Shuru
Apke Nagar Ki App…
శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
KUMAR
శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
More news from Hyderabad and nearby areas
- ధైర్యమే మన కవచం..రాజ్యాధికారమే లక్ష్యం రాజీ పడేవాళ్లకు రాజకీయాల్లో చోటు లేదు : తీన్మార్ మల్లన్న గుండెల్లో ధైర్యం, కళ్లల్లో ఆశయం ఉన్నవారికే తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్‌పీలో స్థానం ఉంటుందని ఆ పార్టీ అధినేత,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ధైర్యం లేని వారికి పార్టీలో చోటు లేదని స్పష్టం చేశారు. రాజీ పడే వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని పేర్కొన్నారు. గద్దె వెనుక దాక్కునే నాయకులు తమకు అవసరం లేదని, పేద ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించే ధైర్యవంతులు కావాలని మల్లన్న అన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడే నాయకత్వమే పార్టీకి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. తెలంగాణలో రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ధైర్యం, నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.1
- Vijay Deverakonda, Anand Deverakonda and Sandeep Reddy Vanga Visit Lal Darwaza Temple for Bonalu Tollywood actors Vijay Deverakonda and Anand Deverakonda, along with filmmaker Sandeep Reddy Vanga, visited the historic Sri Simhavahini Mahankali Temple at Lal Darwaza in Hyderabad on August 9 during the annual Bonalu celebrations. The film personalities performed special puja, offered prayers and broke coconuts seeking the blessings of Goddess Mahankali. Temple priests and festival organisers welcomed them, while a large number of devotees and fans gathered to catch a glimpse of the celebrities. Speaking to the media, Vijay Deverakonda wished everyone a Happy Bonalu and said it was his first visit to the temple to offer prayers. He also said he prayed for the fulfilment of people's wishes as well as his own. The Old City Bonalu celebrations are being held at several prominent temples, including Lal Darwaza, Sultan Shahi and Hari Bowli, amid traditional festivities and heightened security.1
- మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మీయ విందులో ఎంపీ ఈటల రాజేందర్ ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా మాజీ గవర్నర్, సీనియర్ నాయకులు శ్రీ బండారు దత్తాత్రేయ ఆహ్వానం మేరకు రాంనగర్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో కలిసి బోనాల పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు. స్నేహబంధాలు, మానవ సంబంధాలను పెంపొందించే ఇటువంటి ఆత్మీయ కలయికలు మన సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.1
- కాఅఖిల్ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ఎస్సై పోస్టులకు ఉచిత శిక్షణ శిబిరం సద్వినియోగం చేసుకోవాలి . ఫౌండేషన్ చైర్మన్ తౌడ సత్యనారాయణ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరం అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ విడుదల చేసిన పట్టణ సీఐ మెదక్ ఆగస్టు 10 :- ఉమ్మడి మెదక్ జిల్లాలోని యువతి యువకులకు అఖిలరాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్.ఎస్ఐ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ శిబిరం ఫౌండేషన్ చైర్మన్ తాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మెదక్ పట్టణ సీఐ మహేష్ తెలిపారు ఈ సందర్భంగా మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐ మహేష్ మాట్లాడుతూ నిరుపేద యువతి యువకులు అన్ని వర్గాలకు చెందినవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగం సాధించాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ తౌడ సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 16వ తేదీన రామాయంపేట స్నేహ డిగ్రీ కళాశాలలో పరీక్ష కు హాజరై అర్హత సాధించిన వారికి నాగూర్ కర్నూల్.వట్టెం వద్దా పి సి ఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని. ఆయన తెలిపారు. యువతి యువకులు ఇంటర్మీడియట్ డిగ్రీ పాసైన వారు16 తేదీన రామాయంపేట స్నేహ డిగ్రీ కళాశాలలో జరుగు అర్హత పరీక్షకు హాజరుకావాలని. అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 1 నుండి శిక్షణ పూర్తయ్య వరకు పౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. క్రమశిక్షణ. అంకిత భావం.సంకల్పశక్తి.విజయానికి మార్గమని ఆయన తెలిపారు. అభ్యర్థులకు ఏదైనా సందేహాలు ఉంటే.7416661182నంబర్ కు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది. శివ తదితరులు పాల్గొన్నారు1
- ప్రజల హక్కుల కోసం గళమెత్తే నాయకుడు తీన్మార్ మల్లన్న : ఫక్రుద్దీన్ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ శాసనమండలిలో గళం వినిపిస్తున్న నాయకుడు తీన్మార్ మల్లన్న అని ఫక్రుద్దీన్ తాత అన్నారు. ప్రజల హక్కులు, పిల్లల భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మల్లన్న చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఆయన ప్రసంగాలు ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఉంటాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరింత బలంగా పోరాడాలని ఆకాంక్షించారు1
- సోమవారం సువర్ణ శివలింగానికి అభిషేకాలు.. పెరిగిన భక్తుల రద్దీ సోమవారం సందర్భంగా రమణేశ్వర మహాక్షేత్రంలో సువర్ణ శివలింగానికి భక్తులు భక్తిశ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.1
- వెల్దుర్తిలో చౌకోట్‌పై పడి బాలిక మృతి.. వెల్దుర్తిలో విషాదం మెదక్ జిల్లా వెల్దుర్తిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కార్మికుడు యేసు కుమార్తె అలేఖ్య ఇంటి ముందు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు ఇంటి నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన చౌకోట్‌పై పడింది. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అలేఖ్య మృతి చెందింది. బాలిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆస్పత్రి ఆవరణలో విషాద వాతావరణం నెలకొంది.1