పటాన్‌చెరులో ఘనంగా ముదిరాజ్ సంఘం బోనాల వేడుకలు.ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జలగరి ఎట్టయ్య సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకుని, ప్రత్యేకంగా తయారు చేసిన బోనాలను నెత్తిన ఎత్తుకుని అమ్మవారి ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో నైవేద్యంగా సమర్పించారు. ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జలగరి ఎట్టయ్య అమ్మవారికి పట్టు చీర సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పటాన్‌చెరు ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా జలగరి ఎట్టయ్య, ఎండీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మాదిరి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఆషాఢ మాస బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రతి ఏడాది బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. బోనాల సందర్భంగా మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో వేడుకలు సందడిగా సాగాయి. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నెలకొనాలని, రైతులు, కార్మికులు, వ్యాపారులు, యువత, మహిళలు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని నాయకులు ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత పెంపొందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. యువత కూడా మన ఆచార సంప్రదాయాల ప్రాధాన్యతను తెలుసుకుని వాటిని భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మాణిక్యం, చుక్కయ్య, పైల్వాన్ అంజయ్య, వినోద్, మల్లికార్జున్, లక్ష్మీనారాయణ, నాగసాని సహదేవ్, నాగసాని వెంకటేష్, సడబోయిన రవి, వేణు, నాగేష్, మందుమూల శ్రీనివాస్, నాగసాని గణేష్, ప్రజా పిలుపు దినపత్రిక అధినేత విజయ్ కుమార్, మొక్తల రాము, నాగసాని భరత్, భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.
పటాన్‌చెరులో ఘనంగా ముదిరాజ్ సంఘం బోనాల వేడుకలు.ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జలగరి ఎట్టయ్య సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకుని, ప్రత్యేకంగా తయారు చేసిన బోనాలను నెత్తిన ఎత్తుకుని అమ్మవారి ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో నైవేద్యంగా సమర్పించారు. ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జలగరి ఎట్టయ్య అమ్మవారికి పట్టు చీర సమర్పించి ప్రత్యేక
పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పటాన్‌చెరు ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా జలగరి ఎట్టయ్య, ఎండీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మాదిరి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఆషాఢ మాస బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రతి ఏడాది బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. బోనాల సందర్భంగా మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో వేడుకలు సందడిగా సాగాయి. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నెలకొనాలని, రైతులు, కార్మికులు, వ్యాపారులు, యువత, మహిళలు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని నాయకులు ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత పెంపొందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉందని నిర్వాహకులు
పేర్కొన్నారు. యువత కూడా మన ఆచార సంప్రదాయాల ప్రాధాన్యతను తెలుసుకుని వాటిని భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మాణిక్యం, చుక్కయ్య, పైల్వాన్ అంజయ్య, వినోద్, మల్లికార్జున్, లక్ష్మీనారాయణ, నాగసాని సహదేవ్, నాగసాని వెంకటేష్, సడబోయిన రవి, వేణు, నాగేష్, మందుమూల శ్రీనివాస్, నాగసాని గణేష్, ప్రజా పిలుపు దినపత్రిక అధినేత విజయ్ కుమార్, మొక్తల రాము, నాగసాని భరత్, భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.
- అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను: పోచారం శ్రీనివాస్ రెడ్డి అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను! మరోసారి రేవంత్ పై ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకుండే, కానీ తప్పలేదు కేసీఆర్ వల్లే అభివృద్ది జరిగింది అని నేనే చెప్తున్నాను అన్నం పెట్టినోడిని మరవడం కష్టంగా ఉంది కొన్ని రాజకీయ పరిణామాల వల్ల పార్టీ మారాల్సి వచ్చింది నేను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను, కాంగ్రెస్ జెండా కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదు నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామని సీఎం చెబితేనే పార్టీలో చేరాను ఆరు నెలల్లో బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెబితేనే జాతీయ కండువా కప్పుకున్న మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు పొంగులేటి, భట్టి సీఎం మాటలు వినడం లేదు మంత్రులు పట్టించుకోవడం లేదంట, నువ్వైనా నిధులు విడుదల చేయమని వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి చెబితే ఆయన కూడా పట్టించుకోలేదు వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ చేయడం లేదు నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం నిర్వహిస్తే రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించా నేను నీకు అమ్ముడుపోయానా నా ఎమ్మెల్యే పదవిని కొన్నావా అని అడిగాను - ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి1
- బహుళ త్రయోదశి సందర్భంగా ప్రదోష కాలంలో దమ్మాయిగూడ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో శ్రీ నందీశ్వర స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 🪷 బహుళ త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడికి విశేష పూజలు 🙏 ప్రదోష కాలంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు ఈ సందర్భంగా నందీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రదోష కాలంలో శివారాధనకు విశిష్టత ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఓం నమః శివాయ 🙏 హర హర మహాదేవ 🕉️ 📍 శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం, దమ్మాయిగూడ1
- కేశంపేట మండలం పరిధిలోని ఇప్పలపల్లి శివారులో ప్రమాదం పొంచి ఉంది కేశంపేట మండల పరిధిలోని ఇప్పలపల్లి శివారులో మూల మలుపుల వద్ద ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి పక్కన వాహనదారులను అప్రమత్తం చేసేందుకు ఏర్పాటు చేసిన బోల్టాలన్నీ విరిగిపోయి, ప్రస్తుతం ఉపయోగం లేకుండా ఉన్నాయి. దీంతో మూల మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందన్నారు. ప్రమాదాలను నివారించేందుకు వెంటనే విరిగిపోయిన బోల్టాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న అఖిల్ రాజ్, నాగదుర్గ! సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న స్వామిని ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్ర హీరో అఖిల్ రాజ్, సెన్సేషనల్ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వీరి రాకతో ఆలయ ప్రాంగణంలో అభిమానులు ఒక్కసారిగా గుమిగూడారు. త్వరలో రానున్న కొత్త ప్రాజెక్ట్ విశేషాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.1
- మాసాయిపేట గ్రామ శివారులోని జాతీయ రహదారిపై కుళ్లిపోయిన టమాటాలు.. వాహనదారులకు అవస్థలు మాసాయిపేట గ్రామ శివారులోని జాతీయ రహదారి-44పై కుళ్లిపోయిన టమాటాల వ్యర్థాలు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం కామారెడ్డి వైపు టమాటా లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. క్రేన్ సాయంతో లారీని అక్కడి నుంచి తొలగించినప్పటికీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన టమాటాలను మాత్రం తొలగించలేదు. దీంతో అవి కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. వ్యర్థాల వద్ద పందులు సంచరిస్తుండటంతో రహదారిపై ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కుళ్లిన టమాటాలను తొలగించి పరిసరాలను శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.1