Shuru
Apke Nagar Ki App…
సాధువెల్లి లో పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం యాదగిరిగుట్ట మండలం సాధువెల్లిలో పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఓటీపీ, పిన్, సీవీవీ, యూపీఐ పిన్, పాస్వర్డ్లను ఇతరులతో పంచుకోవద్దని టౌన్ సీఐ భాస్కర్ సూచించారు. గుర్తుతెలియని లింకులను తెరవకూడదన్నారు. బహుమతులు, రుణాలు, కేవైసీ పేరుతో వచ్చే మోసపూరిత సందేశాలను నమ్మవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎస్ఐలు ఖాజా మొయినుద్దీన్, ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
P.srinu
సాధువెల్లి లో పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం యాదగిరిగుట్ట మండలం సాధువెల్లిలో పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఓటీపీ, పిన్, సీవీవీ, యూపీఐ పిన్, పాస్వర్డ్లను ఇతరులతో పంచుకోవద్దని టౌన్ సీఐ భాస్కర్ సూచించారు. గుర్తుతెలియని లింకులను తెరవకూడదన్నారు. బహుమతులు, రుణాలు, కేవైసీ పేరుతో వచ్చే మోసపూరిత సందేశాలను నమ్మవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎస్ఐలు ఖాజా మొయినుద్దీన్, ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రధాన బుకింగ్ రూ.61,874, బ్రేక్ దర్శనాలతో రూ.1,21,800, వీఐపీ దర్శనాలతో రూ.2,60,550, కార్ పార్కింగ్ రూ.3,45,500, ప్రసాద విక్రయాలతో రూ.6,17,400, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.16,16,870 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- అన్నం పెట్టిన వారిని మోసం చేయాలని చూస్తే ఇలాగే ఉంటుంది పోచారం గారు అన్నం పెట్టినవారిని మోసం చెయ్యాలని చూస్తే ఇలానే ఉంటది పోచారం గారు.. మంత్రి పదవి కోసం, డబ్బుల కోసం నేను పార్టీ మారలేదు.. అభివృద్ధికి సహకరిస్తామని సీఎం చెబితేనే పార్టీలో చేరా.! ముఖ్యమంత్రి మాటలు మంత్రులు వినడం లేదు.. సీఎం స్వయానా మంత్రులకు నిధులు మంజూరు చేయమని చెప్పిన మంత్రులు సీఎం మాటలు పట్టించుకోవడం లేదు.. కేసీఆర్ ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకుండే, కానీ తప్పలేదు. నేను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను, కాంగ్రెస్ జెండా కాదు. ఆరు నెలల్లో పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కండువా కుప్పుకున్నాక సగం నిధులు మాత్రమే మంజూరు చేశారు. బిల్లులు పెండింగ్ లో ఉండటం వల్ల గుత్తేదారులు పనులు ఆపేశారు. నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేల తో సీఎం సమావేశం నిర్వహిస్తే రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించా.. నేను నీకు అమ్ముడుపోయానా ఎమ్మెల్యేగిరిని కొన్నావా అని అడిగాను. మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు.. నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం, మంత్రులుభట్టి,పొంగులేటికి చెప్పిన నిధులు మంజూరు కావడం లేదు. రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు సీఎం మాటలువినడం లేదు వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి చెప్పిన పట్టించుకోవడం లేదు వేం నరేందర్ రెడ్డి కి 50 సార్లు ఫోన్ చేసిన ఫోన్ అటెండ్ చేయడం లేదు. కేసీఆర్ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. అన్నం పెట్టిన వాళ్లను ఎప్పుడు మర్చిపోలేను. అప్పటి రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసిన పని వల్ల పార్టీ మారాల్సి వచ్చింది.1
- బహుళ త్రయోదశి సందర్భంగా ప్రదోష కాలంలో దమ్మాయిగూడ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో శ్రీ నందీశ్వర స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 🪷 బహుళ త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడికి విశేష పూజలు 🙏 ప్రదోష కాలంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు ఈ సందర్భంగా నందీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రదోష కాలంలో శివారాధనకు విశిష్టత ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఓం నమః శివాయ 🙏 హర హర మహాదేవ 🕉️ 📍 శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం, దమ్మాయిగూడ1
- ఫహద్ ఫాజిల్ నటించిన 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' (Don’t Trouble the Trouble) చిత్రం నుండి 'కేకు వాక్కు' (Cakeu Walku) అనే మ్యూజిక్ వీడియో విడుదలైంది. ఈ పాటను కాల భైరవ సంగీత దర్శకత్వంలో రూపొందించారు. ఇందులో ఫహద్ ఫాజిల్ మరియు సారా పలేకర్ డ్యాన్స్‌తో అలరించారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది.1
- సీఎం సభకు పటిష్ట ఏర్పాట్లపై వరంగల్ సిపి శ్వేతతో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ హనుమకొండ జిల్లా పరకాలలో ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే సభకు పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం పరకాలలో సీఎం పర్యటన నేపథ్యంలో ప్రతిపాదిత హెలిప్యాడ్, సభా వేదిక, వాహనాల పార్కింగ్, రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద సీఎం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.ప్రతిపాదిత హెలిప్యాడ్ కోసం లలితా కన్వెన్షన్ హాల్ సమీపంలోని స్థలాన్ని, సభా వేదిక, వాహనాల పార్కింగ్ కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అంగడి స్థలాలను పరిశీలించారు. సభకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోకలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ, సీఎం పర్యటనలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హెలిప్యాడ్ నుంచి సీఎం ప్రయాణించే మార్గం, ఆసుపత్రి ప్రారంభోత్సవం, సభా వేదిక, ప్రజల రాకపోకలు, పార్కింగ్, రహదారులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ, సీఎం భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ హెలిప్యాడ్, రూట్ మ్యాప్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన భద్రతా ప్రణాళిక అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.అనంతరం సీఎం పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ ప్రణాళికపై కలెక్టర్, పోలీస్ కమిషనర్ అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ రవి, డీఆర్డీవో మేన శ్రీను, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సురేష్ బాబు, ఈఈ దేవిక, టీడబ్ల్యూఐడీసీ ఈఈ అరుణ్ కుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య, పరకాల మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పవన్, ఏసీపీ సతీష్ బాబు, పరకాల సీఐ క్రాంతి కుమార్, కౌన్సిలర్లు శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1
- కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తితో యువకుడి హల్‌చల్.. కాలనీవాసుల్లో భయాందోళన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీలో సోమవారం రాత్రి ఓ యువకుడు కత్తితో హల్‌చల్ సృష్టించాడు. కొబ్బరి బొండాలు కోసే కత్తిని చేతిలో పట్టుకుని కాలనీలో తిరుగుతూ హంగామా చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన కాలనీవాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. యువకుడు కత్తితో ఎందుకు హల్‌చల్ చేశాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.1