logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మల్లాపూర్ కలర్స్ థీమ్ పార్కులో వన మహోత్సవంలో భాగంగా మొక్కల పంపిణీ మల్లాపూర్: వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్‌లోని కలర్స్ థీమ్ పార్కులో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మల్లాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (MMC), నాచారం సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

9 hrs ago
user_Bhaskar Reddy
Bhaskar Reddy
Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
9 hrs ago

మల్లాపూర్ కలర్స్ థీమ్ పార్కులో వన మహోత్సవంలో భాగంగా మొక్కల పంపిణీ మల్లాపూర్: వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్‌లోని కలర్స్ థీమ్ పార్కులో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మల్లాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (MMC), నాచారం సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న అఖిల్ రాజ్, నాగదుర్గ! సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న స్వామిని ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్ర హీరో అఖిల్ రాజ్, సెన్సేషనల్ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వీరి రాకతో ఆలయ ప్రాంగణంలో అభిమానులు ఒక్కసారిగా గుమిగూడారు. త్వరలో రానున్న కొత్త ప్రాజెక్ట్ విశేషాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
    1
    కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న అఖిల్ రాజ్, నాగదుర్గ!
సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న స్వామిని ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్ర హీరో అఖిల్ రాజ్, సెన్సేషనల్ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వీరి రాకతో ఆలయ ప్రాంగణంలో అభిమానులు ఒక్కసారిగా గుమిగూడారు. త్వరలో రానున్న కొత్త ప్రాజెక్ట్ విశేషాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    22 min ago
  • ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • పటాన్‌చెరులో ఘనంగా ముదిరాజ్ సంఘం బోనాల వేడుకలు.ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జలగరి ఎట్టయ్య సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకుని, ప్రత్యేకంగా తయారు చేసిన బోనాలను నెత్తిన ఎత్తుకుని అమ్మవారి ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో నైవేద్యంగా సమర్పించారు. ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జలగరి ఎట్టయ్య అమ్మవారికి పట్టు చీర సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పటాన్‌చెరు ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా జలగరి ఎట్టయ్య, ఎండీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మాదిరి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఆషాఢ మాస బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రతి ఏడాది బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. బోనాల సందర్భంగా మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో వేడుకలు సందడిగా సాగాయి. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నెలకొనాలని, రైతులు, కార్మికులు, వ్యాపారులు, యువత, మహిళలు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని నాయకులు ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత పెంపొందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. యువత కూడా మన ఆచార సంప్రదాయాల ప్రాధాన్యతను తెలుసుకుని వాటిని భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మాణిక్యం, చుక్కయ్య, పైల్వాన్ అంజయ్య, వినోద్, మల్లికార్జున్, లక్ష్మీనారాయణ, నాగసాని సహదేవ్, నాగసాని వెంకటేష్, సడబోయిన రవి, వేణు, నాగేష్, మందుమూల శ్రీనివాస్, నాగసాని గణేష్, ప్రజా పిలుపు దినపత్రిక అధినేత విజయ్ కుమార్, మొక్తల రాము, నాగసాని భరత్, భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.
    4
    పటాన్‌చెరులో ఘనంగా ముదిరాజ్ సంఘం బోనాల వేడుకలు.ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జలగరి ఎట్టయ్య
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల వేడుకలు సోమవారం  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకుని, ప్రత్యేకంగా తయారు చేసిన బోనాలను నెత్తిన ఎత్తుకుని అమ్మవారి ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో నైవేద్యంగా సమర్పించారు.
ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జలగరి ఎట్టయ్య అమ్మవారికి పట్టు చీర సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పటాన్‌చెరు ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా జలగరి ఎట్టయ్య, ఎండీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మాదిరి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఆషాఢ మాస బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రతి ఏడాది బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు.
బోనాల సందర్భంగా మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో వేడుకలు సందడిగా సాగాయి.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నెలకొనాలని, రైతులు, కార్మికులు, వ్యాపారులు, యువత, మహిళలు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని నాయకులు ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత పెంపొందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. యువత కూడా మన ఆచార సంప్రదాయాల ప్రాధాన్యతను తెలుసుకుని వాటిని భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మాణిక్యం, చుక్కయ్య, పైల్వాన్ అంజయ్య, వినోద్, మల్లికార్జున్, లక్ష్మీనారాయణ, నాగసాని సహదేవ్, నాగసాని వెంకటేష్, సడబోయిన రవి, వేణు, నాగేష్, మందుమూల శ్రీనివాస్, నాగసాని గణేష్, ప్రజా పిలుపు దినపత్రిక అధినేత విజయ్ కుమార్, మొక్తల రాము, నాగసాని భరత్, భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.
    user_దొరటి చంద్రశేఖర్
    దొరటి చంద్రశేఖర్
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
  • యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆషాడ మాసం మంగళవారం భక్తుల రద్దీ సర్వ సాధారణంగా కొనసాగుతోంది. ఆలయంలో రద్దీ తక్కువగా ఉన్నందున సర్వదర్శనాలకు గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం మాత్రమే పడుతుంది. స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయి. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
    1
    యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆషాడ మాసం మంగళవారం భక్తుల రద్దీ సర్వ సాధారణంగా కొనసాగుతోంది. ఆలయంలో రద్దీ తక్కువగా ఉన్నందున సర్వదర్శనాలకు గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం మాత్రమే పడుతుంది. స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయి. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    6 hrs ago
  • మల్లాపూర్ కలర్స్ థీమ్ పార్కులో వన మహోత్సవంలో భాగంగా మొక్కల పంపిణీ మల్లాపూర్: వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్‌లోని కలర్స్ థీమ్ పార్కులో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మల్లాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (MMC), నాచారం సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
    1
    మల్లాపూర్ కలర్స్ థీమ్ పార్కులో వన మహోత్సవంలో భాగంగా మొక్కల పంపిణీ
మల్లాపూర్: వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్‌లోని కలర్స్ థీమ్ పార్కులో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మల్లాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (MMC), నాచారం సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు.
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    9 hrs ago
  • పోలీస్ కొలువులకై దిల్సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల వినూత్న నిరసన! ​హైదరాబాద్‌లోని దిల్సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు బోనాలతో వినూత్న నిరసన చేపట్టారు. పోలీస్ ఉద్యోగాల్లో వయోపరిమితిని పెంచాలని, ఖాళీల సంఖ్యను భారీగా పెంచి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి హామీలు నెరవేర్చాలని వారు కోరారు.
    1
    పోలీస్ కొలువులకై దిల్సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల వినూత్న నిరసన!
​హైదరాబాద్‌లోని దిల్సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు బోనాలతో వినూత్న నిరసన చేపట్టారు. పోలీస్ ఉద్యోగాల్లో వయోపరిమితిని పెంచాలని, ఖాళీల సంఖ్యను భారీగా పెంచి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి హామీలు నెరవేర్చాలని వారు కోరారు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • తార్నాకలో ఘనంగా ఆషాఢ బోనాలు.. మహిళల బోనం సమర్న డీజే డ్యాన్స్.. తార్నాకలోని శ్రీ దుర్గా పోచమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో బస్తీవాసులు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే పాటలకు యువత, బస్తీవాసులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. దీంతో ఆలయ పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భక్తుల రాకతో తార్నాకలో సందడి నెలకొంది.
    2
    తార్నాకలో ఘనంగా ఆషాఢ బోనాలు.. మహిళల బోనం సమర్న  డీజే డ్యాన్స్..
తార్నాకలోని శ్రీ దుర్గా పోచమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ కార్యక్రమాలు చేపట్టారు.
పెద్ద సంఖ్యలో బస్తీవాసులు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే పాటలకు యువత, బస్తీవాసులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. దీంతో ఆలయ పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భక్తుల రాకతో తార్నాకలో సందడి నెలకొంది.
    user_DASU GANESH  REPORTER
    DASU GANESH REPORTER
    తిరుమలగిరి, హైదరాబాద్, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.