ కి అందజేశారు. గట్టు మల్ల గ్రామ పరిధిలోని సర్వే నం. 120లో 9.01 ఎకరాలు, సర్వే నం. 119/ ఏ/1లో 1.01 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించి భట్టు శ్రీనివాస్ పేరుపై పట్టా పాస్‌బుక్‌లు, భూ రికార్డులు ఉన్నాయని తెలిపారు. భట్టు శ్రీనివాస్ విదేశాల్లో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నందున, తన మేనల్లుడు భట్టు హరికి 25-06-2025న (ఎస్పిఏ) ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో భూమిలో బోరు వేస్తున్న సమయంలో అడ్డుకోవడం, బోరులో రాళ్లు వేయడం, కేసింగ్ పైపులను ధ్వంసం చేయడం, ఫెన్సింగ్‌ను ధ్వంసం చేయడం వంటి ఘటనలు జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనలపై లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేయడంతో పాటు, గతంలో ఎస్ సి /ఎస్టి (Prevention of Atrocities) Act కింద కేసు కూడా నమోదు అయినట్లు వెల్లడించారు. అలాగే 24-03-2026న అదే వ్యవసాయ భూమిలో మృతదేహాన్ని దహనం చేసిన ఘటనపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇటీవల సుమారు 40–50 మంది వ్యక్తులను భూమి వద్దకు తీసుకువచ్చి, పత్తి పంటను ట్రాక్టర్‌తో దున్ని నాశనం చేయడంతో పాటు, భూ యజమాని అనుమతి లేకుండా పామాయిల్ మొక్కలను నాటినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రశ్నించినప్పుడు దాడికి ప్రయత్నిస్తూ, ప్రాణహాని కలిగించే విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు భూక్యా సీతారాం నాయక్ మాట్లాడుతూ, భట్టు శ్రీనివాస్ భూములను అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు. రెవెన్యూ రికార్డులను సమగ్రంగా పరిశీలించి వాస్తవ హక్కుదారులను నిర్ధారించాలని, పంట నష్టం, అక్రమ ప్రవేశం తదితర అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను కోరారు. బాధిత రైతు కుటుంబానికి తక్షణ పోలీసు రక్షణ కల్పించి, భూమిలోకి అక్రమంగా ప్రవేశించి పంటలను ధ్వంసం చేయడం, బలవంతంగా మొక్కలు నాటడం వంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పోలీస్, రెవెన్యూ శాఖలకు అందించిన ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించి, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు. “భట్టు శ్రీనివాస్ భూమి విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా, వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితుడికి న్యాయం చేయాలి. భూమి హక్కులు, శాంతిభద్రతలను కాపాడటం ప్రభుత్వ అధికారుల బాధ్యత. అధికారులు స్పందించి న్యాయం చేయని పక్షంలో బంజారా బిడ్డలను ఏకం చేసి, మా బంజారా బిడ్డ భట్టు శ్రీనివాస్ భూమిని కాపాడుకునేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తాం” అని భూక్యా సీతారాం నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ములకలపల్లి మండల అధ్యక్షులు గుగులోత్ శంకర్ నాయక్, భట్టు నరేష్ నాయక్, భట్టు వీరన్న నాయక్, భట్టు హరి నాయక్, బానోత్ సందీప్ నాయక్, బానోత్ సతీష్ నాయక్, భట్టు తేజ నాయక్ తదితరులు పాల్గొన్నారు.1
- సారపాక శివాలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నవగ్రహ హోమం*l విశ్వహిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత్ విభాగం ఆధ్వర్యంలో సారపాక శివాలయంలో నవగ్రహ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అయోధ్య రామజన్మభూమిలో జరిగిన సొమ్ము చోరీ ఘటనను నిరసిస్తూ, ఆలయ విశిష్టతను, స్వామీజీలు, అర్చకులు, హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసే విధంగా జరుగుతున్న పరిణామాలను ఖండిస్తూ ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అయోధ్య రామజన్మభూమి వంటి పవిత్రమైన క్షేత్రానికి సంబంధించిన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని వారు పేర్కొన్నారు. పార్లమెంట్ వెలుపల ఇండియా కూటమి నాయకులు చేస్తున్న నిరసనలు, వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారికి భగవంతుడు సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ ప్రత్యేకంగా నవగ్రహ హోమం నిర్వహించినట్లు తెలిపారు. హోమ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, హిందూ సమాజంలో ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించారు. హిందూ ధర్మం, ఆలయాలు, అర్చకులు, స్వామీజీల పట్ల గౌరవభావం పెంపొందాలని, హిందూ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారికి దుర్బుద్ధి తొలగి సద్బుద్ధి కలగాలని భగవంతుడిని ప్రార్థించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత్ విభాగం తెలంగాణ రాష్ట్ర సహ ప్రముఖ్ ముఖ్య అతిథిగా హాజరై నవగ్రహ హోమాన్ని నిర్వహించారు. ఖమ్మం విభాగ్ సంఘటనా కార్యదర్శి శ్రీ గడిదేశీ వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి నాగేశ్వరరావు, ప్రఖండ కార్యకర్తలు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో హోమ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది.2
- ఖమ్మం ఏఎంసీ మార్కెట్‌లో సమస్యల కుప్పలు.. చెత్తతో కంపుకొడుతున్న కూరగాయల మార్కెట్ ఖమ్మం జిల్లా మొత్తానికి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ.. ప్రస్తుతం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. మార్కెట్‌లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి ఉండటంతో వ్యాపారులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మార్కెట్‌లో తాగునీటి సమస్య కూడా వేధిస్తోంది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన నాలుగు మంచినీటి పంపులు పనిచేయకపోవడంతో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు కూరగాయల వ్యర్థాలు ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో మార్కెట్ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. వేలాది మంది ప్రజలు, వ్యాపారులు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన మార్కెట్‌లో కనీస పారిశుధ్య, తాగునీటి వసతులు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెట్‌లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, పనిచేయని మంచినీటి పంపులను వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు, ప్రజలు కోరుతున్నారు.4
- సాంబాయిగూడెం ఇసుక ర్యాంప్‌లో స్థానిక ఆదివాసులకు న్యాయం చేయాలి: తుడుందెబ్బ మణుగూరు మండలం సాంబాయిగూడెం గ్రామంలోని ఇసుక ర్యాంప్ నిర్వహణలో స్థానిక ఆదివాసులకు న్యాయం చేయాలని తుడుందెబ్బ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఆదివాసుల హక్కులు, ఉపాధి అవకాశాలను పక్కనపెట్టి గిరిజనేతరుల ఆధిపత్యంలో ర్యాంప్ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. స్థానిక సమస్యపై మాట్లాడేందుకు వెళ్లిన తుడుందెబ్బ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వట్టం సుభద్రపై కొందరు దురుసుగా ప్రవర్తించడం, గొడవకు దిగడం తీవ్రంగా ఖండిస్తున్నామని కమిటీ పేర్కొంది. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇసుక ర్యాంప్ నిర్వహణలో స్థానిక ఆదివాసుల భాగస్వామ్యం, హక్కులు, ఉపాధి అవకాశాలను అధికారులు పరిరక్షించాలని, సొసైటీ నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, PESA చట్టంలోని గ్రామసభ హక్కులను పరిగణనలోకి తీసుకుని పారదర్శక నిర్ణయం తీసుకోవాలని కోరింది. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే ప్రాజెక్ట్ అధికారి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తుడుందెబ్బ నాయకులు హెచ్చరించారు.1