సీఎం సభకు పటిష్ట ఏర్పాట్లపై వరంగల్ సిపి శ్వేతతో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ హనుమకొండ జిల్లా పరకాలలో ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే సభకు పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం పరకాలలో సీఎం పర్యటన నేపథ్యంలో ప్రతిపాదిత హెలిప్యాడ్, సభా వేదిక, వాహనాల పార్కింగ్, రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద సీఎం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.ప్రతిపాదిత హెలిప్యాడ్ కోసం లలితా కన్వెన్షన్ హాల్ సమీపంలోని స్థలాన్ని, సభా వేదిక, వాహనాల పార్కింగ్ కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అంగడి స్థలాలను పరిశీలించారు. సభకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోకలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ, సీఎం పర్యటనలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హెలిప్యాడ్ నుంచి సీఎం ప్రయాణించే మార్గం, ఆసుపత్రి ప్రారంభోత్సవం, సభా వేదిక, ప్రజల రాకపోకలు, పార్కింగ్, రహదారులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ, సీఎం భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ హెలిప్యాడ్, రూట్ మ్యాప్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన భద్రతా ప్రణాళిక అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.అనంతరం సీఎం పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ ప్రణాళికపై కలెక్టర్, పోలీస్ కమిషనర్ అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ రవి, డీఆర్డీవో మేన శ్రీను, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సురేష్ బాబు, ఈఈ దేవిక, టీడబ్ల్యూఐడీసీ ఈఈ అరుణ్ కుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య, పరకాల మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పవన్, ఏసీపీ సతీష్ బాబు, పరకాల సీఐ క్రాంతి కుమార్, కౌన్సిలర్లు శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- మావోయిస్టు ప్రభావం నుంచి పర్యాటక ప్రాంతంగా కరిగుట్ట.. డీజీపీ కీలక ప్రకటన ములుగు జిల్లా కరిగుట్టలో శాంతి వాతావరణం నెలకొంటోంది. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కరిగుట్టలో పర్యటించి రోడ్డు పనులను పరిశీలించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, శాంతికి ప్రతీకగా తెల్ల పావురాలను విడుదల చేశారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో తెలంగాణ పోలీస్, గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా, ఛత్తీస్‌గఢ్ పోలీసుల సమన్వయాన్ని డీజీపీ ప్రశంసించారు. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కరిగుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రోడ్లు, విద్యుత్, మొబైల్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. పామూరు–చలమాదవ రహదారి పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.1
- ఈరోజు 11 ఆగస్టు 2026 పార్లమెంట్ భవనం న్యూఢిల్లీ అయోధ్యలోని రామ మందిరం పేరుతో సేకరించిన విరాళాలను విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాలు, దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, *తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాన్యశ్రీ డాక్టర్ మల్లు రవి గారు* పార్లమెంట్ భవనం వద్ద ప్రతిపక్ష ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని, పార్లమెంట్ వేదికపై కేంద్ర ప్రభుత్వం నుండి జవాబుదారీతనం, పారదర్శకత మరియు సమాధానాలు కోరుతూ తమ నిరసనను కొనసాగించారు. ప్రజా సమస్యలను లేవనెత్తడానికి మరియు ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని నిలబెట్టడానికి ప్రతిపక్షం యొక్క సంకల్పాన్ని నీరసనులతో నినాదాలతో ప్రతిధ్వనించింది1
- మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ లో సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఏఎస్ఐ కి గాయాలు మరిపెడ పోలీస్ స్టేషన్‌లో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. పాత పోలీస్ స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరడంతో, సీలింగ్ పెచ్చులు ఊడిపడి విధుల్లో ఉన్న ఏఎస్ఐ శ్రీనివాసరావు భుజంపై పడ్డాయి. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. భవనం పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరడంతో ఇప్పటికే అన్ని ఆధునిక వసతులు, హంగులతో పక్కనే నూతన పోలీస్ స్టేషన్‌ను నిర్మించారు. పాత భవనం నుండి కొత్త భవనంలోకి మారే ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. నిజానికి నిన్న 'జైల్ భరో' కార్యక్రమం ఉండటంతో, స్టేషన్‌లోని కంప్యూటర్ల ముందు పనిచేసే సిబ్బంది అంతా అదనపు భద్రతా విధుల కోసం బయటకు వెళ్లారు. దీంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఒకవేళ అందరూ లోపలే ఉండి ఉంటే నష్టం మరింత తీవ్రంగా ఉండేదని అధికారులు భావిస్తున్నారు. ఏఎస్ఐ శ్రీనివాసరావు ఒక్కరే అక్కడ విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్త భవనంలోకి పూర్తిస్థాయిలో మారేలోపే ఈ ఘటన జరగడం పట్ల స్థానిక పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.1
- కరీంనగర్ కిసాన్ నగర్ ఘర్షణ దాడి కేసులో కార్పొరేటర్ తో సహా 7 గురు అరెస్టు...శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిక కరీంనగర్ లోని 29 వ డివిజన్ కిసాన్ నగర్ లో రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణ దాడి కేసులో కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ తో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రాజకీయ కక్షలతో కిసాన్ నగర్ లో గత కొంతకాలంగా బిఆర్ఎస్ బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఆదివారం రాత్రి బిజెపికి చెందిన కార్యకర్తలు టిఆర్ఎస్ కు చెందిన శ్రీకాంత్ శేఖర్ ల పై దాడి చేశారు. దాడిలో శ్రీకాంత్ కు రక్త గాయాలు కావడంతో శ్రీకాంత్ తో పాటు శేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు స్థానిక కార్పొరేటర్ వేణు ప్రసాద్ తోపాటు నాగేందర్, మధు, భానుచందర్, వేణు, శశిధర్ పై హత్నాయత్నంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఏడుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించామని అడిషనల్ డిసిపి వెంకటరమణ ప్రకటించారు.2
- తల్లిపాలపై అవగాహన కల్పించిన అంగన్వాడీ సిబ్బంది .... వడ్లూరులో తల్లిపాల వారోత్సవాలు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం, తొలి ఆరు నెలలు తల్లిపాలను మాత్రమే అందించడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడని వివరించారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. తల్లులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పులి రమేష్, గ్రామ కార్యదర్శి పద్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.2
- రాత్రివేళ గ్రామాల్లో పర్యటిస్తూ కార్యకర్తలకు భరోసా.. అనారోగ్యంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తకు ఎమ్మెల్యే పరామర్శ ఆపదలో ఉన్న కార్యకర్తలు ఏ సమయంలోనైనా తనకు ఫోన్ చేయాలని, వారికి అండగా నిలిచే విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ భరోసా ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామంలో అనారోగ్యంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తను రామచంద్ర నాయక్ పరామర్శించారు. రాత్రివేళ గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలను కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆపద సమయంలో వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే తమకు భరోసా కల్పించడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.1
- గుప్తనిధుల పేరుతో క్షుద్ర పూజ చేస్తామంటూ కలరింగ్ గుప్తనిధుల పేరుతో మోసం పాల్పడుతున్న ముఠాగట్టురట్టు నలుగురు నిందితుల అరెస్టు *గుప్తనిధుల పేరుతో క్షుద్రపూజ చేస్తానంటూ కలరింగ్..!* శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ – 'గుప్త నిధుల' పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు – నలుగురు నిందితుల అరెస్ట్* *స్వాధీనం చేసుకున్న సొత్తు: 02 కార్లు, 01 ఆటో, 02 మోటార్ సైకిళ్లు, 04 సెల్ ఫోన్లు, నకిలీ బంగారు నాణేలు మరియు బొగ్గు.* హైదరాబాదు:: రాజేంద్రనగర్ పోలీసుల భాగస్వామ్యంతో శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను నమ్మించి మోసగిస్తున్న ఒక ముఠాను విజయవంతంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు (04) నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి పలు వాహనాలను మరియు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. *అరెస్టయిన నిందితుల వివరాలు:* మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా (36) – తండ్రి: మహ్మద్ అన్వర్, వృత్తి: కార్ల డెంటింగ్ & పెయింటింగ్, నివాసం: గుడిమల్కాపూర్, హైదరాబాద్. సయ్యద్ అలీ అష్రఫ్ (40) – తండ్రి: సయ్యద్ మూసా, వృత్తి: ఎలక్ట్రీషియన్, నివాసం: ఫర్హాన్ నగర్, జవహర్ నగర్, ECIL, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా. మహ్మద్ హాజీ (25) – తండ్రి: మహ్మద్ ఖాజా, వృత్తి: ఆటో డ్రైవర్, నివాసం: బాలాజీ నగర్, జవహర్ నగర్, ECIL, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా. మహ్మద్ సల్మాన్ (29) – తండ్రి: మహ్మద్ అన్వర్, వృత్తి: బైక్ మెకానిక్, నివాసం: యాదగిరిపల్లి (గ్రామం), కీసర (మండలం), మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా. *స్వాధీనం చేసుకున్న వస్తువులు:* 02 నాలుగు చక్రాల వాహనాలు (కార్లు) 01 ఆటో రిక్షా 02 మోటార్ సైకిళ్లు 04 సెల్ ఫోన్లు 25 నకిలీ (బంగారు పూత పూసిన) నాణేలు 6 కేజీల బొగ్గు 4 కేజీల మట్టి పూజా సామగ్రి ప్రధాన నిందితుడు మునావర్ పాత నేరాల చరిత్ర: బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 01 మోసం (Cheating) కేసు నమోదు. *నేరం చేసిన తీరు (Modus Operandi):* ప్రధాన నిందితుడు మహ్మద్ మునావర్ హైదరాబాద్‌లో జన్మించి పెరిగాడు. చదువు పూర్తయిన తర్వాత కార్ల డెంటింగ్ మరియు పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, వచ్చే ఆదాయం కుటుంబ ఖర్చులకు సరిపోకపోవడంతో, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక కుట్ర పన్నుతాడు. ఇళ్ల కింద పూడ్చిపెట్టిన గుప్త నిధులను బయటకు తీసే ప్రత్యేక విద్య తనకు వచ్చు అని ప్రచారం చేసుకుంటూ అమాయకులను మోసం చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో మునావర్ తన స్నేహితులైన సయ్యద్ అలీ అష్రఫ్, మహ్మద్ హాజీ, మహ్మద్ సల్మాన్‌లను సంప్రదించి తన పథకాన్ని వివరించాడు. ఈ అక్రమ మార్గంలో సులభంగా డబ్బు సంపాదించవచ్చని భావించిన వారు కూడా ఇందుకు అంగీకరించారు. ఆ తర్వాత, నిందితులు అమాయక ప్రజలను సమీపించి, తమకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని, వారి నివాస స్థలాల కింద భూమిలో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించేవారు. వారు సూచించిన ప్రదేశంలో గుంత తీసిన తర్వాత, ముందే సిద్ధం చేసుకున్న బొగ్గు మరియు నకిలీ బంగారు నాణేలు ఉన్న సంచిని రహస్యంగా అందులో ఉంచేవారు. ఆ తర్వాత, పూజలు చేసి, ఆ బొగ్గు బంగారంగా మారడానికి కొంత సమయం పడుతుందని చెప్పి నిందితులు అక్కడ నుండి పరారయ్యేవారు. ఈ ముఠా వివిధ ప్రాంతాల్లో దాదాపు 11 మందిని మోసం చేసి, సుమారు రూ. 1 కోటి వరకు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 916/2026, బిఎన్ఎస్ (BNS) చట్టంలోని సెక్షన్లు 318(4), 351(2), 61(2) r/w 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలకు విజ్ఞప్తి: ఇటీవలి కాలంలో కొందరు కేటుగాళ్లు వీధులు, గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ కొన్ని ప్రాంతాల్లో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని తీసి ఇస్తామని చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. కాబట్టి, సదరు మోసగాళ్లను, వారి మాటలను నమ్మి ప్రజలెవరూ మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఇటువంటి అక్రమ లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరడమైనది. హైదరాబాద్ సిటీ శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ కె. రవి, సబ్‌ఇన్స్‌పెక్టర్లు కె. మన్సూర్ అలీ, నర్సింగరావు, ఎస్. శేషు, ఇతర టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మరియు రాజేంద్రనగర్ పోలీసుల సమన్వయంతో ఈ ముఠాను పట్టుకోవడం జరిగింది. (కె.ఎస్. రావు) అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, టాస్క్‌ఫోర్స్, రాజేంద్రనగర్ & శంషాబాద్ జోన్స్, హైదరాబాద్ సిటీ.1
- సాధువెల్లి లో పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం యాదగిరిగుట్ట మండలం సాధువెల్లిలో పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఓటీపీ, పిన్, సీవీవీ, యూపీఐ పిన్, పాస్వర్డ్లను ఇతరులతో పంచుకోవద్దని టౌన్ సీఐ భాస్కర్ సూచించారు. గుర్తుతెలియని లింకులను తెరవకూడదన్నారు. బహుమతులు, రుణాలు, కేవైసీ పేరుతో వచ్చే మోసపూరిత సందేశాలను నమ్మవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎస్ఐలు ఖాజా మొయినుద్దీన్, ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.1
- బొమ్మలరామారం లో టైర్ల కంపెనీల కాలుష్యంపై ప్రజా ఆగ్రహం.. బొమ్మలరామారం మండల కేంద్రం, రంగాపురం, పర్వతాపురం గ్రామాల్లో టైర్ల పునర్వినియోగ కంపెనీల నుంచి విషవాయువులు వెలువడుతూ తీవ్ర కాలుష్యం ఏర్పడుతోందని ఆరోపిస్తూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సమస్యపై ఆర్డీవో, కలెక్టర్, కాలుష్య నియంత్రణ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలోగా కంపెనీలు మూసివేయకపోతే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు.1