Shuru
Apke Nagar Ki App…
బహుళ త్రయోదశి సందర్భంగా ప్రదోష కాలంలో దమ్మాయిగూడ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో శ్రీ నందీశ్వర స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 🪷 బహుళ త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడికి విశేష పూజలు 🙏 ప్రదోష కాలంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు ఈ సందర్భంగా నందీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రదోష కాలంలో శివారాధనకు విశిష్టత ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఓం నమః శివాయ 🙏 హర హర మహాదేవ 🕉️ 📍 శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం, దమ్మాయిగూడ
SAI KIRAN TRP
బహుళ త్రయోదశి సందర్భంగా ప్రదోష కాలంలో దమ్మాయిగూడ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో శ్రీ నందీశ్వర స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 🪷 బహుళ త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడికి విశేష పూజలు 🙏 ప్రదోష కాలంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు ఈ సందర్భంగా నందీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రదోష కాలంలో శివారాధనకు విశిష్టత ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఓం నమః శివాయ 🙏 హర హర మహాదేవ 🕉️ 📍 శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం, దమ్మాయిగూడ
More news from Hyderabad and nearby areas
- ధైర్యమే మన కవచం..రాజ్యాధికారమే లక్ష్యం రాజీ పడేవాళ్లకు రాజకీయాల్లో చోటు లేదు : తీన్మార్ మల్లన్న గుండెల్లో ధైర్యం, కళ్లల్లో ఆశయం ఉన్నవారికే తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్‌పీలో స్థానం ఉంటుందని ఆ పార్టీ అధినేత,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ధైర్యం లేని వారికి పార్టీలో చోటు లేదని స్పష్టం చేశారు. రాజీ పడే వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని పేర్కొన్నారు. గద్దె వెనుక దాక్కునే నాయకులు తమకు అవసరం లేదని, పేద ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించే ధైర్యవంతులు కావాలని మల్లన్న అన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడే నాయకత్వమే పార్టీకి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. తెలంగాణలో రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ధైర్యం, నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.1
- వెల్మ కన్నె గ్రామంలో ఘనంగా ఆషాడమాసం బోనాల ఉత్సవాల ఊరేగింపు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవం నిర్వహించారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే" దుర్గమ్మ, మాతమ్మ,, ఊరడమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ తల్లుల ఆశీస్సులతో ప్రజలందరికీ నిండుగా సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యాలు కలగాలని వెల్మకన్న గ్రామంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.* ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.1
- హైకోర్టులో ప్రభుత్వ ఉచిత పథకాలపై జడ్జి గారి ఆవేదన అందరం తప్పక వినాల్సిందే చేతులు ఐఫోన్ పట్టుకొని పల్సర్ బైక్ మీద వచ్చి రేషన్ బియ్యం తీసుకెళ్తున్నారు కూర్చొని తింటే గుట్టలే కరిగిపోతాయి: హైకోర్టు జడ్జ్ తెలంగాణ హైకోర్ట్ లో ప్రభుత్వ ఉచిత పధకాల పై జడ్జ్ గారి ఆవేదన....అందరం తప్పక వినాలి. చేతిలో ఐ-ఫోన్ పట్టుకుని, పల్సర్ బైక్ మీద వచ్చి రేషన్ బియ్యం తీసుకెళ్తున్నారు....కూర్చుంటే డబ్బులు..నుంచుంటే డబ్బులు...ప్రజలకు పనిచేయాల్సిన అవసరం ఏంటి....కోటి పైన కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులా? రైతులకు పని చేసే కూలీలు లేక, బీహార్, చట్టిస్గర్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి కూలీలను తీసుకొచ్చి పనిచేయించుకునే దుస్థితి. ప్రభుత్వానికి 89000 కోట్లు ఉచిత పధకాలకే ఖర్చు పెడుతుంటే ఇక అప్పుల భారం మోసే రాష్ట్రానికి భవిష్యత్తు ఏది? పూర్తిగా వినండి!1
- పెద్ది విగ్రహ ప్రతిష్ఠను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఉద్రిక్తత ల మధ్య బీఆర్ఎస్ నాయకులు నర్సంపేటలో ప్రతిష్ఠించారు. సోమవారం నిర్వహించిన ఈ విగ్రహ ప్రతిష్ఠ స్థలానికి చేరుకున్న డీసీపీ, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ప్రైవేట్ భూమిలో విగ్రహం ఏర్పాటు చేసుకుంటే మీకేంటని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పోలీసులు వెనక్కి తగ్గడంతో విగ్రహ ఏర్పాటును ఘనంగా నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- ప్రజల హక్కుల కోసం గళమెత్తే నాయకుడు తీన్మార్ మల్లన్న : ఫక్రుద్దీన్ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ శాసనమండలిలో గళం వినిపిస్తున్న నాయకుడు తీన్మార్ మల్లన్న అని ఫక్రుద్దీన్ తాత అన్నారు. ప్రజల హక్కులు, పిల్లల భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మల్లన్న చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఆయన ప్రసంగాలు ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఉంటాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరింత బలంగా పోరాడాలని ఆకాంక్షించారు1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- కార్మికుల హక్కులను పరిరక్షించే వరకు పోరాటం కొనసాగుతుంది కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం జైల్భరో కార్యక్రమం నిర్వహించారు. చిల్డ్రన్స్ పార్క్ నుంచి బస్టాండ్ వరకు కార్మికులు భారీ ర్యాలీ చేపట్టి అనంతరం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను పరిరక్షించే వరకు పోరాటం కొనసాగుతుందని, లేబర్ కోడ్ల రద్దు జరిగే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1