Shuru
Apke Nagar Ki App…
ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
KUMAR
ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
- Suresh Manasaసదాశివపేట్, సంగారెడ్డి, తెలంగాణJai Durga matha ki jai3 hrs ago
More news from తెలంగాణ and nearby areas
- ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- పటాన్‌చెరులో ఘనంగా ముదిరాజుల బోనాలు వేడుకల్లో ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పటాన్‌చెరు నియోజకవర్గంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. డప్పుల మోతలు, భక్తిగీతాలతో పరిసరాలు మార్మోగాయి. ఈ వేడుకల్లో ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాలు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- పటాన్‌చెరులో ఘనంగా ముదిరాజ్ సంఘం బోనాల వేడుకలు.ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జలగరి ఎట్టయ్య సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకుని, ప్రత్యేకంగా తయారు చేసిన బోనాలను నెత్తిన ఎత్తుకుని అమ్మవారి ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో నైవేద్యంగా సమర్పించారు. ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జలగరి ఎట్టయ్య అమ్మవారికి పట్టు చీర సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పటాన్‌చెరు ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా జలగరి ఎట్టయ్య, ఎండీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మాదిరి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఆషాఢ మాస బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రతి ఏడాది బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. బోనాల సందర్భంగా మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో వేడుకలు సందడిగా సాగాయి. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నెలకొనాలని, రైతులు, కార్మికులు, వ్యాపారులు, యువత, మహిళలు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని నాయకులు ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత పెంపొందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. యువత కూడా మన ఆచార సంప్రదాయాల ప్రాధాన్యతను తెలుసుకుని వాటిని భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మాణిక్యం, చుక్కయ్య, పైల్వాన్ అంజయ్య, వినోద్, మల్లికార్జున్, లక్ష్మీనారాయణ, నాగసాని సహదేవ్, నాగసాని వెంకటేష్, సడబోయిన రవి, వేణు, నాగేష్, మందుమూల శ్రీనివాస్, నాగసాని గణేష్, ప్రజా పిలుపు దినపత్రిక అధినేత విజయ్ కుమార్, మొక్తల రాము, నాగసాని భరత్, భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.4
- అన్నం పెట్టినోడినే మరిచారు: రేవంత్ పై పోచారం తిరుగుబాటు! బాన్సువాడను కేసీఆర్ అభివృద్ధి చేశారని, మంత్రులు ఫోన్ చేసినా ఎత్తడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ జెండా కప్పుకోకపోవడమే మంచిదైందని, మొన్న దానం, నేడు పోచారం అంటూ రేవంత్ రెడ్డిపై ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరవేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.1
- భూ బాధితులకు అండగా ఉంటాం భూముల్లో నుంచి ఇంచు కూడా పోనివ్వం : తీన్మార్ మల్లన్న రాజేంద్రనగర్ భూ బాధితులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న అన్నారు. ‘‘ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క. మీ భూముల్లో నుంచి ఇంచు భూమి కూడా పోనివ్వను’’ అని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు.1
- కాంగ్రెస్ వరుణయాగంపై జగదీష్ రెడ్డి కౌంటర్ - ఎల్‌నినోపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు గాల్లో దీపం పెట్టడం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వరుణయాగం పాపం చేసి చేతులు కడుకున్నట్టు ఉంది కాంగ్రెస్ వరుణయాగంపై జగదీష్ రెడ్డి కౌంటర్ ఎల్‌నినోపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు గాల్లో దీపం పెట్టడం ఏంటి? వచ్చిన నీటిని సముద్రంలోకి వదిలేసి, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాన్ని త్వరలోనే ఆధారాలతో బయటపెడతా – జగదీష్ రెడ్డి1
- వై జంక్షన్ మూసివేతపై బీజేపీ నేతలు–పోలీసుల మధ్య వాగ్వాదం రామాయంపేట: 44వ జాతీయ రహదారిపై రామాయంపేట వై జంక్షన్ వద్ద వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు రహదారి మూసివేతకు చర్యలు చేపట్టారు. అయితే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రోడ్డును మూసివేయడంపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వై జంక్షన్ వద్ద ప్రమాదాలను అరికట్టేందుకు బీజేపీ నాయకులు రహదారిని మూసివేయగా, అక్కడికి చేరుకున్న సీఐ సైదా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా జాతీయ రహదారిని ఎలా మూసివేస్తారని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వై జంక్షన్ వద్ద తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న విషయం తమ దృష్టిలో ఉందని సీఐ తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.1