కేశంపేట మండలం పరిధిలోని ఇప్పలపల్లి శివారులో ప్రమాదం పొంచి ఉంది కేశంపేట మండల పరిధిలోని ఇప్పలపల్లి శివారులో మూల మలుపుల వద్ద ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి పక్కన వాహనదారులను అప్రమత్తం చేసేందుకు ఏర్పాటు చేసిన బోల్టాలన్నీ విరిగిపోయి, ప్రస్తుతం ఉపయోగం లేకుండా ఉన్నాయి. దీంతో మూల మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందన్నారు. ప్రమాదాలను నివారించేందుకు వెంటనే విరిగిపోయిన బోల్టాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
కేశంపేట మండలం పరిధిలోని ఇప్పలపల్లి శివారులో ప్రమాదం పొంచి ఉంది కేశంపేట మండల పరిధిలోని ఇప్పలపల్లి శివారులో మూల మలుపుల వద్ద ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి పక్కన వాహనదారులను అప్రమత్తం చేసేందుకు ఏర్పాటు చేసిన బోల్టాలన్నీ విరిగిపోయి, ప్రస్తుతం ఉపయోగం లేకుండా ఉన్నాయి. దీంతో మూల మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందన్నారు. ప్రమాదాలను నివారించేందుకు వెంటనే విరిగిపోయిన బోల్టాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
- డా.ఏఎస్ రావు నగర్‌లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని వినతి డా.ఏఎస్ రావు నగర్‌లో హనుమాన్ టెంపుల్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్థానిక నివాసులు కాప్రా సర్కిల్-7 డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం సరైన మౌలిక వసతులు లేకపోవడంతో సుమారు 30–40 కుటుంబాలకు చెందిన వృద్ధులు, మహిళలు, చిన్నారులు వాకింగ్, వ్యాయామం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, ఖాళీ స్థలం సద్వినియోగం కోసం త్వరగా వాకింగ్ ట్రాక్ అభివృద్ధి చేయాలని కోరారు.1
- పటాన్‌చెరులో ఘనంగా ముదిరాజుల బోనాలు వేడుకల్లో ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పటాన్‌చెరు నియోజకవర్గంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. డప్పుల మోతలు, భక్తిగీతాలతో పరిసరాలు మార్మోగాయి. ఈ వేడుకల్లో ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాలు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- పటాన్‌చెరులో ఘనంగా ముదిరాజ్ సంఘం బోనాల వేడుకలు.ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జలగరి ఎట్టయ్య సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకుని, ప్రత్యేకంగా తయారు చేసిన బోనాలను నెత్తిన ఎత్తుకుని అమ్మవారి ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో నైవేద్యంగా సమర్పించారు. ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జలగరి ఎట్టయ్య అమ్మవారికి పట్టు చీర సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పటాన్‌చెరు ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా జలగరి ఎట్టయ్య, ఎండీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మాదిరి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఆషాఢ మాస బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రతి ఏడాది బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. బోనాల సందర్భంగా మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో వేడుకలు సందడిగా సాగాయి. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నెలకొనాలని, రైతులు, కార్మికులు, వ్యాపారులు, యువత, మహిళలు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని నాయకులు ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత పెంపొందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. యువత కూడా మన ఆచార సంప్రదాయాల ప్రాధాన్యతను తెలుసుకుని వాటిని భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మాణిక్యం, చుక్కయ్య, పైల్వాన్ అంజయ్య, వినోద్, మల్లికార్జున్, లక్ష్మీనారాయణ, నాగసాని సహదేవ్, నాగసాని వెంకటేష్, సడబోయిన రవి, వేణు, నాగేష్, మందుమూల శ్రీనివాస్, నాగసాని గణేష్, ప్రజా పిలుపు దినపత్రిక అధినేత విజయ్ కుమార్, మొక్తల రాము, నాగసాని భరత్, భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.4
- ప్రజా సమస్యలు చెప్పుకుందామంటే పీఏలు ఫోన్లు ఎత్తడం లేదు: మంత్రి జూపల్లి సమక్షంలో సర్పంచ్ ఆవేదన వనపర్తి జిల్లా ఎదుల మండలం సింగాయిపల్లి గ్రామంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేకులపల్లి తండా సర్పంచ్ ప్రభాకర్ తన గ్రామానికి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ, మంత్రి పీఏలు తన ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.1
- బహుళ త్రయోదశి సందర్భంగా ప్రదోష కాలంలో దమ్మాయిగూడ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో శ్రీ నందీశ్వర స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 🪷 బహుళ త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడికి విశేష పూజలు 🙏 ప్రదోష కాలంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు ఈ సందర్భంగా నందీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రదోష కాలంలో శివారాధనకు విశిష్టత ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఓం నమః శివాయ 🙏 హర హర మహాదేవ 🕉️ 📍 శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం, దమ్మాయిగూడ1
- కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న అఖిల్ రాజ్, నాగదుర్గ! సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న స్వామిని ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్ర హీరో అఖిల్ రాజ్, సెన్సేషనల్ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వీరి రాకతో ఆలయ ప్రాంగణంలో అభిమానులు ఒక్కసారిగా గుమిగూడారు. త్వరలో రానున్న కొత్త ప్రాజెక్ట్ విశేషాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.1
- మల్లాపూర్ కలర్స్ థీమ్ పార్కులో వన మహోత్సవంలో భాగంగా మొక్కల పంపిణీ మల్లాపూర్: వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్‌లోని కలర్స్ థీమ్ పార్కులో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మల్లాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (MMC), నాచారం సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.1
- తార్నాకలో ఘనంగా ఆషాఢ బోనాలు.. మహిళల బోనం సమర్న డీజే డ్యాన్స్.. తార్నాకలోని శ్రీ దుర్గా పోచమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో బస్తీవాసులు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే పాటలకు యువత, బస్తీవాసులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. దీంతో ఆలయ పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భక్తుల రాకతో తార్నాకలో సందడి నెలకొంది.2