Shuru
Apke Nagar Ki App…
ప్రజా సమస్యలు చెప్పుకుందామంటే పీఏలు ఫోన్లు ఎత్తడం లేదు: మంత్రి జూపల్లి సమక్షంలో సర్పంచ్ ఆవేదన వనపర్తి జిల్లా ఎదుల మండలం సింగాయిపల్లి గ్రామంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేకులపల్లి తండా సర్పంచ్ ప్రభాకర్ తన గ్రామానికి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ, మంత్రి పీఏలు తన ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Kethapally shankar
ప్రజా సమస్యలు చెప్పుకుందామంటే పీఏలు ఫోన్లు ఎత్తడం లేదు: మంత్రి జూపల్లి సమక్షంలో సర్పంచ్ ఆవేదన వనపర్తి జిల్లా ఎదుల మండలం సింగాయిపల్లి గ్రామంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేకులపల్లి తండా సర్పంచ్ ప్రభాకర్ తన గ్రామానికి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ, మంత్రి పీఏలు తన ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- అన్నం పెట్టినోడినే మరిచారు: రేవంత్ పై పోచారం తిరుగుబాటు! బాన్సువాడను కేసీఆర్ అభివృద్ధి చేశారని, మంత్రులు ఫోన్ చేసినా ఎత్తడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ జెండా కప్పుకోకపోవడమే మంచిదైందని, మొన్న దానం, నేడు పోచారం అంటూ రేవంత్ రెడ్డిపై ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరవేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.1
- పేదోడికి రూ. 10,800… టీడీపీ కార్యాలయానికి ఎకరానికి రూ. 1,000 మాత్రమేనా? మాజీ ఎమ్మెల్యే రోడ్డుపై చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే చిరు వ్యాపారుల (3X4 సైజ్ తోపుడు బండ్లు) నుండి రోజుకు 30 రూపాయల చొప్పున ఏటా రూ.10,800 గేటు రూపంలో వసూలు చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం ఎకరం స్థలానికి ఏడాదికి కేవలం రూ. 1,000 మాత్రమే పేదోడికి ఒక న్యాయం… అధికార పార్టీకి మరో న్యాయమా? ఇదేనా మంచి ప్రభుత్వం అంటే*? అని మాజీ MLA శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి అని విమర్శించారు.1
- జి. చెన్నారం గ్రామంలో ముత్యాలమ్మ ఆలయ దారి మరమ్మత్తులపై వివాదం నల్గొండ మండలం జి.చెన్నారంలో ఈనెల 13న బోనాల పండుగ జరగనుంది. ఈ నేపథ్యంలో ముత్యాలమ్మ ఆలయానికి వెళ్లే దారి బురదమయంగా మారడంతో మట్టి పోసి మరమ్మతులు చేపట్టేందుకు ప్రయత్నించగా కొందరు కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని సర్పంచ్ సాంబయ్య ఆరోపించారు. పండుగకు హాజరయ్యే భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అధికారులు దారి సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు.2
- నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పోర్ట్స్ చాంపియన్‌షిప్–2026 జిల్లా స్థాయి పోటీలు నంద్యాల, ఆగస్టు 11: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP), జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పోర్ట్స్ చాంపియన్‌షిప్–2026 జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి తెలిపారు. ఆగస్టు 11న బాస్కెట్‌బాల్, యోగా, ఆగస్టు 12న ఆర్చరీ, బ్యాడ్మింటన్, చెస్, బాక్సింగ్, క్యారమ్స్, ఖోఖో, ఆగస్టు 13న బాస్కెట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్ తదితర క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని కోరారు. క్రీడాకారుల ఎంపికలో భాగంగా KVK స్టేడియం, నంద్యాలలో ఆయా క్రీడలకు సంబంధించిన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు తదుపరి స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. క్రీడలపై ఆసక్తి ఉన్న యువత, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు సూచించారు.1
- ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- కాంగ్రెస్ వరుణయాగంపై జగదీష్ రెడ్డి కౌంటర్ - ఎల్‌నినోపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు గాల్లో దీపం పెట్టడం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వరుణయాగం పాపం చేసి చేతులు కడుకున్నట్టు ఉంది కాంగ్రెస్ వరుణయాగంపై జగదీష్ రెడ్డి కౌంటర్ ఎల్‌నినోపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు గాల్లో దీపం పెట్టడం ఏంటి? వచ్చిన నీటిని సముద్రంలోకి వదిలేసి, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాన్ని త్వరలోనే ఆధారాలతో బయటపెడతా – జగదీష్ రెడ్డి1
- డా.ఏఎస్ రావు నగర్‌లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని వినతి డా.ఏఎస్ రావు నగర్‌లో హనుమాన్ టెంపుల్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్థానిక నివాసులు కాప్రా సర్కిల్-7 డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం సరైన మౌలిక వసతులు లేకపోవడంతో సుమారు 30–40 కుటుంబాలకు చెందిన వృద్ధులు, మహిళలు, చిన్నారులు వాకింగ్, వ్యాయామం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, ఖాళీ స్థలం సద్వినియోగం కోసం త్వరగా వాకింగ్ ట్రాక్ అభివృద్ధి చేయాలని కోరారు.1
- కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తితో యువకుడి హల్‌చల్.. కాలనీవాసుల్లో భయాందోళన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీలో సోమవారం రాత్రి ఓ యువకుడు కత్తితో హల్‌చల్ సృష్టించాడు. కొబ్బరి బొండాలు కోసే కత్తిని చేతిలో పట్టుకుని కాలనీలో తిరుగుతూ హంగామా చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన కాలనీవాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. యువకుడు కత్తితో ఎందుకు హల్‌చల్ చేశాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.1