Shuru
Apke Nagar Ki App…
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రధాన బుకింగ్ రూ.61,874, బ్రేక్ దర్శనాలతో రూ.1,21,800, వీఐపీ దర్శనాలతో రూ.2,60,550, కార్ పార్కింగ్ రూ.3,45,500, ప్రసాద విక్రయాలతో రూ.6,17,400, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.16,16,870 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు.
P.srinu
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రధాన బుకింగ్ రూ.61,874, బ్రేక్ దర్శనాలతో రూ.1,21,800, వీఐపీ దర్శనాలతో రూ.2,60,550, కార్ పార్కింగ్ రూ.3,45,500, ప్రసాద విక్రయాలతో రూ.6,17,400, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.16,16,870 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- ఈరోజు 11 ఆగస్టు 2026 పార్లమెంట్ భవనం న్యూఢిల్లీ అయోధ్యలోని రామ మందిరం పేరుతో సేకరించిన విరాళాలను విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాలు, దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, *తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాన్యశ్రీ డాక్టర్ మల్లు రవి గారు* పార్లమెంట్ భవనం వద్ద ప్రతిపక్ష ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని, పార్లమెంట్ వేదికపై కేంద్ర ప్రభుత్వం నుండి జవాబుదారీతనం, పారదర్శకత మరియు సమాధానాలు కోరుతూ తమ నిరసనను కొనసాగించారు. ప్రజా సమస్యలను లేవనెత్తడానికి మరియు ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని నిలబెట్టడానికి ప్రతిపక్షం యొక్క సంకల్పాన్ని నీరసనులతో నినాదాలతో ప్రతిధ్వనించింది1
- డా.ఏఎస్ రావు నగర్‌లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని వినతి డా.ఏఎస్ రావు నగర్‌లో హనుమాన్ టెంపుల్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్థానిక నివాసులు కాప్రా సర్కిల్-7 డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం సరైన మౌలిక వసతులు లేకపోవడంతో సుమారు 30–40 కుటుంబాలకు చెందిన వృద్ధులు, మహిళలు, చిన్నారులు వాకింగ్, వ్యాయామం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, ఖాళీ స్థలం సద్వినియోగం కోసం త్వరగా వాకింగ్ ట్రాక్ అభివృద్ధి చేయాలని కోరారు.1
- NTR ముఖ్యమంత్రి అయ్యేంత వరకు బియ్యం తో అన్నం తినటం తక్కువ. NTR ముఖ్యమంత్రి అయిన తరువాత నే బియ్యం తో అన్నం తిన్నాను - #Pallaburusu యాక్టర్ సుధాకర్ రెడ్డి. #NTR ♥️🙏 #NandamuriTarakaRamarao యుగ పురుషుడు... నందమూరి తారక రామారావు గారు #జోహార్NTR #JoharNTR1
- అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను: పోచారం శ్రీనివాస్ రెడ్డి అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను! మరోసారి రేవంత్ పై ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకుండే, కానీ తప్పలేదు కేసీఆర్ వల్లే అభివృద్ది జరిగింది అని నేనే చెప్తున్నాను అన్నం పెట్టినోడిని మరవడం కష్టంగా ఉంది కొన్ని రాజకీయ పరిణామాల వల్ల పార్టీ మారాల్సి వచ్చింది నేను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను, కాంగ్రెస్ జెండా కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదు నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామని సీఎం చెబితేనే పార్టీలో చేరాను ఆరు నెలల్లో బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెబితేనే జాతీయ కండువా కప్పుకున్న మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు పొంగులేటి, భట్టి సీఎం మాటలు వినడం లేదు మంత్రులు పట్టించుకోవడం లేదంట, నువ్వైనా నిధులు విడుదల చేయమని వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి చెబితే ఆయన కూడా పట్టించుకోలేదు వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ చేయడం లేదు నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం నిర్వహిస్తే రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించా నేను నీకు అమ్ముడుపోయానా నా ఎమ్మెల్యే పదవిని కొన్నావా అని అడిగాను - ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి1
- అమ్మో 80 ఏళ్ల కింద నాటి బావి వైరల్ వీడియో చూసి తరించండి జనగాం జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలోని అతి పురాతనమైన బావి ఉంది. ఇది దగ్గర దగ్గర 7 గోళల లోతు ఉంటుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. వీలుంటే మీరు కూడా అటు పక్కకు పోయినప్పుడు చూసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించండి.1
- సాధువెల్లి లో పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం యాదగిరిగుట్ట మండలం సాధువెల్లిలో పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఓటీపీ, పిన్, సీవీవీ, యూపీఐ పిన్, పాస్వర్డ్లను ఇతరులతో పంచుకోవద్దని టౌన్ సీఐ భాస్కర్ సూచించారు. గుర్తుతెలియని లింకులను తెరవకూడదన్నారు. బహుమతులు, రుణాలు, కేవైసీ పేరుతో వచ్చే మోసపూరిత సందేశాలను నమ్మవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎస్ఐలు ఖాజా మొయినుద్దీన్, ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.1
- గుప్తనిధుల పేరుతో క్షుద్ర పూజ చేస్తామంటూ కలరింగ్ గుప్తనిధుల పేరుతో మోసం పాల్పడుతున్న ముఠాగట్టురట్టు నలుగురు నిందితుల అరెస్టు *గుప్తనిధుల పేరుతో క్షుద్రపూజ చేస్తానంటూ కలరింగ్..!* శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ – 'గుప్త నిధుల' పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు – నలుగురు నిందితుల అరెస్ట్* *స్వాధీనం చేసుకున్న సొత్తు: 02 కార్లు, 01 ఆటో, 02 మోటార్ సైకిళ్లు, 04 సెల్ ఫోన్లు, నకిలీ బంగారు నాణేలు మరియు బొగ్గు.* హైదరాబాదు:: రాజేంద్రనగర్ పోలీసుల భాగస్వామ్యంతో శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను నమ్మించి మోసగిస్తున్న ఒక ముఠాను విజయవంతంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు (04) నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి పలు వాహనాలను మరియు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. *అరెస్టయిన నిందితుల వివరాలు:* మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా (36) – తండ్రి: మహ్మద్ అన్వర్, వృత్తి: కార్ల డెంటింగ్ & పెయింటింగ్, నివాసం: గుడిమల్కాపూర్, హైదరాబాద్. సయ్యద్ అలీ అష్రఫ్ (40) – తండ్రి: సయ్యద్ మూసా, వృత్తి: ఎలక్ట్రీషియన్, నివాసం: ఫర్హాన్ నగర్, జవహర్ నగర్, ECIL, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా. మహ్మద్ హాజీ (25) – తండ్రి: మహ్మద్ ఖాజా, వృత్తి: ఆటో డ్రైవర్, నివాసం: బాలాజీ నగర్, జవహర్ నగర్, ECIL, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా. మహ్మద్ సల్మాన్ (29) – తండ్రి: మహ్మద్ అన్వర్, వృత్తి: బైక్ మెకానిక్, నివాసం: యాదగిరిపల్లి (గ్రామం), కీసర (మండలం), మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా. *స్వాధీనం చేసుకున్న వస్తువులు:* 02 నాలుగు చక్రాల వాహనాలు (కార్లు) 01 ఆటో రిక్షా 02 మోటార్ సైకిళ్లు 04 సెల్ ఫోన్లు 25 నకిలీ (బంగారు పూత పూసిన) నాణేలు 6 కేజీల బొగ్గు 4 కేజీల మట్టి పూజా సామగ్రి ప్రధాన నిందితుడు మునావర్ పాత నేరాల చరిత్ర: బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 01 మోసం (Cheating) కేసు నమోదు. *నేరం చేసిన తీరు (Modus Operandi):* ప్రధాన నిందితుడు మహ్మద్ మునావర్ హైదరాబాద్‌లో జన్మించి పెరిగాడు. చదువు పూర్తయిన తర్వాత కార్ల డెంటింగ్ మరియు పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, వచ్చే ఆదాయం కుటుంబ ఖర్చులకు సరిపోకపోవడంతో, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక కుట్ర పన్నుతాడు. ఇళ్ల కింద పూడ్చిపెట్టిన గుప్త నిధులను బయటకు తీసే ప్రత్యేక విద్య తనకు వచ్చు అని ప్రచారం చేసుకుంటూ అమాయకులను మోసం చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో మునావర్ తన స్నేహితులైన సయ్యద్ అలీ అష్రఫ్, మహ్మద్ హాజీ, మహ్మద్ సల్మాన్‌లను సంప్రదించి తన పథకాన్ని వివరించాడు. ఈ అక్రమ మార్గంలో సులభంగా డబ్బు సంపాదించవచ్చని భావించిన వారు కూడా ఇందుకు అంగీకరించారు. ఆ తర్వాత, నిందితులు అమాయక ప్రజలను సమీపించి, తమకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని, వారి నివాస స్థలాల కింద భూమిలో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించేవారు. వారు సూచించిన ప్రదేశంలో గుంత తీసిన తర్వాత, ముందే సిద్ధం చేసుకున్న బొగ్గు మరియు నకిలీ బంగారు నాణేలు ఉన్న సంచిని రహస్యంగా అందులో ఉంచేవారు. ఆ తర్వాత, పూజలు చేసి, ఆ బొగ్గు బంగారంగా మారడానికి కొంత సమయం పడుతుందని చెప్పి నిందితులు అక్కడ నుండి పరారయ్యేవారు. ఈ ముఠా వివిధ ప్రాంతాల్లో దాదాపు 11 మందిని మోసం చేసి, సుమారు రూ. 1 కోటి వరకు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 916/2026, బిఎన్ఎస్ (BNS) చట్టంలోని సెక్షన్లు 318(4), 351(2), 61(2) r/w 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలకు విజ్ఞప్తి: ఇటీవలి కాలంలో కొందరు కేటుగాళ్లు వీధులు, గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ కొన్ని ప్రాంతాల్లో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని తీసి ఇస్తామని చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. కాబట్టి, సదరు మోసగాళ్లను, వారి మాటలను నమ్మి ప్రజలెవరూ మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఇటువంటి అక్రమ లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరడమైనది. హైదరాబాద్ సిటీ శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ కె. రవి, సబ్‌ఇన్స్‌పెక్టర్లు కె. మన్సూర్ అలీ, నర్సింగరావు, ఎస్. శేషు, ఇతర టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మరియు రాజేంద్రనగర్ పోలీసుల సమన్వయంతో ఈ ముఠాను పట్టుకోవడం జరిగింది. (కె.ఎస్. రావు) అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, టాస్క్‌ఫోర్స్, రాజేంద్రనగర్ & శంషాబాద్ జోన్స్, హైదరాబాద్ సిటీ.1
- మల్లాపూర్ కలర్స్ థీమ్ పార్కులో వన మహోత్సవంలో భాగంగా మొక్కల పంపిణీ మల్లాపూర్: వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్‌లోని కలర్స్ థీమ్ పార్కులో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మల్లాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (MMC), నాచారం సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.1
- తార్నాకలో ఘనంగా ఆషాఢ బోనాలు.. మహిళల బోనం సమర్న డీజే డ్యాన్స్.. తార్నాకలోని శ్రీ దుర్గా పోచమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో బస్తీవాసులు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే పాటలకు యువత, బస్తీవాసులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. దీంతో ఆలయ పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భక్తుల రాకతో తార్నాకలో సందడి నెలకొంది.2